
‘బాహుబలి’ సినిమాలోని భల్లాలదేవా పాత్రకు సరైన కటౌట్ రానానే. బాహుబలి ప్రభాస్ కటౌట్‌కి సరైన కటౌట్ రానానే అనిపించుకున్నారు. అలా ధైర్యసాహసాలు ఉన్న శక్తిమంతుడిగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన రానా ఆ మధ్య అనారోగ్యం పాలయ్యారనే వార్తలు రావడం తెలిసిందే. ఇప్పటివరకూ తన ఆరోగ్యం గురించి బహిరంగంగా మాట్లాడని రానా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పారు.
‘‘నా జీవితం ఫాస్ట్ ఫార్వార్డ్ (వేగంగా)లో వెళుతున్న సమయంలో చిన్న పాజ్ (కుదుపు/చిన్న గ్యాప్) వచ్చింది. నా ఆరోగ్య సమస్య ఏంటంటే పుట్టినప్పటి నుండే నాకు బీపీ (బ్లడ్‌ప్రెజర్) ఉంది. దాంతో గుండె చుట్టూ ఉండే పొర పెళుసుబారిపోతుందని, తర్వాత కిడ్నీలు ఫెయిల్ అవుతాయని డాక్టర్లు అన్నారు. ఈ సమస్య ఉండటం వల్ల 70 శాతం స్ట్రోక్ రావచ్చని, 30 శాతం వరకు ప్రాణహాని ఉందని కూడా చెప్పారు’’ అంటూ ఎమోషన్‌కి గురయ్యారు రానా. ఇదిలా ఉంటే లాక్‌డౌన్‌లో రానా పెళ్లి మిహికాతో జరిగిన విషయం తెలిసిందే. రానా ఆరోగ్య సమస్యలు కూడా పరిష్కారం అయ్యాయి. ప్రస్తుతం ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్‌తో సూపర్‌గా బిజీగా ఉంటున్నారు రానా.
Comments
Please login to add a commentAdd a comment