Rana-Sai Pallavi Period Action Virata Parvam Movie Will Stream On Netflix? - Sakshi
Sakshi News home page

Virata Parvam Movie: ఓటీటీలోకి 'విరాట పర్వం'.. ఎప్పుడు ? ఎక్కడ ? తెలుసా ?

Published Fri, Jun 17 2022 7:43 PM | Last Updated on Fri, Jun 17 2022 8:44 PM

Is Rana Sai Pallavi Virata Parvam OTT Rights Bagged Netflix - Sakshi

Is Rana Sai Pallavi Virata Parvam OTT Rights Bagged Netflix: టాలీవుడ్‌ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన సినిమాల్లో ‘విరాటపర్వం’ ఒకటి. దగ్గుబాటి రానా, టాలెంటెడ్‌ హీరోయిన్‌ సాయిపల్లవి జంటగా నటించడం, తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథా చిత్రం వస్తుండడంతో సినీ ప్రేమికులకు ‘విరాటపర్వం’పై ఆసక్తి పెరిగింది. ఇక ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్‌ ఆ ఆసక్తిని మరింతగా పెంచేశాయి. గతేడాదిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ.. ఎట్టకేలకు ఈ శుక్రవారం (జూన్‌ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య థియేటర్‌లో విడుదలైన ఈ మూవీ మంచి హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. 

అయితే థియేటర్‌లో ఎప్పుడు రిలీజవుతుందా అని చూసినట్లే సినిమా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌కు ఎప్పుడు వస్తుందా అని అనుకుంటున్నారు ఓటీటీ ఆడియెన్స్. ఈ క్రమంలోనే ఈ సినిమా డిజిటల్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకు సొంతం చేసుకుందని టాక్ వినిపిస్తోంది. కాకపోతే ఈ మూవీ సాధారణంగా ఓటీటీలో విడుదలైనట్లు నాలుగు వారాల తర్వాత రీలీజ్‌ కావట్లేదట. ఇలాంటి మంచి సినిమాను థియేటర్‌లో చూసే ఫీల్‌ మిస్‌ అవుతారని ఓటీటీలో ఇప్పట్లో విడుదల చేయట్లేదట మేకర్స్. కానీ పలు నివేదికల సమాచారం ప్రకారం ఈ మూవీని జూలై మూడో వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా రన్నవుతున్న 'విరాట పర్వం' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను మరికొన్ని రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. 

చదవండి:👇
సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్‌..
కాలేజ్‌లో డ్యాన్స్‌ చేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్‌..
తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి

పునర్జన్మపై నమ్మకం ఉందన్న సాయి పల్లవి.. అదెలా అంటే ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement