తల్లిదండ్రులు కొడతారేమోనని.. యువతి ఆత్మహత్య | Inter Student Committed Suicide for Fear of a Parental Blow | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులు కొడతారేమోనని.. యువతి ఆత్మహత్య

Published Sun, Nov 3 2019 7:24 AM | Last Updated on Sun, Nov 3 2019 7:24 AM

Inter Student Committed Suicide for Fear of a Parental Blow - Sakshi

శ్రేయ మృతదేహం

జడ్చర్ల: కళాశాలకు వెళ్లకపోవడంతో తన  తల్లి స్నేహితురాలిని మందలించిందని, తమ తల్లిదండ్రులు కూడా తనను కొడ తారేమోనని భయపడిన ఓ ఇంటర్‌ వి ద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. జడ్చర్లలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి స్థానికుల కథనం ప్రకారం .. శ్రీనివాసనగర్‌లో నివాసం ఉంటు న్న అశోక్, ఉమాదేవి కూతురు శ్రేయ (16) మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ కళాశా లలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతుంది. అయితే శనివారం అదే కాలనీలో ఉంటున్న తన స్నేహితురాలితో కలిసి బయలుదేరారు. కళాశాలకు చెందిన బస్సు ముందుగానే వెళ్లిపోవడంతో వారు ఆటోలో కళాశాలకు వెళ్లారు. కళాశాలకు ఆలస్యంగా వచ్చారని, అధ్యాపకులు వారిని తరగతి గదిలోకి అనుమతించలేదు. దీంతో వారు వెనుతిరిగి ఇం టికి వచ్చారు. ఇంటికి చేరుకున్న శ్రేయ, స్నేహితురాలిని ఆమె తల్లి అడగగా.. ఆలస్యంగా వెళ్లడంతో తిప్పిపంపారని చెప్పింది.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రేయ ముందే స్నేహితురాలి మీద  ఆమె తల్లి చేయి చేసుకుంది. దీంతో తన తల్లిదం డ్రులు కూడా కొడతారేమోనని భయపడిన శ్రేయ ఇంటికి వచ్చి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తర్వా త ఇంటికి వచ్చిన తండ్రి అశోక్‌ తలుపు తట్టగా లోపలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆయన ఇంటి వెంటిలేటర్‌ గుండా లోపలికి చూడగా..  బెడ్‌రూ ంలో శ్రేయ ఆత్మహత్యకు పాల్ప డిందని గుర్తించి.. వెంటిలేటర్‌ ఇనుప చువ్వలను తొలగించి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందింది. శ్రేయ తండ్రి అశోక్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుండగా.. తల్లి ఉమాదేవి నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం లో అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తుంది. వీరికి శ్రేయతోపాటు ఒక కుమారుడు ఉన్నారు. అకారణంగా తమ కూతురు మృతిచెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement