![Commonwealth Games 2022: Jeremy Lalrinnunga Wins Gold In 67kg Weight Lifting, India Bags Fifth Medal - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/31/Untitled-3_1.jpg.webp?itok=vtAUhddK)
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ దూసుకుపోతుంది. ఇప్పటికే 4 పతకాలు సాధించి అంచనాలకు మించి రాణిస్తున్న భారత వెయిట్ లిఫ్టర్లు.. తాజాగా మరో పతకం సాధించారు. మూడో రోజు ఈవెంట్స్‌లో పురుషుల 67 కేజీల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ జెరెమీ లాల్‌రిన్నుంగ 300 కేజీల (స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్‌లో కలిపి) బరువు ఎత్తి స్వర్ణ పతకం నెగ్గాడు. తద్వారా ఈ మెగా ఈవెంట్‌లో ఇప్పటివరకు భారత్ ఖాతాలో చేరిన స్వర్ణాల సంఖ్య రెండుకు, మొత్తం పతకాల సంఖ్య ఐదుకు చేరింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జెరెమీ అనూహ్యంగా 300 కేజీల బరువును ఎత్తి కామన్వెల్త్ గేమ్స్ రికార్డు నమోదు చేశాడు.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న 22వ కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ మాంచి జోరు మీద ఉంది. భారత్ ఇప్పటివరకు సాధించిన పతాకలన్నీ వెయిట్ లిఫ్టింగ్‌లో సాధించినవే కావడం విశేషం. మీరాబాయ్ చాను 49 కేజీల విభాగంలో స్వర్ణం, 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సార్గర్ రజతం, 55 కేజీల విభాగంలో బింద్యారాణి దేవి రజతం, 61 కేజీల విభాగంలో గురురాజ్ పూజారి కాంస్యం, తాజాగా జెరెమీ లాల్‌రిన్నుంగ 67 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment