వివాహ వేడుకల్లో ‘వరుడు కావలెను’ నటులు.. సర్‌ప్రైజ్‌లో వధూవరులు | Varudu Kaavalenu Actors Naga Shaurya and Ritu Varma Surprise Entry Into Few Marriages in Hyderabad | Sakshi
Sakshi News home page

పలు వివాహ వేడుకల్లో ‘వరుడు కావలెను’ నటులు.. సర్‌ప్రైజ్‌లో వధూవరులు

Published Mon, Oct 25 2021 12:18 PM | Last Updated on Mon, Oct 25 2021 12:55 PM

Varudu Kaavalenu Actors Naga Shaurya and Ritu Varma Surprise Entry Into Few Marriages in Hyderabad - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య, పెళ్లి చూపులు ఫేమ్ రీతువర్మ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘వరుడు కావలెను’. ఇందులో వారు ఆకాశ్‌, భూమి పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్‌ 29న థియేటర్స్‌లో విడుదల కానుంది. దీంతో ఈ మూవీని ప్రమోషన్‌ చేసే పనిలో పడింది చిత్ర బృందం. 

మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన పలు వివాహ వేడుకలకి హాజరయ్యారు హీరో హీరోయిన్లు నాగశౌర్య, రీతూ వర్మ. ఇలా సెల​బ్రిటీలు తమ వివాహ వేడుకకి రావడంతో వధూవరులతో పాటు ఫంక్షన్‌కి వచ్చిన అతిథులు సైతం ఎంతో సర్‌ప్రైజ్‌గా ఫీల్‌ అయ్యారు. అంతేకాకుండా వారితో కలిసి ఫోటోలు దిగారు ఈ నటీనటులు. వీటికి సంబంధించిన ఈ పిక్‌లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘వరుడు కావలెను’ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

చదవండి: మనసుకు హత్తుకునేలా ‘మనసులోనే నిలిచిపోకే’ మెలోడీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement