
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, పెళ్లి చూపులు ఫేమ్ రీతువర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్, టీజర్‌తో పాటు విడుదలైన ‘కోలా కల్లే ఇలా’, ‘దిగు దిగు’ పాటలు సైతం ప్రేక్షకాదరణని పొందాయి.
తాజాగా ఆ సినిమా మూడో సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘మనసులోనే నిలిచిపోకే.. మైమరుపులా మధురిమ’ అంటూ పల్లవితో సాగే ఈ మెలోడీ మనసుకు హత్తుకునేలా ఉంది. పాట తీసిన లోకేషన్స్ ఎంతో ఆహ్లాదంగా ఉన్నాయి. పాటలో హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ అదిరిపోయాయి. నాగ శౌర్య, రీతూ వర్మ జంట అందంగా, చూడముచ్చటగా ఉంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. ‘మనసులోనే నిలిచిపోకే’ పాటకి సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ అందించగా, గాయనీ చిన్మయి మనసుకు హత్తుకునేలా ఈ పాటను ఆలపించిందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది చిత్రబృందం.
చదవండి: ‘వరుడు కావలెను’ టీజర్ వచ్చేసింది
Comments
Please login to add a commentAdd a comment