వరంగల్ నగరంలోని ఏకశిలా గర్ల్స్ క్యాంపస్‌లో ఘటన
విద్యార్థి సంఘాల ఆందోళన
అనారోగ్యమే కారణమంటున్న పోలీసులు
హసన్‌పర్తి: హనుమకొండ పరిధిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ఓ విద్యార్థిని మంగళవారం ఆ కాలేజీ హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రాంధన్ తండాకు చెందిన గుగులోతు శ్రీదేవి(16) నగరంలోని డబ్బాల్ జంక్షన్ వద్ద గల ఏకశిలా గర్ల్స్ క్యాంపస్‌లో ఇంటర్ (ఎంపీసీ) ఫస్టియర్ చదువుతోంది.
మంగళవారం రాత్రి 9 గంటలకు కాలేజీ హాస్టల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన తోటి విద్యార్థులు కాలేజీ నిర్వాహకులకు చెప్పగా వెంటనే చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సదరు విద్యార్థి శ్రీదేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కారణంగానే హాస్టల్ గదిలో ఉరివేసుకుందని చెప్పారు.
విద్యార్థి సంఘాల ఆందోళన..
శ్రీదేవి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు, బంధువులు రాత్రి కాలేజీ వద్దకు భారీగా చేరుకున్నారు. మృతదేహంతో కాలేజీ ఎదుట బైఠాయించారు. శ్రీదేవి మృతికి కళాశాల యాజమాన్యమే కారణమని ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగింది.
గుండెపోటుతో ఎంబీబీఎస్ స్టూడెంట్ మృతి
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000 / 040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment