గోల్డ్‌కోస్ట్: కామన్ వెల్త్ క్రీడల్లో భారత్ సత్తా చాటింది. వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో మరో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. శనివారం ఉదయం జరిగిన 77 కేజీల విభాగం పోటీల్లో సతీశ్ కుమార్ శివలింగం ఈ ఘనత సాధించారు. మొత్తం 317 కేజీల బరువునెత్తి అద్భుత ప్రదర్శన కనబరిచిన సతీష్ పసిడి పతకాన్ని పొందారు.
తమిళనాడు వెల్లూరుకు చెందిన సతీష్ 2013లో కామన్వెల్త్ గేమ్స్‌లోనూ స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, ఈసారి క్రీడల్లో ఇప్పటిదాకా భారత్‌కు ఐదు పతకాలు రాగా.. అన్నీ వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలోనే సాధించటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment