Rana Duggubati
-
రానా, తేజ సజ్జా సారీ చెప్పాల్సిందే.. మహేశ్ బాబు ఫ్యాన్స్ డిమాండ్!
టాలీవుడ్లో సంక్రాంతి పండుగకు ఉన్న క్రేజే వేరు. అగ్రహీరోల సినిమాలన్నీ ఆ రోజు కోసమే ఎదురు చూస్తుంటాయి. పొంగల్ బాక్సాఫీస్ పోటీకి థియేటర్లు దొరకడం అంతా ఆషామాషీ కాదు. అందుకే పెద్ద హీరోలంతా ముందుగానే కర్చీఫ్ వేసేస్తారు. ఇప్పటికే వచ్చే ఏడాది సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేశ్ చిత్రం రెడీ అయిపోయాయి. త్వరలోనే మరిన్నీ చిత్రాలు పొంగల్ బాక్సాఫీస్ పోటీకి సై అంటున్నాయి.అయితే ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాలే సందడి చేశాయి. మహేశ్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగ, వెంకటేశ్ సైంధవ్‌తో పాటు ప్రశాంత్ వర్మ హనుమాన్ పోటీలో నిలిచాయి. తేజ సజ్జా నటించిన ఈ చిత్రం ఊహించని విధంగా సంక్రాంతి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. చిన్న సినిమా అయినప్పటికీ పెద్ద సినిమాలకు గట్టి పోటీనిచ్చింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సీక్వెల్ తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు.అయితే ఇటీవల జరిగిన ఐఫా వేడుకల్లో తేజ సజ్జా కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి హోస్ట్‌గా వ్యవహరించారు. వేదికపై వీరిద్దరి మధ్య సరదా సంభాషణ కొనసాగింది. తేజను రానా పొగుడుతూ మాట్లాడారు. అయితే ఆ తర్వాత వెంటనే నేను మహేశ్ బాబు గురించి మాట్లాడనంటూ రానా ఫన్నీగా చెప్పారు. ఇదేంటి ఇది నాకు కూడా సింక్ అయిందేంటని తేజ సజ్జా అన్నారు. ఆ తర్వాత రానా అతను సూపర్ స్టార్, మీరు ఒక సూపర్ హీరో మీరిద్దరూ సంక్రాంతికి వచ్చారు. సంక్రాంతి మ్యాటర్ ఇప్పుడు మాట్లాడవద్దంటూ తేజ సరదాగా అనడంతో.. దానికి ఎందుకు.. అదంతా సెన్సిటివ్ టాపిక్ హా' అని రానా బదులిచ్చాడు.అయితే ఇది చూసిన మహేశ్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి సంభాషణ మహేశ్ బాబును కించపరిచేలా ఉందంటూ నెట్టింట మండిపడుతున్నారు. తమ అభిమాన హీరో మహేశ్ బాబును ఎగతాళి చేశారని తేజ సజ్జా, రానాపై ట్విటర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. 25 ఏళ్లుగా సినిమాల్లో ఉన్న మహేష్ మీద సెటైర్ వేయడం కరెక్ట్ కాదంటున్నారు ఫ్యాన్స్. మహేష్ సినిమాను కించపరిచినందుకు క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ ఓ అభిమాని పోస్ట్ చేశాడు. గుంటూరు కారం సినిమాపై మాట్లాడినందుకు సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు రానా, తేజ సజ్జా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. Context 😤pic.twitter.com/PBTuhvgD3W— Cinderella🦋 (@GlamGirl_Geetha) November 6, 2024 U had one success man, one! Daniki 25 yrs ga ace filmography unna Mahesh meedha satireUnless you come up with a sequel for Hanuman, aa collections thechkolev and yk why @tejasajja123 Inka Rana gurinchi enduku, shelved project adhi— Jimhalpert (@satvikdhfm) November 5, 2024 Dear @tejasajja123 ,Need apology to superstar @urstrulyMahesh garu and his fans You and rana degrade comments about 2024 sankranthi films , in this sankranthi one of my beloved superstar film also there you know also,Please try to understand this situation.Thanks and…— Sagar MB (@dhfmbabu4005) November 5, 2024 -
ఓటీటీలోకి రీమేక్ సినిమా.. ఎనిమిదేళ్ల తర్వాత తెలుగులో
ఇప్పుడంతా ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. కొత్త సినిమా రిలీజ్ కావడం లేటు. నెల-నెలన్నరలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలాంటిది ఓ సినిమా తెలుగు వెర్షన్ దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చింది. ఇందులో సమంత, రానా జంటగా నటించడం విశేషం. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)2014లో రిలీజైన మలయాళ సినిమా 'బెంగళూరు డేస్'. దుల్కర్, నివీన్ పౌలి, నజ్రియా, పార్వతి ప్రధాన పాత్రలు పోషించారు. అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో ఈ చిత్రాన్ని 2016లో తమిళంలోకి రీమేక్ చేశారు. ఆర్య, శ్రీదివ్య, బాబీ సింహా, రానా, సమంత తదితరులు కీలక పాత్రలు పోషించారు. దీన్ని తెలుగులో కూడా థియేట్రికల్ రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ ఎందుకో కుదర్లేదు.దీంతో అప్పటినుంచి కేవలం తమిళ వెర్షన్ మాత్రమే ఉంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తెలుగు డబ్బింగ్ చేసి, నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చారు. తాజాగా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రకటించారు. 'బెంగళూరు డేస్' పేరుతో ఈ మూవీ అందుబాటులో ఉంది. ఒకవేళ ఒరిజినల్ మలయాళ వెర్షన్ చూడాలంటే హాట్‌స్టార్‌లో ఉంది. సబ్స్క్రిప్షన్ అవసరం లేకుండా ఫ్రీగానే చూడొచ్చు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన) -
ఆ పాత్ర నేను చేయాల్సింది.. వెంకటేశ్ ఏం పొడిచారో చూస్తా?..బ్రహ్మానందం
విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి తండ్రికొడుకులుగా నటించిన వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించి ఈ వెబ్ సిరీస్ ఈ నెల 10 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా బ్రహ్మానందం నటించిన ఓ స్పెషల్ వీడియోని నెట్ఫిక్స్ విడుదల చేసింది. అందులో బ్రహ్మీ తనని తాను ఆస్కార్ నాయుడిగా పరిచయం చేసుకొని నాగ నాయుడు (ఈ సిరీస్‌లో వెంకటేశ్ పోషించిన పాత్ర పేరు) క్యారెక్టర్ కోసం ఆడిషన్స్ ఇచ్చాడు. కిరీటి దామరాజు డైరెక్టర్‌గా, జబర్దస్త్ అవినాష్ ఆయన అసిస్టెంట్‌గా కనిపించారు. ఈ స్పెషల్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. బ్రహ్మానందం ఆడిషన్ చూసి విసుగుచెందిన వెంకటేశ్..చివరకు రానాకు తండ్రిగా తానే నటిస్తానని చెబుతాడు. దీంతో బ్రహ్మీ కోపంతో..‘ఆ క్యారెక్టర్‌కి నా ఏజ్ సరిపోలేదని.. వెంకటేశ్‌ను పెట్టారు. ఓకే.. ఏం పొడిచారో..ఎంత పొడిచారో నేను చూస్తాను. మీరూ.. చూడండి.. వాచ్ రానా నాయుడు. స్ట్రీమింగ్ ఆన్ నెట్‌ఫ్లిక్స్’ అని చెప్పడంతో వీడియో ముగుస్తుంది. -
ఫిలింనగర్ భూవివాదంలో కొత్త మలుపు
-
ఓటీటీలోకి 'విరాట పర్వం'.. ఎప్పుడంటే ?
Is Rana Sai Pallavi Virata Parvam OTT Rights Bagged Netflix: టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన సినిమాల్లో ‘విరాటపర్వం’ ఒకటి. దగ్గుబాటి రానా, టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటించడం, తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథా చిత్రం వస్తుండడంతో సినీ ప్రేమికులకు ‘విరాటపర్వం’పై ఆసక్తి పెరిగింది. ఇక ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ ఆ ఆసక్తిని మరింతగా పెంచేశాయి. గతేడాదిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ.. ఎట్టకేలకు ఈ శుక్రవారం (జూన్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య థియేటర్లో విడుదలైన ఈ మూవీ మంచి హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే థియేటర్లో ఎప్పుడు రిలీజవుతుందా అని చూసినట్లే సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు ఎప్పుడు వస్తుందా అని అనుకుంటున్నారు ఓటీటీ ఆడియెన్స్. ఈ క్రమంలోనే ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుందని టాక్ వినిపిస్తోంది. కాకపోతే ఈ మూవీ సాధారణంగా ఓటీటీలో విడుదలైనట్లు నాలుగు వారాల తర్వాత రీలీజ్ కావట్లేదట. ఇలాంటి మంచి సినిమాను థియేటర్లో చూసే ఫీల్ మిస్ అవుతారని ఓటీటీలో ఇప్పట్లో విడుదల చేయట్లేదట మేకర్స్. కానీ పలు నివేదికల సమాచారం ప్రకారం ఈ మూవీని జూలై మూడో వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా రన్నవుతున్న 'విరాట పర్వం' ఓటీటీ రిలీజ్ డేట్‌ను మరికొన్ని రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. చదవండి:👇 సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. కాలేజ్‌లో డ్యాన్స్ చేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్.. తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి పునర్జన్మపై నమ్మకం ఉందన్న సాయి పల్లవి.. అదెలా అంటే ? -
నన్ను నమ్మవు.. ఆడపిల్లను కదా.. సాయి పల్లవి డబ్బింగ్ వీడియో వైరల్
‘నువ్వు టైమ్, రాత, విధి... అన్నిటినీ నమ్ముతావమ్మా. కానీ, నన్ను మాత్రం నమ్మవు. ఎందుకంటే... నేను మగపిల్లాడిని కాదుగా.. ఆడపిల్లను’ అంటూ సాయిపల్లవి డబ్బింగ్ చెబుతున్న వీడియో సోమవారం విడుదలైంది. మే 9న ఈ బ్యూటీ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న త్రిభాషా (తెలుగు, కన్నడ, మలయాళం) చిత్రం ‘గార్గీ’ లుక్, మేకింగ్ వీడియోను విడుదల చేశారు. (చదవండి: సింగర్స్‌గా మారిన మంచు విష్ణు కుమార్తెలు) ఈ వీడియోలోనే తెలుగు, కన్నడ భాషల్లో సాయి పల్లవి డబ్బింగ్ చెబుతూ కనిపించారు. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మరోవైపు సాయిపల్లవి మరో సినిమా అప్డేట్ కూడా వచ్చింది. ప్రముఖ నటుడు కమల్‌హాసన్ బేనర్లో రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా రూపొందనున్న చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్గా నటించనున్నట్లు చిత్రనిర్మాణ సంస్థ ప్రకటించింది. వెన్నెల రెండుసార్లు జన్మించింది రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేశ్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. ఈ సినిమాలో సాయిపల్లవి చేసిన ‘వెన్నెల’ పాత్రను ఉద్దేశించి ‘సోల్ ఆఫ్ వెన్నెల’ పేరుతో ‘వెన్నెల రెండుసార్లు జన్మించింది. తొలిపొద్దులో ఇప్పపూలు పూసినట్టు. అడవి తల్లి ఒడిలో ఒకసారి ఆశయాన్ని ఆయుధం చేసినట్టు.. అతని ప్రేమలో మరొకసారి..’ అంటూ వీడియోను విడుదల చేశారు. -
Bheemla Nayak: భీమ్లా నాయక్ క్రేజీ అప్డేట్.. పవన్ లుక్ అదుర్స్
Bheemla Nayak Update: పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళం హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు తెలుగు రీమేక్ ఇది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. (చదవండి: చీర కట్టులో కుర్రాళ్లను కట్టిపడేస్తున్న అనసూయ.. ఫోటోలు వైరల్) పవన్ కల్యాణ్ హీరోయిజాన్ని తెలియజేస్తూ విడుదలైన టీజర్లో లాలా భీమ్లా.. అనే బ్యాగ్రౌండ్ సాంగ్ వినే ఉంటారు. ఆ సాంగ్‌కు సంబంధించిన వీడియో ప్రోమోను దీపావళి సందర్భంగా బుధవారం సాయంత్రం 07:02 గంటలకు విడుదలవుతుందని ప్రకటిస్తూ..‘ఈ దీపావళిని #TheSoundOfBheemlaతో జరుపుకుందాం. అంటూ మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ లో పవన్ కళ్యాణ్ నుదుటిపై తిలకం దిద్దుకుని, ముందర మందు బాటిల్ పెట్టుకుని కన్పించారు. #LalaBheemla 🔥🥁 pic.twitter.com/YRg10onzzR — Sithara Entertainments (@SitharaEnts) November 3, 2021 సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానాకు జోడీగా ఐశ్వర్య రాజేశ్ అలరించనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. -
Varudu Kavalenu:పెళ్లి చూపుల కాన్సెప్టే నచ్చని అమ్మాయిని ప్రేమిస్తే..?
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, ‘పెళ్లి చూపులు’ఫేమ్ రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం ‘వరుడు కావలెను’.లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్‌తో పాటు పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని దగ్గుబాటి రానా విడుదల చేస్తూ.. చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపాడు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ‘పెళ్లి చూపుల కాన్సెప్టే మా అమ్మాయికి పడదు’ అనిహీరోయిన్ తల్లి చెప్పిన డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. పెళ్లి చూపులు కాన్సెప్ట్ అంటేనే ఇష్టంలేని భూమి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు ఆకాశ్. ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఆయన ప్రయత్నం ఫలించి.. భూమి ప్రేమను పొందుతాడు. కట్ చేస్తే.. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోతారు. మరి ఆ విభేధాలకు గల కారణాలు ఏంటో తెలియాలంటే.. అక్టోబర్ 29న థియేటర్లకు వెళ్లి సినిమా చూడాల్సిందే. -
కెల్విన్‌కు నగదు బదిలీ చేశారా?
సాక్షి, హైదరాబాద్: ‘టాలీవుడ్ డ్రగ్స్’ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం సినీ నటుడు దగ్గుబాటి రానాను ప్రశ్నించారు. ఈడీ అధికారులకు డ్రగ్స్ కేసు ప్రధాన నిందితుడు కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే రానా విచారణ జరిగినట్లు తెలిసింది. ఉదయం 10.30 గంటల నుంచి దాదాపు ఏడున్నర గంట ల పాటు విచారణ జరిగింది. డ్రగ్స్ కేసులో తెలంగాణ ఎక్సైజ్ విభాగానికి చెందిన సిట్ దాఖలు చేసిన చార్జిషీట్ల ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. లావాదేవీలన్నీ సినీరంగానివే... మంగళవారం నటుడు నందు విచారణ సందర్భంగా కెల్విన్‌ను తీసుకొచ్చిన అధికారులు.. బుధవారం కూడా ఆయనను ఈడీ కార్యాలయానికి రప్పించారు. అతడి ల్యాప్‌టాప్‌ను తెరిపించి అందులోంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలిసింది. రానా, కెల్విన్‌లను విడివిడిగా, ఆపై ఇద్దరినీ కలిపి ఈడీ బృందం ప్రశ్నిం చింది. ఇరువురూ చెప్పిన అంశాల్లో కొన్నింటిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. రానా తన వెంట రెండు బ్యాంకు ఖాతాలకు సంబందించిన స్టేట్మెంట్లు తెచ్చారు. 2015–17 మధ్య లావాదేవీల వివరాలను ఈడీకి ఇచ్చారు. 2017లో ఎఫ్–క్లబ్లో జరిగిన పార్టీకి హాజరయ్యారా? దాని ముందు, ఆ తర్వాత కెల్విన్‌కు నగదు బదిలీ చేశారా? తదితర అంశాలపై రానాను ప్రశ్నించారు. ఇంతకు ముందే కెల్విన్ బ్యాంక్ ఖాతా వివరాలు సేకరించిన అధికారులు అం దులో రానా ఖాతా నుంచి డబ్బు బదిలీ అయినట్లు గుర్తించారని సమాచారం. ఈవెంట్ మేనేజర్ అయిన కెల్విన్‌తో తాను చేసిన లావాదేవీలన్నీ సినీ రంగానికి సంబంధించినవే అని ఈడీ అధికారులకు రానా స్పష్టం చేసినట్లు తెలి సింది. రానా సాయంత్రం 6 గంటలకు ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోగా, ఆ తర్వాత 2 గంటల పాటు కెల్విన్ విచారణ సాగింది. నేడు నవ్‌దీప్ కూడా..? ఈడీ సమన్లు అందుకున్న వారిలో నటుడు రవితేజ, ఆయన డ్రైవర్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. వీరిద్దరూ గురువారం ఈడీ కార్యాలయానికి రానున్నారు. సోమవారం నటుడు పి.నవ్‌దీప్ హాజరుకావాల్సి ఉంది. అనివార్య కారణాల నేపథ్యంలో ఆయన కూడా గురువారం హాజరుకావడానికి అనుమతి కోరినట్లు సమాచారం. -
'శశి' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
పిజ్జాలతో వేడుక
‘నా పెళ్లాం పుట్టిన రోజు. అంటే నాకు సెలవులు’ అంటున్నారు రానా. రానా భార్య మిహికా బజాజ్ పుట్టిన రోజు శనివారం. ఈ సందర్భంగా ఆమెకు నచ్చిన పిజ్జాలను ఆర్డర్ చేసి, అర్ధరాత్రి బర్త్‌డేను సెలబ్రేట్ చేశారు రానా. పుట్టినరోజున మిహికా అడిగితేనే వర్క్‌నుంచి రానా బ్రేక్ తీసుకున్నారు. ఈ విషయాన్ని మిహికా ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఈ ఇద్దరూ కలసి శనివారం చిన్న హాలిడేకి వెళ్లారు. -
కామ్రేడ్ రవన్న
‘‘ఈ దేశం ముందు ప్రశ్నగా నిలబడ్డ జీవితం అతనిది, సత్యాన్వేషణలో నెత్తురోడిన హృదయం అతనిది. డాక్టర్ రవిశంకర్ అలియాస్ కామ్రేడ్ రవన్న’’ అంటూ ‘విరాటపర్వం’ చిత్రంలోని వీడియో గ్లింప్స్‌ను సోమవారం రానా పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. రానా, సాయిపల్లవి జంటగా వేణు ఉడుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. డి. సురేశ్ బాబు సమర్పణలో చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘రివల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ అఫ్ లవ్ అనే క్యాప్షన్ ‘విరాటపర్వం’ సినిమా థీమ్‌ను తెలియజేస్తోంది. 1990లలో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో స్టూడెంట్ లీడర్‌గా రానా కనిపించనున్నారు. వీడియోలో ‘ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం’? అని కామ్రేడ్ ప్రశ్నిస్తే ‘దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం’ అంటూ నినాదాలు చేయడం కనిపిస్తుంది. పోస్టర్‌పై మొదట సాయిపల్లవి పేరు, తర్వాత రానా దగ్గుబాటి పేరును ప్రస్తావించటంపై సాయిపల్లవి స్పందిస్తూ – ‘‘ఇందులో హీరోయిన్‌ది కూడా పవర్ ఫుల్ పాత్ర అని, మొదట తన పేరు వేయాలని సూచించిన రానా లాంటి మంచి వ్యక్తితో స్క్రీన్ చేసుకోవటం ఆనందంగా ఉంది’’ అన్నారు. -
కిడ్నీలు ఫెయిల్ అవుతాయన్నారు
‘బాహుబలి’ సినిమాలోని భల్లాలదేవా పాత్రకు సరైన కటౌట్ రానానే. బాహుబలి ప్రభాస్ కటౌట్‌కి సరైన కటౌట్ రానానే అనిపించుకున్నారు. అలా ధైర్యసాహసాలు ఉన్న శక్తిమంతుడిగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన రానా ఆ మధ్య అనారోగ్యం పాలయ్యారనే వార్తలు రావడం తెలిసిందే. ఇప్పటివరకూ తన ఆరోగ్యం గురించి బహిరంగంగా మాట్లాడని రానా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పారు. ‘‘నా జీవితం ఫాస్ట్ ఫార్వార్డ్ (వేగంగా)లో వెళుతున్న సమయంలో చిన్న పాజ్ (కుదుపు/చిన్న గ్యాప్) వచ్చింది. నా ఆరోగ్య సమస్య ఏంటంటే పుట్టినప్పటి నుండే నాకు బీపీ (బ్లడ్‌ప్రెజర్) ఉంది. దాంతో గుండె చుట్టూ ఉండే పొర పెళుసుబారిపోతుందని, తర్వాత కిడ్నీలు ఫెయిల్ అవుతాయని డాక్టర్లు అన్నారు. ఈ సమస్య ఉండటం వల్ల 70 శాతం స్ట్రోక్ రావచ్చని, 30 శాతం వరకు ప్రాణహాని ఉందని కూడా చెప్పారు’’ అంటూ ఎమోషన్‌కి గురయ్యారు రానా. ఇదిలా ఉంటే లాక్డౌన్లో రానా పెళ్లి మిహికాతో జరిగిన విషయం తెలిసిందే. రానా ఆరోగ్య సమస్యలు కూడా పరిష్కారం అయ్యాయి. ప్రస్తుతం ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్‌తో సూపర్‌గా బిజీగా ఉంటున్నారు రానా. -
ఆఖరి పర్వం
‘విరాటపర్వం’ చివరి దశకు వచ్చేసింది. కొన్ని రోజుల్లో చిత్రీకరణ పూర్తికానుందని తెలిసింది. రానా, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేశ్ బాబు సమర్పిస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రియమణి, నందితా దాస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఉద్యమకారుల పాత్రల్లో రానా, సాయి పల్లవి కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఆఖరి షెడ్యూల్‌ను వికారాబాద్ అడవుల్లో›పూర్తి చేస్తున్నారు. రానా, సాయిపల్లవి మరియు ముఖ్య తారాగణం ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. చిత్రీకరణ పూర్తయ్యేవరకూ చిత్రబృందం మొత్తం వికారాబాద్‌లోనే ఉంటుందని తెలిసింది. -
క్షేమం కోరి...
బాలీవుడ్లో అంతా పండగ వాతావరణం కనిపించింది. ఈ సందడంతా ‘కర్వా చౌత్’ కోసమే. భర్త శ్రేయస్సు కోసం రోజంతా ఉపవాసం ఉండి, భర్తతో కలిసి చంద్రుణ్ణి చూశాక భార్య ఉపవాసాన్ని విరమించే పండగ ఇది. ప్రతి ఏడాదీ ఈ పండగను ఘనంగా జరుపుకునేవారిలో శిల్పా శెట్టి ముందుంటారు. ఈసారి కూడా మిస్ కాలేదు. కష్టకాలంలో (కేన్సర్ బారిన పడటం, చికిత్స చేయించుకుని ఆరోగ్యవంతురాలవడం) తోడున్న భర్త కోసం సోనాలీ బింద్రే ఉపవాసం ఆచరించారు. విదేశీ గాయకుడు నిక్ జోనస్‌ని పెళ్లాడిన ప్రియాంకా చోప్రా ‘లవ్ యు నిక్’ అంటూ లాస్ ఏంజిల్స్‌లో పండగ చేసుకున్నారు. కాజోల్, రవీనా టాండన్, బిపాసా బసు తదితరులు కూడా శ్రద్ధగా పూజలు చేశారు. కొత్త దంపతులు కాజల్ అగర్వాల్–గౌతమ్, వీరికన్నా ముందు ఆగస్ట్ 8న పెళ్లి చేసుకున్న రానా–మిహికా కూడా సంప్రదాయాన్ని పాటించారు. డిజైనర్ శారీ, చక్కని నగలతో తమ భర్తతో కలిసి దిగిన ఫొటోలను అందాల భామలు షేర్ చేశారు. రానా, మిహీకా; ∙నక్తో ప్రియాంకా చోప్రా; రవీనా టాండన్; భర్తతో సోనాలీ బింద్రే; భర్తతో బిపాసా -
అశోక్ తొలి దర్శక–నిర్మాత కృష్ణగారే
‘‘గల్లా జయదేవ్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. నన్ను సోదరుడిలా భావిస్తారు. ఆయన నిర్మాతగా కొడుకు అశోక్‌తో తొలి సినిమా చేస్తున్నారు. పద్మావతిగారికి, అశోక్‌కి, నిధీ అగర్వాల్‌కి ఆల్ ది బెస్ట్’’ అని హీరో రామ్‌చరణ్ అన్నారు. వ్యాపారవేత్త, పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా హీరోగా పరిచయవుతున్న సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. నిధీ అగర్వాల్ కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి నటుడు రానా కెమెరా స్విచ్చాన్ చేయగా, రామ్‌చరణ్ క్లాప్ ఇచ్చారు. సూపర్‌స్టార్ కృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘మంచి కథ, కథనాలతో అశోక్ హీరోగా పరిచయం కాబోతుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు రానా. గల్లా జయదేవ్ మాట్లాడుతూ–‘‘టెక్సాస్ ఫిల్మ్ అండ్ టెలివిజన్‌లో అశోక్ డిగ్రీ పూర్తి చేశాడు. మా మామ కృష్ణగారి సినిమాల్లో అశోక్ చిన్నప్పుడు నటించాడు. తన తొలి దర్శక–నిర్మాత కృష్ణగారే. మహేశ్‌బాబు ‘నాని’ సినిమాలోనూ అశోక్ నటించాడు. మా బ్యానర్లో కేవలం సినిమాలే కాదు.. టెలివిజన్ రంగంలోనూ కొత్త కంటెంట్‌ను అందించాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘హీరో కావాలని అశోక్ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాడు’’ అన్నారు పద్మావతి. ‘‘ఈ కథకు అశోక్ కరెక్ట్‌గా సరిపోతాడు’’ అని శ్రీరామ్ ఆదిత్య అన్నారు. ‘‘నేటి నుంచి చిత్రీకరణ ప్రారంభం అవుతుంది’’అన్నారు గల్లా అశోక్. ఈ కార్యక్రమంలో అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ లోగోను ఆవిష్కరించారు. ఈ వేడుకలో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, నటులు వీకే నరేష్, సుధీర్‌బాబు, సుశాంత్, నిధీ అగర్వాల్, పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, రచయిత సత్యానంద్, అమల అక్కినేని, నమ్రత శిరోద్కర్, నన్నపనేని రాజకుమారి, డా.రమాదేవి పాల్గొన్నారు. -
బాహుబలిలో రానా ఫస్ట్‌లుక్
-
బాహుబలిలో రానా ఫస్ట్‌లుక్
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం 'బాహుబలి'. దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నేడు (డిసెంబర్ 14) రానా పుట్టినరోజు సందర్భంగా బాహుబలిలో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. రానా ఈ చిత్రంలో భల్లలదేవ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అంతకు ముందు ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా బాహుబలి తొలి మేకింగ్ వీడియోను విడుదల చేసి ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలి అనుష్క పుట్టినరోజును పురస్కరించుకుని మరొక మేకింగ్ వీడియో విడుదల చేసారు. తాజాగా రానా మేకింగ్ వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమా హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది. దాదాపు రూ. 80 కోట్ల నుంచి రూ. 00 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి జక్కన్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.