కాలేజీ పైనుంచి దూకి సుకన్య ఆత్మహత్య
హైదరాబాద్: ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. నగరంలోని కొంపల్లిలో బుధవారం ఈ ఘటన జరిగింది.
ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలానికి చెందిన సిల్వేరు సుకన్య(16) కొంపల్లిలోని నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో బుధవారం ఆమె కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సుకన్య బలవన్మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది.