బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్‌వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టర్ల హవా కొనసాగుతుంది. ఆరో రోజు ఈ క్రీడలో భారత్ మరో పతకం సాధించింది. పురుషుల 109 కేజీల విభాగంలో లవ్‌ప్రీత్ సింగ్ భారత్‌కు కాంస్య పతకం అందించాడు. స్నాచ్ రౌండ్‌లో 163 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో 192 కేజీలు ఎత్తిన లవ్‌ప్రీత్ సింగ్.. మొత్తంగా 355 కేజీల బరువు ఎత్తి మూడో స్థానంలో నిలిచాడు. కెమరూన్‌కు చెందిన పెరిక్లెక్స్ నగాడ్జా మొత్తం 361 కేజీలు ఎత్తి స్వర్ణం సాధించగా.. సమోవాకు చెందిన జాక్ హిటిలా 358 కేజీలు ఎత్తి రజత పతకం కైవసం చేసుకున్నాడు.
ఇదిలా ఉంటే, లవ్‌ప్రీత్ గెలిచిన పతకంతో ప్రస్తుత క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య 14కు చేరింది. ఒక్క వెయిట్ లిఫ్టింగ్‌లోనే భారత్ 9 పతకాలు సాధించడం విశేషం. మిరాబాయ్ చాను (గోల్డ్), జెరెమీ లాల్‌రిన్నుంగ (గోల్డ్), అచింట షెవులి (గోల్డ్), సంకేత్ సర్గార్ (సిల్వర్), బింద్యా రాణి (సిల్వర్), వికాస్ ఠాకుర్ (సిల్వర్), గురురాజ పుజారి (బ్రాంజ్), హర్జిందర్ కౌర్ (బ్రాంజ్).. తాజాగా లవ్‌ప్రీత్ బ్రాంజ్ మెడల్స్ సాధించారు.
చదవండి: CWG 2022: దూసుకుపోతున్న భారత్.. వెయిట్ లిఫ్టింగ్‌లో మరో పతకం
Comments
Please login to add a commentAdd a comment