నేడు జాతీయ మహిళా దినోత్సవం | To day womans day | Sakshi
Sakshi News home page

నేడు జాతీయ మహిళా దినోత్సవం

Published Sat, Mar 8 2014 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM

To day womans day

ఆమె.. తల్లిగా బిడ్డను కంటికి రెప్పలా కాపాడుతూ.. మమతానురాగాలకు చిరునామాగా నిలుస్తుంది. చెల్లిగా సోదరిప్రేమను పంచుతూ.. ఆత్మీయ అనుబంధాలకు ప్రతీకవుతుంది. ఆలిగా కష్టనష్టాల్లో తోడుగా ఉంటూ అన్ని సేవలు చేస్తుంది..  మగవాడి బతుకులో సగపాలు తనదిగా భావించి రూ.విస్తుంది. ప్రతి మగాడి విజయం వెనకా ఆమె ఉంటుంది. అందుకే ‘ఆకాశంలో సగం’గా.. ఇంటికి దీపం ఇల్లాలుగా కీర్తించబడింది. ఒకప్పడు గృహిణులుగానే పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఆకాశంలో సగం కాదు అన్నింట్లో మేమే అంటూ నిరూపిస్తున్నారు.
 
 మన జిల్లాలోనూ రాజకీయ, సాహిత్య, క్రీడా రంగాల్లో చరిత్ర సృష్టించిన మహిళలు ఉన్నారు.మొన్నటి తాళ్లపాక తిమ్మక్క, మొల్లమాంబ లాంటి కవయిత్రులు సాహితీరంగంలో సమకాలీన పురుష కవులకు ధీటుగా నిలిచారు. రాజకీయ రంగంలో మొన్నటి కోటిరెడ్డి రామసుబ్బమ్మ నుంచి నేటి వైఎస్ విజయమ్మ వరకు తమ ప్రతిభను చాటుతున్నారు.
 
 3112 కిలో మీటర్లు పాదయాత్ర చేసి షర్మిళ రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించారు. నందలూరు వాసి కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్ విశ్వవీధుల్లో విజయ పతాకం ఎగురవేసి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. ఆ వారసత్వాన్ని నేటికి నిలుపుతూ జిల్లాలోని పలువురు మహిళలు వివిధ రంగాల్లో తమదైన శైలిలో సేవలందిస్తున్నారు. నేడు జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారి గురించి క్లుప్తంగా..     
 
 సైంటిస్ట్ స్వర్ణలత..
 
 స్వర్ణలత కడప నగర పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో సీని యర్ సైంటిస్ట్‌గా సేవలందిస్తున్నా రు. తృణధాన్యాల ఉపయోగాలను ప్రజ లకు తెలియజెప్పి వాటితో ఆధునిక ఆహార రకాలైన బిస్కెట్లు తదితర ఆహార పదార్థాలు, కూరగాయలతో పచ్చళ్లు, ఇం కా ఇతర రకాల ఆహార పదార్థాలను తయారు చేయడం మహిళలకు నేర్పుతున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళలతో ఇలాంటి ఆహార పదార్థాలు చేసే యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో పోషక విలువలు గల ఆహారం అందిస్తూ తృణ ధాన్యాల వినియోగాన్ని పెంచుతామన్నారు. మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు.
 
 న్యాయాధికారి మాలతి..
 కడప నగర ప్రజలకు 15 ఏళ్లుగా న్యాయ సేవలందిస్తున్న మాలతి జిల్లా ప్రధాన న్యాయస్థానంలో సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్నారు. సెంటర్ ఆఫ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రతినిధిగా పేదలు, బడుగు వర్గాల ప్రజలకు అవసరమైనప్పుడు ఉచితంగా న్యాయసేవలు పొందడమెలాగో తెలుపుతున్నారు. ఇప్పటికీ ప్రత్యేకంగా వంద సభలు, సదస్సులు ఏర్పాటుచేసి ఉచితంగా న్యాయసేవలు పొందడమెలాగో సాధారణ ప్రజలకు వివరిస్తున్నారు. బడుగులున్న ప్రాంతాలకే వెళ్లి ఈ సేవలందించడం విశేషం. కోర్టు ద్వారా న్యాయం పొందడం వ్యయంతో కూడిన వ్యవహారం అని భావించి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఎందరో సామాన్యులు ఈ సేవలందుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఓ యజ్ఞంలా భావించి ముందుకు సాగిపోతున్నారు.
 
 యోగ ఉద్యమకర్త కల్పన
 కడప నగరంలో మిత్ర యోగ కేం ద్రం ద్వారా ధ్యానం, యోగ నేర్పి న డాక్టర్ కె.కల్పన పలు జాతీయస్థాయి పురస్కారాలు అందుకున్నారు. 17 ఏళ్లుగా కడప నగరంలో 5వేల మందికి పైగా యోగ, ధ్యానం నేర్పారు. జిల్లాలో యోగపై సృ్పహ, అవగాహన కల్పించిన ఘనత డాక్టర్ కల్పనకే దక్కింది. ముఖ్యంగా మహిళల్లో రుతు సమస్యలు, సంతాన లేమి, థైరాయిడ్ సమస్యలకు యోగ ద్వారా ప్రతిభావంతమైన ఫలితాలు సాధించారు. నేటికీ పలువురు గైనకాలజిస్ట్‌లు ఆమె వద్ద యోగ శిక్షణ పొందుతుండడం గమనార్హం. డ్వాక్రా సంఘాలు, అంగన్‌వాడీల ప్రాంతీయ స్థాయి సమావేశాలలో యోగ నేర్పుతున్నారు.
 
 వారంతా సమాజానికి తమదైన రీతిలో విలక్షణ సేవలందిస్తున్నారు. తమ పని మినహా మరోలోకం లేదన్నట్లు వారి వారి రంగాలలో ఎంతో ప్రతిభ కనబరుస్తున్నారు. ఎందరికో అండగా నిలిచారు. ఆప్త బంధువులయ్యారు. అందరి ప్రశంసలు పొందుతున్నారు. వారెప్పుడు ఎవరి మెప్పు కోరలేదు. ప్రచారానికీ ఇతర ఆర్భాటలకూ దూరంగా ఉంటారు. ఒకరు సైంటిస్ట్‌గా.. మరొకరు న్యాయమూర్తిగా విశిష్ట సేవలందిస్తున్నారు. ఒకరు మానసిక వికలాంగులను అక్కును చేర్చుకుంటే.. మరొకరు మహిళల సమస్యలపై అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ సేవా మూర్తుల గురించి క్లుప్తంగా..    
 -న్యూస్‌లైన్, కడప కల్చరల్
 
 పసిదేవుళ్లకు తల్లి సాబిరున్నీసా..
 కడప నగరంలోని అల్‌షిఫా మానసిక వికలాంగుల పునరావాస కేంద్రం నిర్వాహకులు సాబిరున్నీసా తమ కేంద్రం ద్వారా 75మంది మానసిక వికలాంగ బాలలను సాధారణ బాలలుగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఇప్పటికీ 25 మంది మానసిక వికలాంగ బాలలను సాధారణ జన రూ.వన స్రవంతిలో కలిసేలా తీర్చిదిద్దారు. ఈ రంగంలో అత్యున్నత స్థాయి సాంకేతిక శిక్షణ పొందిన సాబిరున్నీసా పలు జాతీయ స్థాయి సదస్సుల్లో మానసిక వికలాంగుల పునరావాసంపై అవగాహన కల్పించారు. కన్న తల్లిదండ్రులే భారమని భావిస్తున్న మానసిక వికలాంగులను, బాలలను తల్లి కంటే ఎక్కువగా ఆదరిస్తూ వారికి పునర్జీవితం ప్రసాదించేందుకు కృషి చేస్తున్నారు.
 
 బాలల సేవిక సిస్టర్ లిసీ..
 కేరళ నుంచి 1992లో మన ప్రాంతానికి వచ్చారు. క్రైస్తవ మిషనరీ ద్వారా ప్రజలకు దైవ సందేశం అందజేస్తూ ఆధ్యాత్మిక సేవలందించారు. అంతటితో తృప్తి చెందక కడప నగర పరిధిలో ‘ఆశ నిలయం’ పేరిట మూగ,బధిర బాలల పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. 72 మంది బాలలను సాధారణ రూ.వితం గడిపే స్థాయికి తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. ప్రతిఫలాపేక్ష లేకుండా నిరాడంబరంగా ప్రచారం, ప్రశంసలకు దూరంగా ఉంటూ బధిరులకు శబ్దంగా, మాట్లాడలేని బాలలకు మాటగా నిలిచారు.
 
 విలక్షణ మహిళలకు
 విశిష్ఠ పురస్కారం..
 దేశవ్యాప్తంగా కళా చారిత్రక, వారసత్వ సంపదను పరిరక్షిస్తున్న భారత జాతీయ కళావారసత్వ పరిరక్షణ సంస్థ (ఇంటాక్) ఆయా రంగాల్లో  సేవలందిస్తున్న మహిళలను గుర్తించింది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం వీరికి విల క్షణ సేవలకు విశిష్ట పురస్కారాలను అందజేయనుంది. శనివారం ఉదయం 9.30 గంటలకు కడప నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఈ పురస్కారాలకు వేదికగా నిలవనుంది.
 
 లింగ వివక్ష లేని సమాజం ఏర్పడాలి  
 లింగ వివక్ష, లైంగిక దాడులు, వేధింపులు లేని సమాజం వచ్చినప్పుడు మహిళా దినోత్సవానికి సార్థకత. మాది చిత్తూరు జిల్లా.తల్లిదండ్రులు  కృష్ణయ్య నాయుడు, సరస్వతమ్మ. 1995లో అసిస్టెంట్ ఇంజనీరుగా కడపలో చేరి 2008లో పదోన్నతి పొందాను. స్వాతంత్య్రం వచ్చి 67 సంవత్సరాలైనా మహిళలకు రక్షణ కరువుకావడం దురదృష్టకరం. నిర్భయ లాంటి కఠిన చట్టాలను అమలుపరచడంలో ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల ఆకతాయిలకు భయం లేకుండా పోతోంది.
 
 మహిళలకు సంబంధించి వ్యాజ్యాలను సత్వరం పరిష్కరించడానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తే బాగుంటుంది. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి కానీ చట్టసభల్లో ఇంకా రాకపోవడం విచారకరం.  ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు, కానీ నా విషయంలో మాత్రం అది తిరగబడింది. నా విజయం వెనుక నా భర్త శ్రీనివాసరావు ఉన్నారు.  కూతురు మానసిక వికలాంగురాలైతే ఆమెకు మా ఆయనే సర్వస్వంగా మారి ఆలనాపాలన చూస్తున్నారు.
 - కే. మాధవి, రోడ్లు, భవనాల శాఖ డీఈఈ
 
 వారి సహకారంతోనే..
 చిన్నప్పుడే తండ్రి మరణిస్తే తల్లి బీడీలు చుట్టి ఆమెను చదివించింది.. పదో తరగతి తర్వాత అన్నా వదినలు ఆమెకు తోడుగా నిలిచారు. తల్లి ఆశయాన్ని.. తన లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కష్టపడి చదివారు. చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించారు. ఆమే ఖారూ.పేట తహశీల్దార్ ఖతుజున్ ఖుప్రా. కలెక్టర్ కావడమే ఆశయమంటున్న ఆమె తన అనుభవాలు పంచుకున్నారు.
 ‘మాది అనంతపురం జిల్లా ఎల్లనూరు. తల్లిదండ్రులు ఖాదర్ మొహిద్దీన్, రహీంబి. నేను రెండో సంతానం.  నా మూడేళ్ల వయసులో  తండ్రి చనిపోయారు.  అప్పటి నుంచి కుటుంబ భారాన్ని నా తల్లి తీసుకున్నారు. బీడీలు చుట్టి మమ్మల్ని పోషించారు. మా అన్నయ్య ఉద్యోగంలో చేరగానే అమ్మకు కాస్త విశ్రాంతి దొరికింది. మా అన్నావదినలు సొంత బిడ్డల కంటే ఎక్కువ చూసుకున్నారు. వారి సహకారంతో  ఎమ్మె స్సీ పూర్తిచేసి  ఉద్యోగం కోసం గ్రూప్స్ పరీక్షలు రాశాను.కలెక్టర్ కావడమే రూ.విత ఆశయం. మహిళలు  కష్టపడితే అనుకున్న లక్ష్యం సాధించవచ్చు.’    
 -ఖతిజున్ ఖుఫ్రా, తహశీల్దార్, ఖారూ.పేట
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement