Varudu Kaavalenu Pre Release Event: Trivikram Satirical Comments On Ritu Varma Movie Titles - Sakshi
Sakshi News home page

Varudu Kaavalenu Pre Release: రీతూ వర్మ మూవీ టైటిల్స్‌పై త్రివిక్రమ్‌ సెటైర్లు..

Published Thu, Oct 28 2021 12:40 PM | Last Updated on Thu, Oct 28 2021 1:42 PM

Trivikram Srinivas Satires On Ritu Varma Movie Titles - Sakshi

Trivikram Srinivas Satires On Ritu Varma Movie Titles: నాగ శౌర్య, రీతూ వర్మ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'వరుడు కావలెను'. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ  చిత్రం ఈనెల29న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం(అక్టోబర్‌28)న హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ హీరోయిన్‌ రీతూవర్మ సినిమా టైటిళ్లపై సెటైర్లు వేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. 

'వరుడు కావలెను సినిమాను నేను చూశాను. చాలా రోజుల తర్వాత సినిమా మొత్తం చీరకట్టిన హీరోయిన్‌ను చూశాను. ఆమె సినిమాలన్నీ చూస్తే...పెళ్లిచూపులు,  కనులు కనులు దోచాయంటే.. ఇప్పుడు వరుడు కావలెను. తర్వాత షామినా, కేటరింగ్‌, లాజిస్టిక్‌ సర్వీసెస్‌.. ఇలాంటి సినిమాలు తీస్తారేమో. అసలే సినిమావాళ్లకు సెంటిమెంట్లు ఎక్కువ కాబట్టి మిగతావాళ్లు కూడా నీతో ఇలాంటి సినిమాలు తీస్తారు' అంటూ రీతూ సినిమా టైటిళ్లపై సెటైర్లు వేశారు. త్రివిక్రమ్‌ కౌంటర్లతో హీరోయిన్‌ రీతూ సిగ్గుతో తలపట్టుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement