అనాధ పిల్లల కోసం మరోసారి మంచి మనసు చాటుకున్న సితార | Mahesh Babu Daughter Sitara Host A Special Screening Of Guntur Kaaram For Orphanage Kids - Sakshi
Sakshi News home page

అనాధ పిల్లల కోసం మరోసారి మంచి మనసు చాటుకున్న సితార

Jan 21 2024 12:59 PM | Updated on Jan 21 2024 1:32 PM

Sitara Again To Help Orphans - Sakshi

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కుమార్తె సితార తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇప్పటికే మహేశ్‌ తన సొంత గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేస్తూనే వందల మంది చిన్నారులకు గుండె సంబంధిత ఆపరేషన్లు ఉచింతంగానే చేపించారు. అలా తన గొప్ప మనసు చాటుకుంటూ సినిమాలతో పాటు మరోవైపు సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. తండ్రి బాటలోనే సితార కూడా అడుగులు వేస్తుంది.

కొన్ని నెలల క్రితం తన పుట్టిన రోజు సందర్భంగా పేదింటి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఆ విద్యార్థులను తన ఇంటికి ఆహ్వానించిన సితార వారితో సరదాగా మాట్లాడటమే కాకుండా వారితో కేక్‌ కూడా కట్‌ చేపించారు. ఒక జ్యువెలరీ యాడ్ ద్వారా వచ్చిన రెమ్యునరేషన్‌ మొత్తం ఒక చారిటీ కోసం విరాళంగా ఇచ్చేశారు.

తాజాగా సితార అనాధ పిల్లలతో కొంత సమయం గడిపారు. ఆపై  మహేశ్‌ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాను వారందరికి చూపించారు. మొదటిరోజు ఈ సినిమాపై నెగటివ్‌ టాక్‌ వచ్చినా తర్వాత సూపర్‌ హిట్‌ సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా గుంటూరు కారం కనెక్ట్‌ అయింది. ఇప్పుడు అనాధ పిల్లల కోసం హైదరాబాద్‌లోని ఏఎంబీ థియేటర్‌లో స్పెషల్‌ షో ఏర్పాటు చేసింది. ఏఎంబీలో అత్యంత లగ్జరీ స్క్రీన్‌లో వారు సినిమా చూసేలా ఏర్పాటు చేసింది.

(ఇదీ చదవండి: అయోధ్య రామ మందిరానికి 'హనుమాన్‌' టీమ్‌ భారీ విరాళం)

గతంలో హీరోయిన్‌ సమంత కూడా  హాయ్‌ నాన్న చిత్రాన్ని అనాధ పిల్లలకు చూపించారు. వారి కోసం ఆమె ఒక స్పెషల్‌ స్క్రీన్‌ను బుక్‌ చేసి ఏర్పాట్లు చేశారు. తాజాగా సితార కూడా తన తండ్రి చిత్రం అయిన గుంటూరు కారం అనాధ పిల్లలకు చూపించి నెటిజన్ల నుంచి అభినందనలు పొందుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement