
కరోనా సెకండ్ వేవ్ కారణంగా పలు సినిమాల చిత్రీకరణలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ ఎత్తేయడంతో తిరిగి సినిమాల షూటింగ్‌లు ప్రారంభం అవుతున్నాయి. తాజాగా సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ‘వరుడు కావలెను’, ‘నరుడి బ్రతుకు నటన’ సినిమాల షూటింగ్‌లు కూడా గురువారం పునఃప్రారంభమయ్యాయి.
నాగశౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ తెరకెక్కుతోన్న చిత్రం ‘వరుడు కావలెను’. ఈ సినిమా చివరి షెడ్యూల్‌ను ప్రారంభించారు. హీరో, హీరోయిన్లపై శేఖర్ మాస్టర్ నేతృత్వంలో ఓ పాట చిత్రీకరిస్తున్నారు. కాగా సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహా శెట్టి హీరోయిన్‌గా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నరుడి బ్రతుకు నటన’ షూటింగ్ కూడా ప్రారంభమైంది.
Comments
Please login to add a commentAdd a comment