మాథ్యూ ఫెర్రీ
అమెరికన్ ప్రముఖ నటుడు మాథ్యూ ఫెర్రీ (54) ఇక లేరు. లాస్ ఏంజిల్స్‌లోని స్వగృహంలో ఫెర్రీ అనుమానాస్పద రీతిలో మరణించినట్లుగా అక్కడి పోలీస్ అధికారులు వెల్లడించారు. జాన్ బెన్నెట్ ఫెర్రీ, సుజానే మేరీ మోరిసన్ దంపతులకు 1969 ఆగస్టు 19న జన్మించారు మాథ్యూ ఫెర్రీ. ఫెర్రీకి ఏడాది వయసు పూర్తి కాక ముందే బెన్నెట్ ఫెర్రీ, సుజానే మేరీ విడాకులు తీసుకున్నారు. 15 ఏళ్లు తల్లి వద్దే ఉంటూ చదువుకున్నాడు ఫెర్రీ.
ఆ తర్వాత అప్పటికే నటనా రంగంలో ఉన్న తండ్రి బాటలో నడిచారు ఫెర్రీ. అలా సినిమాలు, ముఖ్యంగా సీరియల్స్‌లో నటించి పేరు గడించారు. 1994లో ఆరంభమైన ‘ఫ్రెండ్స్’ సిరీస్‌తో ఆయన జీవితం కీలక మలుపు తీసుకుంది.ఇందులో ఫెర్రీ పోషించిన చాండ్లర్ బింగ్ పాత్ర అద్భుతంగా క్లిక్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఫెర్రీకి అభిమానులను సంపాదించిపెట్టింది. ‘ఫ్రెండ్స్’ సిరీస్ 2014 వరకు ఓ అమెరికన్ చానెల్‌లో ప్రసారమైంది.
అలాగే 2021లో ‘ఫ్రెండ్స్ రీ యూనియన్ షో’ కూడా జరిగింది. ఈ షో ఓ ప్రముఖ ఓటీటీ ΄్లాట్‌ఫామ్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ‘ఎమ్టీ నెస్ట్’, ‘హైవే టు హెవెన్’, ‘ఫ్రెండ్స్’, ‘మిస్టర్ సన్‌షైన్’... ఇలా 40కి పైగా టెలివిజన్ సిరీస్‌లలో నటించారు ఫెర్రీ. అలాగే ‘ది కిడ్’, ‘బర్డ్స్ ఆఫ్ అమెరికా’.. ఇలా దాదాపు 15 హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించారాయన. ఇక ఫెర్రీ మృతి పట్ల ఇండియన్ స్టార్స్ వెంకటేశ్, మహేశ్‌బాబు, అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్, సమంత, కరీనా కపూర్‌లతో పాటు పలువరు హాలీవుడ్ స్టార్స్ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment