లేటు వయసులో గర్ల్‌ఫ్రెండ్‌తో బిడ్డకు తండ్రి: నటుడి రియాక్షన్  వైరల్‌  | Actor Robert De Niro About Becoming Father To 7th Child At 79 | Sakshi
Sakshi News home page

లేటు వయసులో గర్ల్‌ఫ్రెండ్‌తో బిడ్డకు తండ్రి: నటుడి రియాక్షన్ వైరల్‌ 

Published Mon, Jan 29 2024 5:07 PM | Last Updated on Mon, Jan 29 2024 5:19 PM

Actor Robert De Niro About Becoming Father To 7th Child At 79 - Sakshi

హాలీవుడ్ నటుడు , లెజెండ్ రాబర్ట్ డి నీరో  లేటు   వయసులో  తండ్రి కావడంపై స్పందించారు.  రెండుసార్లు ఆస్కార్  అవార్డులను సొంతం చేసుకున్న  నీరో ,  గర్ల్ ఫ్రెండ్ టిఫనీ చెన్‌తో  కలిపి గత ఏడాది ఏప్రిల్‌లో 79 ఏళ్ళ వయసులో  ఏడో బిడ్డగా ఒక పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. 

ఇటీవల ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  తండ్రిగా తాను పొందుతున్న ఆనందాలను, అనుభూతి గురించి మాట్లాడారు. తన పాప గియా  చూసినపుడు  చాగా తనకు సంతోషంగా ఉంటుదని,  ఈ వయసులో సాధ్యమైనంత  ఎక్కువ సమయం  పాపతో గడపాలని  కోరుకుంటున్నా అంటూ  భావోద్వేగానికి లోనయ్యాడు..  ఎన్ని టెన్షన్స్ ఉన్నా పాను ఒక్కసారి చూస్తే అన్నీ మటు మాయం... తన పాప చాలా అందంగా ముద్దుగా  ఉంటుందని చెప్పుకొచ్చాడు.  80 ఏళ్ళ వయసులో తండ్రి అవ్వడం పెద్ద విశేషమే అంటూ మురిసిపోయాడు. 

ఇప్పటికే ‘గాడ్ ఫాదర్-2’ సినిమాకు రాబర్ట్ డి నీరో  బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు. అలాగే   2024 ఆస్కార్ నామినేషన్ లిస్టులో కూడా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ క్యాటగిరీలో  మరో అవార్డు అందుకున్నాడు.  రాబర్ట్ డి నీరో రెండుసార్లు వివాహం చేసుకున్నారు. అతని మొదటి భార్య డయానే అబాట్ ద్వారా ఇద్దరు పిల్లలు, కుమార్తె డ్రేనా , కుమారుడు రాఫెల్ ఉన్నారు. అలాగే  మోడల్-నటి టౌకీ స్మిత్‌తో  జూలియన్ ,ఆరోన్ అనే కవలలకు జన్మనిచ్చాడు.  దీంతో పాటు  రాబర్ట్ డి నీరోకు అతని మాజీ భార్య గ్రేస్ హైటవర్‌తో  కుమారుడు ఇలియట్ ,కుమార్తె హెలెన్ గ్రేస్ ఉన్నారు.వీరిలో ఇద్దరు హాలీవుడ్ లో పలు రంగాల్లో రాణిస్తున్నారు.   ఇక ఏడో సంతానంగా టిఫనీ చెన్‌ ,  నీరోకు పాప గియా పుట్టింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement