తమపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ భారత వెయిట్‌లిఫ్టర్లు కామన్వెల్త్ గేమ్స్‌లో అద్వితీయ ప్రదర్శన చేస్తున్నారు. తమ ప్రతిభతో వరుసగా మూడో రోజు భారత్ ఖాతాలో రెండు పతకాలను జమ చేశారు. తొలి రోజు స్వర్ణం, రజతం... రెండో రోజు స్వర్ణం, కాంస్యం రాగా... మూడో రోజు మాత్రం రెండూ స్వర్ణాలే కావడం విశేషం.