Varudu Kaavalenu Twitter Review: Ritu Varma And Naga Shourya Movie Varudu Kaavalenu Twitter Review In Telugu - Sakshi
Sakshi News home page

Varudu Kaavalenu Twitter Review: ‘వరుడు కావలెను’ ఎలా ఉందంటే..?

Oct 29 2021 7:55 AM | Updated on Oct 29 2021 8:31 AM

Varudu Kaavalenu Movie Twitter Review In Telugu - Sakshi

యంగ్ హీరో నాగ శౌర్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను రిలీజ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి పక్క ప్లానింగ్‌తో దూసుకెళ్తున్నాడు.  ఈ క్రమంలో నాగ శౌర్య నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘వరుడు కావలెను’ ఈ శుక్రవారం(అక్టోబర్‌ 29)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే అమెరికా లాంటీ దేశాల్లో ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్‌లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం.

సినిమా ప్లాష్‌బ్యాక్‌లో వచ్చే సీన్స్‌ హైలెట్‌ అని చెబుతున్నారు. 15 నిమిషాల పాటు సాగే ప్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ సినిమా స్థాయిని పెంచినట్లు ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.
 

వరుడు కావలెను యావరేజ్‌ మూవీ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బలహీనమైన కథ, నెరేషన్ సినిమాను ప్రేక్షకుల అంచనాలకు చేరుకోలేకపోయింది. కిషోర్, ప్రవీణ్ కామెడీ, ఫ్లాష్ బ్యాక్ లో సత్య, వెడ్డింగ్ సన్నివేశాలలో సప్తగిరి కామెడీ నవ్వులు పూయిస్తుందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement