
వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న సమంత
సౌత్ ఇండస్ట్రీ హీరోలే కాదు హీరోయిన్లు కూడా నార్త్ బ్యూటీస్కి పోటీ వస్తున్నారు. ఇప్పటికే మన హీరోలు కండలు పెంచుతూ సిక్స్ ప్యాక్లతో అదరగొడుతుంటే తాజాగా హీరోయిన్లు కూడా జిమ్లో కుస్తీలు పడుతున్నారు. సౌత్ స్టార్ హీరోయిన్ సమంత కూడా ఈ లిస్టులో చేరిపోయింది. గతంలో తన జిమ్ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన జెస్సీ.. ఇప్పుడు మరో వీడియోతో అందరికీ షాక్ ఇచ్చింది.
తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో ఈ బ్యూటీ ఏకంగా వంద కేజీల వెయిట్ను మోస్తూ కనిపించింది. తన పర్సనల్ ట్రయినర్ వీడియో రికార్డ్ చేస్తుండగా వంద కేజీల బరువును మూడుసార్లు పైకి ఎత్తింది సమంత. అంతేకాదు.. వీడియో చివర్లో తన కండలు చూపిస్తూ అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో మాత్రమే కనిపించిన ఈ బ్యూటీ ఒక్కసారిగా ఇలా లేడీ బాహుబలిలా మారిపోవటంతో అభిమానులు షాకవుతున్నారు.
ప్రస్తుతం నితిన్, త్రివిక్రమ్ల కాంబినేషన్లో రూపొందుతున్న అ..ఆ.. తో పాటు మహేష్ హీరోగా తెరకెక్కుతున్న బ్రహ్మోత్సవం సినిమాల్లో హీరోయిన్ గా సమంత నటిస్తోంది. వీటితో మరికొన్ని తమిళ సినిమాలకు కూడా ఓకే చెప్పి సౌత్లో బిజీ హీరోయిన్గా కొనసాగుతోంది.