
ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. 'హ్యారీ పాటర్' నటుడు రాబో కాల్ట్రైన్(72) కన్నుమూశారు. ఈ విషయాన్ని కాల్ట్రైన్ ఏజెంట్ బెలిందా రైట్ దృవీకరించారు. 'ఆయన అద్భుతమైన నటుడే కాకుండా, న్యాయపరంగా ఎంతో తెలివైనవాడని, అతన్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాం' అంటూ బెలిందా ఎమోషనల్ అయ్యింది.అయితే కాల్ట్రైన్ మరణానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.
ప్రముఖ టీవీ సిరీస్ క్రాకర్‌లో నేరాలను పరిష్కరించే సైక్రియార్టిస్ట్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కాల్ట్రైన్ హ్యారీ పాటర్ చిత్రంతో మరింత పాపులర్ అయ్యాడు. ఈ సినిమాలో హ్యాగ్రిడ్ పాత్రలో ఆయన నటనకు ఫిదా కాని ప్రేక్షకులు ఉండరు. ఇక కాల్ట్రైన్ తన నటనతో వరుసగా మూడుసార్లు ఉత్తమ నటుడిగాబ్రిటీష్ అకాడమీ టెలివిజన్ అవార్డులను గెలుచుకున్నాడు.
జేమ్స్ బాండ్,గోల్డెన్ ఐ, ది వరల్డ్ ఈజ్ వంటి పలు చిత్రాల్లో ఆయన నటించాడు. కాల్ట్రైన్ చివరగా రిటర్న్ టు హాగ్వార్ట్స్ వార్షికోత్సవంలో కనిపించాడు. కాగా కాల్ట్రైన్ మరణంపై పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment