సాక్షి, పటాన్‌చెరు: నారాయణ కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కన్నకూతురు చనిపోయిందని రోదిస్తున్న మృతురాలి తండ్రి చంద్రశేఖర్‌ను శ్రీధర్ అనే కానిస్టేబుల్ బూటుతో తన్నాడు. దీంతో విద్యార్థులు పోలీసులపై తిరగబడటంతో వారు లాఠీచార్జి చేయగా పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ఇక సదరు కానిస్టేబుల్ దురుసుతనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.(నారాయణ విద్యార్థిని ఆత్మహత్య: పరిస్థితి ఉద్రిక్తం)
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హోంమంత్రి మహమూద్ అలీ గురువారం సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేశారు. కాగా సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం వెలిమెల నారాయణ బాలికల కళాశాలలో విద్యార్థిని సంధ్యారాణి(16) మంగళవారం బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. (నారాయణ విద్యార్థిని ఆత్మహత్య: కేటీఆర్ స్పందన)
Comments
Please login to add a commentAdd a comment