ముక్కంటి సేవలో సినీనటి సుకన్య
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి దేవస్థానానికి శనివారం సినీనటి సుకన్య కుటుంబసభ్యులతో విచ్చేశారు. ఆమెకు ఆలయాధికారులు స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా దర్శించుకున్నారు. అనంతరం గురుదక్షిణామూర్తి వద్ద వేదపండితుల నుంచి ఆశీర్వచనం పొందారు. ఆలయాధికారులు దుశ్శాలువాతో సత్కరించి, స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని,తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ ఆవరణలో భక్తులు సుకన్యతో ఫోటోలు తీయించుకోవడానికి ఆసక్తి చూపారు.