హైదరాబాద్ నగరానికి చెందిన టి. సుకన్య జాతీయ జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో మెరిసింది.
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన టి. సుకన్య జాతీయ జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో మెరిసింది. ఆంధ్రప్రదేశ్‌లోని కేతనకొండలో జరిగిన ఈ పోటీల్లో ఆమె బంగారు పతకాన్ని సాధించింది. మహిళల 75 కేజీ కేటగిరీలో పోటీపడిన ఆమె... స్నాచ్‌లో 50 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 75 కేజీల బరువెత్తింది. తాజా ప్రదర్శనతో ఆమె భారత జాతీయ శిబిరానికి ఎంపికై ంది. టీమ్ చాంపియన్‌షిప్‌లో జూనియర్ బాలికల కేటగిరీలో ఏపీ, యూత్ బాలికల విభాగంలో తెలంగాణ జట్లు రెండో స్థానంలో నిలిచాయి.