Sukanya
-
అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన తెలంగాణ తేజం!
మహబూబాబాద్: ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన ఆసియా, ఆఫ్రికా పవర్‌లిఫ్టింగ్ అంతర్జాతీయ పోటీల్లో తెలంగాణ తేజం మెరిసింది. మహబూబాబాద్ జిల్లా ఉమ్మడి కురవి మండలం జగ్యా తండాకు చెందిన తేజావత్ సుకన్య సత్తా చాటింది.ఈనెల 3వ తేదీ నుంచి జరిగిన ఈ పోటీలో 76 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించి దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసింది. కాగా, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి తనకు సాయపడిన కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్‌కు, కోచ్ వీఎన్ రాజశేఖర్‌కు సుకన్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సుకన్య మాట్లాడుతూ తన జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని తెలిపారు.దేనికి ధైర్యం కోల్పోకుండా క్రీడల్లో రాణిస్తున్నానని తెలిపారు. ఇందులో భాగంగా పవర్ లిఫ్టింగ్లోనే కాకుండా వెయిట్‌లిఫ్టింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధించానన్నారు. ఇంకా పతకాలు సాధించి దేశానికి పేరు తీసుకొస్తానని తెలిపారు. -
కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడని.. భర్తను చంపిన భార్య
సంగారెడ్డి: కూతురితో అసభ్యంగా ప్రవర్తించిన భర్తను భార్య గొడ్డలితో నరికి చంపింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్‌లో బుధవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. సుల్తాన్‌పూర్‌కు చెందిన మన్నే మాణయ్య (45), ఇందిర దంపతులకు కూతురు సుకన్య ఉంది. ఏడాది కిందట సుకన్య భర్త చనిపోవడంతో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. మద్యానికి బానిసైన మాణయ్య ఇంట్లో ఉంటున్న కూతురిపై కన్నేశాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. బుధవారం అర్ధరాత్రి అతిగా మద్యం సేవించి భార్య, కూతురితో గొడవకు దిగాడు. గొడ్డలితో బెదిరిస్తూ కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడు. భార్య అడ్డుకున్నా వినలేదు. దీంతో మాణయ్య చేతిలో ఉన్న గొడ్డలిని లాక్కొని ఇందిర భర్తను నరికి చంపింది.ఘటన విషయం తెలుసుకున్న జోగిపేట సీఐ అనిల్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లీకూతురు ఇద్దరూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. -
ఆమె నా కూతురు కాదంటూ బాంబు పేల్చిన స్టార్ హీరోయిన్
సుకన్య.. ఒకప్పుడు తమిళంలో స్టార్ హీరోయిన్. తమిళంలోనే కాకుండా, మలయాళ, తెలుగు భాషల్లో అగ్ర హీరోలందరి సరసన కథానాయికగా నటించింది. ఒకప్పుడు ఎంతో ఫేమ్ అందుకున్న ఈ బ్యూటీ కొంతకాలంగా మాత్రం వెండితెరపై కనిపించడమే లేదు. అయితే, సుకన్య కూతురు అంటూ ఒక యువతి ఫోటో నెట్టంట వైరల్ అవుతుంది. పెళ్లి అయిన కొన్ని నెలలకే భర్తతో విడిపోయిన సుకన్యకు ఇంత పెద్ద కూతురు ఉందా అంటూ నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఈ అంశం గురించి సుకన్య రియాక్ట్ అయింది.కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో అనుకున్నట్లు ఆ అమ్మాయి తన కూతురు కాదని సుకన్య ఇలా చెప్పింది. 'నేను కూడా ఆ ఫోటో చూశాను. అది నా కూతురు కాదు. ఆమె నా చెల్లెలి కూతురు. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని చెప్పాను. అంతేకాదు, ఆమె నా సోదరి కుమార్తె అని కూడా పేర్కొన్నాను. కానీ అది నా కూతురిలా నెట్టింట వైరల్ అయింది. నా వివాహం అయిన కొన్ని నెలల్లోనే విడాకులతో ముగిసిన సంగతి అందరికీ తెలిసిందే. మేము కొన్ని నెలలు మాత్రమే కలిసి ఉన్నాము. ఆ తర్వాత కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాను. కానీ విడాకులు తీసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అయితే, ఫన్నీగా నా సోదరి కూతురు ఫోటోను షేర్ చేస్తూ నా కుమార్తె అంటూ ప్రచారం చేస్తున్నారు. నా చెల్లెలు కూతురు కూడా ఈ వార్త చూసి, పెద్దమ్మ వల్ల నాకు కూడా గుర్తింపు వచ్చిందని సంతోషంగా వాళ్ల ఇంట్లో చెబుతుంది.' అని సుకన్య తెలిపింది.1991లో ప్రముఖ దర్శకుడు భారతీరాజా దర్శకత్వం వహించిన 'పుదు నెల్లు పుదు నాత్తు' అనే తమిళ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి సుకన్య అడుగుపెట్టింది. అక్కడ మహానది, భారతీయుడు వంటి చిత్రాల్లో మెప్పించిన ఆమె తెలుగులో సాంబ, పెద్దరికం,మున్నా, శ్రీమంతుడు వంటి సినిమాల్లో మెప్పించింది. అయితే తనకు అవకాశాలు రాకనే సినిమాల్లో నటించడం లేదని ఆమె తెలిపింది. ఎవరైన మంచి ఛాన్స్‌లు ఇస్తే మళ్లీ నటిస్తానని సుకన్య పేర్కొంది. -
ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాల్లేక..
సుకన్య.. ఒకప్పుడు తమిళంలో స్టార్ హీరోయిన్. తమిళంలోనే కాకుండా, మలయాళ, తెలుగు భాషల్లో అగ్ర హీరోలందరి సరసన కథానాయికగా నటించింది. ఒకప్పుడు ఎంతో ఫేమ్ అందుకున్న ఈ బ్యూటీ కొంతకాలంగా మాత్రం వెండితెరపై కనిపించడమే లేదు. అప్పటి హీరోయిన్లంతా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. కానీ ఈ బ్యూటీ మాత్రం కనిపించకుండా పోయింది. ఎన్నో ఏళ్ల తర్వాత తమిళంలో ఒకే ఒక్క సినిమా చేసింది. ఆ తర్వాత ఆమె ఊసే లేదు. కెరీర్లో వెనుకబడిపోయిన ఆమె వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. శ్రీధర్ రాజగోపాలన్‌ను పెళ్లాడి అమెరికాలో సెటిలైన ఈ నటి ఏడాదికే(2003లో) అతడికి విడాకులిచ్చేయడం గమనార్హం. అయినా సరే తనకు ఇష్టమైన యాక్టింగ్‌ను విడిచిపెట్టలేదు. మళ్లీ సినిమాల్లో ట్రై చేసింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. కొన్ని టీవీ షోలలోనూ మెరిసింది. ప్రస్తుతం సినీ అవకాశాల్లేక ఓ సీరియల్లో నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నేను సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించలేదు. పలు భాషల్లో నటించి ఎన్నో అవార్డులను అందుకున్నాను. సినిమా వల్లే నాకంటూ గుర్తింపు వచ్చింది. నాకు అవకాశాలు రాకపోవడం వల్లే సినిమాలు చేయడం లేదు. ఎవరూ నన్ను పిలవడం లేదు. మంచి ఛాన్స్ వస్తే మళ్లీ మూవీస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను' అని సుకన్య చెప్పుకొచ్చింది. చదవండి: డేనియల్ బాలాజీ పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. సంపాదించిన డబ్బంతా ఏమైంది? -
శ్రీరాముని కోసం సీనియర్ నటి ప్రత్యేక గీతం..!
సీనియర్ నటి సుకన్య దక్షిణాది సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో కథానాయకిగా పలు చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నారు. ఇకపోతే సుకన్యలో నాట్య, సంగీత కళాకారిణి, గాయని, గీత రచయిత కూడా ఉన్నారనే విషయం చాలా మందికి తెలియదు. తాజాగా నటి సుకన్య శ్రీరాముని కోసం ఓ భక్తి గీతాన్ని రూపొందించింది. అయోధ్య శ్రీరామచంద్రుని ఆలయ నిర్మాణం సాకారమవుతున్న తరుణంలో ఈ విషయాన్ని ఆమె మీడియాకు వెల్లడించారు. ఈ ఆలయం నిర్మాణం ప్రారంభించిన సమయంలో తన ముఖంపై గీసుకున్న శ్రీరామ్ అనే చిత్రలేఖనం అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో విశేష ప్రాచుర్యం పొందిందన్నారు. తాజాగా 500 ఏళ్ల నాటి కల జనవరి 22న సాకారం కాబోతోన్న వేళ తాను రూపొందించిన జై శ్రీరామ్ భక్తిరస గీతాన్ని వీడియోగా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. శ్రీరామ నామ మహిమ, ఆయన పరాక్రమం, రామాయణం కథను ఆవిష్కరించే విధంగా తాను రూపందిస్తున్న జై శ్రీరామ్ ఆడియోను ఆ శ్రీరాముని ఆలయ నిర్మాణంలో భాగంగా సమర్పిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. -
50 ఏళ్ల వయసులో 'మళ్లీ పెళ్లి'.. సీనియర్ నటి క్లారిటీ
మిగతా వాళ్ల సంగతేమో గానీ సెలబ్రిటీలు ఏం చేసినా సరే అది వార్త అవుతూ ఉంటుంది. ఇక వాళ్లు రిలేషన్లో ఉన్నా, పెళ్లి చేసుకున్నా, విడాకులు ఇచ్చినా కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. అయితే పలు తెలుగు సినిమాల్లో తల్లి పాత్రలు చేస్తూ బిజీగా ఉన్న ఓ సీనియర్ నటి.. ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమైందనే న్యూస్ తెగ వైరల్ అయింది. పైన ఫొటోలో కనిపిస్తున్న నటి.. 'శ్రీమంతుడు' సినిమాలో మహేశ్‌కి తల్లిగా నటించింది. అయితే గతంలో ఈమె పలు తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. సహాయ పాత్రల్లోనూ మెప్పించింది. టాలీవుడ్లో పెద్దరికం, అమ్మకొడుకు, సాంబ, శ్రీ, మున్నా, అధినాయకుడు తదితర చిత్రాల్లో నటించింది. అయితే ఎక్కువగా మలయాళ మూవీస్‌తో ఫేమ్ తెచ్చుకుంది. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్) నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న టైంలోనే అంటే 2002లో సుకన్య.. శ్రీధరన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. ఏమైందో ఏమోగానీ ఏడాదిలోనే ఆయన్నుంచి విడిపోయి, తిరిగి స్వదేశానికి వచ్చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. సౌత్ సినిమాల్లో సహాయ పాత్రలు చేస్తూ, మరోవైపు డబ్బింగ్ ఆర్టిస్టుగానూ ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం సుకన్యకు 50 ఏళ్లు. అయితే ఈమె త్వరలో పెళ్లి చేసుకోనుందనే రూమర్ బయటకొచ్చింది. ఇది ఆ నోట ఈ నోట పడి.. ఆమె వరకు చేరుకుంది. దీంతో ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు విషయం బయటపెట్టింది. 'అలాంటి ఆలోచన నాకు లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలు.. అమ్మ అని పిలుస్తారా? అమ్మమ్మ అని పిలుస్తారా?' అని కౌంటర్స్ వేసింది. దీంతో ఈమె పెళ్లి కేవలం పుకారు మాత్రమే అని తేలిపోయింది. (ఇదీ చదవండి: 'చంద్రా’లు దిద్దిన కాపురం.. స్కెచ్ మాములుగా లేదు!) -
కుమార్తె ప్రేమవివాహం.. ఆటోతో ఢీకొట్టి.. చనిపోయాడనుకొని..
సాక్షి, కర్నూలు(పెద్దకడబూరు): ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకునిపై అమ్మాయి తండ్రి, బంధువులు కొడవళ్లు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని హెచ్.మురవణి నాలుగవ మైలు రాయి వద్ద గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసలు, బాధితురాలు తెలిపిన వివరాలు.. హెచ్.మురవణి గ్రామానికి చెందిన ఉసేని కూతురు సుకన్య(24) గత ఏడాది డిసెంబర్లో కాంట్రాక్ట్ పద్ధతిన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీహెచ్ఓ(కమ్మునిటీ హెల్త్ ఆఫీసర్)గా విధుల్లో చేరారు. అదే గ్రామానికి చెందిన పెద్ద ఈరన్న కుమారుడు వీరేష్(28)ను ఫిబ్రవరిలో ప్రేమ వివాహం చేసుకుంది. ప్రేమ వివాహం అమ్మా యి తల్లిదండ్రులకు నచ్చకపోవడంతో ఎమ్మిగనూరు పట్టణంలో వేరు కాపురం పెట్టారు. వీరేష్ తన భార్యను రోజూ ఉదయం ద్విచక్ర వాహనంపై హెచ్.మురవణికి వెళ్లి డ్యూటీకి వదిలిపెట్టి సాయంత్రం తీసుకొని వచ్చేవాడు. అందులో భాగంగా గురువారం సాయంత్రం తన భార్యను బైక్‌పై తీసుకొస్తుండగా అమ్మాయి తండ్రి ఉసేని, వారి బంధువులు ఆటోతో హెచ్.మురవణి నాలుగవ మైలురాయి వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. ఇద్దరూ కింద పడిపోవడంతో వీరేష్‌పై విచక్షణ రహితంగా దాడిచేసి చనిపోయాడని భావించి అక్కడి నుంచి పారిపోయారు. సుకన్య భయంతో పరుగులు తీసింది. ఎమ్మిగనూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు చెప్పింది. రహదారిలో వెళ్తున్న కొందరు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేయడంతో పాటు చికిత్స నిమిత్తం వీరేష్‌ను ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. భార్య సుకన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
‘బయల్దేరుదామా రజతి’ అంటుంది 34 ఏళ్ల సుకన్య డ్యూటీ ఎక్కబోతూ...
అలుపెరగని కెరటాలు. ఆహ్లాదానికి వచ్చే జనాలు. ఉత్సాహం శృతి మించితే ప్రాణానికే ప్రమాదం. అదుపు చేయాలి పిల్లల్ని పెద్దల్ని. చెన్నై మెరీనా బీచ్ ప్రతి ఉదయం సాయంత్రం జన సముద్రం. వారు ప్రమాదాల బారిన పడకుండా అశ్వదళం నిత్యం గస్తీ కాస్తుంటుంది. వారిలో ఐదుగురు మహిళా పోలీసులు ఉన్నారు. అశ్వాన్ని అధిరోహించి ఈ చివర నుంచి ఆ చివరకు కెరటాల మీద రేఖ గీస్తుంటారు. మగ పోలీసుల మాట కంటే ఈ మహిళా పోలీసుల మాటే జనం ఎక్కువగా వింటారు. జీను మీద కూచుని వీరు సాగించే సవారీ కష్టమైనది. స్ఫూర్తిదాయకమైనది. వారి పరిచయం. ‘బయల్దేరుదామా రజతి’ అంటుంది 34 ఏళ్ల సుకన్య డ్యూటీ ఎక్కబోతూ. 12 ఏళ్లుగా అశ్వదళంలో పని చేస్తున్న సుకన్యకు ప్రియమైన అశ్వం రజతి. డ్యూటీ వాళ్లిద్దరూ కలిసి చేయాలి. ఒకరు లేకుండా మరొకరికి డ్యూటీ అసంపూర్ణం. ‘గ్రేటర్ చెన్నై మౌంటెడ్ బ్రాంచ్’ (అశ్వదళం)లో ఇప్పుడు 26 అశ్వాలు ఉన్నాయి. వాటితో డ్యూటీ చేస్తున్న సిబ్బంది సంఖ్య 30. వారిలో ఐదుగురు మహిళా పోలీసులు. వీరి శాఖ పుదుపేటలో ఉంటుంది. వీరి ప్రధాన డ్యూటీ మెరీనా బీచ్‌ను కాపు కాయడమే. పోకిరీల నుంచి కాపాడాలి బంగాళాఖాతంలో అలల తాకిడి ఎక్కువ. విహారానికి వచ్చినవారు అత్యుత్సాహంతో లోపలికి వెళితే ప్రాణాలకు ప్రమాదం. అందుకని సుకన్య, ఇతర గస్తీ సిబ్బంది అలల్లో తడుస్తూనే తిరుగుతూ సందర్శకులను తీరం వైపు తరుముతుంటారు. ‘అది ఒక్కటే కాదు... అమ్మాయిలను వేధించే పోకిరీల నుంచి, చైన్ స్నాచర్ల నుంచి, పార్కింగ్ దగ్గర వాహనాలు ఎత్తుకెళ్లే దొంగల నుంచి కూడా జనాన్ని కాపాడాలి. అలాగే తప్పిపోయిన పిల్లలను వెతికి పెట్టాలి. ఒక్కోసారి జనం తాకిడి ఎక్కువైతే చాలామంది పిల్లలు తప్పిపోతూ ఉంటారు’ అంటుంది సుకన్య. ‘నేను మామూలు లాఠీ పట్టుకుని నేల మీద యూనిఫామ్‌తో నడుస్తూ వస్తే ఏ పోకిరీ మాట వినడు. అదే గుర్రం మీద వస్తే ఆ కథే వేరు. పరిగెడతారు’ అంటుంది నవ్వుతూ. ప్రమాదాలు ఉంటాయి అయితే ఈ ఉద్యోగం అంత సామాన్యం కాదు. మన మూడ్ బాగలేకపోతే గుర్రం గ్రహిస్తుంది. అలాగే గుర్రం మూడ్ పాడైతే మనం గ్రహించాలి. ఈ రెంటి మధ్య సమన్వయం లేకపోతే ప్రమాదం. ‘ఒకసారి న్యూ ఇయర్ నైట్ జనం విపరీతంగా వచ్చారు బీచ్‌కి. గుర్రం బెదిరి భయంకరంగా పరిగెత్తింది. దాని మీద ఉన్న నా గుండెలు అవిసిపోయాయి. అది ఎక్కడ ఆగుతుందో చెప్పలేము. అది ఆగాక ఒక్కసారిగా గెంతి, దాని మెడ నిమిరి అదుపులోకి తెచ్చాను’ అంటుంది సుకన్య. ఆమెతో పని చేసే జాస్మిన్ అనే కానిస్టేబుల్‌ను అయితే గుర్రం అలల్లోకి విసిరికొట్టింది. మణికట్టు విరిగితే ఆరునెలలక్కానీ మళ్లీ కళ్లేలు పట్టుకోవడం వీలు కాలేదు. మొత్తం ఐదుమంది ఇప్పుడు అశ్వదళంలో సుకన్య, జాస్మిన్, మాళవిక, పునీత, మహలక్ష్మి పని చేస్తున్నారు. సుకన్య, జాస్మిన్ సీనియర్లు అయితే మిగిలిన ముగ్గురూ జూనియర్లు. వీరంతా తమ తమ గుర్రాల మంచి చెడ్డలను కూడా చూసుకోవాల్సి ఉంటుంది. వీటికి ప్రతి రోజూ ఆహారం అందించాలి. అందుకు ఒక్కో గుర్రానికి 600 రూపాయలు ఖర్చుపెడుతోంది పోలీస్ శాఖ. గుర్రాలకు స్నానం చేయించడం, మసాజ్, గారం చేయడం ఇవన్నీ చేస్తేనే అవి స్నేహాన్ని పాటిస్తాయి. ‘మేమందరం డ్యూటీ దిగాక గుర్రాలను కాసేపు బుజ్జగించి ఇళ్లకు వెళతాం’ అంటుంది సుకన్య. ఈ గుర్రాలను ఉత్తర ప్రదేశ్ సహరన్పూర్ నుంచి, తమిళనాడు చెట్టినాడ్ నుంచి కొని తెస్తూ ఉంటారు. వీటి కోసంగా ఊటీ నుంచి రోజూ ప్రత్యేకం క్యారట్, గడ్డీ వస్తుంటుంది. పశువైద్యులు చెకప్‌లు నిర్వహిస్తారు. ‘నగరంలో కాసింత ఊపిరి పీల్చుకోవడానికి స్త్రీలు చాలామంది బీచ్‌కు వస్తారు. వాళ్లకు మమ్మల్ని చూస్తే ధైర్యం. డ్యూటీ తృప్తిగా చేయడానికి ఇంతకు మించి కారణం ఏముంది’ అంటారు మెరీనా ధీరలు. ఈసారి చెన్నై వెళితే వారిని చూడండి. సూపర్ సుకన్య కోయంబత్తూరుకు చెందిన సుకన్య అంతవరకూ మగవాళ్లు మాత్రమే పని చేసే అశ్వదళంలో మొదటిసారిగా చేరింది. ‘నేను సినిమాల్లోనే గుర్రాలు చూశాను అప్పటి వరకూ’ అంటుంది సుకన్య. కాని రెండు మూడు నెలల్లోనే ట్రైనింగ్‌లో సుకన్య గుర్రాన్ని ఎలా అదుపులోకి తెచ్చుకోవాలో నేర్చుకుంది. మూడేళ్ల క్రితం వరకూ కూడా మొత్తం అశ్వదళంలో ఆమె ఒక్కర్తే మహిళా పోలీస్. ‘మా ఇంట్లో వాళ్లు మొదట్లో ఈ ఉద్యోగానికి ఒప్పుకోలేదు. ఆడపిల్ల గుర్రం ఎక్కి గస్తీ కాయడం ఏంటి అని ఇప్పటికీ మా అమ్మానాన్నలు అనుకుంటారు. కాని నాకు ఈ ఉద్యోగమే ఇష్టం’ అంటుంది సుకన్య. ఉదయం నాలుగున్నరకు డ్యూటీ మొదలవుతుంది ఆమెది. గుర్రం ఎక్కి మెరీనా బీచ్‌లో వాకింగ్‌కి, విహారానికి, స్నానానికి వచ్చేవారిని అదుపు చేయాలి. వారిని కాపాడాలి. మెరీనా బీచ్ సుదీర్ఘమైన బీచ్. అందుకని గుర్రాలు గస్తీకి బాగా ఉపయోగపడతాయి. అశ్వదళం బ్రిటిష్ హయాం నుంచి ఉన్నా 1926 నుంచి మెరీనా బీచ్ గస్తీకి ఉపయోగిస్తున్నారు. కాని 2011 వరకూ మహిళలు ఎవరూ అందులో చేరలేదు. సుకన్యదే ఆ రికార్డు. ఉదయం 8 వరకూ డ్యూటీ ముగించుకుని మళ్లీ సాయంత్రం 4 గంటలకు గుర్రం ఎక్కుతుంది సుకన్య. 7 గంటల వరకూ డ్యూటీ చేస్తుంది. మొత్తం మీద గుర్రంతో ఆమె రోజూ ఆరు నుంచి ఏడు గంటల పాటు తీరంలో తిరుగుతుంది. -
నంది వనపర్తి : ఉద్రిక్తతల మధ్య రోడ్డు విస్తరణ పనులు
-
పండిట్ రవిశంకర్ (1920–2020) శత వసంతం
కరోనా రాకుండా ఉండివుంటే ప్రపంచానికిది రాగాల రుతువు. స్ప్రింగ్ సీజన్. వసంతం. పువ్వులదొక రాగం. గువ్వలదొక రాగం. పచ్చని ప్రకృతి మువ్వలదొక రాగం. ఈ రాగాలన్నిటితో పండిట్ రవిశంకర్ ‘స్మృతి సితార’ కూడా శృతి కలిపి ఉండేది. ఈరోజు పండిట్ జీ నూరవ జయంతి. ఆయన్ని కృతిస్తూ ఆయన భార్య, కూతురు శత సితార్ మహోత్సవాన్ని ప్లాన్ చేశారు. అయితే లాక్‌డౌన్‌తో అదిప్పుడు ఆగిపోయింది! సంగీతానికి ఒక దేశపు పౌరసత్వం అంటూ ఉంటుందా? అలాగే రవిశంకర్, ఆయన సంతానం! ప్రస్తుతం రవిశంకర్ భార్య సుకన్య, కూతురు అనౌష్క లండన్‌లో ఉన్నారు. ఉండటం కాదు, కరోరా కారణంగా అక్కడి తమ సొంత ఇంట్లో వారు చిక్కుకుపోయారు. వాళ్లతో పాటు రవిశంకర్‌కు ఎంతో ఇష్టమైన ఆయన సితార్ కూడా! కోల్‌కతాలో వాద్యపరికరాల తయారీకి ప్రసిద్ధులైన కన్హాయీలాల్.. రవిశంకర్ కోసం ప్రత్యేకంగా మలిచి ఇచ్చిన సితార్ అది. దానిపై ఇష్టంగా వేళ్లు కదుపుతుండేవారు రవిశంకర్. కరోపా వ్యాప్తికి ముందు లండన్‌లో జరిగిన సంగీత ప్రదర్శనకు ఆ సితార్తోనే వెళ్లారు అనౌష్క. ఇప్పుడు ఇంటి నుంచి కాలు కదపలేని స్థితిలో తండ్రి శతజయంతి స్మృతి గీతికలను ఉన్నచోటు నుంచే వేళ్లతో ఆలపించి, విశ్వాన్ని సమ్మోహనపరచడానికి ఆ సితారే ఆమెకొక దారి చూపించింది. ఇంటి నుంచే..! ఘనమైన సంగీతకారునికి ఘనమైన నివాళి ఇవ్వాలని తల్లీకూతుళ్లిద్దరూ కలిసి కూర్చొని ఇన్ని నెలలుగా వేసుకున్న ప్రణాళికలన్నీ పుస్తకంలో నోట్ చేసుకున్న గమకాల్లా మిగిలి, ఆయన జయంతి రోజు ఇంట్లో చేయబోతున్న చిన్న పూజా కార్యక్రమమే ఇప్పుడు పెద్ద మహోత్సవంగా మిగలబోతోంది. పూజ తర్వాత హిందూస్థానీ సంగీతంలో అనౌష్క పలికించే స్వరాలు ఆన్లైన్లో మాత్రమే ఆమె తండ్రి అభిమానులను ఓలలాడించబోతున్నాయి. అనౌష్క కూడా తండ్రిలాగే సితార్ విద్వాసురాలు. సుకన్య ఆ తండ్రీకూతుళ్ల సంగీతానికి ఒక పిపాసి మాత్రమే. రవిశంకర్ తొలిచూపుతో సుకన్యకు ఏర్పడిన ఆత్మబంధం.. ఆ చూపులోంచి ప్రవహించి హృదయాన్ని సోకిన సంగీతం వల్లనే. భర్త శత జయంతి రోజున భర్తతో తనకున్న అనుబంధాన్ని పంచుకోడానికి ఆమె దగ్గర జలధి తరంగాల్లా ఎన్నటికీ తరగని అంతరంగ భావావేశాలు ఎన్నో ఉన్నాయి. అయితే వాటికి మాత్రం ఆన్లైన్ వేదిక కాకూడదని సుకన్య భావిస్తున్నారు. అంటే ఒక పెద్ద పుస్తకాన్నే ఆమె త్వరలో రాయడం ప్రారంభించబోతున్నారని. పెళ్లిక్కడే జరిగింది హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్లోనే సుకన్య, రవిశంకర్ల పెళ్లి జరిగింది. 1989లో. అప్పటికి ఆయన వయసు 69. ఆమె వయసు 35. అనౌష్క వయసు 8 ఏళ్లు. డెబ్బైల నుంచీ రవిశంకర్‌తో సుకన్యకు పరిచయం. ఆ పరిచయం ప్రేమ అయి, ఆ ప్రేమ.. బంధంగా మారి, అనౌష్క పుట్టిన ఎనిమిదేళ్లకు.. పెళ్లితో వాళ్లిద్దరూ ఆలూమగలు, అనురాగాల సరిగమలు అయ్యారు. అన్నపూర్ణాదేవి (మొదటి భార్య), కమలాశాస్త్రి (సన్నిహిత), సూజోన్స్ (సహజీవన సహచరి).. ఒక్కొక్కరు ఒక్కో సంగీతిక అయితే.. సుకన్య ఒక స్వరసమ్మేళనం రవిశంకర్ జీవితానికి. 1920 ఏప్రిల్ 7న బెనారస్లోని పుట్టారు పండిట్ జీ. బెంగాలీ కుటుంబం. హిందూస్తానీ సితార్ విద్వాంసుడిగా గుర్తింపు పొందారు. ఆలిండియా రేడియోలో మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేశారు. విదేశాల్లో కచేరీలు ఇచ్చారు. ఈ బ్రాహ్మలబ్బాయి మొదటి భార్య ఒక ముస్లిం! పేరు రోషనారా ఖాన్. అన్నపూర్ణాదేవిగా ఆయనే ఆమె పేరు మార్చుకున్నారు. ఆయన సంగీతం ఆయనకు పేరుతో పాటు అనేక మంది సంగీతప్రియులను, ప్రియురాళ్లనూ ఇచ్చింది. మనదేశం ‘భారతరత్న’ ఇచ్చింది. 2012లో కాలిఫోర్నియాలో ఉండగా 92 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు పండిట్ జీ. నేటికీ జీవించి ఉండుంటే ఈ ఏడాదికి నూరేళ్ల వయసులో ఉండేవారు. సుకన్య, ఇద్దరు మనవళ్లు జుబిన్, మోహన్, అనౌష్క అంతా కలిసి లండన్‌లో ఉంటున్నప్పటికీ తరచు లండన్–ఢిల్లీ–కోల్‌కతా మధ్య ప్రయాణాలు సాగిస్తుంటారు. అనౌష్క భర్త జో రైట్ ఆమె జీవితంలో ఒక తెగిపోయిన తీగ. బ్రిటిష్ డైరెక్టర్ ఆయన. రెండేళ్ల క్రితమే విడిపోయారు. రవిశంకర్, స్యూ జోన్స్‌ల కుమార్తె నోరా జోన్స్ యు.ఎస్.లో ఉంటున్నారు. ‘‘పండిట్ రవిశంకర్ జీవించి ఉంటే ఈ కరోనా పరిస్థితులకు ఎలా స్పందించి ఉండేవారు’’ అనే ప్రశ్నకు సుకన్య చెప్పిన సమాధానంలో కూడా ఆమె హృదయంలో ఆయనకెంత ఘనమైన స్థానం ఉందో వెల్లడించే విధంగా ఉంది. ‘‘ప్రతిదీ జీవితంలో భాగమే. ఇదీ ఎన్నాళ్లో ఉండదు. సాగిపోతుంది అనేవారు నవ్వేస్తూ’’ అన్నారు సుకన్య ఒక ఇంటర్వ్యూలో. రవిశంకర్ భార్య సుకన్య (66), కూతురు అనౌష్క (38) -
భార్యభర్తలుగా మారిన ఇద్దరు మహిళలు
చెన్నై , అన్నానగర్ : మధురై సమీపంలో ఓ యువతి తన స్నేహితురాలిని వివాహం చేసుకుంది. వీరిద్దరూ దంపతులుగా మారి గురువారం రామనాథపురం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వద్ద తమ సమస్యను విన్నవించుకున్నారు. మధురైకి చెందిన నవ దంపతులు జాయ్సన్ జ్యోష్వా, సుకన్య జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. కాగా సుకన్యకు ముందే వివాహం అయింది. అయినప్పటికీ వీరిద్దరు వివాహబంధంతో ఒకటయ్యారు. ఈ సందర్భంగా సుకన్య మాట్లాడుతూ..‘‘నేను, బ్యూలా పాఠశాలలో చదువుతున్నప్పుడే బెస్ట్ ఫ్రెండ్స్. కాలక్రమంలో ఇద్దరు కలసి జీవించాలని వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యాం. మా ఇంట్లోవారు తీవ్రంగా వ్యతిరేకించి ఇద్దరినీ విడదీశారు. 2012లో నన్ను రామనాథపురానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అనంతరం నాకు ఓ ఆడ బిడ్డ పుట్టింది. ఈ స్థితిలో నా భర్త ప్రమాదంలో తీవ్రగాయాలు పాలై అనారోగ్యంతో బాధపడుతున్న విషయం నన్ను బాధించింది. దీంతో విరక్తి చెందిన నేను నా పాత స్నేహితురాలైన బ్యూలాని కలుసుకుని నా పరిస్థితిని వివరించాను. తరువాత ఇద్దరు మళ్లీ కలసి జీవించాలని సిద్ధమయ్యాం. ఇందుకోసం మూడు నెలలకు ముందు బ్యూలా పుదువైకి వెళ్లి ఆపరేషన్ చేయించుకుంది. తరువాత ఆమె పురుషుడిలా మారి జాయ్సన్ జ్యోష్వా అని పేరు మార్చుకున్నాడు. తరువాత మధురైలో ఉన్న ప్రైవేట్ షాపింగ్ మాల్లో నేను, జాయ్సన్ సెక్యూరిటీగా పని చేస్తున్నాం. మేము భార్యభర్తలుగా సంతోషంగా కాపురం చేస్తున్నాం. అయితే నా బిడ్డని నేనే పెంచుకుంటా. నా మొదటి భర్త దగ్గర నుంచి నా బిడ్డను ఇప్పించాలని వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. మమ్మల్ని కొందరు విడదీయాలని చూసినా కాలం మమ్మల్ని కలిపింది. నా ఆరేళ్ల కుమార్తె నాకు కావాలి. ఆమెని మేము బాగా పెంచుతాం’ అని సుకన్య తెలిపింది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు కోర్టుకు వెళ్లి చట్టం ప్రకారం బిడ్డను పొందాలని పోలీసులు సూచించారు. -
వీడియో వైరల్ : మద్యం మత్తులో సినీతారల డ్యాన్స్ !
సాక్షి, చెన్నై : తమిళ ప్రముఖ సినీతారల వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఖుష్బూ సుందర్, సుకన్యలు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. చెన్నైలోని సవేరా హోటల్లో విందు సందర్భంగా ప్రముఖ హిందీ సాంగ్ 'పియా తూ అబ్ తొ ఆజా' ప్లే చేశారు. సాంగ్‌కి తగ్గట్టుగా ఖుష్బూ అద్భుతమైన స్టెప్పులు వేశారు. తర్వాత సుకన్య కూడా ఖుష్బూ స్టెప్పులకు ఏమాత్రం తీసిపోకుండా డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఈ ఇద్దరు సీనియర్ నటీమణుల వయసు పెరిగినా స్టెప్పుల్లో ఏమాత్రం గ్రేస్ తగ్గనట్లు కనిపించింది. ఖుష్బూ, సుకన్యలు డ్యాన్స్ వేస్తుంటే పక్కనే ప్రముఖ నటుడు మనోబాల కూడా ఉన్నారు. అయితే మద్యం మత్తులో ఖుష్బూ, సుకన్యలు చిందేశారంటూ సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఖుష్బూ ఇటీవలే విడుదలైన తెలుగు చిత్రం అజ్ఞాతవాసిలో నటించిన విషయం తెలిసిందే. 200లకు పైగా చిత్రాల్లో నటించిన ఖుష్బూ తమిళ రాజకీయాల్లో కూడా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఖుష్బూ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
మద్యం మత్తులో సినీతారల డ్యాన్స్ వీడియో హల్ చల్
-
సుకన్యకు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన టి. సుకన్య జాతీయ జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో మెరిసింది. ఆంధ్రప్రదేశ్‌లోని కేతనకొండలో జరిగిన ఈ పోటీల్లో ఆమె బంగారు పతకాన్ని సాధించింది. మహిళల 75 కేజీ కేటగిరీలో పోటీపడిన ఆమె... స్నాచ్‌లో 50 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 75 కేజీల బరువెత్తింది. తాజా ప్రదర్శనతో ఆమె భారత జాతీయ శిబిరానికి ఎంపికై ంది. టీమ్ చాంపియన్‌షిప్‌లో జూనియర్ బాలికల కేటగిరీలో ఏపీ, యూత్ బాలికల విభాగంలో తెలంగాణ జట్లు రెండో స్థానంలో నిలిచాయి. -
రోడ్డు ప్రమాదంలో ఆరుకి చేరిన మృతుల సంఖ్య
మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో నిన్న ముగ్గురు మృతిచెందగా.. చికిత్స పొందుతూ ఈ రోజు మరో ముగ్గురు మృతిచెందారు. దీంతో ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. గుంటూరు జ్లిలా బొల్లపల్లి మండలం మేళ్లవాగు సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వినుకొండ వెళ్తున్న తార్ ట్యాంకర్ ఎదురుగా వస్తున్న ప్రయాణికుల ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జు నుజ్జై డ్రైవర్ నాగరాజు అక్కడికక్కడే మృతిచెందగా.. బచ్చమ్మ, సుభాన్‌బీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మరో ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. పత్తిపాటి సుకన్య(22), రామకోటమ్మ(65), రత్తమ్మ(48) వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతిచెందారు. మృతులంతా తమిడిపాడుకు చెందిన వారుగా గుర్తించారు. -
కాలేజీ పైనుంచి దూకి సుకన్య ఆత్మహత్య
హైదరాబాద్: ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. నగరంలోని కొంపల్లిలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలానికి చెందిన సిల్వేరు సుకన్య(16) కొంపల్లిలోని నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో బుధవారం ఆమె కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సుకన్య బలవన్మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. -
మహేశ్‌కి తల్లిగా...!
‘పెద్దరికం’ కథానాయిక సుకన్య గుర్తుండే ఉంటారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు కారెక్టర్‌గా నటిగా చేస్తున్నారు. రెండేళ్ల క్రితం ‘అధినాయకుడు’లో కూడా ఓ కీలక పాత్ర చేశారు. ప్రస్తుతం మహేశ్‌బాబు తల్లిగా నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ముందు ‘లగాన్’ ఫేం గ్రేసీ సింగ్‌ను ఈ పాత్రకు తీసుకున్నారనే వార్త ప్రచారమైంది. ఫైనల్‌గా సుకన్యను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆమె పాల్గొనగా కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. విశేషం ఏంటంటే.. ఈ చిత్రంలో ఆమె జగపతిబాబుకి భార్యగా నటిస్తున్నారు. ‘పెద్దరికం’లో అలరించిన ఈ జంట దాదాపు 22 ఏళ్ల తర్వాత మళ్లీ జతకట్టిన చిత్రం ఇది. ఇందులో మహేశ్ సరసన శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. -
ముక్కంటి సేవలో సినీనటి సుకన్య
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి దేవస్థానానికి శనివారం సినీనటి సుకన్య కుటుంబసభ్యులతో విచ్చేశారు. ఆమెకు ఆలయాధికారులు స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా దర్శించుకున్నారు. అనంతరం గురుదక్షిణామూర్తి వద్ద వేదపండితుల నుంచి ఆశీర్వచనం పొందారు. ఆలయాధికారులు దుశ్శాలువాతో సత్కరించి, స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని,తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ ఆవరణలో భక్తులు సుకన్యతో ఫోటోలు తీయించుకోవడానికి ఆసక్తి చూపారు. -
ఊరించి..ఉసూరుమనిపించారు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జెడ్పీ పీఠంపై లేనిపోని ఆశలు కల్పించారు. ‘మద్దతు ఇస్తే నువ్వే జెడ్పీ చైర్పర్సన్’ అని ఆ ముగ్గురు మహిళా జెడ్పీటీసీ సభ్యులకు హామీ ఇచ్చారు. తీరా డబ్బు, ఆధిపత్యం కోసం వారిని కాదని ఓర్వకల్లు జెడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్‌కు కట్టబెట్టారు. కొందరు నేతలు కలిసి పక్కా పథకంతో వెన్నుపోటు రాజకీయాలకు తెరలేపి ఇలా చేసినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఆలూరు అసెంబ్లీ టికెట్ ఆశించిన కప్పట్రాళ్ల బొజ్జమ్మకు జెడ్పీ పీఠం కట్టబెడతామని టీడీపీ అధినేత చంద్రబాబానాయుడే హామీ ఇచ్చారు. అందుకే ఆమె ఎంపీ, ఎమ్మెల్యే, ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేశారు. జెడ్పీటీసీ ఎన్నికలు ముగిసి చిప్పగిరి స్థానం నుంచి బొజ్జమ్మ గెలవడంతో జెడ్పీ చైర్పర్సన్ ఆమెకే నంటూ టీడీపీకి చెందిన ముఖ్యనాయకులు ప్రచారం చేశారు. ఆమెను హైదరాబాద్‌కు పిలిపించి మాట్లాడినట్లు సమాచారం. అయితే పదవి చేతికొచ్చే సమయంలో బొజ్జమ్మకు ఇచ్చిన హామీ అటకెక్కింది. కపట్రాళ్ల కుటుంబానికి వచ్చినట్లే వచ్చి చేజారటం ఇది రెండో సారి. గతంలో కపపట్రాళ్ల వెంకటప్పనాయుడుని జడ్పీ చైర్మన్ చేస్తామని చెప్పారు. అయితే అనూహ్యంగా బత్తిన వెంకట్రాముడుకి కట్టబెట్టారు. ఇలా ప్రతిసారీ కపపట్రాళ్ల కుటుంబానికి టీడీపీలో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆ పార్టీకి చెందిన కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డోన్, పత్తికొండ, ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో టీడీపీ బలోపేతానికి ఆ కుటుంబం కృషి చేసింది. అయితే కొందరు టీడీపీ నా యకులకు ఆ కుటుంబానికి అండగా నిల బడ్డారు. అయితే నేటికీ ఆ కుటుంబానికి టీడీపీలో పదవులు అందని ద్రాక్ష లా మారాయని కపట్రాళ్ల వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీఠం దక్కించుకునేందుకు మహిళలకు అన్యాయం... జిల్లా పరిషత్ పీఠానికి అసరమైన బలం టీడీపీకి లేకపోయినా అధికార బలంతో అడ్డదారిలో దక్కించుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శివానందరెడ్డి, మాజీ ఎంపీపీ విష్ణువర్థన్‌రెడ్డిని టీడీపీ నేతలు ఉపయోగించుకున్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన జెడ్పీటీసీ సభ్యులను ఈ నాయకులు బలవంతంగా టీడీపీలో చేర్పించారు. ఇష్టం లేకున్నా మభ్యపెట్టి క్యాంపులకు తీసుకెళ్లారు. అందులో నందికొట్కూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మీదేవి పేరు తెరపైకి తెచ్చారు. నందికొట్కూరు నియోజక వర్గానికి చెందిన వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యులంతా టీడీపీకి మద్దతు తెలిపితే లక్ష్మీదేవికి జెడ్పీ పీఠాన్ని కట్టబెడతామని హామీ ఇచ్చారు. అయితే పరిణామాలు అమెకు అనుకూలంగా లేవని తెలియటంతో తిరిగి వైఎస్సార్సీపీలోకి రావటానికి ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఆమెను తిరిగి పార్టీలోకి రాకుండా స్థానిక నాయకుడొకరు అడ్డుకున్నట్లు తెలిసింది. అదే విధంగా పత్తికొండ టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలు సుకన్యకు టీడీపీ నేతలు మాటిచ్చారు. దాదాపు సుకన్యనే జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థి అని టీడీపీ నేతలు నిర్ణయించారని ప్రచారం జరిగింది. లేనిపోని ఆశలు చూపి ఈ ఇద్దరు మహిళలకూ టీడీపీ నేతలు అన్యాయం చేశారని మహిళా లోకం మండిపడుతోంది. అదే విధంగా టీడీపీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేస్తున్న నాయకులను కాదని కేవలం పదవి కోసం టీడీపీలోకి వచ్చిన వ్యక్తికి జెడ్పీ పీఠాన్ని ఎలా కట్టబెడుతారని తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జెడ్పీ పీఠం చిచ్చు టీడీపీలో చాపకింద నీరులా అసంతృప్తి జ్వాలలు అంటుకున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. -
వరంగల్ బ్యూటిఫుల్ సిటీ..: హీరోయిన్ సుకన్య
డ్యాన్సర్ నుంచి సినీ రంగంలోకి వచ్చా.. ప్రజలకు మెసేజ్ ఇచ్చే సినిమాలకు ప్రాధాన్యం తెలుగులో నటించడం అంటే చాలా ఇష్టం ‘సాక్షి’తో హీరోయిన్ సుకన్య పోచమ్మమైదాన్ : ‘వరంగల్ ఈజ్.. బ్యూటిఫుల్ సిటీ.. ఇ క్కడి అందాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు.. ఈ జిల్లా ప్రజలు చూపించే ఆదారాభిమానాలు తాను ఎన్నడూ మరిచిపోనని..’ అని హీరోయిన్ సుకన్య అన్నారు. ప్రజలకు మం చి మేసేజ్ ఇచ్చే సినిమాలకే తాను ప్రాధాన్యమిస్తానని.. బాలీవుడ్ నేషన్బుక్ అంటే ఎంతో ఇష్టమని ఆమె చెప్పుకొచ్చారు. వరంగల్‌లో మంగళవారం జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సుకన్యను ‘సాక్షి’ పలకరించింది. ఈ సందర్భంగా చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే... వరంగల్ బాగా నచ్చింది... నేను వరంగల్‌కు రావడం ఇదే మొదటిసారి. ఇ క్కడికి వచ్చే ముందు నగరంలో చూడాల్సిన పర్యాటక స్థలాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు, దేవాలయాలను ఇంటర్నెట్లో పరిశీలించా ను. ఇందులో భాగంగా ఉదయం హన్మకొండలోని వేయిస్తంభాల గుడిలోని శివలింగాన్ని, వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నా. అయితే వేయిస్తంభాల గు డిని చూడగానే మొదట ఆశ్చర్యం కలిగింది. ఇన్ని రాళ్లతో ఆలయాన్ని ఇంతపెద్దగా ఎలా క ట్టకలిగారని గుడిలో ఉన్న అధికారులను అడిగాను. ఈ సం దర్భంగా వారు చెప్పిన వివరాలు తెలుసుకున్న తర్వాత అమేజింగ్ అనిపించింది. వేయిస్తంభా ల గుడికి వెళ్లిన అనంతరం భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నాను. అయితే ముందు ఆల యంలోకి అడుగిడగానే ఎంతో ప్రశాంతత ల భించింది. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి రావాలని అనిపించలేదు. కొద్ది సేపు కూర్చున్న తర్వాత అమ్మవారి చరిత్రను కూడా అడిగి తెలుసుకున్నాను. ఇక్కడికి వచ్చి న తనను ప్రజలు ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఇక నుంచి వరంగల్‌కు ఎప్పుడు వచ్చినా భద్రకాళి అమ్మవారిని తప్పక దర్శించుకుంటాను. తెలుగులో నాలుగు చిత్రాలు.. నాకు తెలుగు సినిమాల్లో నటించడం అంటే చాలా ఇష్టం. తెలుగులో ఇప్పటివరకు పెద్దరి కం, కెప్టెన్, అధినాయకుడు, మున్నా సిని మాల్లో నటించాను. తెలుగులో డబ్బింగ్ చేసిన భారతీయుడు సినిమా ద్వారా నాకు బాగా గుర్తింపు వచ్చింది. మున్నా సినిమా ద్వారా కూడా ఆదరణ లభించింది. సినీరంగంలో రాణించాలని... సినీ రంగంలో అన్ని విభాగాల్లో పనిచేయాలని నాకు ఇష్టం. అందుకే ప్రొడ్యూసర్‌గా కూడా మారుతున్నా. ప్రస్తుతం ‘తిరుపతి మహత్యం’ పై పాటల అల్బమ్‌ను తయారు చేశాను. అలా గే ఇటీవల ‘జడ్జిమెంట్’ అనే షార్ట్ ఫిల్మ్‌కు ని ర్మాతగా, డెరైక్టర్‌గా పనిచేశాను. ఈ సినిమాలో హీరోగా ప్రకాష్‌రాజ్‌ను పెట్టాను. దీనివల్ల నాకు మంచి గుర్తింపు వచ్చింది. మ్యూజిక్ డెరైక్టర్‌గా, లిరికిస్ట్‌గా కూడా చేయాలనేదే నా కోరిక. అది కూడా త్వరలో పూర్తి చేస్తా. బాలీవుడ్ నేషన్ బుక్ అంటే మక్కువ... సినీనటి జానకి కుమారుడు వంశీ జూలురి రూ పొందించిన ‘బాలివుడ్ నేషన్ బుక్’ అంటే ఇష్టం. ప్రతి షూటింగ్ దగ్గరకు బుక్‌ను తప్పకుండా తీసుకెళ్తాను. షూటింగ్లో సమయం దొరికినప్పుడల్లా బుక్‌ను చదువుతాను. స్థాయిని గుర్తుంచుకోవాలి... కొత్తగా సినీరంగంలోకి వచ్చే వారు కష్టపడితే భవిష్యత్ ఉంటుంది. కొంత స్టేజీకి వెళ్లిన తర్వాత మనం ఏ స్థాయి నుంచి వచ్చామనేది గుర్తుంచుకోవాలి. గోల్ పెట్టుకుని సినీ రంగం లో రాణించేందుకు కృషి చేయాలి. భరత నాట్యం అంటే ఇష్టం... చిన్నప్పటి నుంచి నాకు భరతనాట్యం అంటే చాలా ఇష్టం. చిన్నతనంలో పాఠశాలకు వెళ్తున్న సమయంలో డ్యాన్సర్ గా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. తర్వాత నటి గా రంగ ప్రవేశం చేశాను. తమిళంలో 1991లో ‘పొద్దునెల్లు.. పొద్దు నత్తు’ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు, కన్నడం, తమిళం, మళయాళం భాషల్లో నటించాను. తమిళంలో 44, మళయాళంలో 17, కన్నడంలో 2, తెలుగులో 4 చిత్రాలు నటించాను. తమిళంలో 1992 సంవత్సరంలో బెస్ట్ యాక్టర్‌గా అవార్డు వచ్చింది. అలాగే 5 ఫిలింఫేర్ అవార్డులు కూడా వచ్చాయి. మళయాళంలో ‘లైఫ్ పార్టనర్’ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. మెసేజ్ ఉన్న సినిమాల్లోనే నటిస్తా... ప్రజల్లోకి మంచి మెసేజ్ వెళ్లే సినిమాల్లోనే నటిస్తాను. ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో నటిస్తే ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంటాం. ప్రతి రోజు మహిళలపై అత్యాచారాలు, చైన్ స్నాచింగులు జరుగుతున్నాయి. వీటిని చూస్తే నాకు చాలా బాధ కలుగుతోంది. పత్రికల్లో ఇలాంటి వార్తలు చదివినప్పుడల్లా నా హృదయం ద్రవిస్తుంది. ‘సౌందర్య’ మంచి స్నేహితురాలు.. తెలుగు సినీనటి సౌందర్య అంటే నాకు ఎనలేని ఇష్టం. ఆమె ఆకస్మికంగా చనిపోవడం నన్ను చాలా బాధకు గురిచేసింది. సౌందర్య నాకు మంచి స్నేహితురాలు. అలాగే దివంగత ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు అంటే కూడా ఇష్టం. గతంలో వీరి సినిమాలు బాగా చూసే దాన్ని. వారి నటనకు హ్యాట్సాప్.