ఆలిండియా బీఎస్‌ఎన్‌ఎల్ టోర్నమెంట్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత బీఎస్‌ఎన్‌ఎల్ వెయిట్‌లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, బెస్ట్ ఫిజిక్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సత్తాచాటింది. గచ్చిబౌలిలోని ఆర్‌టీటీసీలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో వెయిట్ లిఫ్టింగ్ టీమ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ రన్నరప్‌గా నిలిచింది. వ్యక్తిగత విభాగాల్లోనూ ఆంధ్ర సర్కిల్‌కు చెందిన జంగయ్య, నారాయణ, నాగబాబు, కుమార్ పతకాలను సాధించారు. ఈ జట్టుకు కోచ్‌గా నందూలాల్, మేనేజర్‌గా మోహన్ వ్యవహరించారు.
పవర్ లిఫ్టింగ్ విజేతల వివరాలు
59 కేజీలు: 1. సతీరామ్ సింగ్ (యూపీ ఈస్ట్), 2. దిలీప్ (మధ్యప్రదేశ్), 3. హరూన్ డానియెల్ (యూపీ వెస్ట్).
66 కేజీలు: 1. దీపక్ జ్యోతి (జమ్మూ, కశ్మీర్), 2. నరేశ్(మహారాష్ట్ర), 3. సుకేశ్ బాబు(కేరళ).
74 కేజీలు: 1. విమల్ రాజా (తమిళనాడు), 2. విజయ్ రామ్ (పశ్చిమ బెంగాల్), 3. ఎన్.ఎల్. వాంఖేడె (మహారాష్ట్ర).
83 కేజీలు: 1. పుణీత్ కుమార్ (యూపీ వెస్ట్), 2. మనోజ్ (కేరళ), తమిళరాసన్ (తమిళనాడు).
రన్నరప్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్
Published Fri, Jan 20 2017 10:52 AM | Last Updated on Tue, Sep 5 2017 1:42 AM
Advertisement
Advertisement