ఇండస్ట్రీలో విషాదం.. గేమ్ ఆఫ్ థ్రోన్స్‌ నటుడు మృతి | Sakshi
Sakshi News home page

Game Of Thrones Actor: గేమ్ ఆఫ్ థ్రోన్స్‌ నటుడు కన్నుమూత

Published Wed, May 8 2024 10:18 AM

Game Of Thrones Actor Ian Gelder Dies Due To Cancer

సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ హాలీవుడ్‌ నటుడు ఇయాన్ గెల్డర్ కన్నుమూశారు. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' చిత్రంలో కెవాన్ లన్నిస్టర్ పాత్రకు గుర్తింపు తెచ్చుకున్నారు. క్యాన్సర్‌ బారిన పడిన ఆయన కోలుకోలేక మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బెన్ డేనియల్స్ ధృవీకరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్‌ రాసుకొచ్చారు.

ఇయాన్ గెల్డర్‌ గేమ్ ఆఫ్ థ్రోన్స్‌తో పాటు సర్జ్‌, క్వీర్స్‌, షేక్స్‌పియర్ గ్లోబ్, హిజ్ డార్క్ మెటీరియల్స్. అండర్‌డాగ్‌ లాంటి చిత్రాల్లో నటించారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్'లో కెవాన్ లన్నిస్టర్ పాత్రకే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. కాగా.. ఇటీవలే టైటానిక్ నటుడు సైతం మరణించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement