Commonwealth Games 2022 Day 2: Lifter Sanket Sargar Opens Indias Medal Count With A Silver - Sakshi
Sakshi News home page

Commonwealth Games 2022: బోణీ కొట్టిన భారత్‌.. వెయిట్‌ లిఫ్టింగ్‌లో రజతం

Published Sat, Jul 30 2022 4:00 PM | Last Updated on Sat, Jul 30 2022 5:20 PM

Commonwealth Games 2022 Day 2: Lifter Sanket Sargar Opens Indias Medal Count With A Silver - Sakshi

Birmingham 2022: బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత్‌ బోణీ కొట్టింది. పురుషుల వెయిట్‌ లిఫ్టింగ్‌ ‌55 కేజీల విభాగంలో సంకేత్‌ సర్గార్‌ రజత పతకం సాధించాడు. ఈ పోటీల్లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన  సంకేత్‌.. మొత్తం 248 కేజీల బరువును (స్నాచ్‌లో 113 కేజీలు, సీ ఎండ్‌ జేలో 135 కేజీలు) ఎత్తి తన లక్ష్యానికి (స్వర్ణం) కేవలం ఒక్క కిలో దూరంలో నిలిచిపోయాడు.

మలేషియాకు చెందిన బిబ్‌ అనిక్‌ 259 కేజీల బరువు ఎత్తి స్వర్ణ పతకం కైవసం చేసుకోగా..  శ్రీలంకకు చెందిన దిలంక యోడగే (225 కేజీలు) కాంస్యం సాధించాడు. సంకేత్‌.. సీ ఎండ్‌ జే రెండో ప్రయత్నంలో గాయపడటంతో రజతంతో సరిపెట్టుకున్నాడు. 
చదవండి: CWG 2022: ఎక్కడికెళ్లినా దొరికిపోవడమే.. వీడేం బాక్సర్‌ రా బాబు!.. కామన్‌వెల్త్‌ నుంచి సస్పెండ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement