అనుమానాస్పద స్థితిలో నటుడు మృతి.. మహేశ్‌, సమంత సంతాపం | Friends Actor Matthew Perry Died At 54, Mahesh Babu, Samantha Condolences | Sakshi
Sakshi News home page

Matthew Perry: అనుమానాస్పద స్థితిలో నటుడు మృతి.. మహేశ్‌, సమంత సంతాపం

Published Sun, Oct 29 2023 3:53 PM | Last Updated on Sun, Oct 29 2023 4:06 PM

Friends Actor Matthew Perry Died At 54, Mahesh Babu, Samantha Condolences - Sakshi

ప్రముఖ హాలీవుడ్‌ నటుడు, ‘ఫ్రెండ్స్’ వెబ్ సిరీస్‌ ఫేమ్‌ మాథ్యూ పెర్రి(54) అనుమానస్పద రీతిలో మృతి చెందారు. అవివాహితుడైన పెర్రీ.. లాస్ ఎంజెల్స్‌లోని తన నివాసంలో శనివారం సాయంత్రం బాత్‌ టబ్‌లో విగతజీవిగా కనిపించారు. దీంతొ ఆయన అసిస్టెంట్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పెర్రి నివాసానికి వెళ్లిన పోలీసులు.బాత్‌ టబ్‌ నుంచి మృతదేహాన్ని తీసి.. పోస్ట్‌మార్టంకు తరలించారు. అనంతరం అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

ఫెర్రీ 1969 ఆగస్టు 19న మస్సాచుసెట్స్‌లోని మిలియమ్స్ టౌన్‌లో జన్మించారు. కెనడాలోని ఒట్టావాలోని రాక్‌క్లిఫ్ పార్క్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నాడు. పెర్రీ తల్లి సుజాన్నె మారిసన్ వృత్తిరీత్యా జర్నలిస్ట్. అప్పటి కెనడా ప్రధాని పియర్రె ట్రుడో వద్ద ప్రెస్ సెక్రెటరీగా పని చేశారు. చదువు పూర్తయిన తరువాత లాస్ ఏంజిలిస్‌లో స్థిరపడిన ఫెర్రీ హాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. 

ఫ్రెండ్స్ వెబ్ సిరీస్‌లో చాండ్ల‌ర్ బింగ్ అనే పాత్ర‌తో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. 1994 నుంచి 2004 వరకు  ఫ్రెండ్స్‌ వెబ్‌సిరీస్‌ వరుసగా 10 సీజన్లు రాగా.. అన్నింట్లోనూ ఫెర్రి నటించాడు.  రీసెంట్‌గా 2021లో ఫ్రెండ్స్ రీయూనియన్ షో కూడా జరిగింది. ప్ర‌స్తుతం ఇది ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.

స్టార్స్‌ సంతాపం
పెర్రి మరణంతో యావత్‌సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది. హాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌,బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆయన మృతి పట్ల సంతపం తెలుపుతున్నారు. ఈ జనరేషన్‌ ఓ మంచి ‘ఫ్రెండ్‌’ని కోల్పోయిందని మహేశ్‌బాబు ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. ఇక సమంత అయితే పెర్రి మరణ వార్త విని  గుండె బద్దలైందని, అతను ఎప్పటికీ మనకు ‘ఫ్రెండ్‌’గానే ఉంటాడని రాసుకొచ్చింది. రణ్‌వీర్‌ సింగ్‌, కరీనా కపూర్‌ తో పాటు పలువు బాలీవుడ్‌ స్టార్స్‌  కూడా సోషల్‌ మీడియా వేదికగా పెర్రికి సంతాపం ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement