
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, ‘పెళ్లి చూపులు’ఫేమ్ రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం ‘వరుడు కావలెను’.లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్‌తో పాటు పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని దగ్గుబాటి రానా విడుదల చేస్తూ.. చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపాడు.
ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ‘పెళ్లి చూపుల కాన్సెప్టే మా అమ్మాయికి పడదు’ అనిహీరోయిన్ తల్లి చెప్పిన డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. పెళ్లి చూపులు కాన్సెప్ట్ అంటేనే ఇష్టంలేని భూమి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు ఆకాశ్. ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఆయన ప్రయత్నం ఫలించి.. భూమి ప్రేమను పొందుతాడు. కట్ చేస్తే.. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోతారు. మరి ఆ విభేధాలకు గల కారణాలు ఏంటో తెలియాలంటే.. అక్టోబర్ 29న థియేటర్లకు వెళ్లి సినిమా చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment