వరుడు కావలెను నుంచి 'వడ్డాణం' సాంగ్‌ రిలీజ్‌ | Vaddaanam Song From Varudu Kaavalenu Movie Is Out | Sakshi
Sakshi News home page

Vaddaanam : 'వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు' సాంగ్‌ విడుదల

Published Sat, Oct 2 2021 10:36 AM | Last Updated on Sat, Oct 2 2021 11:28 AM

Vaddaanam Song From Varudu Kaavalenu Movie Is Out - Sakshi

Vaddaanam Song From Varudu Kaavalenu: టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య, పెళ్లి చూపులు ఫేమ్ రీతువర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన  ‘దిగు దిగు దిగు నాగ, మనసులోనే నిలచిపోకే పాటలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. తాజాగా  'వడ్డాణం' అనే ఫన్‌ అండ్‌ పెప్పీ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ఎస్‌ఎస్‌ థమన్‌ ఈ పాటను సంగీతం అందించారు.

'వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు..వయ్యారం చిందేసే అందాల బొమ్మలు'..అంటూ సాగే ఈ సాంగ్‌ ఆకట్టుకుంటుంది. రిలీజ్‌ అయిన కాసేపటికే వ్యూస్‌ పరంగా దూసుకెళ్తుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా అక్టోబర్ 15న విడుదల కానుంది. లక్ష్మీ సౌజన్య ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement