రానా, తేజ సజ్జా సారీ చెప్పాల్సిందే.. మహేశ్‌ బాబు ఫ్యాన్స్ డిమాండ్! | Mahesh Babu fans On Teja Sajja and Rana Daggubati joking about Guntur Kaaram | Sakshi
Sakshi News home page

Guntur Kaaram Movie: గుంటూరు కారం ప్రస్తావన.. రానా, తేజ సజ్జాపై ఫ్యాన్స్ ఆగ్రహం!

Published Wed, Nov 6 2024 3:37 PM | Last Updated on Wed, Nov 6 2024 4:12 PM

Mahesh Babu fans On Teja Sajja and Rana Daggubati joking about Guntur Kaaram

టాలీవుడ్‌లో సంక్రాంతి పండుగకు ఉన్న క్రేజే వేరు. అగ్రహీరోల సినిమాలన్నీ ఆ రోజు కోసమే ఎదురు చూస్తుంటాయి. పొంగల్ బాక్సాఫీస్ పోటీకి థియేటర్లు దొరకడం అంతా ఆషామాషీ కాదు. అందుకే పెద్ద హీరోలంతా ముందుగానే కర్చీఫ్ వేసేస్తారు. ఇప్పటికే వచ్చే ఏడాది సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేశ్ చిత్రం రెడీ అయిపోయాయి. త్వరలోనే మరిన్నీ చిత్రాలు పొంగల్‌ బాక్సాఫీస్‌ పోటీకి సై అంటున్నాయి.

అయితే ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాలే సందడి చేశాయి. మహేశ్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగ, వెంకటేశ్ సైంధవ్‌తో పాటు ప్రశాంత్ వర్మ హనుమాన్ పోటీలో నిలిచాయి. తేజ సజ్జా నటించిన ఈ చిత్రం ఊహించని విధంగా సంక్రాంతి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. చిన్న సినిమా అయినప్పటికీ పెద్ద సినిమాలకు గట్టి పోటీనిచ్చింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌ హిట్ కావడంతో డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ సీక్వెల్ తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు.

అయితే ఇటీవల జరిగిన ఐఫా వేడుకల్లో తేజ సజ్జా కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి హోస్ట్‌గా వ్యవహరించారు. వేదికపై వీరిద్దరి మధ్య సరదా సంభాషణ కొనసాగింది. తేజను రానా పొగుడుతూ మాట్లాడారు. అయితే ఆ తర్వాత వెంటనే నేను మహేశ్‌ బాబు గురించి మాట్లాడనంటూ రానా ఫన్నీగా చెప్పారు. ఇదేంటి ఇది నాకు కూడా సింక్ అయిందేంటని తేజ సజ్జా అన్నారు. ఆ తర్వాత రానా అతను సూపర్ స్టార్, మీరు ఒక సూపర్ హీరో మీరిద్దరూ సంక్రాంతికి వచ్చారు. సంక్రాంతి మ్యాటర్ ఇప్పుడు మాట్లాడవద్దంటూ తేజ సరదాగా అనడంతో.. దానికి ఎందుకు.. అదంతా సెన్సిటివ్ టాపిక్ హా' అని రానా బదులిచ్చాడు.

అయితే ఇది చూసిన మహేశ్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి సంభాషణ మహేశ్‌ బాబును కించపరిచేలా ఉందంటూ నెట్టింట మండిపడుతున్నారు. తమ అభిమాన హీరో మహేశ్‌ బాబును ఎగతాళి చేశారని తేజ సజ్జా, రానాపై ట్విటర్‌ వేదికగా పోస్టులు పెడుతున్నారు. 25 ఏళ్లుగా సినిమాల్లో ఉన్న మహేష్ మీద సెటైర్ వేయడం కరెక్ట్‌ కాదంటున్నారు ఫ్యాన్స్‌. మహేష్ సినిమాను కించపరిచినందుకు క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ ఓ అభిమాని పోస్ట్ చేశాడు. గుంటూరు కారం సినిమాపై మాట్లాడినందుకు సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు రానా, తేజ సజ్జా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement