సంక్రాంతి అంటేనే సినిమాలకు చాలా మంచి సీజన్. చిన్న సినిమా అయినా సరే కథ బాగుంటే హిట్ అవుతుంది. కంటెంట్‌లో సత్తా ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరించి, విజయం అందిస్తారు. ఈ సంక్రాంతికి వస్తున్న ‘గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ’ సినిమాలతో పాటు ‘హను–మాన్’ కూడా విడుదల అవుతుంది. కానీ హనుమాన్ సినిమాను చిన్న ప్రాజెక్ట్ అని మరో తేదీలో విడుదల చేసుకోవచ్చు కదా అంటూ చిత్ర పరిశ్రమ నుంచి కొందరు ఒత్తిడి తీసుకొస్తున్నారని గతంలో నిర్మాత నిరంజన్ రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే.. ఇదే అంశంపై చిరంజీవి వ్యాఖ్యానించారు.
👉: ‘హను–మాన్’ ప్రీ రిలీజ్ వేడుక ముఖ్యఅతిథిగా చిరంజీవి (ఫొటోలు)
జనవరి 12న గుంటూరు కారం, హను-మాన్ రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల కానున్నాయి. తాజాగా జరిగిన హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన మెగస్టార్ చిరంజీవి గుంటూరు కారం కాంట్రవర్సీపై పరోక్షంగా కామెంట్లు చేశారు. హనుమాన్ చిత్రంలో హీరోగా నటించిన తేజ సజ్జ చాలా కష్టపడ్డాడు. ఈ సంక్రాంతి సీజన్‌కు ఎన్ని సినిమాలు వచ్చినా సరే.. కంటెంట్‌లో సత్తా ఉండి.. దేవుడి ఆశీస్సులు ఉన్నాయంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరించి, విజయం అందిస్తారని చిరంజీవి అన్నారు. ఇందులో ఎలాంటి సందేహం అక్కరలేదని ఆయన తెలిపారు.
అయితే ఇదీ కాస్త పరీక్షా కాలం అనుకోవచ్చు.. అందరూ అనుకున్నట్లుగా హనుమాన్ చిత్రానికి థియేటర్లు దొరకకపోవచ్చు.. సినిమాలో కంటెంట్ ఉంటే సెకండ్ షో చూస్తారు.. అదీ లేకపోతే మరో వారం తర్వాత అయినా చూస్తారు. ఈ సంక్రాంతికి వస్తున్న గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ సినిమాలతో పాటు హను–మాన్ కూడా బాగా ఆడాలి.. ఆడుతుందని చిరంజీవి అన్నారు. చిత్ర పరిశ్రమ ఎప్పుడూ పచ్చగా ఉండాలని ఆయన కోరారు.
'2017 సంక్రాంతి సమయంలో కూడా ఇలాంటి సందర్భమే వచ్చింది. అన్నీ పెద్ద సినిమాలు ఉన్నాయి.. అప్పుడు రేసులోకి శతమానం భవతి చిన్న సినిమాను నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ఆ సమయంలో నేను రిస్క్ ఎందుకని దిల్ రాజుకు చెప్పాను.. అందుకు ఆయన ఒకటే మాట అన్నాడు సినిమా బాగుంది.. అందరికీ నచ్చుతుందని విడుదల చేశాడు.. అనుకున్నట్లే ఆ సమయంలో శతమానం భవతి సూపర్ హిట్ అయింది. ఈ ఏడాది కూడా చిన్న సినిమాగా వస్తున్న హనుమాన్ కూడా సూపర్ హిట్ అవుతుంది.' అని చిరంజీవి అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment