Bheema Nayak:Lala Bheemla Video Promo to be released on 3rd November - Sakshi
Sakshi News home page

Bheemla Nayak: నుదుటిపై తిలకం, ముందు మందు బాటిల్‌.. పవన్‌ లుక్‌ వైరల్‌

Published Wed, Nov 3 2021 12:18 PM | Last Updated on Wed, Nov 3 2021 1:30 PM

Bheema Nayak:Lala Bheemla Video Promo To Out On 3rd November - Sakshi

Bheemla Nayak Update: పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘భీమ్లా నాయక్‌’. మలయాళం హిట్‌ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు తెలుగు రీమేక్‌ ఇది. ఇప్పటికే ఈ మూవీకి  సంబంధించి విడుద‌లైన టీజర్‌, పాటలు  ప్రేక్ష‌కులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. 
(చదవండి: చీర కట్టులో కుర్రాళ్లను కట్టిపడేస్తున్న అనసూయ.. ఫోటోలు వైరల్‌)

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ హీరోయిజాన్ని తెలియ‌జేస్తూ విడుద‌లైన టీజ‌ర్‌లో లాలా భీమ్లా.. అనే బ్యాగ్రౌండ్ సాంగ్ వినే ఉంటారు. ఆ సాంగ్‌కు సంబంధించిన వీడియో ప్రోమోను దీపావ‌ళి సంద‌ర్భంగా బుధవారం సాయంత్రం 07:02 గంటలకు విడుదలవుతుందని ప్రకటిస్తూ..‘ఈ దీపావళిని #TheSoundOfBheemlaతో జరుపుకుందాం. అంటూ మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ లో పవన్ కళ్యాణ్ నుదుటిపై తిలకం దిద్దుకుని, ముందర మందు బాటిల్ పెట్టుకుని కన్పించారు.

సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న  ఈ మూవీలో పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానాకు జోడీగా ఐశ్వర్య రాజేశ్ అలరించనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement