మేడ్చల్‌రూరల్: తనకు ఇష్టం లేకపోయినా హాస్టల్‌లో ఉంచి చదివిస్తున్నారని మనస్తానికి గురైన ఇంటరీ్మడియెట్ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్ పట్టణంలో చోటుచేసుకుంది. మేడ్చల్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్టణానికి చెందిన కోట్ల అవినాష్ (16)ను తల్లిదండ్రులు నగరంలోని కొంపల్లిలోని ఓ హాస్టల్‌లో ఉంచి పేట్ బషీరాబాద్‌లోని సెయింట్ ఆంటోని కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివిస్తున్నారు.
సెలవు రోజుల్లో అవినాష్ మేడ్చల్ పట్టణంలోని కేఎల్‌ఆర్ కాలనీలో నివాసం ఉండే అక్క, బావ ఇంటికి వచ్చేవాడు. ఈ నేపథ్యంలో హాస్టల్‌లో ఉంటూ సదరు కళాశాలలో చదవడం తనకు ఇష్టం లేదని, తాను డే స్కాలర్స్‌గా చదువుకుంటానని అవినాష్ తల్లిదండ్రులకు చెప్పినా వారు కుమారుడి ఆవేదనను పట్టించుకునేవారు కాదు. ఇంటర్ పూర్తయ్యే వరకు హాస్టల్‌లో కొనసాగాలని తల్లిదండ్రులు సర్ది చెప్పేవారు.
దీంతో మనస్తాపం చెందిన అవినాష్ ఇటీవల దీపావళి సెలవుల్లో మేడ్చల్‌లోని సోదరి ఇంటికి వచ్చాడు. శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న మేడ్చల్‌పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment