Matthew Perry
-
పెర్రీ చనిపోయిన ఇల్లు.. రూ.71 కోట్లకు కొన్న భారతీయ మహిళ
ప్రముఖ అమెరికన్-కెనడియన్ నటుడు, ప్రఖ్యాత టీవీ సిరీస్ ‘ఫ్రెండ్స్’ స్టార్ మాథ్యూ పెర్రీ ఇంటిని భారత్‌కు చెందిన ఓ మహిళ కొనుగోలు చేశారు. అది కూడా రూ.71 కోట్లు పెట్టి మరీ కొన్నారు. పెర్రీ కెటామైన్ డోస్ ఎక్కువై ఆ ఇంట్లోనే తుది శ్వాస విడిచారు.సాధారణంగా భారతీయులు.. ఎవరైనా ఇంట్లో చనిపోతే ఆ ఇల్లు కొనడానికి ఇష్టపడరు. కానీ భారతీయ మూలాలున్న అనితా వర్మ-లాలియన్ లాస్ ఏంజిల్స్‌లోని మాథ్యూ పెర్రీ విల్లాను కొనుగోలు చేశారు. అక్కడ ఆయన గతేడాది అక్టోబర్‌లో హాట్ టబ్‌లో చనిపోయారు.పెర్రీ జ్ఞాపకాలకు గౌరవంపెర్రీ జ్ఞాపకాలు, సానుకూల అంశాలను గౌరవించాలనే ఉద్దేశంతో ఈ ఇంటిని కొనుగోలు చేసినట్లు అనితా వర్మ చెబుతున్నారు. హిందూ మతాన్ని ఆచరించే ఆమె అక్కడ పూజలు చేయించారు. ఆ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.ఎవరీ అనితా వర్మ?భారతీయ మూలాలున్న అనితా వర్మ-లాలియన్ క్యామెల్బ్యాక్ ప్రొడక్షన్స్ అనే ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీని స్థాపించారు. వర్మ-లాలియన్ అరిజోనాలో ప్రసిద్ధ వాణిజ్య రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కూడా. ఆమె తన కుటుంబ వ్యాపారమైన వర్మలాండ్ను విడిచి అరిజోనా ల్యాండ్ కన్సల్టింగ్ను ప్రారంభించారు. కాగా ఇక ఇంటి విషయానికి వస్తే అనితా వర్మ 8.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.71 కోట్లు) పెట్టి కొనుగోలు చేశారు. ఇదే ఇంటిని పెర్రీ 2020లో 6 మిలియన్ డాలర్లకు కొన్నారు. -
హాలీవుడ్ నటుడు మాథ్యూ ఫెర్రీ ఇక లేరు
అమెరికన్ ప్రముఖ నటుడు మాథ్యూ ఫెర్రీ (54) ఇక లేరు. లాస్ ఏంజిల్స్‌లోని స్వగృహంలో ఫెర్రీ అనుమానాస్పద రీతిలో మరణించినట్లుగా అక్కడి పోలీస్ అధికారులు వెల్లడించారు. జాన్ బెన్నెట్ ఫెర్రీ, సుజానే మేరీ మోరిసన్ దంపతులకు 1969 ఆగస్టు 19న జన్మించారు మాథ్యూ ఫెర్రీ. ఫెర్రీకి ఏడాది వయసు పూర్తి కాక ముందే బెన్నెట్ ఫెర్రీ, సుజానే మేరీ విడాకులు తీసుకున్నారు. 15 ఏళ్లు తల్లి వద్దే ఉంటూ చదువుకున్నాడు ఫెర్రీ. ఆ తర్వాత అప్పటికే నటనా రంగంలో ఉన్న తండ్రి బాటలో నడిచారు ఫెర్రీ. అలా సినిమాలు, ముఖ్యంగా సీరియల్స్‌లో నటించి పేరు గడించారు. 1994లో ఆరంభమైన ‘ఫ్రెండ్స్’ సిరీస్‌తో ఆయన జీవితం కీలక మలుపు తీసుకుంది.ఇందులో ఫెర్రీ పోషించిన చాండ్లర్ బింగ్ పాత్ర అద్భుతంగా క్లిక్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఫెర్రీకి అభిమానులను సంపాదించిపెట్టింది. ‘ఫ్రెండ్స్’ సిరీస్ 2014 వరకు ఓ అమెరికన్ చానెల్లో ప్రసారమైంది. అలాగే 2021లో ‘ఫ్రెండ్స్ రీ యూనియన్ షో’ కూడా జరిగింది. ఈ షో ఓ ప్రముఖ ఓటీటీ ΄్లాట్‌ఫామ్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ‘ఎమ్టీ నెస్ట్’, ‘హైవే టు హెవెన్’, ‘ఫ్రెండ్స్’, ‘మిస్టర్ సన్‌షైన్’... ఇలా 40కి పైగా టెలివిజన్ సిరీస్‌లలో నటించారు ఫెర్రీ. అలాగే ‘ది కిడ్’, ‘బర్డ్స్ ఆఫ్ అమెరికా’.. ఇలా దాదాపు 15 హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించారాయన. ఇక ఫెర్రీ మృతి పట్ల ఇండియన్ స్టార్స్ వెంకటేశ్, మహేశ్‌బాబు, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, సమంత, కరీనా కపూర్లతో పాటు పలువరు హాలీవుడ్ స్టార్స్ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో నటుడు మృతి.. మహేశ్, సమంత సంతాపం
ప్రముఖ హాలీవుడ్ నటుడు, ‘ఫ్రెండ్స్’ వెబ్ సిరీస్ ఫేమ్ మాథ్యూ పెర్రి(54) అనుమానస్పద రీతిలో మృతి చెందారు. అవివాహితుడైన పెర్రీ.. లాస్ ఎంజెల్స్‌లోని తన నివాసంలో శనివారం సాయంత్రం బాత్ టబ్‌లో విగతజీవిగా కనిపించారు. దీంతొ ఆయన అసిస్టెంట్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పెర్రి నివాసానికి వెళ్లిన పోలీసులు.బాత్ టబ్ నుంచి మృతదేహాన్ని తీసి.. పోస్ట్‌మార్టంకు తరలించారు. అనంతరం అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఫెర్రీ 1969 ఆగస్టు 19న మస్సాచుసెట్స్‌లోని మిలియమ్స్ టౌన్లో జన్మించారు. కెనడాలోని ఒట్టావాలోని రాక్‌క్లిఫ్ పార్క్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు. పెర్రీ తల్లి సుజాన్నె మారిసన్ వృత్తిరీత్యా జర్నలిస్ట్. అప్పటి కెనడా ప్రధాని పియర్రె ట్రుడో వద్ద ప్రెస్ సెక్రెటరీగా పని చేశారు. చదువు పూర్తయిన తరువాత లాస్ ఏంజిలిస్‌లో స్థిరపడిన ఫెర్రీ హాలీవుడ్లో కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. ఫ్రెండ్స్ వెబ్ సిరీస్‌లో చాండ్లర్ బింగ్ అనే పాత్రతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. 1994 నుంచి 2004 వరకు ఫ్రెండ్స్ వెబ్‌సిరీస్ వరుసగా 10 సీజన్లు రాగా.. అన్నింట్లోనూ ఫెర్రి నటించాడు. రీసెంట్గా 2021లో ఫ్రెండ్స్ రీయూనియన్ షో కూడా జరిగింది. ప్రస్తుతం ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. స్టార్స్ సంతాపం పెర్రి మరణంతో యావత్సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది. హాలీవుడ్‌తో పాటు టాలీవుడ్,బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతి పట్ల సంతపం తెలుపుతున్నారు. ఈ జనరేషన్ ఓ మంచి ‘ఫ్రెండ్’ని కోల్పోయిందని మహేశ్‌బాబు ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. ఇక సమంత అయితే పెర్రి మరణ వార్త విని గుండె బద్దలైందని, అతను ఎప్పటికీ మనకు ‘ఫ్రెండ్’గానే ఉంటాడని రాసుకొచ్చింది. రణ్వీర్ సింగ్, కరీనా కపూర్ తో పాటు పలువు బాలీవుడ్ స్టార్స్ కూడా సోషల్ మీడియా వేదికగా పెర్రికి సంతాపం ప్రకటించారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)