![inter student suicide in warangal - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/12/Died.jpg.webp?itok=1QnGy_Uz)
వరంగల్: ‘మమ్మి, డాడీ ఐయామ్ సారీ... నాకు ఎంబీబీఎస్ సీటు రాదెమోనని అనిపిస్తుంది’అని సూసైడ్ నోట్ రాసిన ఓ ఇంటర్ విద్యార్థి ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పీక్లాతండాజీపీ శివారు బోడగుట్టతండాలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం..తండాకు చెందిన గుగులోతు లచ్చు, జ్యోతి దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కుమారులున్నారు.
పెద్దకుమారుడు కృష్ణ(19) ఏటూరునాగారంలోని ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీలో ఇంటరీ్మడియట్(బైపీసీ) చదివి, ఇటీవల పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు. ఎంబీబీఎస్ సీటు సాధించాలనే లక్ష్యం ఉన్న కృష్ణ, ఇంట్లో గోడలపై ఎంబీబీఎస్ నా డ్రిమ్ అంటూ రాసుకున్నాడు. ఈ మేరకు నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. ఈక్రమంలో తల్లి పంటచేను వద్దకు వెళ్లగా, తండ్రి కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి అమ్మేందుకు వెళ్లాడు. తమ్ముడు ప్రభాకర్ పదవ తరగతి పరీక్ష రాసేందుకు కల్వల మోడల్ స్కూల్‌కి వెళ్లాడు.
ఇంట్లో ఒంటరిగా ఉన్న కృష్ణ, తనకు ఎంబీబీఎస్ సీటు రాదెమోనని మనస్తాపం చెంది, ఐయామ్ సారీ మమ్మి, డాడీ అంటూ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని తాత ఇంట్లోకి వచ్చి చూడగా ఉరివేసుకుని కనిపించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఇంటికి చేరుకుని, కొడుకు మృతదేహంపై పడి కన్నీరుమున్నీరుగా విలపించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment