అతడు ప్రముఖ నటుడు. 'ఆస్కార్' అవార్డు గెలుచుకున్న సినిమాలోనూ నటించాడు. తాజాగా ఓ కేసులో ఇరుక్కున్నాడు. సడన్‌గా ఇతడు కనిపించడం లేదని అతడి భార్య ఫిర్యాదు చేసింది. అనుహ్యంగా ఇప్పుడు అనుమానాస్పద స్థితిలో కారులో విగతజీవిగా కనిపించాడు. ఈ క్రమంలోనే ఇతడి మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ అసలేం జరిగింది?
(ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ శృతిహాసన్? అసలు విషయం ఇదే)
కొరియన్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న లీ సన్ క్యూన్.. ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న 'పారాసైట్' మూవీలోనూ కీలకపాత్రలో కనిపించి మెప్పించాడు. ఆ తర్వాత మరిన్ని సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. అయితే ఇతడు చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాలు (డ్రగ్స్) వినియోగిస్తున్నట్లు కొన్నాళ్ల క్రితం ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇతడిని పోలీసులు విచారించారు.
సడన్‌గా లీ సన్ క్యూన్ కనిపించడం లేదని రెండు మూడు రోజుల క్రితం ఇతడి భార్య కంప్లైంట్ చేసింది. దీంతో ఎక్కడికి వెళ్లాడా అని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇంట్లోనే ఇతడి సూసైట్ నోట్ దొరికింది. అలానే పార్కింగ్ చేసిన కారులో శవమై కనిపించాడు. ఈ విషయాన్ని లీ భార్య పోలీసులు చెప్పింది. అయితే ఇతడు చనిపోయాడా? ఎవరైనా చంపేశారా? అనేది తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7'లో ఓడిపోతేనేం.. ఇప్పుడు శోభాశెట్టికి ఆ అవార్డ్)
Comments
Please login to add a commentAdd a comment