Oscar Winning Actor William Hurt Died, Details Inside - Sakshi
Sakshi News home page

William Hurt Death: హాలీవుడ్‌ నటుడు విలియమ్‌ హర్ట్‌ మృతి..

Mar 14 2022 12:46 PM | Updated on Mar 14 2022 1:58 PM

Oscar Winning Actor William Hurt Dies At 71 - Sakshi

Oscar Winning Actor William Hurt Dies At 71: ప్రముఖ హాలీవుడ్‌ నటుడు, ఆస్కార్‌ అవార్డు గ్రహీత విలియమ్‌ హర్ట్‌ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కొడుకు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. మా నాన్న72వ పుట్టినరోజుకు వారం రోజుల ముందు మార్చి13న మరణించారు. ఆయన మృతి పట్ల మా కుటుంబం ఎంతో విచారంగా ఉంది. సహజ కారణాలతో ఆయన చనిపోయారు అని వివరించాడు. కాగా ది బిగ్ చిల్, ఎ హిస్టరీ ఆఫ్ వైలెన్స్‌ వంటి సినిమాల్లో నటించి పాపులర్‌ అయిన విలియమ్‌ హర్ట్‌కు 2018లో ప్రొస్టేట్ కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.

అయితే ఆయన క్యాన్సర్‌ కారణంగానే చనిపోయారా లేక వృద్దాప్యపు సమస్యలతో మరణించారా అన్నదానిపై కుటుంబ సభ్యులు క్లారిటీ ఇవ్వలేదు. 1991లో‘అంటిల్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్’ సినిమాలో ఆయన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు పొందారు.  1985లో వచ్చిన ‘కిస్ ఆఫ్ ద స్పైడర్ వుమెన్’ సినిమాలో స్వలింగ సంపర్క ఖైదీ పాత్రకు గాను ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అవార్డును గెలుచుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement