న్యూఢిల్లీ : ప్రస్తుతం తాత్కాలిక నిషేధం ఎదుర్కొంటున్న వెయిట్ లిఫ్టర్ గీతా రాణి కెరీర్ ఇక ముగిసినట్టుగానే భావించాలి. ఇటీవల డోపింగ్‌లో దొరికిన 33 ఏళ్ల గీతా.. ‘బి’ శాంపిల్ కూడా పాజిటివ్‌గానే తేలడంతో ఆమెపై సుదీర్ఘకాలం నిషేధం పడే అవకాశం ఉంది. 2004 ఆసియా గేమ్స్‌లో రజతంతో పాటు 2006 కామన్వెల్త్‌లో స్వర్ణం గెలుచుకుని గీతా అందరి దృష్టినీ ఆకర్శించింది. ఇటీవల కేరళలో జరిగిన జాతీయ క్రీడల సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షలో ఆమె ‘ఎ’ శాంపిల్ పాజిటివ్‌గా తేలింది. ఆ ఈవెంట్‌లోనూ ఆమె 75+ విభాగంలో స్వర్ణం గెలుచుకుంది. జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ ప్యానెల్ విచారణ అనంతరం గీతా రాణి నిషేధంపై నిర్ణయం తీసుకుంటారు.