ఆత్మహత్యకు పాల్పడిన ఇర్ఫాన్ (ఫైల్)
కర్నూలు సిటీ: ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం నగర శివారులోని ఓ జూనియర్ కాలేజీలో చోటు చేసుకుంది. ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడకు చెందిన తోళ్ల షఫీవుల్లా, ఖాజాబీ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు తోళ్ల ఇర్ఫాన్ నగర శివారులోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ గ్రూప్ చదువుతున్నాడు. రోజూ ఉదయం 6.30 గంటలకు తరగతులకు వెళ్లేవాడు. అయితే శనివారం తన రూంమెట్స్ వెళ్లినా కూడా ఇర్ఫాన్ రూంలోనే ఉండిపోయాడు.
సాయంత్రం 5గంటలకు తరగతులు ముగించుకొని రూంకి వెళ్లిన విద్యార్థులు తలుపులు కొట్టారు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో గట్టిగా తలుపులు తోయడంతో గదిలో పైకప్పుకు టవల్స్‌తో ఇర్ఫాన్ ఉరేసుకున్న విషయం గుర్తించారు. విషయం నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లగా కిందకు దించి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తాలుకా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇదిలాఉంటే ఇర్ఫాన్‌ను కొంత మంది క్లాస్‌మెట్స్, సీనియర్లు ఎగతాళిగా మాట్లాడడంతోనే మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment