బాహుబలిలో రానా ఫస్ట్లుక్ | Bahubali making teaser for Rana birthday | Sakshi
Sakshi News home page

బాహుబలిలో రానా ఫస్ట్లుక్

Published Sat, Dec 14 2013 11:02 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

బాహుబలిలో రానా ఫస్ట్లుక్ - Sakshi

బాహుబలిలో రానా ఫస్ట్లుక్

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న  చిత్రం 'బాహుబలి'. దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో  ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నేడు (డిసెంబర్ 14) రానా పుట్టినరోజు సందర్భంగా బాహుబలిలో ఫస్ట్లుక్ను విడుదల చేశారు. రానా ఈ చిత్రంలో  భల్లలదేవ పాత్రలో  నటిస్తున్నట్లు సమాచారం. అంతకు ముందు ప్రభాస్ బర్త్డే సందర్భంగా బాహుబలి తొలి మేకింగ్ వీడియోను విడుదల చేసి ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలి అనుష్క పుట్టినరోజును పురస్కరించుకుని మరొక మేకింగ్ వీడియో విడుదల చేసారు.

తాజాగా రానా మేకింగ్ వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.  ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమా హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది. దాదాపు రూ. 80 కోట్ల నుంచి రూ. 00 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి జక్కన్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement