
‘‘ఈ దేశం ముందు ప్రశ్నగా నిలబడ్డ జీవితం అతనిది, సత్యాన్వేషణలో నెత్తురోడిన హృదయం అతనిది. డాక్టర్ రవిశంకర్ అలియాస్ కామ్రేడ్ రవన్న’’ అంటూ ‘విరాటపర్వం’ చిత్రంలోని వీడియో గ్లింప్స్‌ను సోమవారం రానా పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. రానా, సాయిపల్లవి జంటగా వేణు ఉడుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. డి. సురేశ్ బాబు సమర్పణలో చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘రివల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ అఫ్ లవ్ అనే క్యాప్షన్ ‘విరాటపర్వం’ సినిమా థీమ్‌ను తెలియజేస్తోంది.
1990లలో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో స్టూడెంట్ లీడర్‌గా రానా కనిపించనున్నారు. వీడియోలో ‘ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం’? అని కామ్రేడ్ ప్రశ్నిస్తే ‘దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం’ అంటూ నినాదాలు చేయడం కనిపిస్తుంది. పోస్టర్‌పై మొదట సాయిపల్లవి పేరు, తర్వాత రానా దగ్గుబాటి పేరును ప్రస్తావించటంపై సాయిపల్లవి స్పందిస్తూ – ‘‘ఇందులో హీరోయిన్‌ది కూడా పవర్ ఫుల్ పాత్ర అని, మొదట తన పేరు వేయాలని సూచించిన రానా లాంటి మంచి వ్యక్తితో స్క్రీన్ చేసుకోవటం ఆనందంగా ఉంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment