సినీ ఇండస్ట్రీలో విషాదం.. ఆస్కార్‌ విజేత మృతి! | Oscar Winning Producer Albert S Ruddy Passes Away At 94, Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

Albert S Ruddy Death: హాలీవుడ్‌లో విషాదం.. ఆస్కార్‌ చిత్రనిర్మాత కన్నుమూత!

Published Wed, May 29 2024 3:28 PM | Last Updated on Wed, May 29 2024 4:50 PM

Oscar Winning Producer Albert S Ruddy Passes Away At 94

హాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ ఆస్కార్‌ అవార్డ్ విన్నర్‌, చిత్రనిర్మాత ఆల్బర్ట్ ఎస్ రడ్డీ కన్నుమూశారు. అనారోగ్యంతో లాస్‌ఎంజిల్స్‌లోని ఆస్పత్రిలో చేరిన ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆల్బర్ట్ కుటుంబ సభ్యులు వెల్లడించారు.  కాగా.. ది గాడ్‌ఫాదర్, మిలియన్ డాలర్ బేబీ లాంటి చిత్రాలకు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్నారు. 

అల్ రడ్డీ సిట్‌కామ్ హొగన్ హీరోస్, డ్రామా వాకర్, టెక్సాస్ రేంజర్, ది లాంగెస్ట్ యార్డ్‌ లాంటి సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన బ్యాడ్ గర్ల్స్ (1994) చిత్రాన్ని కూడా నిర్మించాడు. ముఖ్యంగా మహిళా ప్రధాన పాత్రలతో మొదటి పాశ్చాత్య చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత బేస్ బాల్ కామెడీ ది స్కౌట్ (1994), మటిల్డా (1978) లాంటి కామెడీ ఓరియంటెస్‌ సినిమాలు నిర్మించారు. వీటితో పాటు డెత్ హంట్, మెగాఫోర్స్ , లాస్సిటర్, లేడీబగ్స్ , ప్రిజనర్స్, మీన్ మెషిన్ , కామిల్లె చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement