weight lifting
-
National Girl Child Day 2025: నీ ధైర్యమే.. నీ సైన్యమై..!
కరాటే అనేది మార్షల్ ఆర్ట్ మాత్రమే కాదు... మహత్తరమైన ఫిలాసఫీ కూడా. ఆ తత్వంలో... మనల్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకువచ్చే... సాహసంతో దూసుకెళ్లే స్ఫూర్తి దాగుంది. అందుకే కరాటే అనే ఆత్మరక్షణ విద్య అత్యవసరం అయింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అనంతపురం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న వంద విద్యాసంస్థల్లో 30 రోజుల పాటు 50 వేల మంది అమ్మయిలకు కరాటే క్లానుల నిర్వహణకు శ్రీకారం చుట్టారు...అక్షరక్రమంలోనే కాదు, ఆత్మరక్షణలోనూ అనంతపురం జిల్లాను ముందు వరుసలో ఉంచే లక్ష్యంగా అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న పాఠశాలల నుంచి కాలేజీల వరకు కరాటే క్లాసుల నిర్వహణకు చొరవ తీసుకున్నారు. కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ సహకారంతో ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ వర్కర్లు, ఆర్డీటీ సంస్థ ప్రతినిధులతో కలసి అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యతోపాటు యోగా, మానసిక వికాస తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 3న సామాజిక ఉద్యమకారిణి, తొలితరం ఉపాధ్యాయిని సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శిక్షణ తరగతులకు శ్రీకారం చుట్టారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, గురుకుల పాఠశాలలు, జడ్పీ, మున్సిపల్ యాజమాన్యాల పరిధిలోని బాలికల పాఠశాలలు, కళాశాలల్లో శిక్షణ ఇస్తున్నారు. (National Girl Child day 2025 సమాన అవకాశాలేవీ?)‘నిజం చెప్పాలంటే కొన్నిరోజుల ముందువరకు ఇల్లు దాటి ఒంటరిగా బయటికి రావాలంటే భయంగా ఉండేది. ఎవరైనా కామెంట్ చేస్తారేమో అనే భయమే దీనికి కారణం. ఒకరోజు మా అక్క ను ఎవరో అసభ్యంగా కామెంట్ చేస్తే ఇంట్లో చెప్పి ఏడ్చింది. అప్పటినుంచి నాకు కూడా అలాంటి అనుభవం ఎదురవుతుందేమోననే భయం ఏర్పడింది. కరాటే క్లాసులకు హాజరు కావడం వల్ల నాలో ఉన్న ఆ భయం పోయింది. ఇప్పుడు నేను నిశ్చింతగా బయటికి వెళుతున్నాను. ఎవరైనా కామెంట్ చేస్తే వారిని ధైర్యంగా పోలీస్‌స్టేషన్‌కు ఈడ్చుకు వెళ్లగలననే నమ్మకం వచ్చింది’ అంటుంది పల్లవి.‘కరాటే నేర్చుకోవడం అనేది ఎవరినో భయపెట్టడానికి కాదు. మనం ధైర్యంగా ఉండడానికి. కరాటేలాంటి ఆత్మరక్షణ విద్యల వల్ల క్రమశిక్షణ, ఆరోగ్య స్పృహ పెరుగుతుందనేది అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను’ అంటుంది శ్రీలత. (National Girl Child Day 2025: అమ్మాయిలకు హెల్తీ ప్లేట్!)‘మా అమ్మాయికి ఎంసెట్ కోచింగ్ ఇప్పటినుంచే ఇప్పిస్తున్నాం’ అని ఘనంగా చెప్పుకునే తల్లిదండ్రులను, ‘అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్ ఎందుకు!’ అని ఆశ్చర్యపడేవాళ్లను ఎందరినో చూస్తుంటాం. పల్లవి, శ్రీలత, ఆఫ్రోజ, భార్గవి.. లాంటి అమ్మాయిల మనసులో మాట విన్నప్పుడు కరాటే నుంచి యోగా వరకు శిక్షణ తరగతులు నిర్వహణ అనేది ఎంత ముఖ్యమో అర్థమవుతుంది.– ఖాజీ హిదాయతుల్లా, సాక్షి, అనంతపురం సిటీఎప్పుడు ఏ ఆపద వచ్చినా...జిల్లా వ్యాప్తంగా 50 వేల మంది అమ్మాయిలను ఆత్మరక్షణ విద్యలో ఆరితేరేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకు ప్రతి మండలం లో కార్యక్రమాన్ని నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించి అమలు చేస్తున్నాం. నాలుగు రిసోర్స్ టీమ్‌లు అందుబాటులో ఉంటాయి. వాటికి వీరవాహిని, బలప్రభ, సురసేన, శక్తిసేనగా నామకరణం చేశాం. సంక్షేమ శాఖ, కరాటే అసోసియేషన్, ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు చెందిన వారు ప్రతి టీమ్‌ను పర్యవేక్షిస్తారు. ఎప్పుడు ఎటువంటి ఆపద వచ్చినా సమర్థంగా తిప్పికొట్టేలా అమ్మాయిలను తీర్చిదిద్దుతున్నాం. పది నుంచి పద్దెనిమిది ఏళ్లలోపు టీ నేజ్ అమ్మాయిలకు వచ్చే సమస్యలపైన అవగాహన కల్పిస్తున్నాం. – బొల్లిపల్లి వినూత్న, అసిస్టెంట్ కలెక్టర్, అనంతపురంఅదృష్టంగా భావిస్తున్నా...కరాటే, యోగా, మానసిక వికాసం, ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో ఉచితంగా శిక్షణ పొందడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎవరైనా ఆకతాయులు నా జోలికి వస్తే తోక ముడిచి పరుగెత్తేలా చేయగలననే నమ్మకం వచ్చింది. అన్ని పాఠశాలల్లోనూ ప్రాథమిక స్థాయి నుంచే ఇటువంటి శిక్షణ ఇస్తే మరింత బాగుంటుంది.– జి. భార్గవి, ఇంటర్ విద్యార్థిని, రాప్తాడుసెల్ఫ్–డిఫెన్స్సాహసానికి జెండర్ భేదం లేదు. అయితే కొన్ని ఆటలు మాత్రం ‘పురుషులకు మాత్రమే’ కోట గోడలలో బంధీలై పోయాయి. ఇప్పుడు ఆ కోటలు బ్రద్దలవుతున్నాయి. తమిళనాడులో ‘ఇలవట్ట కల్’ అనేది పురాతన ఆట. పెద్ద పెద్ద గుండ్రాళ్లను ఎత్తి పడేసే ఈ ఆటలో పురుషులు మాత్రమే పాల్గొనేవారు. మహిళలు ప్రేక్షక΄ాత్రకే పరిమితం అయ్యేవారు. ఈసారి మాత్రం మేము సైతం అంటూ ‘ఇలవట్ట కల్’లో మహిళలు సత్తా చాటారు. భవిష్యత్ తరాలకు తరగని ఉత్సాహాన్ని ఇచ్చారు. నామక్కల్ జిల్లా తిరుచెంగోడులో ఈసారి మహిళల కోసం ‘ఇలవట్ట కల్’ ప్రత్యేకంగా నిర్వహించారు. 47 కేజీలు, 67 కేజీల విభాగంలో మహిళలు సత్తా చాటారు. ఎత్తే సత్తా ‘ఇలవట్ట కల్’ ΄ోటీలలోపాల్గొన్న భవధరణి 67 కేజీల బరువు ఉన్న రాతిగుండును ఏకంగా రెండు సార్లు అలవోకగా ఎత్తిపడేసి మొదటి బహుమతిని గెలుచుకుంది. ‘ఈ ΄ోటీలలో ΄ాల్గొనడం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి... సంప్రదాయంగా వస్తున్న ఆటలను కాపాడుకోవడం. రెండు... ఇలవట్ట కల్లో మహిళలు కూడా సత్తా చాటగలరు అని నిరూపించడం’ అంటుంది భవధరణి.– అస్మతీన్ మైదీన్, సాక్షి, చెన్నై -
కొండ వెలగాడనుంచి పదుల సంఖ్యలో జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు
-
Olympics: ఒలింపిక్స్‌లో వరుసగా ఆరు స్వర్ణాలు
Diana Taurasi: ఒలింపిక్స్ బాస్కెట్‌బాల్‌లో అమెరికా క్రీడాకారిణి డయానా టురాసి చరిత్ర పుటల్లోకి ఎక్కింది. వరుసగా ఆరు స్వర్ణ పతకాలు సాధించిన ఏకైక బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా ఆమె గుర్తింపు పొందింది. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భాగంగా ఆదివారం జరిగిన మహిళల బాస్కెట్‌బాల్ ఫైనల్లో అమెరికా 67–66తో ఫ్రాన్స్‌ను ఓడించి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ జట్టులో డయానా సభ్యురాలిగా ఉంది. 42 ఏళ్ల డయానా 2004 ఏథెన్స్, 2008 బీజింగ్, 2012 లండన్, 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లోనూ పసిడి పతకాలు గెలిచిన అమెరికా బాస్కెట్‌బాల్ జట్టులోనూ సభ్యురాలిగా ఉంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో చైనా హవా పారిస్ ఒలింపిక్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో చైనా ఐదు స్వర్ణాలతో అదరగొట్టింది. చివరిరోజు మహిళల ప్లస్ 81 కేజీల విభాగంలో చైనా లిఫ్టర్ లీ వెన్వెన్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. లీ వెన్వెన్ మొత్తం 309 కేజీల (స్నాచ్‌లో 136 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్‌లో 173 కేజీలు) బరువెత్తింది. చైనా తరఫున ఈ క్రీడల్లో హు జీహుయ్ (49 కేజీలు), షిఫాంగ్ లువో (59 కేజీలు), లీ ఫాబిన్ (61 కేజీలు), లీ హువాన్హువా (102 కేజీలు) కూడా పసిడి పతకాలు సాధించారు. -
Olympics: నెలసరి మూడో రోజు.. వీక్నెస్ వల్ల: మీరాబాయి చాను
‘‘నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాను. కోచ్ చెప్పినట్లుగా చేశాను. పతకం సాధించలేకపోయినా నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాను. గాయం నుంచి కోలుకునే క్రమంలో తక్కువ సమయమే దొరికినా దానిని సద్వినియోగం చేసుకోగలిగాను.85 కిలోల బరువు ఎత్తడం కోసం ఎంతగానో ప్రాక్టీస్ చేశా. కాంపిటీషన్ సమయంలోనూ పొరపాట్లకు తావివ్వలేదు. క్లీన్ అండ్ జెర్క్ విషయంలో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. నిజానికి.. పోటీకి సిద్ధమవుతున్నపుడే నా నెలసరి మొదలైంది.ఇది మూడోరోజు. అది కూడా ప్రభావం చూపింది. వీక్నెస్ కారణంగా లక్ష్యాన్ని చేరుకోలేకపోయాను. దేశం కోసం పతకం గెలవాలని ఎంతగానో కృషి చేశాను. అయినా.. ఆటలో గెలుపోటములు భాగమే. వచ్చే ఒలింపిక్స్ కోసం మరింత కష్టపడతా. అత్యుత్తమ ప్రదర్శనతో దేశానికి పతకం అందిస్తా’’ అంటూ భారత వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను ఉద్వేగానికి లోనైంది.నాలుగోస్థానంతో సరిప్యారిస్ ఒలింపిక్స్-2024లో మీరాబాయి తృటిలో పతకం కోల్పోయిన విషయం తెలిసిందే. మహిళల 49 కేజీల విభాగంలో పోటీపడ్డ ఈ మణిపూర్ ఆణిముత్యం నాలుగోస్థానంతో సరిపెట్టుకుంది. ఫలితంగా కాంస్య పతకం చేజారింది. ఫైనల్లో 12 మంది పోటీపడగా.. మీరాబాయి మొత్తం 199 కేజీల బరువు మాత్రమే ఎత్తగలిగింది. స్నాచ్‌లో 88 కేజీలు... తర్వాత క్లీన్ అండ్ జెర్క్ అంశంలో 111 కేజీలు బరువెత్తింది. ఈ క్రమంలో నాలుగో స్థానంలో నిలిచింది. కాగా గత టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి రజత పతకం గెలిచిన విషయం తెలిసిందే.ఇక ఈ విభాగంలో చైనా వెయిట్‌లిఫ్టర్ హు జిహుయ్ మొత్తం 206 కేజీల బరువెత్తి( (చైనా; స్నాచ్‌లో 93 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్‌లో 117 కేజీలు) స్వర్ణం సాధించగా.. రొమేనియాకు చెందిన మిహేలా వలెంటీనా మొత్తం 205 కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకుంది. థాయ్‌లాండ్‌కు చెందిన సురోద్చనా ఖాంబావ్ 200 కేజీల బరువెత్తి కాంస్యం కైవసం చేసుకుంది.చదవండి: వినేశ్ ఊహించలేదా!.. జుట్టు కత్తిరించి, రక్తం తీసినా.. తప్పెవరిది? -
అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన తెలంగాణ తేజం!
మహబూబాబాద్: ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన ఆసియా, ఆఫ్రికా పవర్‌లిఫ్టింగ్ అంతర్జాతీయ పోటీల్లో తెలంగాణ తేజం మెరిసింది. మహబూబాబాద్ జిల్లా ఉమ్మడి కురవి మండలం జగ్యా తండాకు చెందిన తేజావత్ సుకన్య సత్తా చాటింది.ఈనెల 3వ తేదీ నుంచి జరిగిన ఈ పోటీలో 76 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించి దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసింది. కాగా, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి తనకు సాయపడిన కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్‌కు, కోచ్ వీఎన్ రాజశేఖర్‌కు సుకన్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సుకన్య మాట్లాడుతూ తన జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని తెలిపారు.దేనికి ధైర్యం కోల్పోకుండా క్రీడల్లో రాణిస్తున్నానని తెలిపారు. ఇందులో భాగంగా పవర్ లిఫ్టింగ్లోనే కాకుండా వెయిట్‌లిఫ్టింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధించానన్నారు. ఇంకా పతకాలు సాధించి దేశానికి పేరు తీసుకొస్తానని తెలిపారు. -
ప్రీతిస్మిత ప్రపంచ రికార్డు..!
లిమా (పెరూ): ప్రపంచ యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి ప్రీతిస్మిత భోయ్ మూడు స్వర్ణ పతకాలు సాధించింది. ఈ క్రమంలో క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది.మహిళల 40 కేజీల విభాగంలో బరిలోకి దిగిన ఒడిశాకు చెందిన 15 ఏళ్ల ప్రీతిస్మిత మొత్తం 133 కేజీలు (క్లీన్ అండ్ జెర్క్‌లో 76 కేజీలు+స్నాచ్‌లో 57 కేజీలు) బరువెత్తి విజేతగా నిలిచింది. మూడు విభాగాల్లో (క్లీన్ అండ్ జెర్క్+స్నాచ్+టోటల్) వేర్వేరుగా పతకాలు అందించగా... ఈ మూడింటిలోనూ ప్రీతిస్మిత అగ్రస్థానంలో నిలిచి మూడు పసిడి పతకాలను సొంతం చేసుకుంది.40 కేజీల విభాగంలోనే పోటీపడ్డ భారత లిఫ్టర్ జోష్నా సబర్ రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించింది. 45 కేజీల విభాగంలో పాయల్ ఒక రజతం, రెండు కాంస్యాలు గెలిచింది. పురుషుల 49 కేజీల విభాగంలో బాబూలాల్ రెండు కాంస్య పతకాలు దక్కించుకున్నాడు.ఇవి చదవండి: జ్యోతి సురేఖకు నిరాశ.. క్వార్టర్ ఫైనల్లో ఓటమి -
వరుసగా మూడోసారి ఒలింపిక్స్‌లో పోటీపడనున్న భారత స్టార్ వెయిట్ లిఫ్టర్
బ్యాంకాక్: భారత స్టార్ మహిళా లిఫ్టర్ మీరాబాయి చాను పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం దాదాపు ఖరారైంది. అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) ప్రపంచకప్‌లో సోమవారం జరిగిన మహిళల 49 కేజీల ఈవెంట్లో టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి మూడో స్థానంలో నిలిచింది. 6 నెలల విరామానంతరం బరిలోకి దిగిన ఆమె గ్రూప్ ‘బి’లో పోటీపడి మొత్తం 184 కేజీల (81+103) బరువెత్తింది. తద్వారా మీరా మూడో స్థానంలో నిలిచింది. ఫలితమిలా ఉన్నప్పటికీ తప్పనిసరి టోర్నీల్లో పాల్గొనడంతో పాటు, 49 కేజీల కేటగిరీలో ఆమె ఒలింపిక్ క్వాలిఫికేషన్ ర్యాంకింగ్‌లో రెండో స్థానంలో ఉంది. చైనా లిఫ్టర్ జియాన్ హుయ్‌హువా అగ్రస్థానంలో ఉండగా, ప్రతి కేటగిరీ నుంచి టాప్–10 లిఫ్టర్లకు పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌లు లభిస్తాయి. దీంతో 2017 ప్రపంచ చాంపియన్ మీరాబాయి జూలైలో జరిగే ఒలింపిక్స్‌కు అర్హత పొందడం లాంఛనం కానుంది. ప్రపంచకప్ ముగిశాక క్వాలిఫయర్ల జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు. మణిపూర్‌కు చెందిన మీరాబాయికివి వరుసగా మూడో ఒలింపిక్స్ క్రీడలు కానున్నాయి. రియో ఒలింపిక్స్‌లో మీరాబాయి విఫలంకాగా, టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సొంతం చేసుకుంది. -
వెయిట్ లిఫ్టింగ్ లో సిల్వర్ మెడల్ సాధించిన సినీ నటి
-
వీడియో: మెడ విరిగి కుప్పకూలిన ఫేమస్ ఫిట్నెస్ ట్రైనర్
-
నటి ప్రగతి కొత్త జర్నీ.. ఇది అస్సలు ఎవరూ ఊహించలేదు!
నటి ప్రగతి.. ఈ పేరు చెప్పగానే తల్లి, అత్త పాత్రలు చేసే నటి గుర్తొస్తుంది. తనదైన యాస, యాక్టింగ్ తో నవ్వించే ఈమె.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఓవైపు నటిగా ఎంటర్టైన్ చేస్తూనే మరోవైపు జిమ్‌లో వర్కౌట్స్‌తో బాగా పాపులర్ అయింది. అవన్నీ సరదాగా చేస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ ఇప్పుడు అసలు విషయాన్ని బయటపెట్టేసింది. హీరోయిన్గా చేసింది గానీ హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ప్రగతికి.. డిగ్రీ చదువుతున్నప్పుడే హీరోయిన్గా తమిళ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అలా ఓ ఏడు తమిళ సినిమాలు, ఓ మలయాళ చిత్రం చేసింది. తర్వాత పెళ్లి కావడంతో కొన్నిరోజుల నటనకు బ్రేక్ ఇచ్చింది. కొన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చింది కానీ సీరియల్స్‌లో నటించడం మొదలుపెట్టింది. అలా అలా కొన్నాళ్లకు సినిమాల్లో సహాయపాత్రలు చేసే అవకాశాలు వచ్చాయి. (ఇదీ చదవండి: ఈమెని గుర్తుపట్టారా? మీరనుకునే హీరోయిన్ మాత్రం కాదు!) లిఫ్టర్‌గా కొత్త జర్నీ మహేశ్‌బాబు 'బాబీ' సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రగతి.. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం తెలుగులో వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతోంది. లాక్డౌన్ టైంలో ప్రగతి ఎక్కువగా జిమ్ వీడియోలు పోస్ట్ చేసేది. అయితే అవన్నీ సరదాకి అనుకున్నారు. ఇప్పుడు నిజంగానే పవర్ లిఫ్టర్ గా మారిపోయి అందరికీ షాకిచ్చింది. అందుకు సంబంధించిన వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. టార్గెట్ పెద్దదే 'కొత్త జర్నీ మొదలైంది. రెండు నెలల క్రితం నా జీవితం ఇలా మలుపు తిరుగుతుందని అస్సలు ఊహించలేదు. పవర్ లిఫ్టింగ్‌లో నా కొత్త ప్రయాణమిది. రెండు నెలల క్రితం స్టార్ట్ అయిన ఈ జర్నీలో ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. ఇది కూడా పూర్తి చేసే తీరతాను. ప్రస్తుతం నా స్కోరు 250. అయితే టార్గెట్ చాలా పెద్దదే. దాన్ని చేరేవరకు తగ్గేదే లే' అని ప్రగతి తన ఇన్ స్టా వీడియో క్యాప్షన్ రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Pragathi Mahavadi (@pragstrong) (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి సూపర్‌హిట్ సినిమా!) -
Asian Weightlifting Championship: భారత్ ఖాతాలో రెండో పతకం, జెరెమికు రజతం
జిన్జూ (దక్షిణ కొరియా): ఆసియా సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. పురుషుల 67 కేజీల విభాగంలో జెరెమి లాల్రినుంగా స్నాచ్ ఈవెంట్లో 141 కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకున్నాడు. అయితే మిజోరం రాష్ట్రానికి చెందిన 20 ఏళ్ల జెరెమి క్లీన్ అండ్ జెర్క్ ఈవెంట్లో తడబడి మొత్తం బరువును నమోదు చేయడంలో విఫలమయ్యాడు. మూడు క్లీన్ అండ్ జెర్క్ అవకాశాల్లోనూ జెరెమి నిర్ధారిత బరువును ఎత్తలేకపోయాడు. శనివారం జరిగిన మహిళల 55 కేజీల విభాగంలో బింద్యారాణి భారత్‌కు రజత పతకం అందించిన సంగతి తెలిసిందే. -
డోపింగ్ టెస్ట్‌లో పట్టుబడ్డ భారత స్టార్ వెయిట్ లిఫ్టర్
భారత క్రీడారంగంలో మరోసారి డోపింగ్ కలకలం రేగింది. స్టార్ మహిళా వెయిట్ లిఫ్టర్, రెండుసార్లు కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత కుముక్చమ్ సంజిత చాను (మణిపూర్) డోపింగ్ టెస్ట్‌లో విఫలమైంది. ఆమె నుంచి సేకరించిన శాంపుల్స్‌లో నిషేధిత ఉత్ప్రేరకం డ్రొస్టనొలోన్ను గుర్తించినట్లు డోపింగ్ నిరోధక అధికారులు (డీసీఓ) వెల్లడించారు. దీంతో సంజితపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ప్రాథమిక నిషేధం విధించింది. శాంపిల్ సేకరించిన నాటి నుంచే సంజితపై నిషేధం అమల్లో ఉంటుందని నాడా పేర్కొంది. కాగా, గతేడాది జరిగిన జాతీయ క్రీడల సందర్భంగా సంజిత నుంచి శాంపుల్స్ సేకరించారు. ఆ పోటీల్లో 49 కేజీల విభాగంలో పోటీపడ్డ సంజిత రజత పతకం కైవసం చేసుకుంది. ఈ పోటీలో టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చాను స్వర్ణం నెగ్గింది. -
Asia Cup 2022: కఠినమైన వర్కౌట్లు చేస్తున్న కోహ్లి.. వీడియో వైరల్
Virat Kohli Gym Video Viral: ఇంగ్లండ్ పర్యటన తర్వాత జట్టుకు దూరమైన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆసియా కప్-2022 టోర్నీ నేపథ్యంలో తిరిగి మైదానంలో దిగనున్నాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరగనున్న మ్యాచ్‌తో జట్టుతో కలవనున్నాడు. ఈ క్రమంలో ఈ స్టార్ బ్యాటర్ ఇప్పటికే ప్రాక్టీసు మొదలుపెట్టాడు. ఇటీవల ముంబైలోని బికేసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న కోహ్లి.. తాజాగా జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్న వీడియో షేర్ చేశాడు. వెయిట్ లిఫ్టింగ్‌తో పాటు... కఠిన వ్యాయామాలు పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించేందుకు కష్టపడుతున్నాడు. ఈ మేరకు జిమ్‌లో చెమటోడుస్తున్న కోహ్లిని చూసిన అభిమానులు.. 71వ సెంచరీ చేసేందుకు కింగ్ సన్నద్ధమవుతున్నాడంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో తిరిగి ఫామ్‌లోకి వస్తే చూడాలని ఉందని.. దాయాదిపై శతకం బాది తమ ఆశను నెరవేర్చాలంటూ కోహ్లికి విజ్ఞప్తి చేస్తున్నారు. కోహ్లి సెంచరీ చేసి దాదాపు రెండున్నరేళ్లు గడిచిపోయిన విషయం తెలిసిందే! పూర్వ వైభవం తిరిగి పొందేనా! గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్‌తో కోహ్లి విమర్శల పాలవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్ టూర్ తర్వాత ఏ ఇతర సిరీస్‌కు కోహ్లిని ఎంపిక చేయలేదు సెలక్టర్లు. చాలా రోజుల పాటు అతడికి విశ్రాంతినిచ్చారు. ఈ క్రమంలో తాజాగా మెగా ఈవెంట్‌కు ఎంపికైన కోహ్లి.. సరికొత్త ఉత్సాహంతో ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ టోర్నీతోనైనా తన పూర్వ వైభవాన్ని సాధిస్తాడని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్న వేళ పూర్తి స్థాయిలో ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు సన్నద్ధమవుతున్నాడు. అద్బుతమైన రికార్డు! ఇక ఆసియా కప్ టోర్నీలో కోహ్లికి మెరుగైన రికార్డు ఉంది. 2010లో ఈవెంట్లో తొలి మ్యాచ్ ఆడిన ఈ రన్‌మెషీన్ వన్డే ఫార్మాట్లో 766 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక టోర్నీ టీ20 ఫార్మాట్‌కు మారిన తర్వాత ఆడిన ఐదు మ్యాచ్‌లలో 153 పరుగులు చేశాడు. కాగా ఈసారి ఆగష్టు 27 నుంచి ఆసియా కప్ ఈవెంట్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. మరింత ప్రత్యేకం.. ఎందుకంటే! ఆ మరుసటి రోజు భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. కోహ్లికి ఇది వందో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కావడంతో ఈ పోరు మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 70 సెంచరీలు బాదిన కోహ్లి.. ఈ మ్యాచ్‌లో మరో శతకం సాధించి దీనిని మరింత ప్రత్యేకం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా కోహ్లి తాజాగా షేర్ చేసిన వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. గంటలోపే లక్షా ఇరవై వేలకు పైగా వ్యూస్ సాధించింది. చదవండి: Vinod Kambli: ఏదైనా పని ఉంటే ఇప్పించండి.. చాలీచాలని జీతంతో బ్రతుకీడుస్తున్నా..! NZ vs WI: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. ఆరేళ్ల తర్వాత విండీస్ ఆటగాడు రీ ఎంట్రీ! 🏋️♂️🫶 pic.twitter.com/NOvAD9uutT — Virat Kohli (@imVkohli) August 17, 2022 -
కొనసాగుతున్న భారత వెయిట్ లిఫ్టర్ల హవా.. ఇవాళ మరో పతకం
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టర్ల హవా కొనసాగుతుంది. ఆరో రోజు ఈ క్రీడలో భారత్ మరో పతకం సాధించింది. పురుషుల 109 కేజీల విభాగంలో లవ్‌ప్రీత్ సింగ్ భారత్‌కు కాంస్య పతకం అందించాడు. స్నాచ్ రౌండ్లో 163 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ రౌండ్లో 192 కేజీలు ఎత్తిన లవ్‌ప్రీత్ సింగ్.. మొత్తంగా 355 కేజీల బరువు ఎత్తి మూడో స్థానంలో నిలిచాడు. కెమరూన్‌కు చెందిన పెరిక్లెక్స్ నగాడ్జా మొత్తం 361 కేజీలు ఎత్తి స్వర్ణం సాధించగా.. సమోవాకు చెందిన జాక్ హిటిలా 358 కేజీలు ఎత్తి రజత పతకం కైవసం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే, లవ్‌ప్రీత్ గెలిచిన పతకంతో ప్రస్తుత క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య 14కు చేరింది. ఒక్క వెయిట్ లిఫ్టింగ్లోనే భారత్ 9 పతకాలు సాధించడం విశేషం. మిరాబాయ్ చాను (గోల్డ్), జెరెమీ లాల్రిన్నుంగ (గోల్డ్), అచింట షెవులి (గోల్డ్), సంకేత్ సర్గార్ (సిల్వర్), బింద్యా రాణి (సిల్వర్), వికాస్ ఠాకుర్ (సిల్వర్), గురురాజ పుజారి (బ్రాంజ్), హర్జిందర్ కౌర్ (బ్రాంజ్).. తాజాగా లవ్‌ప్రీత్ బ్రాంజ్ మెడల్స్ సాధించారు. చదవండి: CWG 2022: దూసుకుపోతున్న భారత్.. వెయిట్ లిఫ్టింగ్‌లో మరో పతకం -
CWG 2022: దూసుకుపోతున్న భారత్.. వెయిట్ లిఫ్టింగ్‌లో మరో పతకం
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల వేటలో దూసుకుపోతుంది. ఐదో రోజు మహిళల లాన్ బౌల్స్, పురుషుల టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్లలో స్వర్ణ పతాకలు సాధించిన భారత్.. వెయిట్ లిఫ్టింగ్‌లో తాజా మరో పతకం సాధించింది. పురుషుల 96 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ వికాస్ సింగ్ రజతం సాధించాడు. స్నాచ్ రౌండ్లో 155 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ రౌండ్లో 191 కేజీలు ఎత్తిన వికాస్.. మొత్తంగా 346 కేజీల బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో వికాస్‌కు ఇది వరుసగా మూడో పతకం కావడం విశేషం. 2014 గ్లాస్గో క్రీడల్లో రజతం గెలిచిన వికాస్.. 2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించాడు. ఈ విభాగంలో సమోవాకి చెందిన డాన్ ఓపెలోగ్ (171+210=381 కేజీలు) స్వర్ణం గెలువగా.. ఫిజికి చెందిన తానియెల (155+188=343) కాంస్యం సాధించాడు. వికాస్ సింగ్ విజయంతో భారత పతకాల సంఖ్య 12కి చేరింది. ఇందులో ఐదు స్వర్ణాలు, నాలుగు రజతాలు, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి. చదవండి: భారత్ ఖాతాలో ఐదో స్వర్ణం.. ఎందులో అంటే..? -
రికార్డు సృష్టించిన అచింత షెవులి.. భారత్ ఖాతాలో మూడో స్వర్ణం
Achinta Sheuli: కామన్వెల్డ్ గేమ్స్ 2022లో భారత వెయిట్‌లిఫ్టర్ల హవా కొనసాగుతుంది. ఈ గేమ్స్ భారత్ ఇప్పటివరకు సాధించిన పతకాలన్నీ వెయిట్ లిఫ్టింగ్‌లో సాధించినవే కావడం విశేషం. ఈ క్రీడలో ఇప్పటికే 5 మెడల్స్ సాధించిన భారత్.. తాజాగా మరో పతకం ఖాతాలో వేసుకుంది. 73 కేజీల విభాగంలో అచింత షెవులి రికార్డు ప్రదర్శనతో పసిడి సాధించాడు. Achinta Sheuli bags #TeamIndia's third 🥇 at @birminghamcg22 👏🎆All three gold medals so far have been won by our weightlifters 🏋♂️🏋♀️🏋♂️#EkIndiaTeamIndia | @WeAreTeamIndia pic.twitter.com/kCJVxFVNYI— Team India (@WeAreTeamIndia) July 31, 2022 స్నాచ్‌లో 143 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 170 కేజీల బరువు ఎత్తిన షెవులి.. మొత్తంగా 313 కేజీల బరువు ఎత్తి సరికొత్త కామన్వెల్త్ రికార్డు నెలకొల్పాడు. కామన్వెల్త్లో భారత్‌కు ఇది మూడో స్వర్ణం. 73 కేజీల ఈవెంట్లో మలేషియాకు చెందిన ఎర్రి హిదాయత్ మహమ్మద్ 303 కేజీల బరువు ఎత్తి రజతం సాధించగా.. కెనెడాకు చెందిన షాడ్ డార్సిగ్ని (298 కేజీలు) కాంస్యం దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న 22వ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య మొత్తం ఆరుకు చేరింది. మహిళల కేటగిరిలో మీరాబాయ్ చాను 49 కేజీల విభాగంలో స్వర్ణం, జెరెమీ లాల్రిన్నుంగ 67 కేజీల విభాగంలో స్వర్ణం, 73 కేజీల విభాగంలో అచింత షెవులి స్వర్ణం, 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సార్గర్ రజతం, 55 కేజీల విభాగంలో బింద్యారాణి దేవి రజతం, 61 కేజీల విభాగంలో గురురాజ్ పూజారి కాంస్య పతకం సాధించారు. చదవండి: భారత్ ఖాతాలో మరో పతకం.. వెయిట్ లిఫ్టింగ్‌లో జెరెమీకి గోల్డ్ -
భారత్ ఖాతాలో మరో పతకం.. వెయిట్ లిఫ్టింగ్‌లో జెరెమీకి గోల్డ్
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ దూసుకుపోతుంది. ఇప్పటికే 4 పతకాలు సాధించి అంచనాలకు మించి రాణిస్తున్న భారత వెయిట్ లిఫ్టర్లు.. తాజాగా మరో పతకం సాధించారు. మూడో రోజు ఈవెంట్స్‌లో పురుషుల 67 కేజీల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ జెరెమీ లాల్రిన్నుంగ 300 కేజీల (స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్‌లో కలిపి) బరువు ఎత్తి స్వర్ణ పతకం నెగ్గాడు. తద్వారా ఈ మెగా ఈవెంట్లో ఇప్పటివరకు భారత్ ఖాతాలో చేరిన స్వర్ణాల సంఖ్య రెండుకు, మొత్తం పతకాల సంఖ్య ఐదుకు చేరింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జెరెమీ అనూహ్యంగా 300 కేజీల బరువును ఎత్తి కామన్వెల్త్ గేమ్స్ రికార్డు నమోదు చేశాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న 22వ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ మాంచి జోరు మీద ఉంది. భారత్ ఇప్పటివరకు సాధించిన పతాకలన్నీ వెయిట్ లిఫ్టింగ్‌లో సాధించినవే కావడం విశేషం. మీరాబాయ్ చాను 49 కేజీల విభాగంలో స్వర్ణం, 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సార్గర్ రజతం, 55 కేజీల విభాగంలో బింద్యారాణి దేవి రజతం, 61 కేజీల విభాగంలో గురురాజ్ పూజారి కాంస్యం, తాజాగా జెరెమీ లాల్రిన్నుంగ 67 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించారు. -
CWG 2022: భారత్ ఖాతాలో మరో పతకం.. గురురాజ పూజారి కాంస్యం
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ సత్తా చాటుతుంది. రెండో రోజు భారత అథ్లెట్లు వెయిట్‌లిఫ్టింగ్‌లో రెండు పతకాలు సాధించారు. తొలుత పురుషుల 55 కేజీల విభాగంలో సంకేత్ సర్గార్ రజత పతకం సాధించగా.. తాజాగా 61 కేజీల (పురుషుల) విభాగంలో గురురాజ పుజారి కాంస్యం నెగ్గాడు. గురురాజ మొత్తం 269 కేజీల బరువును (స్నాచ్‌లో 118 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 153 కేజీలు) ఎత్తి మూడో స్థానంలో నిలువగా.. మలేషియాకు చెందిన అజ్నిల్ బిన్ బిడిన్ మహ్మద్ 285 కేజీలు (127, 158) ఎత్తి స్వర్ణ పతకాన్ని.. పపువా న్యూ గినియాకు చెందిన మోరియా బారు 273 కేజీలు (121, 152) ఎత్తి రజతం సాధించారు. కాగా, గురురాజకు కామన్వెల్త్ క్రీడల్లో ఇది వరుసగా రెండో పతకం కావడం విశేషం. అతను 2018 గోల్డ్ కోస్ట్ క్రీడల్లో 56 కేజీల విభాగంలో రజత పతకం సాధించాడు. 2️⃣nd medal for 🇮🇳 at @birminghamcg22 🤩 What a comback by P. Gururaja to bag 🥉 with a total lift of 269 Kg in the Men's 61kg Finals🏋♂️ at #B2022 Snatch- 118kg Clean & Jerk- 151kg With this Gururaj wins his 2nd consecutive CWG medal 🙂 Congratulations Champ!#Cheer4India pic.twitter.com/UtOJiShUvS — SAI Media (@Media_SAI) July 30, 2022 చదవండి: CWG 2022: బోణీ కొట్టిన భారత్.. వెయిట్ లిఫ్టింగ్‌లో తొలి పతకం -
CWG 2022: బోణీ కొట్టిన భారత్.. వెయిట్ లిఫ్టింగ్‌లో తొలి పతకం
Birmingham 2022: బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ బోణీ కొట్టింది. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 55 కేజీల విభాగంలో సంకేత్ సర్గార్ రజత పతకం సాధించాడు. ఈ పోటీల్లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన సంకేత్.. మొత్తం 248 కేజీల బరువును (స్నాచ్‌లో 113 కేజీలు, సీ ఎండ్ జేలో 135 కేజీలు) ఎత్తి తన లక్ష్యానికి (స్వర్ణం) కేవలం ఒక్క కిలో దూరంలో నిలిచిపోయాడు. Braving through injury to win a medal for his country, we couldn't have asked for more from Sanket! ❤️🇮🇳#CommonwealthGames pic.twitter.com/btIYs9MEqx — The Bridge (@the_bridge_in) July 30, 2022 మలేషియాకు చెందిన బిబ్ అనిక్ 259 కేజీల బరువు ఎత్తి స్వర్ణ పతకం కైవసం చేసుకోగా.. శ్రీలంకకు చెందిన దిలంక యోడగే (225 కేజీలు) కాంస్యం సాధించాడు. సంకేత్.. సీ ఎండ్ జే రెండో ప్రయత్నంలో గాయపడటంతో రజతంతో సరిపెట్టుకున్నాడు. చదవండి: CWG 2022: ఎక్కడికెళ్లినా దొరికిపోవడమే.. వీడేం బాక్సర్ రా బాబు!.. కామన్వెల్త్ నుంచి సస్పెండ్ -
World Youth Weightlifting Championship: భళా గురు...
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అంతర్జాతీయ క్రీడా వేదికపై మరోసారి తెలుగు తేజం మెరిసింది. ప్రపంచ యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ కుర్రాడు శనపతి గురునాయుడు పసిడి పతకంతో అదరగొట్టాడు. గురునాయుడు ప్రతిభతో ఈ టోర్నీలో భారత్‌కు బంగారు పతకాల బోణీ లభించింది. మెక్సికోలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో విజయనగరం జిల్లాకు చెందిన 16 ఏళ్ల గురునాయుడు బాలుర 55 కేజీల విభాగంలో విజేతగా నిలిచాడు. స్నాచ్‌లో 104 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 126 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 230 కేజీలతో గురునాయుడు అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. సౌదీ అరేబియా లిఫ్టర్ మాజీద్ అలీ (229 కేజీలు; స్నాచ్‌లో 105+క్లీన్ అండ్ జెర్క్‌లో 124) రజతం... కజకిస్తాన్ లిఫ్టర్ యెరాసిల్ ఉమ్రోవ్ (224 కేజీలు; స్నాచ్‌లో 100+క్లీన్ అండ్ జెర్క్‌లో 124) కాంస్యం సాధించారు. ఈ చాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు భారత్ నాలుగు పతకాలు సాధించింది. బాలికల 45 కేజీల విభాగంలో మహారాష్ట్రకు చెందిన సౌమ్య కాంస్యం గెలిచింది. సౌమ్య స్నాచ్‌లో 65 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 83 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 148 కేజీలతో మూడో స్థానంలో నిలి చింది. ఆకాంక్ష (40 కేజీలు), విజయ్ ప్రజాపతి (49 కేజీలు) రజత పతకాలు గెలిచారు. ‘లిఫ్ట్’ చేస్తే పతకమే... వేదిక ఏదైనా బరిలోకి దిగితే గురునాయుడు పతకంతోనే తిరిగొస్తున్నాడు. తాష్కెం ట్లో జరిగిన 2020 ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో గురు 49 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. అంతకుముందు 2019లో తాష్కెంట్‌లోనే జరిగిన ఆసియా యూత్ క్రీడల్లో రజతం గెలిచాడు. గత మూడేళ్లుగా జాతీయస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో గురు పసిడి పతకాల పంట పండిస్తున్నాడు. 2020లో బుద్ధగయలో జాతీయ పోటీల్లో అతను స్వర్ణం సాధించడంతోపాటు ఐదు రికార్డులు నెలకొల్పాడు. 2021లో పంజాబ్‌లో, ఈ ఏడాది జనవరిలో భువనేశ్వర్‌లో జరిగిన జాతీయ పోటీల్లో గురునాయుడు బంగారు పతకాలు గెలిచాడు. ‘ఒలింపిక్స్ క్రీడల్లో పతకం సాధించడం, సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విజేతగా నిలిచి ఐఏఎస్ అధికారి కావడం తన జీవిత లక్ష్యాలు’ అని సోమవారం మెక్సికో నుంచి ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ గురునాయుడు పేర్కొన్నాడు. తండ్రి కలను నిజం చేస్తూ... గురునాయుడు స్వస్థలం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని చంద్రంపేట. అతని తండ్రి రామస్వామి గ్రామీణ క్రీడల్లో రాణించేవారు. ఆ రోజుల్లోనే బాడీబిల్డర్‌గా, వెయిట్‌లిఫ్టర్‌గా పేరుపొందారు. పేదరికం వల్ల తన అభిరుచికి మధ్యలోనే స్వస్తి పలకాల్సి వచ్చింది. తన ముగ్గురు కుమారుల్లో చిన్నవాడైన గురునాయుడిని మాత్రం వెయిట్‌లిఫ్టర్‌గా చేయాలని తపించారు. తన ఆశయాన్ని తన కుమారుడి ద్వారా సాధించాలనే లక్ష్యంతో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని కొండవెలగాడ గ్రామానికి చెందిన చల్లా రాము వద్ద శిక్షణకు పంపించారు. అలా వెయిట్‌లిఫ్టింగ్‌లో ఓనమాలు దిద్దిన గురునాయుడు సికింద్రాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఆర్మీ స్కూల్లో సీటు సాధించాడు. సీబీఎస్ఈ పదో తరగతిలో ‘ఎ’ గ్రేడ్‌తో ఉత్తీర్ణుడయ్యాడు. అక్కడే ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతూ కోచ్ దేవా వద్ద శిక్షణ పొందుతున్నాడు. తమ కుమారుడు గురునాయుడు సాధించిన విజయంతో తల్లిదండ్రులైన రామస్వామి, పాపయ్యమ్మ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. -
ఒంటివేలు బాహుబలి.. ఏకంగా 129.49 కిలోల బరువెత్తి!
మీకు వెయిట్ లిఫ్టింగ్ తెలుసుగా.. అదేనండి, బరువులెత్తే పోటీ.. మరి మీకు ఫింగర్ లిఫ్టింగ్ గురించి తెలుసా? ఒంటి వేలితో భారీ బరువులు ఎత్తడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఒకే ఒక వేలితో బరువులు ఎత్తడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? కానీ బ్రిటన్‌కు చెందిన స్టీవ్ కీలర్ (48) అనే వ్యక్తి కేవలం తన మధ్య వేలితో భారీ బరువును పైకెత్తి సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించాడు. ఇంతకీ ఆయన పైకెత్తిన బరువు ఎంతో తెలుసా? ఏకంగా 129.49 కిలోలు. కెంట్ నగరంలోని యాష్ఫోర్డ్కు చెందిన కీలర్ ఓ కరాటే యోధుడు. తన 18 ఏట నుంచే కరాటే శిక్షణ పొందుతున్న కీలర్ గత నాలుగేళ్లుగా బలాన్ని పెంచుకోవడంపై ప్రత్యేక ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అలా శిక్షణ పొందే క్రమంలో ఓసారి అలవోకగా 111 కిలోల బరువు ఎత్తేశాడట. అప్పటివరకు ఉన్న గిన్నిస్ వరల్డ్ రికార్డుకు ఇది కేవలం 10 కిలోలు మాత్రమే తక్కువట. దీంతో కొత్త రికార్డు నెలకొల్పడంపై దృష్టిపెట్టిన కీలర్.. తాజాగా 129.49 కిలోల బరువుగల ఆరు ఇనుప డిస్క్‌లను తన మధ్య వేలితో పైకిత్తి గిన్నిస్కెక్కాడు. కీలర్ ధాటికి 2012లో అర్మేనియాకు చెందిన బెనిక్ అనే యువకుడు ఒంటి వేలితో పైకెత్తిన 121.69 కిలోల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. తన రికార్డును ఇటీవల మరణించిన, తనకు బలాన్ని పెంచుకోవడంలో శిక్షణ ఇచ్చిన పినతండ్రికి అంకితమిచ్చాడు. చదవండి: ప్రపంచంలో తొలి సోలార్ పవర్ కారు.. విశేషాలు ఇవే -
భారత వెయిట్‌లిఫ్టర్ జెరెమీకి స్వర్ణం
కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ లిఫ్టర్ జెరెమీ లాల్రినుంగా స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. తాష్కెంట్లో జరుగుతున్న ఈ టోర్నీలో మిజోరం రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల జెరెమీ 67 కేజీల విభాగంలో అగ్రస్థానంలో నిలిచాడు. జెరెమీ స్నాచ్‌లో 141 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 164 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 305 కేజీలతో బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. ఇదే వేదికపై జరుగుతున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో జెరెమీ ఏడో స్థానంలో నిలిచాడు. -
ఒలింపిక్స్ నుంచి బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్ ఔట్!
లాసానే (స్విట్జర్లాండ్): ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడు పతకాలు అందించిన బాక్సింగ్, రెండు పతకాలు అందించిన వెయిట్లిఫ్టింగ్లకు విశ్వ క్రీడల్లో భవిష్యత్తు సందేహాత్మకంగా మారింది. 2028లో లాస్ ఏంజెలిస్‌లో జరిగే ఒలింపిక్స్ నుంచి ఈ క్రీడలను తప్పించే అవకాశం ఉంది. దీంతో పాటు ఐదు క్రీడాంశాల సమాహారమైన మోడ్రన్ పెంటాథ్లాన్‌ను (రన్నింగ్, ఈక్వెస్ట్రియన్, స్విమ్మింగ్, షూటింగ్, ఫెన్సింగ్) కూడా తొలగించాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) భావిస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడకపోయినా... మూడు కొత్త క్రీడాంశాల ప్రకటనను బట్టి చూస్తే పై మూడింటిని తప్పించాలని ఐఓసీ అంతర్గత సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వీటి స్థానాల్లో కొత్తగా స్కేట్ బోర్డింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, సర్ఫింగ్‌లను చేర్చనున్నారు. యువత ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్న ఈ క్రీడలను ఒలింపిక్స్‌లో రెగ్యులర్ క్రీడాంశంగా మార్చేందుకు ఐఓసీ సిద్ధమైంది. 1912 ఒలింపిక్స్ నుంచి ఉన్న మోడ్రన్ పెంటాథ్లాన్‌కు చారిత్రక ప్రాధాన్యమే తప్ప వాణిజ్యపరంగా కానీ అభిమానులపరంగా పెద్దగా ఆసక్తి గానీ ఉండటం లేదని ఐఓసీ చెబుతోంది. ఇక బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడలను సుదీర్ఘ కాలంగా పలు సమస్యలు వెంటాడుతున్నాయి. ఆర్థిక పరమైన అంశాలు, నైతికత లోపించడం, డోపింగ్, పరిపాలన సరిగా లేకపోవడంతో ఈ క్రీడల ప్రక్షాళన అవసరమని భావిస్తూ వీటిని తప్పించాలని ఐఓసీ ప్రతిపాదించింది. మరోవైపు 2028 నుంచి క్రికెట్ కూడా ఒలింపిక్స్‌లోకి రావచ్చంటూ వినిపించగా, తాజా పరిణామాలతో ఆ అవకాశం లేదని తేలిపో యింది. లాస్ ఏంజెలిస్ ఈవెంట్ కోసం నిర్వాహకులు ప్రతిపాదించిన 28 క్రీడాంశాల్లో క్రికెట్ పేరు లేకపోవడంతో దీనిపై స్పష్టత వచ్చేసింది. -
శభాష్ ! సాయి అలంకృత.. వెయిట్ లిఫ్టింగ్‌లో వరల్డ్ రికార్డ్
-
అభిమానులకు షాక్.. వచ్చే ఒలింపిక్స్‌లో ఆ క్రీడ డౌటే
స్విట్జర్లాండ్: వెయిట్ లిఫ్టింగ్ అభిమానులకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) షాక్ ఇవ్వనుంది. 2024 పారిస్ ఒలింపిక్స్ నుంచి వెయిట్ లిఫ్టింగ్ క్రీడను ఎత్తివేసేందుకు ప్రణాళికను సిద్దం చేస్తుంది. దీనిపై ఇప్పటికే చర్చలు జరిపినట్లు.. త్వరలోనే దీనికి ఆమోదముద్ర వేయనున్నట్లు ఐవోసీ ఒక ప్రకటనలో తెలిపింది. వెయిట్ లిఫ్టింగ్‌లో పాల్గొంటున్న అథ్లెట్లలో చాలామంది డోపింగ్‌కు పాల్పడినట్లు తెలిసిందంటూ ఐవోసీ పేర్కొంది. ముఖ్యంగా కొంతమంది ఆటగాళ్లు బరువులు ఎత్తడానికి నిషేదిత డ్రగ్స్ వాడుతున్నట్లు వాదనలు వినిపించాయి. అంతేగాక డ్రగ్స్ వాడుతూ తమ కెరీర్‌ను కొనసాగిస్తున్నారని తేలింది. దీనిపై గతంలోనే ఇంటర్నేషనల్ వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్ (ఐడబ్ల్యూఎఫ్)కు ఐవోసీ హెచ్చరికలు సైతం జారీ చేసింది. వెయిట్ లిఫ్టింగ్‌లో పెద్ద ఎత్తున డోపీలు పట్టుబడుతుండడంతో ఐవోసీ కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే వచ్చే పారిస్ ఒలింపిక్స్ నుంచి వెయిట్ లిఫ్టింగ్‌ను సస్పెండ్ చేయడంపై నిర్ణయం తీసుకోనుంది. అయితే తాము పేర్కొన్న సంస్కరణల అమలుపై ఐడబ్ల్యూఎఫ్ చర్యలు తీసుకుంటే.. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్‌ను తిరిగి చేర్చే అంశాన్ని పరిశీలిస్తామని ఐవోసీ వెల్లడించింది. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత అథ్లెట్ మీరాబాయి చాను రజతం గెలుచుకున్న సంగతి తెలిసిందే. వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో పోటీపడింది. మొత్తమ్మీద 202 కేజీలు ఎత్తిన మీరాబాయి.. స్వర్ణం కోసం జరిగిన మూడో అటెంప్ట్‌లో మాత్రం విఫలమైంది. క్లీన్ అండ్ జెర్క్‌లో 117 కేజీలు ఎత్తే క్రమంలో తడబడింది. కాగా ఒలింపిక్స్ ప్రారంభమైన రెండో రోజే దేశానికి పతకం అందించి చరిత్ర సృష్టించింది. ఇక వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కరణం మల్లీశ్వరీ(కాంస్యం, 2000 సిడ్నీ ఒలింపిక్స్) తర్వాత దేశానికి రెండో పతకం అందించిన మహిళగా మీరాబాయి నిలిచింది. -
వారెవ్వా ! అలంకృత... ఇదే వరల్డ్ రికార్డ్
-
వారెవ్వా ! అలంకృత... ఇదే వరల్డ్ రికార్డ్
సాక్షి, వెబ్‌డెస్క్: సిడ్నీ ఒలింపిక్స్‌లో భారత్‌కి ఏకైక పతకాన్ని అందించిన ఘనత కరణం మల్లేశ్వరీ సొంతం. ఆ తర్వాత దాదాపు ఇరవై ఏళ్లకు మీరాచాను ఈ ఫీట్ సాధించింది. ఇప్పుడు వాళ్లకీ వారసురాలు మన భాగ్యనగరంలో రెడీ అవుతోంది. బుడిబుడి అడుగులు వేసే వయసులోనే భారీ బరువులు సునాయాసంగా లేపుతోంది. పాలబుగ్గల వయసులోనే వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. వరల్డ్ రికార్డ్ హైదరాబాద్ నగరానికి చెందిన సందీప్, సాయి స్నిగ్ధబసు దంపతుల ముద్దు బిడ్డ సాయి అలంకృత కేవలం 20 నెలల వయసులోనే సంచలనాలు సృష్టిస్తోంది. తోటి పిల్లలెవరికీ సాధ్యం కాని రీతిలో బరువులను ఎత్తుతోంది. పాపలోని టాలెంట్‌ని గమనించిన తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆమెలోని ప్రతిభకు మెరుగులు దిద్దుతున్నారు. దీంతో అతి చిన్న వయసులో ఎక్కువ బరువు ఎత్తిన బేబీగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరును నమోదు చేసుకుంది. ఏడాది వయస్సులోనే ఏడాది వయస్స ఉన్నప్పుడే ఇంట్లో ఉన్న టూ లీటర్స్ వాటర్ బాటిల్‌ని సాయి అలంకృత అవలీలగా ఎత్తుకుని నడిచింది. అప్పటి నుంచి పాపలోని స్పెషల్ ట్యాలెంట్‌ని తల్లిదండ్రులు గమనిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్లో 4.2 కేజీల బరువు ఉన్న వాటర్ మిలాన్‌ని పదిహేడు నెలల వయస్సులో ఎత్తింది, ఇప్పుడు 20 నెలల వయస్సులో 5 కేజీల బరువును ఎత్తడంతో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. 6 కేజీలు ఎత్తగలదు - సందీప్ (తండ్రి) బరువులు ఎత్తడంలో పాపకు ఉన్న ప్రత్యేక నైపుణ్యాన్ని గుర్తించి, ఆమెకు స్పెషల్ డైట్ అందిస్తున్నాం. పాపకు ఇప్పుడు 20 నెలలు, ఈ వయసు పిల్లలు కేజీ వరకు బరువులే అతి కష్టంగా ఎత్తగలరు. ఇప్పటి వరకు 4 ఏళ్ల బాబు 3 కేజీలు ఎత్తడమే వరల్డ్ రికార్డ్. అలంకృత ఇప్పుడు 6 కేజీల వరకు బరువును ఎత్తగలుగుతోంది. మేము 5 కేజీల బరువు ఎత్తిన వీడియోనే రికార్డు పరిశీలనకు పంపించాం. సంతోషంగా ఉంది - సాయి స్నిగ్ధబసు (తల్లి) ఏడాది వయసులో పాపలోని స్పెషల్ టాలెంట్‌ని గుర్తించి గమనిస్తూ వచ్చాం. ఈ రోజు మా పాప టాలెంట్‌ని ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు వారు గుర్తించడంతో సంతోషంగా ఉంది. స్పెషల్ టాలెంట్ ఉన్న పిల్లలను ప్రోత్సహించాలి. -
మీరాబాయి చానును అచ్చంగా దింపేసిన చిన్నారి; వీడియో వైరల్
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో భారత్‌కు చెందిన మీరాబాయి చాను రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది. వెయిట్‌లిఫ్టింగ్ మహిళల విభాగంలో కరణం మల్లీశ్వరీ తర్వాత పతకం సాధించిన రెండో మహిళగా మీరాబాయి రికార్డులకెక్కారు. ఒలింపిక్స్ ప్రారంభమైన రెండో రోజే దేశానికి పతకాన్ని సాధించిపెట్టిన ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. తాజాగా స్వదేశానికి చేరుకున్న మీరాబాయికి ఘన స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో మీరాబాయి చానును అనుకరిస్తూ వెయిట్‌లిఫ్టర్ సతీష్ శివలింగం కూతురు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 49 కేజీల విభాగంలో రజతం గెలిచిన మీరాబాయిని టీవీలో చూస్తూ అచ్చం ఆమెను దింపేసింది. మీరాబాయి వెయిట్ లిఫ్ట్ చేసిన వీడియోనూ చూస్తూ ఆ చిన్నారి కూడా తన ముందు ఒక వెయిట్ లిఫ్టింగ్‌ను సిద్దం చేసుకుంది. ఆ తర్వాత అచ్చం ఆమెలానే వెయిట్ ఎత్తిన చిన్నారి తన హావభావాలతో మెప్పించింది. అనంతరం మెడల్ ప్రెజంటేషన్లో భాగంగా చాను మెడల్ ధరించినట్టుగానే చిన్నారి కూడా తన మెడలో ఒక మెడల్ వేసుకొని ముసిముసిగా నవ్వింది. ఈ వీడియోను వెయిట్‌లిఫ్టర్ సతీష్ శివలింగమ్ స్వయంగా తన ట్విటర్లో షేర్ చేయగా.. మీరాబాయి చాను స్పందించడం విశేషం. ''ఈ చిన్నారి భలేగా చేసింది... సో క్యూట్.. జస్ట్ లవ్ దిస్'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. '' నువ్వు సూపర్ రా చిన్నారి.. మాకు మరో మీరాబాయ్ చాను దొరికేసింది.. బుల్లి మీరాబాయి అదరగొట్టేసింది..'' అంటూ కామెంట్లు చేశారు. So cute. Just love this. https://t.co/IGBHIfDrEk — Saikhom Mirabai Chanu (@mirabai_chanu) July 26, 2021 -
జయహో చాను.. ఆమె తొలి కోచ్ ఎవరంటే?
-
జయహో చాను.. ఆమె తొలి కోచ్ ఎవరంటే?
సాక్షి, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి ప్రకంపనల మధ్య అసలు ఒలింపిక్ ఉత్సాహం ఉంటుందో లేదో అన్న సందేహాల నడుమ ఎట్టకేలకు జపాన్ రాజధాని టోక్యో నగరం సిద్దమై పోయింది. సంబరం అలా మొదలైందో లేదో ఇలా ఒక పతకం భారత సిగలో మెరవడం విశేషమే మరి. అయితే ఈ సందర్భంగా వెయిట్ లిఫ్టింగ్‌లో పతకాలతో మెరిసి మురిపించిన లెజెండరీ భారతీయ మహిళల గురించి తెలుసుకుందాం. రంగం ఏదైనా పురుషులతో సమానంగా అనే మాటను మన అమ్మాయిలు అధిగమించి తమకుతామే సాటి అంటూ దూసుకుపోతున్నారు. అన్నింటా మేమే ఫస్ట్ అంటున్నారు. వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్... టెన్నిస్..బ్యాడ్మింటన్..క్రికెట్ ఇలా క్రీడ ఏదైనా ఆకాశమే హద్దుగా రాణిస్తున్నారు. టోక్యో ఒలింపిక్ క్రీడా సంగ్రామం వేదికగా ఇది మరోసారి నిరూపితమైంది. Chanu Saikhom Mirabai టోక్యో ఒలంపిక్స్‌లో తొలి పతకంతో శుభారంభం చేసి ప్రపంచం దృష్టిని తన వైపుతిప్పుకుని భారత కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప జేశారు మన మణిపూర్ మణిపూస. మణిపూర్‌కు చెందిన క్రీడాకారిణి మీరాబాయి చాను వెయింట్ లిప్టింగ్ పోటీల్లో 49 కేజీల విభాగంలో రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. దాదాపు 20 ఏళ్ల తరువాత మన దేశానికి వన్నె తెచ్చిన పతకమిది. ‘‘బంగారం పతకం కోసం చాలా ప్రయత్నించా.. కానీ సాధ్యం కాలేదు. కానీ సెకండ్ లిఫ్ట్ తరువాత పతకం ఖాయమని అర్థమైపోయిందంటూ’’ ఆమె సంబరపడిపోయారు. అంతేకాదు ‘‘ముందు ఒక పిజ్జా తినాలి..పిజ్జా తిని ఎన్ని రోజులైందో’’ అంటూ అక్కడున్న వారందరిలో నవ్వులు పూయించారు. మరోవైపు తన విద్యార్థి మొత్తం దేశం మోముపై చిరునవ్వులు పూయస్తోందంటూ మీరా బాయి గురువు , మరో ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్ కుంజారాణీ దేవి సంతోషం వ్యక్తం చేశారు. మణిపూర్ మణిపూస కుంజరాణీ దేవి వివిధ అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించి, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాన్ని సైతం అందుకుని భారతీయ వెయిట్ లిఫ్టింగులో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న మహిళ మణిపూర్‌కే చెందిన కుంజారాణీ దేవి. మీరా బాయికి తొలి అడుగులు నేర్పిన గురువు కుంజారాణి కావడం ఇక్కడ మరో విశేషం. ఆమె కరీర్‌ను రూపొందించడంలో ఆమెది కీలక పాత్ర. 2015 వరకు తనకు గురువుగా వున్న ఆమె స్టయిల్‌ను ఫాలో అవుతానని, ఆమెను చూసే వెయిట్ లిఫ్టింగ్‌ను కరియర్‌గా ఎంచుకున్నానని స్వయంగా మీరా బాయే చెప్పుకున్నారు. 1985 సంవత్సరం మొదలుకొని జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 44, 46, 48 కిలోల విభాగాల్లో పతకాలు సాధించారామె. 1989లో మాంచెస్టర్‌లో జరిగిన ప్రపంచ మహిళా వెయిట్ లిఫ్టింగ్ పోటీలో మొదటిసారి పాల్గొని మూడు వెండి పతకాలు సాదించారు. 1990లో బీజింగ్, 1994లో హిరోషిమాలో జరిగిన ఆసియా క్రీడలలో రజత పతకాన్నితన ఖాతాలో వేసుకున్నారు. 1989 షాంఘైలో జరిగిన పోటీలలో ఒక రజత, రెండు కాంస్య పతకాలు 1991లో ఇండోనేషియాలో జరిగిన పోటీలో 44 కిలోల విభాగంలో మూడు వెండిపతకాలతో తన విజయ పరంపర కొనసాగించారు. ఇక ఆ తరువాత 1992లో థాయిలాండ్ లోను, 1993లో చైనా పోటీల్లోనూ తన రెండవ స్థానాన్ని సాధించారు. 1995లో దక్షిణకొరియాలో జరిగిన పోటీల్లో 46 కిలోల విభాగంలో రెండు బంగారు పతకాలు, ఒక రజతపతకాన్ని సొంతం చేసుకున్నారు. యాబైకి పైగా అంతర్జాతీయ అవార్డులు ఆమె సొంతం. 2006 మెల్బోర్న్లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో 48 కిలోల విభాగంలో బంగారుపతకాన్ని గెలవడమేకాక 72 కిలోలు, 94 కిలోల ఉమ్మడి విభాగంలో రికార్డు నెలకొల్పారు. తెలుగు తేజం కరణం మల్లీశ్వరి 1990వ దశకంలో ఒలింపిక్ వేదికగా మువ్వన్నెల పతాకానికి వన్నె తెచ్చిన తెలుగు తేజం కరణం మల్లీశ్వరి. శ్రీకాకుళానికి చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి 2000 సిడ్నీ ఒలింపిక్ పతకం కాంస్య పతకం సాధించారు. ఈ సమయంలో భారత్‌కు ఏకైక పతకాన్ని సాధించి, దేశ ప్రతిష్టను సమున్నతంగా నిలబెట్టిన ఆ క్షణాలను సగటు భారతీయుడు ఎలా మర్చిపోగలడు. 1994 అర్జున, 1999లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, పద్మశ్రీ పురస్కారాలతోపాటు, 11 స్వర్ణాలతో సహా మొత్తం 29 అంతర్జాతీయ పతకాలు సాధించిన రికార్డు మల్లీశ్వరి సొంతం. అందుకే దేశ రాజధాని ఢిల్లీలోని క్రీడా విశ్వవిద్యాలయానికి తొలి వైస్ ఛాన్సలర్ పదవి ఆమెను వచ్చి వరించింది. పద్మశ్రీ కరణం మల్లీశ్వరిని స్పోర్ట్స్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్‌గా నియమిస్తూ ఢిల్లీ ప్రభుత్వం నియమించింది. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరగాల్సిన కరోనా కారణంగా ఒక సంవత్సరం ఆలస్యంగా జరుగుతోంది. ఆగస్టు నెల 8వ తేదీవరకు క్రీడా సంగ్రామం హోరా హోరీగా జరగనుంది. మన దేశం నుంచి 119మంది పాల్గొంటున్న ఈ ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు, రికార్డులు మన సొంతం కావాలని కోరుకుందాం. ముఖ్యంగా బాక్సింగ్ మేరీ కోమ్ ఈ ఒలంపిక్‌లో ఎలాగైనా గోల్డ్ కొట్టాలి. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్, సీడబ్ల్యుజీ బంగారు పతక విజేత, ఆసియా గేమ్స్ బంగారు పతక విజేత, ఆసియా ఛాంపియన్షిప్ బంగారు పతక విజేత, ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెల్చుకున్నప్పటికీ .. ఇపుడు బంగారు పతకం సాధించాలనేది ఆశ. ఇందుకు 2020 టోక్యో గేమ్స్ ఆఖరి అవకాశం. వివిధ క్రీడల్లో దేశానికి అంతర్జాతీయఖ్యాతి తెచ్చిన మహిళామణుల గురించి రాయాలంటే చాలా పెద్దలిస్టే.. భారత తొలి మహిళా అథ్లెట్ అంజూ బాబీ జార్జి మొదలు పరుగుల రాణి పీటీ ఉష, బాక్సింగ్‌కు మారుపేరు మేరీ కోమ్...కుస్తీ వస్తాదు సాక్షీ మాలిక్, టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా, బ్యాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, సైనా.. చదరంగంలో తొలి మహిళా గ్రాండ్ మాస్టర్ భాగ్యశ్రీ థిప్సే, కోనేరు హంపీ, హారిక.. ఇక క్రికెట్లో మిథాలీరాజ్.. సఫాలీ వర్మ ఇలా ఎందరో.. మరెందరో.. అందరికీ మరోసారి జయహో...! -
కరణం మల్లీశ్వరి ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూ
-
మీరాబాయి చానుపై ప్రశంసల జల్లు
-
మీరాబాయి చానుకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ బోణీ కొట్టిన విషయం తెలిసిందే. భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను శనివారం వీరోచిత ప్రదర్శనతో రజత పతకాన్ని సాధించింది. 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంతో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మీరాబాయి చరిత్ర సృష్టించింది. కాగా భారత్‌కు పథకం సాధించిన మీరాబాయికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ స్పందించారు. ‘అద్భుతమైన ప్రదర్శన. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో భారతదేశం పథకం సాధించడం చాలా ఆనందంగా ఉంది. 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించినందుకు మీరాబాయి చానుకి హృదయపూర్వక అభినందనలు’ అని ట్వీట్ చేశారు. కాగా కరణం మల్లీశ్వరి తర్వాత ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పథకాన్ని గెలుచుకున్న రెండో భారతీయ మహిళగా మీరాబాయి చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ 49 కేజీల విభాగంలో మొత్తం మీద 202 కేజీలు ఎత్తిన మీరాబాయి.. స్వర్ణం కోసం జరిగిన మూడో అటెంప్ట్‌లో మాత్రం విఫలమైంది. క్లీన్ అండ్ జెర్క్‌లో 117 కేజీలు ఎత్తే క్రమంలో తడబడింది. అయితేనేం రజతం ద్వారా భారత్ పతకాల బోణీని తెరిచిన తొలి వ్యక్తిగా నిలిచింది. A magnificent feat! Absolutely delighted to see India off the mark in #Olympics #Tokyo2020. Hearty congratulations @mirabai_chanu on winning the silver medal in 49 kgs women's weight lifting category.#MirabaiChanu — YS Jagan Mohan Reddy (@ysjagan) July 24, 2021 -
వెయిట్ లిఫ్టింగ్‌లో రాణిస్తున్న సింధూ
మహబూబ్‌నగర్ క్రీడలు: వనపర్తి జిల్లా కొన్నూర్‌లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన గంటల సింధూ వెయిట్ లిఫ్టింగ్‌లో మెరుగైన నైపుణ్యం ప్రదర్శిస్తూ జిల్లా, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. 2007లో స్పోర్ట్స్ స్కూల్ సెలెక్షన్స్‌లో సింధూ ప్రతిభ కనబరిచి 4వ తరగతిలో హైదరాబాద్ హకీంపేట స్పోర్ట్స్ హాస్టల్లో ప్రవేశం పొందింది. రెండేళ్లపాటు కండీషన్ ట్రైనింగ్ అనంతరం సింధూ వెయిట్ లిఫ్టింగ్‌కు ఎంపికైంది. అప్పటి నుంచి వెయిట్ లిఫ్టింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ అనతి కాలంలోనే రాష్ట్ర, జాతీయస్థాయిలో సత్తాచాటింది. 2018లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో వనపర్తి జిల్లా ఉత్తమ క్రీడాకారిణిగా మంత్రి నిరంజన్‌రెడ్డి చేతులమీదుగా అవార్డు అందుకుంది. 27 నేషనల్ పోటీల్లో 19 పతకాలు సింధూ ఇప్పటివరకు 30 జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 19 పతకాలు సాధించింది. మొదటగా 2010 హర్యానాలో జరిగిన జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్‌లో 48 కిలోల విభాగంలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. అదే ఏడాది మహారాష్ట్ర (సాంగ్లీ)లో జరిగిన పోటీల్లో 53కిలోల విభాగంలో బంగారు పతకం పొందింది. చత్తీస్ఘడ్ (రాయ్‌పూర్)లో జరిగిన పోటీల్లో 53 విభాగంలో బంగారు పతకం సాధించింది. 2013లో అస్సాం (గౌహతి)లో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో 58 కిలోల విభాగంలో కాంస్య పతకం, 2015 హర్యానాలో 58 కిలోల విభాగంలో రజతం, 2016 పంజాబ్‌లో జరిగిన ఆలిండియా యూనివర్సిటీలో 55కిలోల విభాగంలో రజతం పతకాలు సాధించింది. 2017లో బెంగళూర్‌లో జరిగిన సీనియర్ నేషనల్ పోటీల్లో, 2018లో నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఆలిండియా యూనివర్సిటీ, వైజాగ్‌లో జరిగిన సీనియర్ నేషనల్ పోటీల్లో పాల్గొంది. గత ఏడాది డిసెంబర్లో తమిళనాడులోని ఎంఎస్‌యూ యూనివర్సిటీలో జరిగిన ఆలిండియా యూనివర్సిటీలో 55 కిలోల విభాగంలో రజత పతకం సాధించింది. ఈ ఏడాది ఫిబ్రవరి కోల్‌కత్తాలో జరిగిన సీనియర్ నేషనల్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న సింధూ కోల్కత్తా ఇన్‌కంటాక్స్ డిపార్ట్మెంట్లో ఈ ఏడాది మార్చిలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించింది. దేశానికి ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యం వెయిట్ లిఫ్టింగ్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడమే నా లక్ష్యం. అందుకోసం తీవ్రంగా కష్టపడతా. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వచ్చినందుకు సంతోషంగా ఉంది. పాలమూరురెడ్డి సేవా సమితి వారు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. మధ్యతరగతి అనే భావనను వీడి కష్టపడితే క్రీడల్లో ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. – సింధూ, వెయిట్‌లిఫ్టర్ 2018లో.. ప్రస్తుత మంత్రి నిరంజన్‌రెడ్డి చేతులమీదుగా ఉత్తమ క్రీడాకారిణిగా అవార్డు అందుకుంటున్న సింధూ -
గురు నాయుడుకు కాంస్య పతకం
సాక్షి, విజయవాడ స్పోర్ట్స్: ఆసియా యూత్, జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ ఎస్.గురు నాయుడు కాంస్య పతకాన్ని సాధించాడు. ఉజ్బెకిస్తాన్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్లో విజయనగరం జిల్లా లిఫ్టర్ గురు నాయుడు యూత్ బాలుర 49 కేజీల విభాగంలో మూడో స్థానంలో నిలిచాడు. గురు నాయుడు మొత్తం 177 కేజీలు (స్నాచ్‌లో 77+క్లీన్ అండ్ జెర్క్‌లో 100) బరువెత్తాడు. -
భారత వెయిట్‌లిఫ్టర్ రాఖీ హల్దర్‌కు కాంస్యం
దోహాలో జరిగిన ఖతర్ కప్ అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ టోర్నమెంట్లో భారత్‌కు మూడో పతకం లభించింది. మహిళల 64 కేజీల విభాగంలో రాఖీ హల్దర్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలిచింది. రాఖీ మొత్తం 218 కేజీలు (స్నాచ్‌లో 85 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్‌లో 123 కేజీలు) బరువెత్తింది. ఈ క్రమంలో రాఖీ 214 కేజీలతో తన పేరిటే ఉన్న జాతీయ సీనియర్ రికార్డును సవరించింది. టోక్యో ఒలింపిక్స్ సిల్వర్ స్థాయి అర్హత టోర్నమెంట్‌గా గుర్తింపు పొందిన ఖతర్ కప్‌లో ఓవరాల్‌గా భారత్‌కు మూడు పతకాలు లభించాయి. ఇంతకుముందు ఈ టోర్నీలో మీరాబాయి చాను స్వర్ణం, జెరెమీ లాల్రినుంగా రజతం సాధించారు. -
ఒకేసారి 27 రికార్డులు బద్దలు
దోహా: ఖతర్ కప్ అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ టోర్నమెంట్లో యూత్ ఒలింపిక్స్ చాంపియన్, భారత యువతార జెరెమీ లాల్రినుంగా రజత పతకం సాధించాడు. పురుషుల 67 కేజీల విభాగంలో పోటీపడిన మిజోరం లిఫ్టర్ లాల్రినుంగా మొత్తం 306 (స్నాచ్‌లో 140 కేజీల+క్లీన్ అండ్ జెర్క్‌లో 166 కేజీలు) కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 17 ఏళ్ల లాల్రినుంగా తన పేరిటే ఉన్న ఐదు సీనియర్ జాతీయ రికార్డులను, ఐదు జాతీయ జూనియర్ రికార్డులను, ఐదు జాతీయ యూత్ రికార్డులను, మూడు యూత్ వరల్డ్ రికార్డులను, మూడు ఆసియా యూత్ రికార్డులను, ఆరు కామన్వెల్త్ రికార్డులను బద్దలు కొట్టాడు. -
కాజల్.. సవాల్
చెన్నై : హీరోయిన్ల ఛాలెంజ్‌లు అధికం అవుతున్నాయి. మొన్న నటి సమంత ఒక్క బక్కెట్ నీరు అంటూ ఛాలెంజ్ విసిరింది. తాజాగా నటి కాజల్‌అగర్వాల్ కూడా సవాల్ అంటోంది. అయితే ఈ అమ్మడి ఛాలెంజ్ చాలా బరువైనదే. దాదాపు ఒకటిన్నర దశాబ్దం నట జీవిత మైలురాయి టచ్ చేయడానికి చేరువలో ఉన్న నటి కాజల్ అగర్వాల్. అదే విధంగా అర్ధ సెంచరీ చిత్రాల మైలురాయిని అవలీలగా దాటేసింది. అయినా ఈ అమ్మడికి సినీ మోహం ఏ మాత్రం తీరలేదు. స్టిల్ నాటౌట్ క్రేజీ హీరోయిన్గా బరిలో ఉంది. బహు భాషా నటిగానూ రాణిస్తోంది. ఇందుకు కావలసినంత అందాన్ని మెరుగు పరుచుకునే ప్రయత్నాలూ చేస్తోంది. అందుకు కసరత్తులు చాలా అవసరం. ఈ విషయంలో కాజల్ అగర్వాల్ మరింత డోస్ పెంచేసింది. ఇప్పటి వరకూ సాధారణ ఎక్సర్‌సైజ్‌లతో సరిపెట్టుకుంటూ వెయిట్ లిప్ట్ జోలికి పోనీ ఈ బ్యూటీ ఇటీవల ఆ ప్రయత్నాలు మొదలెట్టేసింది. వెయిట్లిప్ట్ల్లో హీరోయిన్లు పోటీ పడటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కాగా కాజల్‌అగర్వాల్ తొలి ప్రయత్నంలోనే ఏకంగా 70 కిలోల బరువును చేతులతో లేపేసే ప్రయత్నం చేసింది. తన శిక్షకుడి పర్యవేక్షణలో అంత వెయిట్ లిప్ట్ చేసిన కాజల్ అమ్మో అంటూ ఒక్క సారిగా కింద చతికిల పడిందట. అయితే ఇది ట్రైలరేననీ, మెయిన్ పిక్చర్ ముందు ముందు చూపిస్తాననీ సవాల్ విసిరింది. అయితే ఈ సవాల్‌ను తను విసిరింది అభిమానులకా? లేక ఇతర హీరోయిన్లకా అనే చర్చ సినీ వర్గాల్లో స్టార్ట్ అయ్యింది. అయితే చందమామ వెయిట్ లిప్ట్ కసరత్తుల దృశ్యాలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కమలహాసన్‌కు జంటగా ఇండియన్–2 చిత్రంలో నటించడానికి ఈ ముద్దుగుమ్మ రెడీ అవుతోంది. ఆయన సరసన మరింత నాజూగ్గా కనిపించాలనే ఈ వెయిట్లిప్ట్ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా కాజల్ కసరత్తుల వ్యవహారం ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. -
వెయిట్ లిఫ్టింగ్‌తో గుండెకు మేలు
లండన్ : హృదయనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో కార్డియో వ్యాయామాలతో పోలిస్తే వెయిట్ లిఫ్టింగ్ మేలని తాజా అథ్యయనం వెల్లడించింది. స్థూలకాయుల్లో గుండెలో పేరుకుపోయిన కొవ్వు ప్రమాదకరమని దీన్ని తగ్గించడంలో బరువులు ఎత్తడం, డంబెల్స్,పుషప్స్ వంటివి మెరుగైన వ్యాయామంగా ఉపకరిస్తాయని నిపుణులు పేర్కొన్నారు. కార్డియో వ్యాయామాల జోలికి వెళ్లకుండా మూడు నెలల పాటు కేవలం వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ తీసుకున్న స్థూలకాయుల్లో మూడింట ఒక వంతు హృదయనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు తగ్గుముఖం పట్టిందని శాస్త్రవేత్తల అథ్యయనంలో వెల్లడైంది. సరైన ఆహారం, వ్యాయామం ద్వారా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి హృద్రోగాలకు దారితీసే పరిస్థితిని నివారించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. కోపెన్హాగన్ యూనివర్సిటీ ఆస్పత్రికి చెందిన శాస్త్రవేత్తలు ఈ అథ్యయనం నిర్వహించారు. -
బరువులెత్తితే.. మధుమేహ నియంత్రణ!
మధుమేహంతో బాధపడుతున్న ఊబకాయులకు వెయిట్ ట్రెయినింగ్, శక్తినిచ్చే వ్యాయామాలు రెండూ ఎంతో ఉపయోగపడతాయని అంటున్నారు బ్రెజిల్ శాస్త్రవేత్తలు. నడక లాంటి వ్యాయామాలే మధుమేహానికి చాలనుకుంటున్న తరుణంలో కంపినాస్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ కొత్త విషయాన్ని చెప్పడం గమనార్హం. ఊబకాయులు పైన చెప్పిన రెండు పనులు చేస్తే వారి కాలేయాల్లో పేరుకున్న కొవ్వు గణనీయంగా తగ్గిపోతుందని, తద్వారా రక్తంలోని చక్కెర మోతాదులు నియంత్రణలోకి వస్తాయని వీరు అంటున్నారు. ఎలుకలపై తాము జరిపిన ప్రయోగాల్లో రెండువారాలపాటు బరువులెత్తడం, శక్తినిచ్చే వ్యాయామాలు చేయడం ద్వారా కాలేయ కణజాలంలోని జన్యువుల్లో మార్పులు వచ్చాయని, ఫలితంగా అక్కడి కొవ్వులు వేగంగా కరగడం మొదలైందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త లియాండ్రో పెరీరా తెలిపారు. ఇదంతా ఎలా జరుగుతోందో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, వ్యాయామం కారణంగా నిర్దిష్ట ప్రొటీన్ల ఉత్పత్తిలో హెచ్చుతగ్గులను గుర్తిస్తే వాటిని కృత్రిమంగా తయారు చేయవచ్చునని లియాండ్రో ఆశాభావం వ్యక్తం చేశారు. కాలేయంలో ఎక్కువ కొవ్వు ఉన్నప్పుడు స్థానికంగా మంట/వాపు లాంటివి వస్తాయని, ఫలితంగా కాలేయంలోని కణాలు ఇన్సులిన్‌పై ప్రభావం చూపే స్థితిని కోల్పోతాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో నిరాహారంగా మాత్రమే ఉన్నప్పుడు విడుదల కావాల్సిన గ్లూకోజ్ రక్తంలోనికి చేరిపోతుందని వివరించారు. -
విరాట్ వీరత్వం చూశారా!
ఐపీఎల్ 2012లో ఘోరంగా విఫలమైన తర్వాత తనపై తనకే చికాకు కలిగింది విరాట్ కోహ్లికి. జట్టులో ఒక్కరికైనా క్రీడాకారుడికి ఉండాల్సిని బాడీ ఫిట్నెస్ ఉందా అంటూ అప్పటి టీమిండియా కోచ్ విమర్శ. జట్టులో కొనసాగలన్నా.. అత్యున్నత శిఖరాలు ఎక్కాలన్నా ఎదో కొత్తగా ట్రై చేయాలి అనుకున్నాడు కోహ్లి. అనుకున్నదే తడవుగా ఫిట్నెస్ మంత్ర మొదలెట్టాడు. బాడీ ఫిట్‌గా ఉంటే బ్యాటింగ్ బాదేయొచ్చని ఫిక్స్ అయ్యాడు. అప్పుడు మొదలెట్టిన వర్కౌట్స్ ఇప్పటి వరకూ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో ఆటగాళ్ల ఫిట్నెస్ గురించి ఎక్కడ ప్రస్తావన వచ్చినా.. తొలుత కోహ్లి పేరే వినిపించడం విశేషం. ప్రస్తుతం క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డులను అధిగమించే వరకు వచ్చాడు. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఆక్టివ్‌గా ఉండే కోహ్లి.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. వెయిట్ లిఫ్టర్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా.. ఎక్కువ బరువులను మోస్తూ ప్రొఫెషనల్ వెయిట్ లిఫ్టర్‌గా కోహ్లి కనిపించాడు. అంతేకాకుండా ‘ఏం సాధించాలనుకున్నా, ఏదైనా కావాలని కోరుకోవాలనుకున్నా ముందుగా మనం బలంగా, బాడీ ఫిట్‌గా ఉండాలి’అంటూ క్యాప్షన్ చేర్చాడు. యథా రాజా తథా ప్రజా అన్నట్టు.. సారథి దారిలోనే మిగిలిన ఆటగాళ్లు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడం విశేషం. అందుకే ఆటగాళ్లు పూర్తిగా ఫిట్‌గా ఉండటంతో టీమిండియా ఎప్పుడూ లేనంతంగా ఫీల్డింగ్‌లో బలంగా ఉంది. ఇక వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో చెలరేగిన టీమిండియా సారథి వరసగా మూడు శతకాలు సాధించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. ఇక ఈ సిరీస్‌లోనే పదివేల పరుగుల క్లబ్లో చేరాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌లోనే పదివేల పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. -
వెయిట్‌లిఫ్టర్ రాహుల్ స్వస్థలంలో సంబరాలు
-
కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన తెలుగు తేజం
-
కామన్ వెల్త్ గేమ్స్: భారత్‌కు మరో స్వర్ణం
-
సత్తా చాటిన సతీష్.. భారత్‌కు స్వర్ణం
గోల్డ్‌కోస్ట్: కామన్ వెల్త్ క్రీడల్లో భారత్ సత్తా చాటింది. వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో మరో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. శనివారం ఉదయం జరిగిన 77 కేజీల విభాగం పోటీల్లో సతీశ్ కుమార్ శివలింగం ఈ ఘనత సాధించారు. మొత్తం 317 కేజీల బరువునెత్తి అద్భుత ప్రదర్శన కనబరిచిన సతీష్ పసిడి పతకాన్ని పొందారు. తమిళనాడు వెల్లూరుకు చెందిన సతీష్ 2013లో కామన్వెల్త్ గేమ్స్‌లోనూ స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, ఈసారి క్రీడల్లో ఇప్పటిదాకా భారత్‌కు ఐదు పతకాలు రాగా.. అన్నీ వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలోనే సాధించటం విశేషం. -
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ రెండో స్వర్ణం
-
వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మళ్లీ స్వర్ణం
గోల్డ్‌కోస్ట్, ఆస్ట్రేలియా : కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ మళ్లీ స్వర్ణ పతకాన్ని గెలిచింది. 53 కేజీల విభాగంలో లిఫ్టర్ సంజిత చాను 192 కేజీ బరువును ఎత్తి పసిడిని ముద్దాడింది. స్నాచ్ రౌండ్లోమూడు అటెంప్ట్‌లలో విజయం సాధించిన సంజిత.. క్లీన్ అండ్ జర్క్ మూడో అటెంప్ట్‌లో విఫలమైంది. అయితే, సంజితకు చేరువలో ఉన్న పాపువా న్యూ గినియా లిఫ్టర్ కూడా క్లీన్ అండ్ జర్క్ మూడో అటెంప్ట్‌లో విఫలం కావడంతో భారత్‌కు స్వర్ణ పతకం ఖాయమైంది. -
సూపర్.. చాను
గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తొలి స్వర్ణ పతకాన్ని ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన మహిళల 48 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను బంగారు పతకాన్ని సాధించింది. స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ విభాగాల్లో మొత్తంగా 196 కేజీల బరువును సునాయాసంగా ఎత్తిన మీరాబాయి చాను పసిడి పతకాన్ని అందుకుంది. తొలుత స్నాచ్‌లో 86 కేజీలను ఎత్తిన చాను..ఆపై క్లీన్ అండ్ జర్క్‌లో 110 కేజీలను ఎత్తి సత్తాచాటింది. ఇక మారిషస్‌కు చెందిన వెయిట్ లిఫ్టర్ రోల్యా రానైవోసోవా మొత్తం 170 కేజీలను ఎత్తి రజత పతకాన్ని సొంతం చేసుకోగా, మొత్తం 155 కేజీలతో శ్రీలంక లిఫ్టర్ దినుషా గోమ్స్ కాంస్య పతకంతో సంతృప్తి పడింది. స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ చాలెంజ్‌లో మీరాబాయి చానుకు ఎదురే లేకుండా పోయింది. స్నాచ్‌లో భాగంగా జరిగిన మూడు రౌండ్లలో (80,84 86 కేజీలు) చాను సక్సెస్‌ఫుల్‌గా బరువులు ఎత్తగా, క్లీన్ అండ్ జర్క్ విభాగంలోని మూడు రౌండ్లను(103, 107, 110 కేజీలు) మీరాబాయి చాను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. క్లీన్ అండ్ జర్క్ చివరి రౌండ్లో అత్యధికంగా 110 కేజీల బరువు ఎత్తిన చాను తొలి స్థానంలో నిలిచింది. దాంతో పసిడి పతకం మీరాబాయి చాను ఖాతాలో వేసుకుంది. ఇది క్లీన్ అండ్ జర్క్‌లో మీరాబాయ్ చాను అత్యుత్తమ ప్రదర్శనగా రికార్డులెక్కింది. అంతకుముందు 109 కేజీలను మాత్రమే తన అత్యుత్తమ క్లీన్ అండ్ జర్క్ ప్రదర్శన కాగా, దాన్ని చాను తాజాగా అధిగమించి సరికొత్త వ్యక్తిగత ఫీట్‌ను సైతం సొంతం చేసుకుంది. అయితే స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ విభాగాల్లో రోల్యా రానైవోసోవా, దినుషా గోమ్స్‌లు రెండేసి రౌండ్లను మాత్రమే పూర్తి చేయడం చాను ఆధిపత్యాన్ని రుజువు చేసింది. మరోవైపు గురువారం జరిగిన పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ 56 కేజీల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ గురురాజా రజత పతకం సాధించాడు. మొత్తం మూడు రౌండ్లలో 249 కిలోల బరువును ఎత్తిన గురురాజా రెండో స్థానంలో నిలిచి వెండి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. -
భారత్‌కు ఇది గొప్ప ఆరంభం: కైఫ్
సాక్షి, స్పోర్ట్స్ : కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ, రజత పతకాలు సాధించిన భారత అథ్లెట్లను క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభినందించారు. గురువారం జరిగిన మహిళల 48 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను పసిడిని సాధించారు. తద్వారా ఈ గేమ్స్‌లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణం చేరింది. మరో అథ్లెట్ గురురాజా రజతం సాధించిన విషయం తెలిసిందే. మీరాబాయి చాను, గురురాజాలు మరిన్ని విజయాలు అందుకోవాలని, రాబోయే రోజుల్లో మీ ప్రతిభకు మరింత గుర్తింపు దక్కాలని తన ట్వీట్ ద్వారా కైఫ్ ఆకాంక్షించారు. కాగా, పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 56 కేజీల విభాగంలో గురురాజా రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకున్నాడు. ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన అథ్లెట్‌గా గురురాజా నిలిచాడు. Congratulations to #MirabaiChanu for the gold and #Gururaja for the silver at the #CWG2018 . Great start for India. Wish more success and recognition for our talent in the coming days. pic.twitter.com/OR33sFskeK — Mohammad Kaif (@MohammadKaif) 5 April 2018 కరణం మల్లేశ్వరి హర్షం వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను అద్భుతంగా బరువులెత్తి కామన్వెల్త్ క్రీడల్లో సత్తా చాటిందని వెయిట్ లిఫ్టర్, పద్మశ్రీ కరణం మల్లేశ్వరి ప్రశంసించారు. భారతీయ అథ్లెట్లకు ఇది శుభ పరిణామం. ఇతర అథ్లెట్లకు మీరాబాయి స్వర్ణం స్ఫూర్తినిస్తుందన్నారు. తొలి లిఫ్ట్‌తోనే పతకం సాధించడం విశేషమని మల్లేశ్వరి కొనియాడారు. మీరాబాయి ప్రదర్శనను గమనించినట్లయితే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో పథకంపై ఆశలు చిగురిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఒలింపిక్ పోటీల్లో భారతదేశానికి వెయిట్‌లిఫ్టింగ్‌లో తొలి పతకం తీసుకువచ్చిన వెయిట్‌లిఫ్టర్‌గా కరణం మల్లేశ్వరి రికార్డులకెక్కిన విషయం తెలిసిందే. -
భారత్‌కు తొలి స్వర్ణం
-
కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం
-
భారత్‌కు తొలి స్వర్ణం
గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తొలి స్వర్ణ పతకాన్ని ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన మహిళల 48 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను పసిడిని సాధించారు. స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ విభాగాల్లో మొత్తంగా 196 కేజీల బరువును సునాయాసంగా ఎత్తిన మీరాబాయి చాను పసిడి పతకాన్ని అందుకున్నారు. తొలుత స్నాచ్‌లో 86 కేజీలను ఎత్తిన చాను..ఆపై క్లీన్ అండ్ జర్క్‌లో 110 కేజీలను ఎత్తి సత్తాచాటారు. ఇక మారిషియన్ వెయిట్ లిఫ్టర్ రోల్యా రానైవోసోవా మొత్తం 170 కేజీలను ఎత్తి రజత పతకాన్ని సొంతం చేసుకోగా, మొత్తం 155 కేజీలతో శ్రీలంక లిఫ్టర్ దినుషా గోమ్స్ కాంస్య పతకంతో సంతృప్తి పడింది. స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ చాలెంజ్‌లో మీరాబాయి చానుకు ఎదురే లేకుండా పోయింది. స్నాచ్‌లో భాగంగా జరిగిన మూడు రౌండ్లలో (80,84 86 కేజీలు) చాను సక్సెస్‌ఫుల్‌గా బరువులు ఎత్తగా, క్లీన్ అండ్ జర్క్ విభాగంలోని మూడు రౌండ్లను(103, 107, 110 కేజీలు) మీరాబాయి చాను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. క్లీన్ అండ్ జర్క్ చివరి రౌండ్లో అత్యధికంగా 110 కేజీల బరువు ఎత్తిన చాను తొలి స్థానంలో నిలిచారు. దాంతో పసిడి పతకం మీరాబాయి చాను ఖాతాలో వేసుకున్నారు. ఇది క్లీన్ అండ్ జర్క్‌లో మీరాబాయ్ చాను అత్యుత్తమ ప్రదర్శనగా రికార్డులెక్కింది. అంతకుముందు 109 కేజీలను మాత్రమే తన అత్యుత్తమ క్లీన్ అండ్ జర్క్ ప్రదర్శన కాగా, దాన్ని చాను తాజాగా అధిగమించి సరికొత్త వ్యక్తిగత ఫీట్‌ను సైతం సొంతం చేసుకున్నారు. అయితే స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ విభాగాల్లో రోల్యా రానైవోసోవా, దినుషా గోమ్స్‌లు రెండేసి రౌండ్లను మాత్రమే పూర్తి చేయడం చాను ఆధిపత్యాన్ని రుజువు చేసింది. బుధవారం జరిగిన వెయిట్‌లిఫ్టింగ్ 56 కేజీల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ గురురాజా రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం మూడు రౌండ్లలో 249 కిలోల బరువును ఎత్తిన గురురాజా రెండో స్థానంలో నిలిచాడు. -
వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో గురురాజాకు రజతం
-
వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు రజతం
సాక్షి, హైదరాబాద్ : కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. వెయిట్‌లిఫ్టింగ్ 56 కేజీల విభాగంలో గురురాజా రజత పతకం సాధించాడు. మొత్తం మూడు రౌండ్లలో 249 కిలోల బరువును ఎత్తిన గురురాజా రెండో స్థానంలో నిలిచాడు. కామన్వెల్త్ క్రీడల్లో గురురాజాకు ఇదే తొలి పతకం. 261 కిలోల బరువును ఎత్తిన మలేసియా వెయిట్ లిప్టర్ మహ్మద్ ఇజార్ అహ్మద్ పసిడి సాధించగా, శ్రీలంక లిఫ్టర్ లక్మల్ 248 కేజీల బరువును ఎత్తి కాంస్య పతకాన్ని అందుకున్నాడు. -
ప్రియదర్శినికి స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్ గేమ్స్ అండర్–19 వెయిట్‌లిఫ్టింగ్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి టి. ప్రియదర్శిని సత్తా చాటింది. హకీంపేట్‌లోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో 48 కేజీల విభాగంలో ఆమె స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో ప్రియదర్శిని స్నాచ్ విభాగంలో 62 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ కేటగిరీలో 83 కేజీలతో ఓవరాల్ 145 కేజీల బరువునెత్తి విజేతగా నిలిచింది. ఈ విభాగంలో నూతన్ (మహారాష్ట్ర–125 కేజీలు), రమణ్‌దీప్ కౌర్ (పంజాబ్–123 కేజీలు) వరుసగా రజత, కాంస్యాలను సాధించారు. 44 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బి. రాజేశ్వరి రాణించింది. ఆమె ఫైనల్లో 103 (48+55) కేజీల బరువునెత్తి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మహారాష్ట్రకు చెందిన రుతుజా ఠాకూర్ (121 కేజీలు) స్వర్ణాన్ని, తమిళనాడుకు చెందిన పూన్ గోడి (118 కేజీలు) రజతాన్ని గెలుచుకున్నారు. పోటీలకు ముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తూముకుంట ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ నర్సయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ఐ పరిశీలకుడు శర్మ, తెలంగాణ వెయిట్ లిఫ్టింగ్ అధ్యక్షులు కోటేశ్వర్ రావు, కార్యదర్శి శ్రీనివాస్ రావు, టోర్నీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎల్. రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర పరిశీలకుడు జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. -
భారత జట్టులో వరుణ్, దీక్షిత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన యువ వెయిట్‌లిఫ్టర్లు వరుణ్, దీక్షితలు ఆసియా జూనియర్, యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులోకి ఎంపికయ్యారు. నేపాల్‌లోని ఖాట్మండులో జూలై 21 నుంచి 29 వరకు ఈ పోటీలు జరుగుతాయి. వరుణ్ 77 కేజీల విభాగంలో, దీక్షిత 58 కేజీల విభాగంలో పోటీపడతారు. ఈ సందర్భంగా ‘శాట్స్’ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి వీరిని అభినందించారు. మన రాష్ట్రం నుంచి ఇద్దరు వెయిట్ లిఫ్టర్లు ఒకేసారి దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. వరుణ్, దీక్షితలా మరింత మంది క్రీడాకారులు దేశం తరఫున పాల్గొని పతకాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. -
వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్ ఖమ్మం
► వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు డోర్నకల్ : తెలంగాణ రాష్ట్ర వెయిట్‌లిఫ్టింగ్ మెన్, ఉమెన్ చాంపియన్ షిప్‌ను ఖమ్మం జిల్లా క్రీడాకారులు సాధించారు. ఆదివారం వీర్ వ్యాయామశాల ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీల బహుమతి ప్రదానోత్సవం ఆదివారం రాత్రి జరిగింది. మహబూబాబాద్ డీఎస్పీ రాజమహేంద్రనాయక్ విజేతలకు బహుమతులను అందజేశారు. పురుషుల, మహిళల చాంపియన్‌షిప్‌ను వేర్వేరుగా ఖమ్మం జట్టు, రన్నర్స్‌గా భద్రాద్రి కొత్తగూడెం జట్టు సాధించాయి. వ్యక్తిగత విభాగంలో 50 కేజీల కేటగిరిలో మొదటి మూడు స్థానాల్లో ఎస్.లక్ష్మణ్ (ఖమ్మం), 56 కేజీల విభాగంలో వి.సంతోష్‌కుమార్ (ఖమ్మం), బి.హన్మంతరావు (నిజామాబాద్), అజయ్‌ప్రసాద్ పాశి (కొత్తగూడెం), 62 కేజీల విభాగంలో వి.ఉదయ్సందీప్ (ఖమ్మం), ఎం .దత్తురాజ్ (నిజామాబాద్), ఆర్.సునీల్ (కొత్తగూడెం), 69 కేజీల విభాగంలో బి.నరేష్ (ఖమ్మం), కె.నవీన్ (కొత్తగూడెం), పి.అనురుధ్ (నిజామాబాద్), 77 కేజీల విభాగంలో జి.యశ్వంత్ (ఖమ్మం), వై.రాహుల్ (వరంగల్), సీహెచ్.సాయికృçష్ణ (కొత్తగూడెం), 85 కేజీల విభాగంలో సయ్యద్ అబ్దుల్లా (వరంగల్), జి.చంద్రశేఖర్ (ఖమ్మం), ఎం మోహన్‌రావు (వరంగల్), 94 కేజీల విభాగంలో కె.హరితేజ (ఖమ్మం), ఎస్.హిమసాగర్ (దిలాబాద్), ఎస్ శ్రీనివాసరావు (వరంగల్) 105 కేజీల విభాగంలో డి.ఆదిగణేష్ (కరీంనగర్), వై.కేశవ లక్ష్మివరప్రసాద్ (ఖమ్మం), 105పైన విభాగంలో కె.తరుణ్‌తేజ (ఖమ్మం) నిలిచారు. మహిళల విభాగంలో 44 కేజీల కేటగిరిలో ఎం.అనూష (ఖమ్మం), బి.శ్వేత (కొత్తగూడెం), 48 కేజీల కేటగిరిలో ఎస్కె ఆసియా (ఖమ్మం), సీహెచ్.హిమబిందు (ఖమ్మం), జె.సుచిత్ర (ఖమ్మం), 58 కేజీల విభాగంలో బి.సంధ్యారాణి (ఖమ్మం), కె.సౌమ్య (కొత్తగూడెం), 63 కేజీల విభాగంలో జి.మౌనిక (వరంగల్), సీహెచ్ దివ్యశ్రీ (ఖమ్మం) నిలిచారు. -
రన్నరప్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్
ఆలిండియా బీఎస్ఎన్ఎల్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: అఖిల భారత బీఎస్ఎన్ఎల్ వెయిట్‌లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, బెస్ట్ ఫిజిక్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సత్తాచాటింది. గచ్చిబౌలిలోని ఆర్టీటీసీలో జరిగిన ఈ టోర్నమెంట్లో వెయిట్ లిఫ్టింగ్ టీమ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ రన్నరప్‌గా నిలిచింది. వ్యక్తిగత విభాగాల్లోనూ ఆంధ్ర సర్కిల్‌కు చెందిన జంగయ్య, నారాయణ, నాగబాబు, కుమార్ పతకాలను సాధించారు. ఈ జట్టుకు కోచ్‌గా నందూలాల్, మేనేజర్‌గా మోహన్ వ్యవహరించారు. పవర్ లిఫ్టింగ్ విజేతల వివరాలు 59 కేజీలు: 1. సతీరామ్ సింగ్ (యూపీ ఈస్ట్), 2. దిలీప్ (మధ్యప్రదేశ్), 3. హరూన్ డానియెల్ (యూపీ వెస్ట్). 66 కేజీలు: 1. దీపక్ జ్యోతి (జమ్మూ, కశ్మీర్), 2. నరేశ్(మహారాష్ట్ర), 3. సుకేశ్ బాబు(కేరళ). 74 కేజీలు: 1. విమల్ రాజా (తమిళనాడు), 2. విజయ్ రామ్ (పశ్చిమ బెంగాల్), 3. ఎన్.ఎల్. వాంఖేడె (మహారాష్ట్ర). 83 కేజీలు: 1. పుణీత్ కుమార్ (యూపీ వెస్ట్), 2. మనోజ్ (కేరళ), తమిళరాసన్ (తమిళనాడు). -
వెయిట్ లిఫ్టింగ్ జిల్లా జట్టు ఎంపిక
ఆమదాలవలస: విజయనగరం జిల్లా కొండవెలగవాడలో ఈ నెల 23, 23వ తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టును ఆదివారం ఎంపిక చేశారు. ఆమదాలవలసలోని మారుతి యువజన వ్యాయామ మండలిలో జరిగిన ఎంపికల్లో ఎనిమిది మంది మహిళలు, 19 మంది పురుషులను ను వివిధ కేటగిరీల్లో ఎంపిక చేసినట్లు రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య ఉపాధ్యక్షుడు ఇంజరాపు భాస్కరరావు, జిల్లా సమాఖ్య కార్యదర్శి కె.మధుసూదనరావులు తెలిపారు. పురుషుల విభాగంలో ఎం.జగదీష్, ఎ.వాసుదేవ్నాయుడు, సీహెచ్.నరసింగరావు, ఎన్.జగపతిబాబు, జి.రామకృష్ణ, ఎం.మన్మధరావు, పి.ఎర్రన్నాయుడు, కె.వాసు, జి.రవి, వై.తవిటిరాజు, ఎన్.వెంకటేష్, ఎం.సూర్యారావు, కె.కృష్ణ, ఎ.గోవిందరావు, బి.లక్ష్మినారాయణ, ఐ.శ్రీరాముడు, ఎం.తిరుపతి ఎంపికయ్యారు. మహిళల విభాగంలో ఎం.ప్రశాంతి, కె.శ్రావణి, బి.ఆదిలక్ష్మి, కె.లక్ష్మి, సీహెచ్ శ్రావణి, టి.అనూరాధ, జి.లలిత, ఎన్.లలితలు ఎంపికయ్యారు. నార ఈశ్వరరావు, ఇప్పిలి అప్పన్న, కె.అమ్మినాయుడులు సెలక్షన్ కమిటీ సభ్యులుగా వ్యవహరించారు. -
సుకన్యకు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన టి. సుకన్య జాతీయ జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో మెరిసింది. ఆంధ్రప్రదేశ్‌లోని కేతనకొండలో జరిగిన ఈ పోటీల్లో ఆమె బంగారు పతకాన్ని సాధించింది. మహిళల 75 కేజీ కేటగిరీలో పోటీపడిన ఆమె... స్నాచ్‌లో 50 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 75 కేజీల బరువెత్తింది. తాజా ప్రదర్శనతో ఆమె భారత జాతీయ శిబిరానికి ఎంపికై ంది. టీమ్ చాంపియన్‌షిప్‌లో జూనియర్ బాలికల కేటగిరీలో ఏపీ, యూత్ బాలికల విభాగంలో తెలంగాణ జట్లు రెండో స్థానంలో నిలిచాయి. -
రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
డోర్నకల్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు బుధవారం డోర్నకల్‌లో జిల్లా జట్టును ఎంపిక చేశారు. స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలోని పైకా కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా జట్టు ఎంపిక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలో ప్రతిభ కనబర్చి జిల్లాకు పేరు తేవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ మేకపోతుల రమ్య, జడ్పీటీసీ సభ్యురాలు కేశబోయిన స్వరూప, సర్పంచ్ మాదా లావణ్య, పీఏసీఎస్ చైర్మెన్ రాయల వెంకటేశ్వర్రావు, ఎంఈఓ మధులత, మండల క్రీడాధికారి ఇమ్మానియల్, జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్జనరల్ సెక్రెటరీ కొత్త రాంబాబు, కో ఆప్షన్ సభ్యులు వాజీద్, ఎస్ఎంసీ చైర్మన్ దాసరి నాగేశ్వర్రావు, వెయిట్‌లిఫ్టింగ్ కోచ్ కొత్త కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గొర్ల సత్తిరెడ్డి పాల్గొన్నారు. బాలుర జట్టు.. 48 కేజీల విభాగంలో వి.గణేష్, ఎం వేణు, 56 కేజీల విభాగంలో ఎన్రాజేష్, 62 కేజీల విభాగంలో కె.హర్షిత్చక్రవర్తి, బి.కార్తీక్, 69 కేజీల విభాగంలో కె.సాయికుమార్, 77 కేజీల విభాగంలో ఎస్కె మదార్, 85 కేజీల విభాగంలో జి.గణేష్, ఎస్కె మెహరాజ్పాషా, ఎండీ అమీర్‌పాషా ఎంపికయ్యారు. బాలికల జట్టు.. 44 కేజీల విభాగంలో వి.వెన్నెల, కె.వైజయంతి, 48 కేజీల విభాగంలో ఎస్ మౌనిక, 53 కేజీల విభాగంలో బి.కావేరి, 58 కేజీల విభాగంలో పి.శ్రావణి, 63 కేజీల విభాగంలో బి.సింధు, 75 కేజీల విభాగంలో బి.అఖిల ఎంపికయ్యారు. -
సాయిరేవతికి రెండు స్వర్ణాలు
తెనాలి: వెయిట్ లిఫ్టింగ్ జాతీయస్థాయి పోటీల్లో అనేక పతకాలు సాధించిన తెనాలి వాసి ఘట్టమనేని సాయిరేవతి తాజాగా మహిళల రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో రెండు విభాగాల్లో బంగారు పతకాలు సాధించారు. ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఈ నెల 16, 17 తేదీల్లో నందిగామలో పోటీలు నిర్వహించింది. 63 కిలోల కేటగిరీలో పోటీల్లో పాల్గొన్న సాయిరేవతి, ఎక్కిప్డ్ విభాగంలో 402.5 కిలోల బరువులనెత్తి ప్రథమస్థానంలో నిలిచారు ‘అన్ఎక్విప్డ్’లోనూ 357.5 కిలోలతో విజేతగా నిలిచి, రెండు విభాగాల్లోనూ బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. ఆమె ప్రస్తుతం ఆదాయ పన్నుల శాఖలో ఉద్యోగినిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమెకు ఆదాయ పలువురు అభినందనలు తెలిపారు. -
వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న సమంత
సౌత్ ఇండస్ట్రీ హీరోలే కాదు హీరోయిన్లు కూడా నార్త్ బ్యూటీస్‌కి పోటీ వస్తున్నారు. ఇప్పటికే మన హీరోలు కండలు పెంచుతూ సిక్స్ ప్యాక్‌లతో అదరగొడుతుంటే తాజాగా హీరోయిన్లు కూడా జిమ్‌లో కుస్తీలు పడుతున్నారు. సౌత్ స్టార్ హీరోయిన్ సమంత కూడా ఈ లిస్టులో చేరిపోయింది. గతంలో తన జిమ్ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన జెస్సీ.. ఇప్పుడు మరో వీడియోతో అందరికీ షాక్ ఇచ్చింది. తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో ఈ బ్యూటీ ఏకంగా వంద కేజీల వెయిట్‌ను మోస్తూ కనిపించింది. తన పర్సనల్ ట్రయినర్ వీడియో రికార్డ్ చేస్తుండగా వంద కేజీల బరువును మూడుసార్లు పైకి ఎత్తింది సమంత. అంతేకాదు.. వీడియో చివర్లో తన కండలు చూపిస్తూ అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మాత్రమే కనిపించిన ఈ బ్యూటీ ఒక్కసారిగా ఇలా లేడీ బాహుబలిలా మారిపోవటంతో అభిమానులు షాకవుతున్నారు. ప్రస్తుతం నితిన్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో రూపొందుతున్న అ..ఆ.. తో పాటు మహేష్ హీరోగా తెరకెక్కుతున్న బ్రహ్మోత్సవం సినిమాల్లో హీరోయిన్ గా సమంత నటిస్తోంది. వీటితో మరికొన్ని తమిళ సినిమాలకు కూడా ఓకే చెప్పి సౌత్‌లో బిజీ హీరోయిన్గా కొనసాగుతోంది. -
గీతా రాణిపై సుదీర్ఘ కాలం నిషేధం!
న్యూఢిల్లీ : ప్రస్తుతం తాత్కాలిక నిషేధం ఎదుర్కొంటున్న వెయిట్ లిఫ్టర్ గీతా రాణి కెరీర్ ఇక ముగిసినట్టుగానే భావించాలి. ఇటీవల డోపింగ్‌లో దొరికిన 33 ఏళ్ల గీతా.. ‘బి’ శాంపిల్ కూడా పాజిటివ్‌గానే తేలడంతో ఆమెపై సుదీర్ఘకాలం నిషేధం పడే అవకాశం ఉంది. 2004 ఆసియా గేమ్స్‌లో రజతంతో పాటు 2006 కామన్వెల్త్లో స్వర్ణం గెలుచుకుని గీతా అందరి దృష్టినీ ఆకర్శించింది. ఇటీవల కేరళలో జరిగిన జాతీయ క్రీడల సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షలో ఆమె ‘ఎ’ శాంపిల్ పాజిటివ్‌గా తేలింది. ఆ ఈవెంట్లోనూ ఆమె 75+ విభాగంలో స్వర్ణం గెలుచుకుంది. జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ ప్యానెల్ విచారణ అనంతరం గీతా రాణి నిషేధంపై నిర్ణయం తీసుకుంటారు. -
రోజుకూలీ కొడుకు.. పతకం కొట్టాడు!!
ఆయన పేరు చంద్రకాంత్ మాలి. రోజు కూలీగా పనిచేస్తుంటారు. పొద్దున్నే లేచి కూలికి వెళ్తే తప్ప పూట గడవదు. కానీ, గురువారం మాత్రం రాత్రంతా ఆయన మేలుకునే ఉన్నారు. స్కాట్లండ్‌లోని గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల ప్రసారాన్ని టీవీలో చూస్తూనే ఉండిపోయారు. అర్ధరాత్ర 1.30 గంటలయ్యింది. అప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా లేచి ఆనందంగా అరిచారు. అవును.. ఆయన కొడుకు గణేశ్ మాలి కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ కాంస్య పతకం సాధించాడు!! మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా షిరోల్ తాలూకా కురుండ్వాడ్ గ్రామంలోని బసవేశ్వర్ కాలనీలో ఉన్న వాళ్ల బంధువులంతా ఆనందోత్సాహాలలో మునిగిపోయారు. వెయిట్ లిఫ్టింగ్‌లోని 56 కిలోల విభాగంలో 21 ఏళ్ల గణేశ్ మాలి కాంస్య పతకం సాధించాడు. చంద్రకాంత్ మాలి పెయింటర్‌గా పనిచేసుకుంటుంటే, ఆయన భార్య అనిత పొలాల్లో కూలికి వెళ్తారు. వాళ్ల ఏకైక కొడుకు గణేశ్. అతడు దేశం తరఫున ఆడి పతకం సాధించాడని తెలిసి తన ఆనందానికి అంతులేదని, అతడే తమ ఆశాకిరణమని చంద్రకాంత్ చెప్పారు. గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో మాలి దంపతులు పనిలోకి కూడా వెళ్లలేకపోయారు. అయినా.. ఇప్పుడు గణేశ్ పతకం సాధించడంతో వాళ్ల ఆవేదన మొత్తం ఒక్క క్షణంలో తీరిపోయింది. గణేశ్ మాలి ఇంటర్మీడియట్ వరకు చదివి, ఎయిర్‌ఫోర్స్‌లో చేరాడు. సెలవు రోజుల్లో ఇంటికి వచ్చి, తల్లిదండ్రులకు సాయం చేస్తుంటాడు. -
‘బరువు’ పెరిగింది
వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకాల పంట పురుషుల హాకీ జట్టు బోణీ బ్యాడ్మింటన్‌లో జైత్రయాత్ర కామన్వెల్త్ క్రీడల రెండో రోజు భారత షూటర్లు, వెయిట్ లిఫ్టర్లు పతకాలతో పరువు నిలబెట్టారు. న్యూఢిల్లీలో జరిగిన గత క్రీడలతో పోలిస్తే ఈసారి కాస్త జోరు తగ్గినా... ఓవరాల్‌గా తొలి రెండు రోజలు భారత క్రీడాకారుల ప్రదర్శన ఆశాజనకంగానే ఉంది. గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో భారత లిఫ్టర్లు పతకాల పంట పండించారు. తొలి రెండు రోజుల్లో రెండు స్వర్ణాలతో కలిపి మొత్తం ఐదు పతకాలు గెలిచి సత్తా చాటారు. గురువారం అర్ధరాత్రి జరిగిన పురుషుల 56 కేజీల కేటగిరీలో సుకేన్ డే 248 (స్నాచ్ 109 + క్లీన్ అండ్ జర్క్ 139) కేజీల బరువు ఎత్తి స్వర్ణం గెలవగా, గణేశ్ మాలి 244 (స్నాచ్ 111 + క్లీన్ అండర్ జర్క్ 133) కేజీలతో కాంస్య పతకం దక్కించుకున్నాడు. మహిళల జూడో 63 కేజీల విభాగం కాంస్య పతక పోరులో సునీబాల హుడ్రోమ్... సాలీ కాన్వే (స్కాట్లాండ్) చేతిలో ఓడి పతకానికి దూరమైంది. రెప్‌చేజ్ రౌండ్లో ఆమె... మోనికా బార్గెస్ (కెనడా)పై నెగ్గి కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. గరిమా చౌదరీ (భారత్) క్వార్టర్స్ బౌట్లో క్లార్క్ (స్కాట్లాండ్) చేతిలో పరాజయం పాలైంది. బ్యాడ్మింటన్: మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో 5-0తో కెన్యాను చిత్తు చేసింది. మిక్స్డ్ డబుల్స్‌లో శ్రీకాంత్-జ్వాల 21-8, 21-8తో మోబోగో-జోసెఫ్‌లపై; పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్ 21-7, 21-8తో విక్టర్ ముంగాపై; మహిళల సింగిల్స్‌లో పి.సి.తులసీ 21-4, 21-2తో లావినా మార్టిన్స్‌పై; పురుషుల డబుల్స్‌లో గురుసాయిదత్-ప్రణవ్ చోప్రా 21-5, 21-6తో జోసెఫ్ గితిటూ-మోబోగోపై; మహిళల డబుల్స్‌లో పి.వి.సింధు-జ్వాల 21-4, 21-5తో మార్టిన్స్-జోసెఫ్‌లపై గెలిచారు. పురుషుల బాక్సింగ్: సూపర్ హెవీ వెయిట్ (+91 కేజీ) ప్రిక్వార్టర్స్‌లో పర్వీన్ 0-3తో హెండర్సన్ (స్కాట్లాండ్) చేతిలో ఓడాడు. టేబుల్ టెన్నిస్: పురుషుల గ్రూప్ మ్యాచ్‌లో భారత్ 3-0తో గువానాపై గెలిచింది. స్విమ్మింగ్ 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్: సందీప్ సెజ్వాల్ సెమీస్‌కు అర్హత సాధించాడు. హీట్స్‌లో 1:02.97 సెకన్ల టైమింగ్‌తో 12వ స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా 16 మంది స్విమ్మర్లు సెమీస్‌కు చేరారు. మరోవైపు 200 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో సాజన్ ప్రకాశ్ 1:53.82 సెకన్ల టైమింగ్‌తో 22వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. సైక్లింగ్: భారత్ సైక్లిస్ట్ల నిరాశజనక ప్రదర్శన కొనసాగుతోంది. పురుషుల 4 వేల మీటర్ల వ్యక్తిగత పర్సుట్ విభాగంలో మంజిత్ సింగ్ (4:55.164 సెకన్లు) 16వ; సోంబీర్ (4:57.202 సెకన్లు) 17వ; అమిత్ కుమార్ (4:58.444 సెకన్లు) 18వ స్థానాల్లో నిలిచారు. మహిళల 3 వేల మీటర్ల వ్యక్తిగత పర్సుట్లో సునీతా ఎంగ్లమ్ (4:07.614 సెకన్లు) 17వ స్థానంతో సరిపెట్టుకుంది. స్క్వాష్: స్టార్ ప్లేయర్ జోష్న చిన్నప్పకు చుక్కెదురైంది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆమె 3-11, 8-11, 11-8, 5-11తో మూడోసీడ్ జోలీ కింగ్ (న్యూజిలాండ్) చేతిలో ఓటమిపాలైంది. మహిళల ప్లేట్ రౌండ్లో ఆనక అలకమోని 3-0తో నడుని గుణవర్ధిని (శ్రీలంక)పై నెగ్గింది. హాకీలో బోణీ: పెనాల్టీ కార్నర్లతో విజృంభించిన భారత పురుషుల హాకీ జట్టు గేమ్స్‌లో శుభారంభం చేసింది. పూల్-ఏ ప్రిలిమినరి మ్యాచ్‌లో 3-1తో ప్రపంచ 31వ ర్యాంకర్ వేల్స్‌పై విజయం సాధించింది. రఘునాథ్ (20వ ని.), రూపిందర్ పాల్ సింగ్ (42వ ని.), గుర్విందర్ సింగ్ చండి (47వ ని.)లు భారత్‌కు గోల్స్ అందించారు. వేల్స్ తరఫున ఆండ్రూ కార్నిక్ (23వ ని.) ఏకైక గోల్ చేశాడు. -
నేడు జాతీయ మహిళా దినోత్సవం
ఆమె.. తల్లిగా బిడ్డను కంటికి రెప్పలా కాపాడుతూ.. మమతానురాగాలకు చిరునామాగా నిలుస్తుంది. చెల్లిగా సోదరిప్రేమను పంచుతూ.. ఆత్మీయ అనుబంధాలకు ప్రతీకవుతుంది. ఆలిగా కష్టనష్టాల్లో తోడుగా ఉంటూ అన్ని సేవలు చేస్తుంది.. మగవాడి బతుకులో సగపాలు తనదిగా భావించి రూ.విస్తుంది. ప్రతి మగాడి విజయం వెనకా ఆమె ఉంటుంది. అందుకే ‘ఆకాశంలో సగం’గా.. ఇంటికి దీపం ఇల్లాలుగా కీర్తించబడింది. ఒకప్పడు గృహిణులుగానే పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఆకాశంలో సగం కాదు అన్నింట్లో మేమే అంటూ నిరూపిస్తున్నారు. మన జిల్లాలోనూ రాజకీయ, సాహిత్య, క్రీడా రంగాల్లో చరిత్ర సృష్టించిన మహిళలు ఉన్నారు.మొన్నటి తాళ్లపాక తిమ్మక్క, మొల్లమాంబ లాంటి కవయిత్రులు సాహితీరంగంలో సమకాలీన పురుష కవులకు ధీటుగా నిలిచారు. రాజకీయ రంగంలో మొన్నటి కోటిరెడ్డి రామసుబ్బమ్మ నుంచి నేటి వైఎస్ విజయమ్మ వరకు తమ ప్రతిభను చాటుతున్నారు. 3112 కిలో మీటర్లు పాదయాత్ర చేసి షర్మిళ రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించారు. నందలూరు వాసి కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్ విశ్వవీధుల్లో విజయ పతాకం ఎగురవేసి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. ఆ వారసత్వాన్ని నేటికి నిలుపుతూ జిల్లాలోని పలువురు మహిళలు వివిధ రంగాల్లో తమదైన శైలిలో సేవలందిస్తున్నారు. నేడు జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారి గురించి క్లుప్తంగా.. సైంటిస్ట్ స్వర్ణలత.. స్వర్ణలత కడప నగర పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో సీని యర్ సైంటిస్ట్‌గా సేవలందిస్తున్నా రు. తృణధాన్యాల ఉపయోగాలను ప్రజ లకు తెలియజెప్పి వాటితో ఆధునిక ఆహార రకాలైన బిస్కెట్లు తదితర ఆహార పదార్థాలు, కూరగాయలతో పచ్చళ్లు, ఇం కా ఇతర రకాల ఆహార పదార్థాలను తయారు చేయడం మహిళలకు నేర్పుతున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళలతో ఇలాంటి ఆహార పదార్థాలు చేసే యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో పోషక విలువలు గల ఆహారం అందిస్తూ తృణ ధాన్యాల వినియోగాన్ని పెంచుతామన్నారు. మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు. న్యాయాధికారి మాలతి.. కడప నగర ప్రజలకు 15 ఏళ్లుగా న్యాయ సేవలందిస్తున్న మాలతి జిల్లా ప్రధాన న్యాయస్థానంలో సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్నారు. సెంటర్ ఆఫ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రతినిధిగా పేదలు, బడుగు వర్గాల ప్రజలకు అవసరమైనప్పుడు ఉచితంగా న్యాయసేవలు పొందడమెలాగో తెలుపుతున్నారు. ఇప్పటికీ ప్రత్యేకంగా వంద సభలు, సదస్సులు ఏర్పాటుచేసి ఉచితంగా న్యాయసేవలు పొందడమెలాగో సాధారణ ప్రజలకు వివరిస్తున్నారు. బడుగులున్న ప్రాంతాలకే వెళ్లి ఈ సేవలందించడం విశేషం. కోర్టు ద్వారా న్యాయం పొందడం వ్యయంతో కూడిన వ్యవహారం అని భావించి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఎందరో సామాన్యులు ఈ సేవలందుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఓ యజ్ఞంలా భావించి ముందుకు సాగిపోతున్నారు. యోగ ఉద్యమకర్త కల్పన కడప నగరంలో మిత్ర యోగ కేం ద్రం ద్వారా ధ్యానం, యోగ నేర్పి న డాక్టర్ కె.కల్పన పలు జాతీయస్థాయి పురస్కారాలు అందుకున్నారు. 17 ఏళ్లుగా కడప నగరంలో 5వేల మందికి పైగా యోగ, ధ్యానం నేర్పారు. జిల్లాలో యోగపై సృ్పహ, అవగాహన కల్పించిన ఘనత డాక్టర్ కల్పనకే దక్కింది. ముఖ్యంగా మహిళల్లో రుతు సమస్యలు, సంతాన లేమి, థైరాయిడ్ సమస్యలకు యోగ ద్వారా ప్రతిభావంతమైన ఫలితాలు సాధించారు. నేటికీ పలువురు గైనకాలజిస్ట్లు ఆమె వద్ద యోగ శిక్షణ పొందుతుండడం గమనార్హం. డ్వాక్రా సంఘాలు, అంగన్వాడీల ప్రాంతీయ స్థాయి సమావేశాలలో యోగ నేర్పుతున్నారు. వారంతా సమాజానికి తమదైన రీతిలో విలక్షణ సేవలందిస్తున్నారు. తమ పని మినహా మరోలోకం లేదన్నట్లు వారి వారి రంగాలలో ఎంతో ప్రతిభ కనబరుస్తున్నారు. ఎందరికో అండగా నిలిచారు. ఆప్త బంధువులయ్యారు. అందరి ప్రశంసలు పొందుతున్నారు. వారెప్పుడు ఎవరి మెప్పు కోరలేదు. ప్రచారానికీ ఇతర ఆర్భాటలకూ దూరంగా ఉంటారు. ఒకరు సైంటిస్ట్‌గా.. మరొకరు న్యాయమూర్తిగా విశిష్ట సేవలందిస్తున్నారు. ఒకరు మానసిక వికలాంగులను అక్కును చేర్చుకుంటే.. మరొకరు మహిళల సమస్యలపై అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ సేవా మూర్తుల గురించి క్లుప్తంగా.. -న్యూస్‌లైన్, కడప కల్చరల్ పసిదేవుళ్లకు తల్లి సాబిరున్నీసా.. కడప నగరంలోని అల్షిఫా మానసిక వికలాంగుల పునరావాస కేంద్రం నిర్వాహకులు సాబిరున్నీసా తమ కేంద్రం ద్వారా 75మంది మానసిక వికలాంగ బాలలను సాధారణ బాలలుగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఇప్పటికీ 25 మంది మానసిక వికలాంగ బాలలను సాధారణ జన రూ.వన స్రవంతిలో కలిసేలా తీర్చిదిద్దారు. ఈ రంగంలో అత్యున్నత స్థాయి సాంకేతిక శిక్షణ పొందిన సాబిరున్నీసా పలు జాతీయ స్థాయి సదస్సుల్లో మానసిక వికలాంగుల పునరావాసంపై అవగాహన కల్పించారు. కన్న తల్లిదండ్రులే భారమని భావిస్తున్న మానసిక వికలాంగులను, బాలలను తల్లి కంటే ఎక్కువగా ఆదరిస్తూ వారికి పునర్జీవితం ప్రసాదించేందుకు కృషి చేస్తున్నారు. బాలల సేవిక సిస్టర్ లిసీ.. కేరళ నుంచి 1992లో మన ప్రాంతానికి వచ్చారు. క్రైస్తవ మిషనరీ ద్వారా ప్రజలకు దైవ సందేశం అందజేస్తూ ఆధ్యాత్మిక సేవలందించారు. అంతటితో తృప్తి చెందక కడప నగర పరిధిలో ‘ఆశ నిలయం’ పేరిట మూగ,బధిర బాలల పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. 72 మంది బాలలను సాధారణ రూ.వితం గడిపే స్థాయికి తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. ప్రతిఫలాపేక్ష లేకుండా నిరాడంబరంగా ప్రచారం, ప్రశంసలకు దూరంగా ఉంటూ బధిరులకు శబ్దంగా, మాట్లాడలేని బాలలకు మాటగా నిలిచారు. విలక్షణ మహిళలకు విశిష్ఠ పురస్కారం.. దేశవ్యాప్తంగా కళా చారిత్రక, వారసత్వ సంపదను పరిరక్షిస్తున్న భారత జాతీయ కళావారసత్వ పరిరక్షణ సంస్థ (ఇంటాక్) ఆయా రంగాల్లో సేవలందిస్తున్న మహిళలను గుర్తించింది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం వీరికి విల క్షణ సేవలకు విశిష్ట పురస్కారాలను అందజేయనుంది. శనివారం ఉదయం 9.30 గంటలకు కడప నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఈ పురస్కారాలకు వేదికగా నిలవనుంది. లింగ వివక్ష లేని సమాజం ఏర్పడాలి లింగ వివక్ష, లైంగిక దాడులు, వేధింపులు లేని సమాజం వచ్చినప్పుడు మహిళా దినోత్సవానికి సార్థకత. మాది చిత్తూరు జిల్లా.తల్లిదండ్రులు కృష్ణయ్య నాయుడు, సరస్వతమ్మ. 1995లో అసిస్టెంట్ ఇంజనీరుగా కడపలో చేరి 2008లో పదోన్నతి పొందాను. స్వాతంత్య్రం వచ్చి 67 సంవత్సరాలైనా మహిళలకు రక్షణ కరువుకావడం దురదృష్టకరం. నిర్భయ లాంటి కఠిన చట్టాలను అమలుపరచడంలో ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల ఆకతాయిలకు భయం లేకుండా పోతోంది. మహిళలకు సంబంధించి వ్యాజ్యాలను సత్వరం పరిష్కరించడానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తే బాగుంటుంది. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి కానీ చట్టసభల్లో ఇంకా రాకపోవడం విచారకరం. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు, కానీ నా విషయంలో మాత్రం అది తిరగబడింది. నా విజయం వెనుక నా భర్త శ్రీనివాసరావు ఉన్నారు. కూతురు మానసిక వికలాంగురాలైతే ఆమెకు మా ఆయనే సర్వస్వంగా మారి ఆలనాపాలన చూస్తున్నారు. - కే. మాధవి, రోడ్లు, భవనాల శాఖ డీఈఈ వారి సహకారంతోనే.. చిన్నప్పుడే తండ్రి మరణిస్తే తల్లి బీడీలు చుట్టి ఆమెను చదివించింది.. పదో తరగతి తర్వాత అన్నా వదినలు ఆమెకు తోడుగా నిలిచారు. తల్లి ఆశయాన్ని.. తన లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కష్టపడి చదివారు. చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించారు. ఆమే ఖారూ.పేట తహశీల్దార్ ఖతుజున్ ఖుప్రా. కలెక్టర్ కావడమే ఆశయమంటున్న ఆమె తన అనుభవాలు పంచుకున్నారు. ‘మాది అనంతపురం జిల్లా ఎల్లనూరు. తల్లిదండ్రులు ఖాదర్ మొహిద్దీన్, రహీంబి. నేను రెండో సంతానం. నా మూడేళ్ల వయసులో తండ్రి చనిపోయారు. అప్పటి నుంచి కుటుంబ భారాన్ని నా తల్లి తీసుకున్నారు. బీడీలు చుట్టి మమ్మల్ని పోషించారు. మా అన్నయ్య ఉద్యోగంలో చేరగానే అమ్మకు కాస్త విశ్రాంతి దొరికింది. మా అన్నావదినలు సొంత బిడ్డల కంటే ఎక్కువ చూసుకున్నారు. వారి సహకారంతో ఎమ్మె స్సీ పూర్తిచేసి ఉద్యోగం కోసం గ్రూప్స్ పరీక్షలు రాశాను.కలెక్టర్ కావడమే రూ.విత ఆశయం. మహిళలు కష్టపడితే అనుకున్న లక్ష్యం సాధించవచ్చు.’ -ఖతిజున్ ఖుఫ్రా, తహశీల్దార్, ఖారూ.పేట -
ఘనంగా ముగిసిన హంపి ఉత్సవాలు
హంపి ఉత్సవాల సందర్భంగా శనివారం రాత్రి ఎంపీ ప్రకాష్ వేదికపై ఏర్పాటు చేసిన న్యూఢిల్లీకి చెందిన ప్రతిభా ప్రహ్లాద్ బృందం భరత నాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. సుమారు గంట పాటు సాగిన భరత నాట్యానికి సందర్శకులు తన్మయత్వం చెందారు. శ్రీకృష్ణదేవరాయ వేదికపై కన్నడ సినీ గాయకులు అర్చన ఉడుప పాడిన పాటలతో పాటు హిందీ సినీ గాయకుడు కూనాల్ గాంజావాల వినిపించిన పాటలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఆదివారం కడ్డి రాంపురం వద్ద నిర్వహించిన వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో క్రీడాకారులు ఎంతో ఆసక్తిగా పాల్గొని తమ సత్తా చాటారు. హంపి ఉత్సవాలకు రాష్ట్రం వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ఆదివారం సెలవు దినం కావడంతో కుటుంబ సమేతంగా హంపి ఉత్సవాలను చూసేందుకు విచ్చేశారు. ఉదయం నుంచే హంపిలో సందర్శకుల తాకిడి మొదలైంది. విరుపాక్షేశ్వరస్వామి ఆలయం ఎదురుగా ఉన్న బసన్న వీధిలో కృష్ణదేవాలయం రహదారిలో, గాయత్రి పీఠం రహదారిలో, రాణి స్నాన మందిర రహదారిలో పర్యాటకులు భారీగా కనిపించారు. సాయంత్రానికి ఈ సంఖ్య మరింత పెరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హంపిలోని గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వంటల పోటీకి అనూహ్య స్పందన హంపి ఉత్సవాల్లో మహిళలకు నిర్వహించిన సంప్రదాయ రుచికర వంటల పోటీకి మంచి స్పందన లభించింది. ఆదివారం ఉత్సవాలు ముగియనుండటంతో రుచికర వంటల పోటీల్లో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలు ఆసక్తి కనబరిచారు. కాజు, ఓళిగ, రాగిరొట్టె, జొన్నరొట్టె, రాగి ముద్ద, అరిసెలు, బర్ఫీ, గోధుమ సేమియా పాయసం, రోటీ తదితర రుచికరమైన 35 రకాల వంటకాలను తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు. వంటల పోటీల్లో ప్రథమ బహుమతి గెలుపొందిన విజేతకు రూ.25 వేలు, ద్వితీయ స్థానం విజేతకు రూ.15 వేలు, తృతీయ స్థానం విజేతకు రూ.10 వేల చెక్కులను పంపిణీ చేశారు. - న్యూస్‌లైన్, బళ్లారి/ హొస్పేట -
వెయిట్ లిఫ్టింగ్ జట్టు కెప్టెన్‌గా అశోక్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆలిండియా టెలికామ్ వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, బెస్ట్ ఫిజిక్స్ టోర్నమెంట్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు హైదరాబాద్‌కు చెందిన జి.అశోక్ సారథ్యం వహిస్తాడు. ఈ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టు బీఎస్ఎన్ఎల్ సర్కిల్ ప్రకటించింది. ఈ పోటీలు ఈనెల 27 నుంచి 30 వరకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరుగుతాయి. ఈ మీట్లో పాల్గొనే రాష్ట్ర బీఎస్ఎన్ఎల్ జట్టు శిక్షణ శిబిరం కోచ్‌గా బి.సత్యనారాయణ (విజయనగరం) పర్యవేక్షణలో శుక్రవారం నుంచి ఎల్బీ స్టేడియంలో ప్రారంభమైంది. జట్టు: జి.అశోక్(కెప్టెన్), ఎస్.ఓంకార్ జైశ్వాల్, బి.రమేష్, బి.బాలరాజ్, ఎస్.ఫిల్మాన్ రాజ్ కు మార్, జి.ఆర్.కుమార్, జి.జగ్గయ్య, ఎస్.వి.నారాయణ, ఎం.మల్లేష్, నందులాల్ (హైదరాబాద్). -
వ్యవసాయ కుటుంబం నుంచి...
సాక్షి, హైదరాబాద్: కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో మూడు స్వర్ణాలు సాధించిన శిరీష స్వస్థలం వైఎస్సార్ కడప జిల్లా, వల్లూరు మండలం పెద్దపుత్త గ్రామం. తండ్రి వెంకట శివారెడ్డి వ్యవసాయం చేస్తుంటారు. తల్లి పేరు వెంకటలక్ష్మి. స్వతహాగా క్రీడాభిమాని అయిన తండ్రి... అమ్మాయిని క్రీడాకారిణిని చేయాలని భావించారు. అందుకే హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్లో శిరీషను చేర్పించారు. ఆ తర్వాత వివిధ స్థాయిల్లో శిరీష రాణించి ఇప్పుడు కామన్వెల్త్లో విజేతగా నిలిచింది. కోచ్‌ల శిక్షణలో... స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశం తీసుకున్నప్పుడు ఆరంభంలో శిరీష జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ తీసుకుంది. అయితే అక్కడి కోచ్‌లు ఎస్ఏ సింగ్, మాణిక్యాలరావు ఆమెలో ప్రతిభను గుర్తించి వెయిట్ లిఫ్టింగ్ వైపు ప్రోత్సహించారు. పాఠశాల స్థాయిలో పలు విజయాలు సాధించిన అనంతరం శిరీష, జాతీయ స్థాయిలో సత్తా చాటింది. జార్ఖండ్‌లో జరిగిన జాతీయ వెయిట్ లిఫ్టింగ్ (యూత్) చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, జూనియర్ విభాగంలో కాంస్యం గెలుచుకుంది. ఈ ఏడాది ఉత్తర కొరియాలో జరిగిన ఏషియన్ కప్‌లో 3 రజత పతకాలు గెల్చుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. తాజా విజయం ఆమె కెరీర్లో అత్యుత్తమమైందిగా చెప్పవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసుకున్న శిరీష, ప్రత్యేక అనుమతితో స్పోర్ట్స్ స్కూల్లో శిక్షణ కొనసాగిస్తోంది. ‘మా అమ్మాయి ఏదైనా క్రీడలో భారత్‌కు ఆడేలా చూడాలనేది నా కోరిక. ఇప్పుడు జూనియర్ స్థాయిలో ఆమె ఇలాంటి విజయాలు సాధించడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో సీనియర్ విభాగంలోనూ రాణించాలని కోరుకుంటున్నాను’ - శివారెడ్డి, శిరీష తండ్రి -
మా కొడుకును కాపాడుకున్నాం!
సాక్షి, హైదరాబాద్: స్టువర్ట్ పురం... ఈ పేరు వినగానే ఒక్క క్షణం గుండెలు అదిరిపోతాయి... ఎక్కడ దొంగతనం జరిగినా అందరికీ అదే గుర్తుకొస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఆ ఊరికి పడిన ‘బ్రాండ్’ను ఎవరూ మార్చలేకపోయారు. అయితే ఇలాంటి ప్రాంతంలో పుట్టినా... తెలిసీ తెలియని వయసులో వక్ర మార్గం పట్టకుండా ఆ తండ్రి తన కొడుకును సరైన దిశలో నడిపించాడు. అందు కోసం ఆయనకు కనిపించిన దారి క్రీడలు! తాజాగా ఆసియా యూత్ క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణం సాధించిన రాగాల వెంకట రాహుల్ నేపథ్యమిది. యూనివర్సిటీ స్థాయి వరకు క్రీడల్లో పాల్గొన్న రాహుల్ తండ్రి మధు, తన కొడుకు క్రీడల్లో మరింత ఎదిగేలా ప్రోత్సహించారు. ఆటలో తానే ఓనమాలు నేర్పించినా.... హకీంపేటలోని ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ స్కూల్ (ఏపీఎస్ఎస్)లో చేరి రాహుల్ వెయిట్‌లిఫ్టింగ్‌లో మేటిగా మారాడు. గత రెండేళ్ల కాలంలో యూత్ కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో, యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో, ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు సాధించి సత్తా చాటిన రాహుల్, ఇప్పుడు ఆసియా యూత్ గేమ్స్‌లో కూడా పసిడి నెగ్గి తన జోరును కొనసాగించాడు. భోజనం చేయకుండా... ‘ఆసియా యూత్ గేమ్స్‌లో బుధవారం మా అబ్బాయి ఈవెంట్ ఉందని తెలుసు. అందుకే ఉదయం నుంచి కనీసం భోజనం కూడా చేయకుండా కబురు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం. చివరకు సాయంత్రం నాలుగున్నరకు రాహుల్ స్వర్ణం నెగ్గాడని తెలిసింది. అతని ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. మేం ఊహించినదానికంటే వేగంగా అతను మంచి విజయాలు సాధిస్తున్నాడు. దేశం తరఫున అబ్బాయి పతకాలు నెగ్గాలన్న మా కల ఫలిస్తోంది. ఇలాంటి విజయాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశాం. ఒలింపిక్స్‌లో కూడా అతను భారత్‌కు ప్రాతినిధ్యం వహించి పతకం గెల్చుకోవాలనేది మా కోరిక. మా స్టువర్ట్పురంలో పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రపంచం అంతటికీ తెలుసు. అలాంటి చోట ఒక గిరిజన కుటుంబంలోని పిల్లలు తప్పు దోవ పట్టకుండా కాపాడుకోవడం అంత సులభం కాదు. అందుకోసం మేం ఆటనే నమ్మకున్నాం. ఇప్పుడు ఆ ఫలితం కనిపిస్తోంది.’ - ‘సాక్షి’తో రాహుల్ తల్లిదండ్రులు రాగాల మధు, నీలిమ