inter student suicide
-
హాస్టల్లో ఉండటం ఇష్టం లేక.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
మేడ్చల్‌రూరల్: తనకు ఇష్టం లేకపోయినా హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారని మనస్తానికి గురైన ఇంటరీ్మడియెట్ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్ పట్టణంలో చోటుచేసుకుంది. మేడ్చల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్టణానికి చెందిన కోట్ల అవినాష్ (16)ను తల్లిదండ్రులు నగరంలోని కొంపల్లిలోని ఓ హాస్టల్లో ఉంచి పేట్ బషీరాబాద్‌లోని సెయింట్ ఆంటోని కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివిస్తున్నారు. సెలవు రోజుల్లో అవినాష్ మేడ్చల్ పట్టణంలోని కేఎల్ఆర్ కాలనీలో నివాసం ఉండే అక్క, బావ ఇంటికి వచ్చేవాడు. ఈ నేపథ్యంలో హాస్టల్లో ఉంటూ సదరు కళాశాలలో చదవడం తనకు ఇష్టం లేదని, తాను డే స్కాలర్స్‌గా చదువుకుంటానని అవినాష్ తల్లిదండ్రులకు చెప్పినా వారు కుమారుడి ఆవేదనను పట్టించుకునేవారు కాదు. ఇంటర్ పూర్తయ్యే వరకు హాస్టల్లో కొనసాగాలని తల్లిదండ్రులు సర్ది చెప్పేవారు. దీంతో మనస్తాపం చెందిన అవినాష్ ఇటీవల దీపావళి సెలవుల్లో మేడ్చల్‌లోని సోదరి ఇంటికి వచ్చాడు. శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న మేడ్చల్పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
నంద్యాల(బొమ్మలసత్రం): ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్థాపంతో నంద్యాల పట్టణానికి చెందిన వేమూరి రజిత(16) ఉరేసుకుని శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని కాళికాంబ దేవాలయం వీధిలో నివసిస్తున్న శ్రీనివాసులు, కుమారి దంపతులకు కుమార్తె రజిత, కుమారుడు మేఘనాథ్ సంతానం. శ్రీనివాసులు స్థానిక బైర్మల్ వీధిలో స్టీల్ సామన్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమార్తె స్థానిక ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ చదువుతోంది. శుక్రవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెలువడటంతో ఇంటర్నెట్లో చూసుకునేందుకు వెళ్లింది. అక్కడ తాను ఫెయిల్ అయినట్లు తెలియడంతో దిగాలుగా ఇంటికి వచ్చింది. తల్లి కుమారి బయటకు వెళ్లడంతో ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరేవేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రజిత తల్లి కొంత సేపటి తర్వాత ఇంటికి రాగానే కుమార్తె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని కిందకు దింపారు. అప్పటికే రజిత మృతి చెందడంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిపేందుకు శ్మశానవాటికకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం బేతంచెర్ల: నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని శంకరాపురం గ్రామానికి చెందిన విద్యార్థి మోడల్ స్కూల్లో సీఈసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో వంశీ ఒక సబ్జెక్టు ఫెయిలయ్యాడు. మనస్థాపం చెందిన విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు. బేతంచెర్లలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. -
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
కర్నూలు సిటీ: ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం నగర శివారులోని ఓ జూనియర్ కాలేజీలో చోటు చేసుకుంది. ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడకు చెందిన తోళ్ల షఫీవుల్లా, ఖాజాబీ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు తోళ్ల ఇర్ఫాన్ నగర శివారులోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ గ్రూప్ చదువుతున్నాడు. రోజూ ఉదయం 6.30 గంటలకు తరగతులకు వెళ్లేవాడు. అయితే శనివారం తన రూంమెట్స్ వెళ్లినా కూడా ఇర్ఫాన్ రూంలోనే ఉండిపోయాడు. సాయంత్రం 5గంటలకు తరగతులు ముగించుకొని రూంకి వెళ్లిన విద్యార్థులు తలుపులు కొట్టారు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో గట్టిగా తలుపులు తోయడంతో గదిలో పైకప్పుకు టవల్స్‌తో ఇర్ఫాన్ ఉరేసుకున్న విషయం గుర్తించారు. విషయం నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లగా కిందకు దించి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తాలుకా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇదిలాఉంటే ఇర్ఫాన్‌ను కొంత మంది క్లాస్‌మెట్స్, సీనియర్లు ఎగతాళిగా మాట్లాడడంతోనే మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఉరేసుకుందా.. గుండెపోటా?
వికారాబాద్: ఇంటర్ విద్యార్థిని మృతి అనుమానాస్పదంగా మారింది. ఉరేసుకుని మృతిచెందినట్లు గ్రామస్తులు చెబుతుండగా.. తమ బిడ్డ గుండె పోటుతో మృతిచెందిందని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని నాగారం గ్రామానికి చెందిన అపూర్వ (18) రంగారెడ్డి జిల్లా షాబాద్‌లోని ఓ గురుకుల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. వారం రోజుల క్రితం కంటి నొప్పితో హాస్టల్ నుంచి ఇంటికి వచ్చింది. తండ్రి బైండ్ల వెంకటయ్యకు ఫోన్ చేసిన ప్రిన్సిపల్ బాలికను పంపించాలని సూచించారు. దీంతో తల్లిదండ్రులు అపూర్వకు విషయం చెప్పి హాస్టల్‌కు వెళ్లమని సూచించారు. ఆమె మాత్రం రాఖీ పౌర్ణిమ తర్వాత వెళతానని చెప్పడంతో చిన్నపాటి వాగ్వాదం జరిగింది. మిన్నకుండిపోయిన తల్లిదండ్రులు ఎవరి పనులపై వారు వెళ్లిపోయారు. తమ్ముడు సైతం ఇంట్లో లేకపోవడంతో ఒంటరిగా ఉన్న అపూర్వ చీరతో ఫ్యా న్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లగా.. తమ కూతురు గుండెపో టు తో మృతి చెందిందని తల్లిదండ్రులు చెప్పారు. ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు నిరాకరించారు. -
బాచుపల్లిలో కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, మైదరాబాద్: బాచుపల్లి ఓ ప్రైవేట్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. బాలికల క్యాంపస్ హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం ఉదయం హాస్టల్ భవనం 5వ అంతస్తు నుంచి దూకి విద్యార్థిని వంశిక మృతి చెందింది. కామారెడ్డి జిల్లాకు చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వంశిక.. వారం రోజుల క్రితమే క్యాంపస్‌లో చేరినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ వద్దకు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వంశిక ఆత్మహత్య చేసుకుందా?. ప్రమాదవశాత్తు కింద పడి చనిపోయిందా? అన్నది స్పష్టత లేదు. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతికి గల కారణలపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: శిరీషది హత్యా.. ఆత్మహత్యా?.. తెలంగాణ డీజీపీకి మహిళా కమిషన్ ఆదేశం -
మమ్మీ.. డాడీ ఐయామ్ సారీ..
వరంగల్: ‘మమ్మి, డాడీ ఐయామ్ సారీ... నాకు ఎంబీబీఎస్ సీటు రాదెమోనని అనిపిస్తుంది’అని సూసైడ్ నోట్ రాసిన ఓ ఇంటర్ విద్యార్థి ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పీక్లాతండాజీపీ శివారు బోడగుట్టతండాలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం..తండాకు చెందిన గుగులోతు లచ్చు, జ్యోతి దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కుమారులున్నారు. పెద్దకుమారుడు కృష్ణ(19) ఏటూరునాగారంలోని ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీలో ఇంటరీ్మడియట్(బైపీసీ) చదివి, ఇటీవల పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు. ఎంబీబీఎస్ సీటు సాధించాలనే లక్ష్యం ఉన్న కృష్ణ, ఇంట్లో గోడలపై ఎంబీబీఎస్ నా డ్రిమ్ అంటూ రాసుకున్నాడు. ఈ మేరకు నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. ఈక్రమంలో తల్లి పంటచేను వద్దకు వెళ్లగా, తండ్రి కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మిర్చి అమ్మేందుకు వెళ్లాడు. తమ్ముడు ప్రభాకర్ పదవ తరగతి పరీక్ష రాసేందుకు కల్వల మోడల్ స్కూల్‌కి వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న కృష్ణ, తనకు ఎంబీబీఎస్ సీటు రాదెమోనని మనస్తాపం చెంది, ఐయామ్ సారీ మమ్మి, డాడీ అంటూ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని తాత ఇంట్లోకి వచ్చి చూడగా ఉరివేసుకుని కనిపించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఇంటికి చేరుకుని, కొడుకు మృతదేహంపై పడి కన్నీరుమున్నీరుగా విలపించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఇంటర్ విద్యార్థి సాత్విక్ సూసైడ్ కేసులో నలుగురు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ విద్యార్థి స్వాత్విక్ సూసైడ్ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. లెక్చరర్ ఆచార్య, వార్డెన్ నరేష్ సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని రాజేంద్రనగర్ మేజిస్ట్రేట్ ముందు నార్సింగి పోలీసులు హాజరుపరిచారు కాగా, నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి సాత్విక్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.. గత మంగళవారం రాత్రి క్లాస్ రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి తరలించేలోపే సాత్విక్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు తోటి విద్యార్థులు సైతం కాలేజీ ఒత్తిడి వల్లే సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ఆరోపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా, నార్సింగి శ్రీచైతన్య కాలేజీ హాస్టల్ నుంచి సాత్విక్ సామగ్రిని తీసుకుంటున్న సమయంలో అతడి డ్రెస్‌ల మధ్య సూసైడ్ నోట్ బయటపడింది. అందులో ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, అడ్మిన్ ప్రిన్సిపాల్ ఆచార్య, శోభన్, క్యాంపస్ ఇన్చార్జి నరేశ్‌ల వేధింపులు భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సాత్విక్ పేర్కొన్నాడు. తనతోపాటు తన మిత్రులకూ వారు నరకం చూపిస్తున్నారని, వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరాడు. చదవండి: సాత్విక్ సూసైడ్ నోట్.. నివ్వెరపోయే విషయాలు ‘‘అమ్మ, నాన్న, అన్న.. ఈ పనిచేస్తున్నందుకు నన్ను క్షమించండి. మిమ్మల్ని బాధపెట్టాలని కాదు. కాలేజీలో పెట్టే మెంటల్ టార్చర్, వాళ్లు చూపే నరకాన్ని భరించలేకనే ఈ చెడ్డ పని చేస్తున్నాను. మిస్ యూ. మీ అందరినీ బాధపెడుతున్నందుకు సారీ.. నన్ను క్షమించండి, నా కోసం మీరు బాధపడితే నా ఆత్మ శాంతించదు. మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. అమ్మా, నాన్నకు నేను లేనిలోటు రాకుండా చూసుకో అన్నా..’’అని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఆ లేఖ బాగా నలిగిపోయి ఉండటం చూస్తే.. కొన్ని రోజుల కిందే రాసిపెట్టుకున్నట్టు ఉందని సాత్విక్ స్నేహితులు చెప్తున్నారు. -
టార్చర్ తట్టుకోలేను.. వెళ్లిపోతున్నా..
ఒక్కసారి రా.. నాన్నా.. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి సాత్విక్.. కాలేజీలో వేధింపులు భరించలేక చనిపోదామనుకున్నాడు.. నాన్న చివరి చూపు.. అమ్మతో ఆఖరి మాటల కోసం తపించాడు. ‘జ్వరం వచ్చింది.. ఒక్కసారి రా నాన్నా..’ అని ఫోన్ చేసి తండ్రిని పిలిపించుకున్నాడు. ఆఖరి సారిగా అమ్మతో ఆప్యాయంగా మాట్లాడాడు. అంతకు ముందే ‘మిస్ యూ అన్నా.. నన్ను క్షమించు.. అమ్మానాన్నను బాగా చూసుకో’ అని సూసైడ్ నోట్ రాసి పెట్టాడు. తరగతి గదిలోనే ఉరివేసుకున్నాడు. కాలేజీలో పెట్టే నరకం భరించలేక... సూసైడ్ నోట్లో సాత్విక్ ఆవేదన బుధవారం సాయంత్రం నార్సింగి శ్రీచైతన్య కాలేజీ హాస్టల్ నుంచి సాత్విక్ సామగ్రిని తీసుకుంటున్న సమయంలో అతడి డ్రెస్‌ల మధ్య సూసైడ్ నోట్ బయటపడింది. అందులో ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, అడ్మిన్ ప్రిన్సిపాల్ ఆచార్య, శోభన్, క్యాంపస్ ఇన్చార్జి నరేశ్‌ల వేధింపులు భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సాత్విక్ పేర్కొన్నాడు. తనతోపాటు తన మిత్రులకూ వారు నరకం చూపిస్తున్నారని, వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరాడు. ‘‘అమ్మ, నాన్న, అన్న.. ఈ పనిచేస్తున్నందుకు నన్ను క్షమించండి. మిమ్మల్ని బాధపెట్టాలని కాదు. కాలేజీలో పెట్టే మెంటల్ టార్చర్, వాళ్లు చూపే నరకాన్ని భరించలేకనే ఈ చెడ్డ పని చేస్తున్నాను. మిస్ యూ. మీ అందరినీ బాధపెడుతున్నందుకు సారీ.. నన్ను క్షమించండి, నా కోసం మీరు బాధపడితే నా ఆత్మ శాంతించదు. మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. అమ్మా, నాన్నకు నేను లేనిలోటు రాకుండా చూసుకో అన్నా..’’అని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఆ లేఖ బాగా నలిగిపోయి ఉండటం చూస్తే.. కొన్ని రోజుల కిందే రాసిపెట్టుకున్నట్టు ఉందని సాత్విక్ స్నేహితులు చెప్తున్నారు. మణికొండ (హైదరాబాద్)/ షాద్‌నగర్: ‘సరిగా చదవడం లేదంటూ తిడుతున్నారు. మార్కులు రాకుంటే గేటు బయట వాచ్‌మన్‌గా కూడా పనికిరావని అవమానిస్తున్నారు. కాలేజీలో పెట్టే మెంటల్ టార్చర్‌ను, నరకాన్ని భరించలేక వెళ్లిపోతున్నాను..’’ అంటూ ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలేజీ అధ్యాపకులు, హాస్టల్ నిర్వాహకుల వేధింపులతో మనస్తాపం చెంది తరగతి గదిలోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. హైదరాబాద్ శివార్లలోని నార్సింగి శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అంతేకాదు హాస్టల్లో సాత్విక్ కనిపించడం లేదని చెప్పినా, ఉరివేసుకున్నట్టు తెలిసినా కాలేజీ సిబ్బంది పట్టించుకోలేదని తోటి విద్యార్థులు చెప్పారు. తామే మోసుకుంటూ కాలేజీ బయటికి మోసుకొచ్చి, ఓ వాహనదారుడిని లిఫ్ట్ అడిగి ఆస్పత్రికి తీసుకెళ్లామని.. కానీ అప్పటికే సాత్విక్ మరణించాడని తెలిపారు. బుధవారం విద్యార్థి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగటంతో ఈ ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థి సాత్విక్ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం చేశాక కుటుంబ సభ్యులు సాత్విక్ మృతదేహాన్ని షాద్‌నగర్‌లోని ఇంటికి తీసుకెళ్లారు. పరీక్షలు ఉన్నాయని ఆగి.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేటకు చెందిన నాగుల రాజు షాద్‌నగర్‌లో ఉంటూ మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు. వారిలో చిన్న కుమారుడు సాత్విక్ నార్సింగి శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్నాడు. శివరా>త్రి పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన సాత్విక్.. కాలేజీలో వేధింపుల గురించి తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే 15 రోజుల్లో పరీక్షలు ఉన్నాయని, ముగిసిన వెంటనే మరో కాలేజీలో చేర్పిస్తామని తండ్రి సర్దిచెప్పాడు. దీనితో సాత్విక్ నాలుగు రోజుల క్రితం హాస్టల్‌కు తిరిగొచ్చాడు. జ్వరం వచ్చిందంటూ సాత్విక్ ఫోన్ చేయడంతో.. తండ్రి రాజు మంగళవారం రాత్రి 8గంటల సమయంలో హాస్టల్‌కు వచ్చి మాట్లాడి, మందులు ఇచ్చి వెళ్లిపోయారు. హాస్టల్లో రాత్రి 10.30 గంటల వరకు స్టడీ అవర్ నిర్వహించారు. అందరి కంటే ముందుగా స్టడీ హాల్ నుంచి లేచిన సాత్విక్.. నేరుగా తరగతి గదికి వెళ్లి ఉరి వేసుకున్నాడు. సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నది ఈ గదిలోనే.. చెప్పినా పట్టించుకోని సిబ్బంది.. స్టడీ హాల్ నుంచి హాస్టల్ గదికి వచ్చాక సాత్విక్ రాలేదని గుర్తించి, సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా.. ‘అతడే వస్తాడు, మీరు పడుకోండి..’ అంటూ నిర్లక్ష్యం చేశారని తోటి విద్యార్థులు చెప్పారు. గట్టిగా అరవడంతో అర గంట తర్వాత గేట్ తీశారని, కాలేజీ అంతా వెతకగా సాత్విక్ ఓ తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించాడని వివరించారు. వెంటనే అతడిని కిందికి దింపామని.. ప్రాణాలతో ఉన్నట్టు కనిపించడంతో కాలేజీ బయటికి తామే మోసుకుంటూ వచ్చామని తెలిపారు. ఇది చూసి కూడా కాలేజీ సిబ్బంది పట్టించుకోలేదని.. పైగా ఎలాంటి శబ్దం చేయకుండా తీసుకెళ్లా్లని చెప్పారని వాపోయారు. దీంతో తాము సాత్విక్‌ను మెయిన్ రోడ్డు వరకు మోసుకుంటూ వచ్చి, ఓ వాహనదారుడ్ని లిఫ్ట్ అడిగి సమీపంలోని నర్సింగ్ హోంకు తరలించామని.. కానీ అప్పటికే సాత్విక్ చనిపోయాడని డాక్టర్ చెప్పారన్నారు. ఇంటికి వచ్చిన అరగంటలోపే.. నాగుల రాజు తన కుమారుడికి మందులు ఇచ్చి సుమారు రాత్రి 10 గంటల సమయంలో షాద్‌నగర్‌లోని ఇంటికి చేరుకున్నాడు. తర్వాత అర గంట సేపటికి సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని ఫోన్ వచ్చింది. దీనితో కుటుంబమంతా హతాశులయ్యారు. సాత్విక్ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని, కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. సాత్విక్ తల్లితండ్రులు, బంధువులు, స్నేహితులతోపాటు విద్యార్థి సంఘాల నేతలు కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మృతుడి తల్లి అలివేలు, అన్న మిథున్లు పోలీసుల కాళ్లు పట్టుకుని, నిందితులను శిక్షించాలంటూ వేడుకున్న తీరు కలచి వేసింది. సమగ్ర విచారణకు మంత్రి సబిత ఆదేశం సాత్విక్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఆత్మహత్యకు కారణాలు తెలుసుకోవాలని, త్వరగా విచారణ నివేదిక ఇవ్వాలన్నారు. అవమానించడంతోనే.. ఎక్కువ మార్కులు రాకపోతే కాలేజీ గేటు ముందు వాచ్‌మన్‌గా కూడా పనికిరారని, ర్యాంకు వచ్చేలా చదవాలని కాలేజీ అడ్మిన్ ప్రిన్సిపాల్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్లు వేధించడంతోనే సాత్విక్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నా కుమారుడి చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి. – అలివేలు, సాత్విక్ తల్లి రోదిస్తున్న సాత్విక్ తల్లి, సోదరుడు చదువు ఒత్తిడి ఇలా చేస్తుందనుకోలేదు సాత్విక్‌కు కాలేజీలో ఎదురవుతున్న ఇబ్బందులను నాకు చెప్పాడు. దీనిపై కాలేజీ వారితో మాట్లాడుతానని సర్దిచెప్పాను. ఇంతగా తట్టుకోలేని పరిస్థితి ఉందని చెప్పి ఉంటే ఇంటికి తీసుకెళ్లే వాడిని. కాలేజీ నిర్వాహకులు ఫీజులు, ర్యాంకులు తప్ప విద్యార్థుల మనోభావాలతో పనిలేకుండా వ్యవహరిస్తున్నారు. కానీ చదువే ఇలా చావు వరకు తెస్తుందని ఊహించలేకపోయాం. – నాగుల రాజు, సాత్విక్ తండ్రి చదవడం లేదని రక్తం వచ్చేలా కొట్టారు గతంలో సరిగా చదవడం లేదం టూ నన్ను ముక్కుమీద గుద్దితే రక్తం వచ్చింది. కనికరం కూడా లేకుండా నాతోనే రక్తాన్ని కడిగించారు. షాద్‌నగర్ నుంచి వచ్చి చదువుకుంటున్న మా ఐదుగురు ఫ్రెండ్స్‌ను గాలి బ్యాచ్ అని హేళన చేసేవారు. కాలేజీ గేటు వద్ద వాచ్మన్లుగా కూడా పనికిరా రంటూ అవమానపర్చేవారు. – ప్రదీప్, తోటి విద్యార్థి వేధిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు కాలేజీలో విద్యార్థులను ఉపాధ్యాయులు వేధిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరం. దీనికి కారణమైన ముగ్గురు సిబ్బంది పోలీసుల అదుపులో ఉన్నారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేస్తాం. విద్యాసంస్థల్లో వేధింపులు, అసౌకర్యాలపై విచారణ చేస్తాం. – స్వామి, చైతన్య కళాశాల ఏజీఎం నిందితులను అదుపులోకి తీసుకున్నాం విద్యార్థి మృతికి కారకులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అడ్మిన్ ప్రిన్సిపాల్ ఆచార్య, ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ జగన్‌లను అదుపులోకి తీసుకున్నాం. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. – జీవీ రమణగౌడ్, ఏసీపీ, నార్సింగి -
‘సాక్షి’ చేతిలో సాత్విక్ సూసైడ్ నోట్.. నివ్వెరపోయే విషయాలు
సాక్షి, హైదరాబాద్: నార్సింగిలో శ్రీ చైతన్య కళాశాల విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. తాజాగా ఈ కేసులో సాత్విక్ సూసైడ్ లేఖ వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు ముందు తను అనుభవించిన బాధను సాత్విక్ లేఖలో రాసుకొచ్చాడు. ప్రిన్సిపల్, కాలేజీ ఇంచార్జ్, లెక్చరర్ పెట్టే టార్చర్ వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ‘అమ్మానాన్న.. నేను ఈ పని చేస్తున్నందుకు క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్ధేశం నాకు లేదు. కృష్ణారెడ్డి, ఆచార్య, శోభన్, నరేష్ వేధింపులను తట్టుకోలేకపోయాను. వీరు నలుగురు నాతోపాటు హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. వీరి వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. సారీ అమ్మా.. నేను పడిన టార్చర్ వేరెవరికీ రాకూడదని కోరుకుంటున్నా. నన్ను వేధించిన ముగ్గురిపై చర్యలు తీసుకోవాలి. అమ్మా నాన్న లవ్ యూ, మిస్ యూ ఫ్రెండ్స్’ అంటూ సాత్విక్ తన సూసైడ్ నోట్లో రాశాడు. కాగా, నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి సాత్విక్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.. మంగళవారం రాత్రి క్లాస్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి తరలించేలోపే సాత్విక్ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు తోటి విద్యార్థులు సైతం కాలేజీ ఒత్తిడి వల్లే సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ఆరోపిస్తున్నారు. -
టీడీపీ నేత వేధింపులు.. ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం
సాక్షి, అమరావతి/తనకల్లు: టీడీపీ నేత వేధింపులకు ఓ బాలిక బలైపోయింది. ప్రేమించకపోతే నీ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పెడతానని బెదిరించడంతో భయపడిపోయిన ఓ ఇంటర్ విద్యార్థిని ఉరి వేసుకుంది. టీడీపీ నాయకుడి బెదిరింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ బలవన్మరణానికి ముందు సెల్ఫీ వీడియోలో చెప్పింది. శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం ఎర్రబల్లిలో బుధవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎర్రబల్లికి చెందిన కురుబ శ్రీనివాసులు, రాధమ్మ దంపతుల ఏకైక కుమార్తె సంధ్యారాణి(17). అన్నమయ్య జిల్లా మొలకలచెరువులోని మెడల్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ అనుచరుడైన నల్లచెరువుకు చెందిన తెలుగు యువత మండల ప్రధాన కార్యదర్శి రాళ్లపల్లి ఇంతియాజ్.. ఫేస్బుక్లో సంధ్యారాణితో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ప్రేమించాలంటూ వేధించడం మొదలెట్టాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఎర్రబల్లికి వెళ్లి వారి తల్లిదండ్రుల సమక్షంలోనే తనని ప్రేమించాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇటీవల సంధ్యారాణి తల్లిదండ్రులతో కలిసి పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి గుడి వద్దకు వెళ్లగా.. అక్కడికీ వచ్చి మరీ వేధించాడు. తనను ప్రేమించకుంటే ఫొటోలు మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పెడతానంటూ బెదిరించాడు. దీంతో సంధ్యారాణి తీవ్ర భయాందోళలనకు లోనైంది. ఈ క్రమంలోనే దసరా సెలవులకు ఇంటికొచ్చిన సంధ్యారాణి బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. తన ఆత్యహత్యకు రాళ్లపల్లి ఇంతియాజే కారణమంటూ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో చెప్పింది. సమచారం అందుకున్ని స్థానిక ఎస్ఐ రాంభూపాల్ ఘటన స్థలానికి చేరుకుని సంధ్యారాణి మృతదేహానికి పోస్టుమార్టం చేయించి.. కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. కీచక టీడీపీ నేతల అరాచకాలకు చంద్రబాబే కారణం : రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ లైంగిక వేధింపులకు పాల్పడి మైనర్ బాలికలను పొట్టనబెట్టుకుంటున్న కీచక టీడీపీ నేతలకు చంద్రబాబు వత్తాసుపలకడం అత్యంత బాధాకరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత ఇంతియాజ్ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న బాలిక ఉదంతంపై గురువారం వాసిరెడ్డి పద్మ.. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ, కదిరి డీఎస్పీతో మాట్లాడారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి నిందితుడిపై కఠిన చర్యలకు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అనంత, సత్యసాయి జిల్లాల్లో వరుసగా టీడీపీ నేతల వేధింపులకు ప్రధాన కారణం.. వారిని చంద్రబాబు వెనుకేసుకురావడమేనన్నారు. విజయవాడలో వినోద్ జైన్ కేసు, లోకేశ్ పీఏ వేధిస్తున్నాడని మహిళ ఫిర్యాదు ఇచ్చిన సమయంలోనే టీడీపీ నేతలకు చంద్రబాబు గట్టిగా బుద్ధి చెప్పి ఉంటే.. ఇలాంటి ఘటనలకు తావుండేది కాదన్నారు. -
స్టేటస్ పెట్టి.. బావిలో దూకాడు
భూదాన్‌పోచంపల్లి: వ్యవసాయబావిలో దూకి ఇంటర్ విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం పెద్దగూడెంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దగూడేనికి చెందిన నోముల ఆకాశ్‌రెడ్డి(17) భూదాన్‌పోచంపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ సెకండియర్ చదువుతున్నాడు. మ్యాథ్స్ అర్థం కావడంలేదని, లె క్చరర్ హోంవర్క్ ఎక్కువ ఇస్తున్నారని వేరే కళాశాలలో చేరుతానని చెబుతుండేవాడు. అన్నట్టుగానే ఐదు రోజుల క్రితం టీసీ తీసుకొని పట్టణ పరిధిలోని మోడల్ స్కూల్లో చేరాడు. స్టేటస్ పెట్టిన 10నిమిషాల్లోనే..: ‘నేను చనిపోవడానికి మా జూనియర్ కళాశాల మ్యాథ్స్ లెక్చరర్, తోటి విద్యార్థిని కారణం’అని ఆదివారం మధ్యాహ్నం 12.55కి తన మొబైల్ లో స్టేటస్ పెట్టాడు. అతని స్టేటస్ చూ సిన స్నేహితులు... ఆకాశ్‌రెడ్డి తల్లి అరుణకు చెప్పారు. అదే సమయంలో అక్కడి కి వచ్చిన ఆకాశ్‌ను ప్రశ్నించగా... సరదాగా పెట్టానంటూ వెళ్లిపోయాడు. అనంతరం సైకిల్‌పై గ్రామ సమీపంలోని వ్య వసాయ బావి వద్దకు వెళ్లాడు. రోడ్డు పక్కన సైకిల్, గట్టు పైన చెప్పులు,సెల్‌ఫోన్ పెట్టి బావిలో దూకాడు. అతని కోసం వెదుకుతుండగానే బావిలో దూకాడని గ్రామస్తులు చెప్పారు. భయంతోనేనా.. ఆకాశ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న సమయంలో తోటి విద్యార్థిని ఫొటోలను తన ఫోన్లో వాట్సప్ డీపీగా పెట్టుకునే వాడు. కాలేజీ మారాక కూడా కొనసాగించాడు. దీంతో సదరు విద్యార్థిని మ్యాథ్స్ లెక్చరర్‌కు చెప్పింది. దీనిపై సోమవారం పోలీస్‌లకు ఫిర్యాదు చేద్దామని లెక్చరర్ చెప్పినట్లు సమాచారం. తనపై కేసు అవుతుందనే భయంతోనే బావిలోకి దూకి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అంతేకాక ఆకాశ్ మానసిక స్థితి కూడా సరిగా ఉండదని తెలిసింది. అతడి తండ్రి నోముల శ్రీనివాస్‌రెడ్డి మూడేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. తల్లి అరుణ మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కాగా, బావిలో నీరు ఎక్కువగా ఉండడంతో పోలీసులు అర్ధరాత్రివరకు వెతికినా మృతదేహం దొరకలేదు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సైదిరెడ్డి తెలిపారు. -
రికవరీ ఏజెంట్ల దూషణలతో.. ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం
నందిగామ: బ్యాంకు క్రెడిట్ కార్డుపై తీసుకున్న రుణం చెల్లించాలంటూ రికవరీ ఏజెంట్ల ఆగడాలు ఓ చదువుల తల్లిని బలితీసుకున్నాయి. తండ్రి తీసుకున్న అప్పు కట్టేయాలనడమే కాక నోటికొచ్చినట్లు నానా మాటలు ఆనడంతో ఆమె తట్టుకోలేకపోయింది. మరోవైపు.. కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగా ఉండడంతో ఆ విద్యార్థిని తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో గురువారం చోటుచేసుకుంది. మృతురాలి తల్లి అరుణ తెలిపిన సమాచారం ప్రకారం.. పట్టణంలోని పాత కరెంట్ ఆఫీస్ రోడ్డులో ఉంటున్న జాస్తి ప్రభాకరరావు ఢిల్లీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆయన కొద్దినెలల క్రితం ఓ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా రూ 3.50 లక్షల అప్పు తీసుకున్నాడు. ఆ మొత్తం సకాలంలో చెల్లించకపోవడంతో వడ్డీ పెరిగిపోయింది. దీంతో ఈ నెల 26న సంబంధిత బ్యాంకు సిబ్బంది ఇంటికొచ్చి తీసుకున్న రుణం వెంటనే చెల్లించాలంటూ అసభ్య పదజాలంతో దూషించారు. ఆ మాటలు విన్న ప్రభాకరరావు పెద్ద కుమార్తె జాస్తి హరిత వర్షిణి (17) తీవ్ర మనస్తాపానికి గురైంది. అప్పటినుంచి అదే ఆలోచనతో ఉన్న ఆమె గురువారం ఉదయం సూసైడ్ లెటర్ రాసి వంట గదిలో ఉరి వేసుకుని మృతిచెందింది. అమ్మా.. నన్ను క్షమించు నిజానికి.. హరిత వర్షిణి చిన్నతనం నుంచి చదువులో బాగా శ్రద్ధ చూపేది. పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేసుకుని ఏపీ ఈఏపీసెట్ (ఎంసెట్)లో 15 వేల ర్యాంకు సాధించింది. మరింత మంచి ర్యాంకు కోసం ఈనెల 30న జరగనున్న తెలంగాణ ఎంసెట్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో.. అప్పు చెల్లించాలంటూ బ్యాంకు సిబ్బంది ఇంటికొచ్చి నానా మాటలు అనడం.. అదే సమయంలో కుటుంబ ఆర్థిక పరిస్థితులు వర్ణిణిని తీవ్రంగా కుంగదీశాయి. కుటుంబానికి తాను భారం కాకూడదనుకుని సూసైడ్ నోట్ రాసి తనువు చాలించింది. అందులో.. ‘‘అమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బతకడం కూడా కష్టమవుతుంది. నా కాలేజి ఫీజు, చెల్లి స్కూల్ ఫీజుకు కూడా డబ్బుల్లేవు. మావల్ల నీ ఆరోగ్యం పాడుచేసుకోకు. చెల్లిని బాగా చదివించి మంచి ఉద్యోగం తెచ్చుకోమను. నేను నీకు భారం కాకూడదని ఇలాచేశా. నన్ను క్షమించు అమ్మ. నీకు నేనేమీ చేయలేకపోతున్నా. నా గురించి నువ్వు ఏడవకు. చెల్లి జాగ్రత్త. ఎవరన్నా అడిగితే ఎంసెట్ ర్యాంకు రాలేదని చనిపోయిందని చెప్పండి.. డాడీకి నిజం చెప్పొద్దు’’.. అంటూ రాసిన లేఖ చూపరులను కంటతడి పెట్టిస్తోంది. ఘటనపై అన్ని కోణాలలో దర్యాప్తు వర్షిణి మృతిపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్హెచ్ఓ కనకారావు తెలిపారు. -
ఫెయిల్ అవుతాననే భయంతో..
జగిత్యాలక్రైం: వార్షిక పరీక్షలు సరిగా రాయలేదని, దీంతో ఫెయిల్ అవుతాననే భయంతో ఇంటర్ విద్యార్థి ద్యాగల సంజయ్‌కుమార్(19) శనివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని లింగంపేటలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. లింగంపేటకు చెందిన సంజయ్‌కుమార్ పట్టణంలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్(సీఈసీ) ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 6 నుంచి 19వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు హాజరయ్యాడు. అయితే, పరీక్షలు సరిగా రాయలేదని కొద్దిరోజులుగా మానసికంగా కుంగిపోతున్నాడు. ఇంట్లో ఎవరితోనూ మాట్లాడటంలేదు. పరీక్షల్లో ఫెయిలైనా ఏమీకాదని కుటుంబసభ్యులు ధైర్యం చెప్పినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి భోజనం చేశాక తన గదిలోకి వెళ్లాడు. శనివారం ఉదయం వరకూ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు..గది వెనకాల ఉన్న కిటికీలోంచి చూడగా.. ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి లక్ష్మీరాజం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కిశోర్ తెలిపారు. -
పుస్తకాలు బస్టాప్‌లో.. స్రవంతి హెచ్చెల్సీలో దూకి..
సాక్షి, కణేకల్లు (అనంతపురం): కాలేజీకని వెళ్లి కనిపించకుండాపోయిన ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. స్నేహితుడి ఆత్మహత్యతో జీవితంపై విరక్తి చెంది ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది. రెండు రోజుల తర్వాత మృతదేహం లభ్యమైంది. ఎస్ఐ దిలీప్ కుమార్ కథనం మేరకు... గెనిగెర గ్రామానికి చెందిన స్రవంతి (17) కణేకల్లు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం (బైపీసీ) చదువుతోంది. తన స్నేహితుడు ఇటీవల పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి స్రవంతి పూర్తి డిప్రెషన్లో ఉంది. స్నేహితుడు లేని జీవితం శూన్యంగా అనిపించింది. శుక్రవారం కాలేజీకని సోదరుడితో కలిసి ద్విచక్రవాహనంపై కణేకల్లు–బళ్లారి రోడ్డు వద్దనున్న బస్టాప్ వరకు వెళ్లింది. అయితే అక్కడి నుంచి కాలేజీకి వెళ్లలేదు. సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పుస్తకాలు బస్టాప్ వద్దనున్న ఆలయం ముందు కనిపించడంతో ఆమె కోసం గాలించారు. అయితే ఎక్కడా కనిపించలేదు. స్రవంతి శుక్రవారం రోజే హెచ్చెల్సీలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం సాయంత్రం యర్రగుంట వద్ద మృతదేహం బయటపడింది. తల్లిదండ్రులు తమ కూతురేనని గుర్తించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (దారుణం: భార్య గొంతునులిమి.. పసికందు ముక్కు మూసి) -
యాక్సిడెంట్ భయం: భవనంపై నుంచి దూకి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
-
హాస్టల్లో ఉండలేనమ్మా!, 10 నిముషాల్లోనే ఘోరం
పెనమలూరు/పెద్దతిప్పసముద్రం: ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన పోరంకిలోని శ్రీ చైతన్య క్యాంపస్‌లో సోమవారం చోటు చేసుకుంది. కృష్ణాజిల్లా పెనమలూరు సీఐ ఎం.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం..చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం రంగసముద్రం గ్రామానికి చెందిన మదన్‌మోహన్‌రెడ్డి, మంజుల దంపతుల కుమార్తె బట్టి శిరీష (17) పోరంకిలోని శ్రీచైతన్య సరస్వతీ సౌధంలో ఇంటర్ (బైపీసీ) రెండో సంవత్సరం చదువుతున్నది. ఇటీవల ప్రాక్టికల్స్ పరీక్ష రాసిన ఆమె తల్లిదండ్రులతో కలిసి ఈ నెల 7వ తేదీన ఇంటికి వెళ్లింది. మరలా సోమవారం తల్లితో కలిసి పోరంకిలోని కాలేజీకి వచ్చింది. తాను హాస్టల్లో ఉండలేనని తల్లికి చెప్పగా.. ఆమె నచ్చజెప్పింది. దీంతో రూమ్‌లోకి వెళ్లి వస్తానని చెప్పి అరుంధతి బ్లాక్ రూమ్ నంబర్ 247లోకి వెళ్లింది. పది నిమిషాలైనా కుమార్తె తిరిగి రాకపోవడంతో తల్లి, కాలేజీ యాజమాన్యం రూమ్‌లోకి వెళ్లి చూడగా శిరీష చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. ఆమెను వెంటనే కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీరించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. సమాచారం అందుకున్న యువతి తండ్రి మదన్‌మోహన్‌రెడ్డి హుటాహుటిన సోమవారం కళాశాలకు వెళ్లారు. -
పబ్జీ ఆడొద్దు అన్నందుకు ఎంతపని చేశాడు!
వెంకటేశ్వరకాలనీ (హైదరాబాద్): పబ్జీ ఆడొద్దని తండ్రి మందలించినందుకు ప్రాణాలు తీసుకోబోయాడో విద్యార్థి.. ఏకంగా ఐదంతస్తుల భవనంపై నుంచి దూకగా అదృష్టవశాత్తు స్వల్పగాయాలతో బయటపడ్డాడు.. పంజగుట్ట ప్రతాప్‌నగర్‌లో కొన్నేళ్లుగా ఓ కుటుంబం నివాసముంటోంది. ఆన్లైన్ క్లాసులున్న నేపథ్యంలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న బాలుడు (17) కొన్ని రోజులుగా పబ్జీ ఆటకు బానిసయ్యాడు. అది గమనించిన ఆ బాలుడి తండ్రి శనివారం రాత్రి అతడిని మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన బాలుడు పక్కనే ఉన్న ఐదంతస్తుల ఇంటిపైకి ఎక్కి కిందికి దూకేశాడు. ఈ క్రమంలో నేరుగా కరెంటు వైర్లు, కేబుల్ వైర్లపై పడి కిందకు జారాడు. అదృష్టవశాత్తు బాలుడికి స్వల్ప గాయాలే కావడంతో ప్రాణాపాయం తప్పింది. ఇటు వైర్లపై ఒకేసారి భారం పడటంతో కరెంటు స్తంభం కూడా కూలింది. బాలుడిని సమీపంలోని తన్వీర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇటు కరెంటు స్తంభం కూలడంతో శనివారం రాత్రి 8.30 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. సమాచారమందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేసి వైర్ల కనెక్షన్లను పునరుద్ధరించారు. -
‘పబ్జీ’కి బానిసై ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
తిరుపతి క్రైం: పబ్జీ గేమ్‌కు బానిసైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుపతిలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. అలిపిరి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిరుపతి నగరం మంగళం బీటీఆర్ కాలనీలో నివాసముంటున్న టీటీడీ ఉద్యోగి భాస్కర్ కుమారుడు తేజేష్ (19) ఇంటర్ చదువుతున్నాడు. తేజేష్ కొంత కాలంగా పబ్జీ గేమ్‌కు బానిసయ్యాడు. దీనిపై తల్లిదండ్రులు నిరంతరం మందలిస్తున్నా పట్టించుకునేవాడు కాదు. ఈ క్రమంలో తేజేష్ పబ్జీ గేమ్ కోసం ఆన్లైన్లో ఖర్చు పెట్టుకునేందుకు తండ్రిని రూ.3 వేలు అడిగాడు. తండ్రి నిరాకరించడంతోపాటు మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం రాత్రి తన బెడ్రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం లేచి చూసేసరికి తేజేష్ విగతజీవిగా ఉరితాడుకు వేలాడుతుండటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. కాగా, పబ్జీని కేంద్ర ప్రభుత్వం నిషేధించినప్పటికీ కొందరు యువత ఇతర మార్గాల్లో పబ్జీ గేమ్‌ను డౌన్లోడ్ చేసుకుని ఆడుతుండటం గమనార్హం. -
బూటుకాలితో తన్నిన కానిస్టేబుల్‌పై వేటు
సాక్షి, పటాన్చెరు: నారాయణ కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కన్నకూతురు చనిపోయిందని రోదిస్తున్న మృతురాలి తండ్రి చంద్రశేఖర్‌ను శ్రీధర్ అనే కానిస్టేబుల్ బూటుతో తన్నాడు. దీంతో విద్యార్థులు పోలీసులపై తిరగబడటంతో వారు లాఠీచార్జి చేయగా పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ఇక సదరు కానిస్టేబుల్ దురుసుతనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.(నారాయణ విద్యార్థిని ఆత్మహత్య: పరిస్థితి ఉద్రిక్తం) ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హోంమంత్రి మహమూద్ అలీ గురువారం సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేశారు. కాగా సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం వెలిమెల నారాయణ బాలికల కళాశాలలో విద్యార్థిని సంధ్యారాణి(16) మంగళవారం బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. (నారాయణ విద్యార్థిని ఆత్మహత్య: కేటీఆర్ స్పందన) -
నారాయణ విద్యార్థిని ఆత్మహత్య: పరిస్థితి ఉద్రిక్తం
-
నారాయణ విద్యార్థిని ఆత్మహత్య; ఉద్రిక్తత
సాక్షి, సంగారెడ్డి: పటాన్చెరు ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నిన్న వెలిమల నారాయణ కళాశాలలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సంధ్యారాణి అనే విద్యార్థిని బాత్రూమ్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే కళాశాల యాజమాన్యం వేధింపుల వల్లే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందంటూ బుధవారం విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. మృతదేహాన్ని పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా అడ్డుకున్నారు. అంతేకాకుండా మార్చురీలో ఉన్న సంధ్యారాణి మృతదేహాన్ని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మృతదేహం తరలింపును పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మృతురాలి తండ్రిని ఓ పోలీస్ అధికారి బూట్ కాళ్లతో తన్నారు. ఈ సంఘటనతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమువుతున్నాయి. దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబీకులు కోరుతున్నారు. న్యాయం చేయమని అడిగితే దౌర్జన్యానికి దిగుతారా అని ప్రశ్నిస్తున్నారు. కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలి సంధ్యారాణి మృతిపై నిరసన వ్యక్తం చేసిన ఏబీవీపీ, తెలంగాణ జన సమితి విద్యార్థి నేతలు బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు పోలీసులు అదుపులోనే ఉన్నారు. అరెస్టు చేసిన విద్యార్థి నేతల్ని పోలీసులు బేషరతుగా విడుదల చేయాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు. సంధ్యారాణి తండ్రి చంద్రశేఖర్‌ను బూటుకాలితో తన్నిన కానిస్టేబుల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. నారాయణ విద్యా సంస్థ ల యాజమాన్యంపై క్రిమినల్ కేసు పెట్టాలని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయకపోతే విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఎస్పీ చందనా దీప్తి సీరియస్ పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రి వద్ద సంధ్యారాణి తండ్రి చంద్రశేఖర్‌ను బూటు కాలితో కానిస్టేబుల్ తన్నిన ఘటనపై సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ ఎస్పీ చందనా దీప్తి సీరియస్ అయ్యారు. కానిస్టేబుల్ శ్రీధర్‌ను హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఎస్పీ చందనా దీప్తి ఆదేశించారు. కాగా, వెలిమేల గ్రామంలోని నారాయణ రెసిడెన్షియల్ కాలేజ్ లో సంధ్యారాణి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. మధ్యాహ్నం భోజనం విరామ సమయంలో బాత్రూమ్లోకి వెళ్లిన సంధ్యారాణి అక్కడే ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న యాజమాన్యం నలగండ్లలోని సిటీజన్ ఆసుపత్రికి తరలించారు. -
నేను ప్రేమించడం లేదు.. చస్తే చావు
శ్రీకాకుళం, కాశీబుగ్గ: ప్రేమ వ్యవహారమే ఇంటర్ విద్యార్థిని మృతికి దారి తీసిందని.. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో పరిశీలించి.. సాక్ష్యాలు సేకరించిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించామని కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి విలేకర్లకు మంగళవారం వెల్లడించారు. ఆత్మహత్యకు కారణమైన బాలుడ్ని అరెస్టు చేసి జూనియర్ సివిల్ కోర్టులో హాజరుపరిచామన్నారు. తీవ్ర సంచలనం కలిగించిన ఈ కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఆత్యహత్యగా నిర్ధారించడంతో మిస్టరీ వీడింది. అసలేం జరిగింది.. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ తెలియజేసిన వివరాల ప్రకారం.. వజ్రపుకొత్తూరు మండలం ధర్మపురం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని జనవరి 26న గ్రామానికి సమీపంలోని రైల్వే ట్రాక్‌పై శవంగా కనిపించింది. బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన తర్వాత రైల్వే ట్రాక్‌పై పడేశారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎస్పీ అమ్మిరెడ్డి ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తునకు ఆదేశించారు. ఈ కేసును పలాస రైల్వే పోలీసులు నమోదు చేసి కాశీబుగ్గ పోలీసులకు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. 8 రోజులపాటు అన్ని కోణాల్లో కాశీబుగ్గ సీఐ వేణుగోపాలరావు ఆధ్వర్యంలో దర్యాప్తు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్పత్రి నుంచి పోస్టుమార్టం రిపోర్టు కూడా రావడంతో దర్యాప్తు వేగవంతమైంది. బాలికపై ఎటువంటి అఘాయిత్యం జరగలేదని స్పష్టం కావడంతో హత్య కోణంపై దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో కూడా ఎటువంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఆత్మహత్య కోణంపై దర్యాప్తు సాగింది. మొత్తం 50 మంది ప్రత్యక్ష సాక్షులను విచారించిన తర్వాత బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. నిందితుడిగా అనుమానిస్తున్న ఇంటర్ విద్యార్థిని ప్రశ్నించారు. కాల్ డేటా, మెసేజ్‌లు, వాట్సాప్ చాటింగ్‌లు పరిశీలించారు. ఈ విద్యార్థి వ్యవహారం వల్లే బాలిక మృతి చెందినట్లు భావించారు. నిందితుడిపై సెక్షన్ 305 కింద కేసు నమోదు చేశారు. వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శివరామిరెడ్డి, సీఐ వేణుగోపాలరావు నిన్ను ప్రేమించడం లేదు.. ప్రియుడిగా అనుమానిస్తున్న విద్యార్థితో బాలికకు మూడు నెలల నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. గత నెల 23వ తేదీన చివరి సందేశంలో ‘నేను ప్రేమించడం లేదు. చస్తే చావు’ అని చేప్పాడు. ప్రేమించడం లేదని చెప్పడంతో బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో 25న అర్ధరాత్రి దాటిన తర్వాత బహిర్భూమికని వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరానికి విద్యార్థిని అరెస్టు చేశామని, విద్యార్థి మైనర్ కావడంతో జువైనల్ కోర్టులో హాజరుపరిచామన్నారు. ఈ కేసును ఛేదించిన సిబ్బందిని అభినందించారు. విలేకరుల సమావేశంలో సీఐ వేణుగోపాల్‌రావు సిబ్బంది ఉన్నారు. బంధువులు, గ్రామస్తుల ఆందోళన విద్యార్థిని జువైనెల్ కోర్టుకు పోలీసులు తరలిస్తున్నారన్న విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు కాశీబుగ్గ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. పోలీసుల అదుపులో వారం రోజులకుపైగా స్టేషన్లోనే ఎందుకు ఉంచారని ఆందోళన వ్యక్తం చేశారు. బాలుడిని తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. కొద్దిసేపటి తర్వాత బాలుడ్ని చూపించడంతో పట్టువిడిచారు. అనంతరం శ్రీకాకుళం కోర్టుకు వాహనంలో తరలించారు. -
మా అమ్మకు ఇల్లు కట్టించండి
మిర్యాలగూడ అర్బన్: ‘మా అమ్మకు ఇల్లు కట్టించి నేను లేని లోటు లేకుండా చూడండి. ఇది నా చివరి కోరిక. ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు. కానీ పేదల బతుకులు మారడం లేదు. మా లాంటి పేదవారికి సాయం చేయండి. దేశంలో ఇంకా ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ఆకలి కేకలను దేశం నుంచి పారదోలలేమా..?’అంటూ లేఖ రాసి ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని తాళ్లగడ్డలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తాళ్లగడ్డకు చెందిన సోమశంకర్, నాగలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు శివప్రసాద్ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు దేవేందర్ (17) స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. అద్దె ఇంట్లో నివాసం ఉంటూ తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు నెలకొనడంతో మనస్తాపానికి గురైన దేవేందర్ ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దేవేందర్ రాసిన లేఖ. సూసైడ్ నోట్ స్వాధీనం.. ఘటనా స్థలంలో దేవేందర్ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేశంలోని ఆర్థిక అసమానతల గురించి, ఇంట్లో తాము అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బందుల గురించి లేఖలో వివరించాడు. ‘కోట్లు కూడబెట్టుకుని ధనంవంతులు ఏమి సాధిస్తారు. ఉన్నదాంట్లో మాలాంటి పేదలకు పంచి చూడండి. పేద వారికి సహాయం చేయండి. ఆ ఆనందం తెలుస్తుంది. మా అమ్మ, నాన్న మమ్మల్ని ఎంతగానో కష్టపడి పెంచుతున్నారు. మాకు సొంత ఇల్లు కూడా లేదు. అమ్మ, నాన్న సంపాదించిన డబ్బులన్నీ ఇంటి అద్దెకే సరిపోతున్నాయి. మాలాంటి పేదవారు చాలామంది ఉన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి. ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు. కానీ పేదల బతుకులు మాత్రం మారడం లేదు. దేశంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వానిదే. ఇల్లు లేని పేదవారు ఉండకూడదు. నేను చనిపోయిన తర్వాత నన్ను పోస్టుమార్టం చేయండి. మా అమ్మకు ఇల్లు కట్టించి నేను లేని లోటు లేకుండా చూడండి. ఇదే నా చివరి కోరిక’అంటూ లేఖలో పేర్కొన్నాడు. -
తల్లిదండ్రులు కొడతారేమోనని.. యువతి ఆత్మహత్య
జడ్చర్ల: కళాశాలకు వెళ్లకపోవడంతో తన తల్లి స్నేహితురాలిని మందలించిందని, తమ తల్లిదండ్రులు కూడా తనను కొడ తారేమోనని భయపడిన ఓ ఇంటర్ వి ద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. జడ్చర్లలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి స్థానికుల కథనం ప్రకారం .. శ్రీనివాసనగర్‌లో నివాసం ఉంటు న్న అశోక్, ఉమాదేవి కూతురు శ్రేయ (16) మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశా లలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుంది. అయితే శనివారం అదే కాలనీలో ఉంటున్న తన స్నేహితురాలితో కలిసి బయలుదేరారు. కళాశాలకు చెందిన బస్సు ముందుగానే వెళ్లిపోవడంతో వారు ఆటోలో కళాశాలకు వెళ్లారు. కళాశాలకు ఆలస్యంగా వచ్చారని, అధ్యాపకులు వారిని తరగతి గదిలోకి అనుమతించలేదు. దీంతో వారు వెనుతిరిగి ఇం టికి వచ్చారు. ఇంటికి చేరుకున్న శ్రేయ, స్నేహితురాలిని ఆమె తల్లి అడగగా.. ఆలస్యంగా వెళ్లడంతో తిప్పిపంపారని చెప్పింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రేయ ముందే స్నేహితురాలి మీద ఆమె తల్లి చేయి చేసుకుంది. దీంతో తన తల్లిదం డ్రులు కూడా కొడతారేమోనని భయపడిన శ్రేయ ఇంటికి వచ్చి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తర్వా త ఇంటికి వచ్చిన తండ్రి అశోక్ తలుపు తట్టగా లోపలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆయన ఇంటి వెంటిలేటర్ గుండా లోపలికి చూడగా.. బెడ్రూ ంలో శ్రేయ ఆత్మహత్యకు పాల్ప డిందని గుర్తించి.. వెంటిలేటర్ ఇనుప చువ్వలను తొలగించి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందింది. శ్రేయ తండ్రి అశోక్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా.. తల్లి ఉమాదేవి నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం లో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తుంది. వీరికి శ్రేయతోపాటు ఒక కుమారుడు ఉన్నారు. అకారణంగా తమ కూతురు మృతిచెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. -
అమ్మా! నాన్నా! నన్ను మర్చిపోండి..
తూర్పుగోదావరి,మండపేట: సరిగా చదవలేకపోతున్నానన్న ఆవేదన, తల్లిదండ్రులకు భారంగా ఉన్నానన్న బాధతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండపేటలోని గొల్లపుంతకాలనీలో చోటుచేసుకుంది. పట్టణ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన పట్టాభి వెంకట్రావు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఇంజినీరింగ్ చదువుతోంది. చిన్న కుమార్తె పవిత్ర పట్టణంలోని ప్రైవేట్ కళాశాలలో సీనియర్ ఇంటర్ చదువుతోంది. తండ్రి లారీ డ్రైవర్ కావడంతో దూరప్రాంతం వెళ్లాడు. తల్లి పట్టణంలోని షాపులో పనిచేస్తుండగా ఆమె కూడా పనికి వెళ్లిపోయింది. పవిత్ర చదువుకుంటానని చెప్పి మంగళవారం కళాశాలకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండిపోయింది. మధ్యాహ్న సమయంలో నాయనమ్మ ఇంటికి వచ్చి చూడగా ఇంటికి గెడ వేసి ఉండడంతో పడుకుని ఉంటుందని ఆమె వెనక్కి వెళ్లిపోయింది. మూడు గంటల సమయంలో మరోసారి వచ్చి చూసే సరికి తలుపు వేసి ఉండడంతో తలుపుకొట్టిన పవిత్ర తలుపు తీయలేదు. అనుమానం వచ్చి చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు బలంగా తెరిచి చూడగా సిల్క్ చీరతో ఉరివేసుకుని కింద పడి ఉంది. వెంటనే స్థానిక వైద్యులను పిలిచి చూపించగా అప్పటికే ఆమె మృతిచెంది ఉన్నట్టు గుర్తించారు. సిల్క్ చీరతో ఉరివేసుకోవడంతో అది కొద్దిసేపటికి జారిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పేరుపేరునా క్షమించమని కోరుతూ.. అక్క మెరిట్ విద్యార్థి కావడంతో ర్యాంకు సాధించి ఇంజినీరింగ్ చదువుకుంటున్నట్టు స్థానికులు తెలిపారు. పవిత్ర సరిగా చదవలేకపోయేది. ‘నేను మీకు ఏ విధంగా సహాయపడలేనని, అమ్మా! నాన్నా! నన్ను మర్చిపోండి’ అంటూ నోట్‌బుక్‌లో సూసైడ్ నోట్లో పేర్కొంది. బంధువులు, స్నేహితులు అందరినీ పేరుపేరునా ప్రస్తావించి క్షమించమని కోరుతూ ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటన స్థలంలో ఈ లేఖ లభ్యమైనట్టు పట్టణ పోలీసులు తెలిపారు. కుమార్తె మృతితో తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. రోజూ కళ్లముందు తిరిగే అమ్మాయి ఇంతటి అఘాయిత్యానికి పాల్పడుతుందనుకోలేదంటూ చుట్టుపక్కల వారు విషాదంలో మునిగిపోయారు. తల్లి ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై టి.సునీత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.