sandhya rani
-
మంత్రి సంధ్యారాణి కాన్వాయ్ కి ప్రమాదం
-
మినీ వ్యాన్‌ను ఢీకొన్న ఏపీ మంత్రి ఎస్కార్ట్ వాహనం.. పలువురికి గాయాలు
సాక్షి, విజయనగరం: ఏపీ మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనం మినీ వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మినీ వ్యాన్ డ్రైవర్ సహా ముగ్గురు కానిస్టేబుల్స్ తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాలోని బుసాయవలస వద్ద ఏపీ మంత్రి సంధ్యా రాణి ఎస్కార్ట్‌లోని వాహనం ఎదురుగా వస్తున్న మీనీ వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్యూటీలో ఉన్న ముగ్గురు కానిస్టేబుల్స్ సహా మినీ వ్యాన్ డ్రైవర్ గాయపడ్డారు. దీంతో, వారిని విజయనగరంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇది కూడా చదవండి: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. -
Salur: ఇంట గెలవని రాణి..!
ఆమెది ఒంటెత్తు పోకడ వ్యవహారమన్న ఆరోపణలున్నాయి. ఎమ్మెల్సీగా పదవి అనుభవించినా సంతృప్తి లేదు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలన్నదే ఆమె లక్ష్యం. అయితే సొంత పార్టీలోని మాజీ ఎమ్మెల్యేతో ఇప్పటికీ విభేదాలే. కూటమి కట్టి పోటీ చేస్తున్నప్పటికీ..కూటమి పార్టీ ఎంపీ అభ్యర్థితోనూ సఖ్యత అంతంతమాత్రమే. నియోజకవర్గంలోని మూడు మండలాల్లోనూ ఆమెను వ్యతిరేకించేవారే ఉన్నారని సొంతపార్టీ నాయకులే చెప్పుకుంటారు. ఆమె ధోరణి, వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తలు పలుమార్లు పార్టీ అధిష్టానం వద్ద పంచాయితీ పెట్టిన ఉదంతాలూ ఉన్నాయి. మక్కువ మండలంలోని ఆమె వ్యతిరేక వర్గం..కేవలం కూటమి ఎంపీ అభ్యర్థికి మాత్రమే అనుకూలంగా ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. పాచిపెంట మండలంలోనూ పార్టీ కేడర్‌కు గతంలో ఆమెతో విభేదాలున్నాయి. పార్టీలోని సొంత వర్గీయులే కాదు..వ్యతిరేక వర్గం వారైనా తలెగరేస్తే పాతాళానికి తొక్కేసే వరకూ ఆమె నిద్రపోరనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఆమె వైఖరిని ఖండిస్తూ గతంలో సొంత పార్టీ నేతలే సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం గమనార్హం. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇవన్నీ చాలదన్నట్లు కులవివాదాన్నీ ఎదుర్కొంటున్నారు. ఇలా ఇంటా బయటా వ్యతిరేకతను కూడగట్టుకున్న తెలుగుదేశం పార్టీ సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సంధ్యారాణి..ఎని్నకల్లో ఎలా ముందుకు వెళ్తారో అన్న చర్చ సాగుతోంది.పార్వతీపురం మన్యం: సాలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి ఏమైనా ఉందా అని భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. తనకు ఎమ్మెల్యేగా అవకాశవిుస్తే అది చేస్తా..ఇది చేయిస్తా అంటూ టీడీపీ తరఫున ఎన్నికల బరిలో దిగుతున్న గుమ్మిడి సంధ్యారాణి కొద్దిరోజులుగా ఊదరగొడుతున్నారు. కనీసం తాను ఎమ్మెల్సీగా పదవిని అనుభవించిన ఆరేళ్ల కాలంలో ఏం చేశారో చెప్పాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ హయాంలో ఆరేళ్లు ఎమ్మెల్సీగా చేసినా నియోజకవర్గానికి ఆమె చేసింది శూన్యం. తాగునీరు, ఇతర అవసరాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని ఆమె చెబుతుంటే అధికార పార్టీ నేతలు అడిగిన ప్రశ్నలకు తిరిగి సమాధానం ఇవ్వలేకపోతున్నారు. కనీసం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా స్పందించడం లేదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే ఆమె ఎమ్మెల్సీగా పదవిని అనుభవించారు.పదవిలో ఆమె ఉన్నది ప్రజల శ్రేయస్సు కాద ని, ఆమె స్వలాభం కోసమేనని సొంత పార్టీ నేతలే విమర్శిస్తుంటారు. సాలూరులో ఆటోనగర్‌ను అభివృద్ధి చేస్తామని, లారీ పరిశ్రమను ఆదుకుంటామని స్వయంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయాంలో హామీ ఇచ్చారు. బైపాస్ రోడ్డును పూర్తి చేస్తామని చెప్పినా చేయలేదు. ఈ ప్రాంత ఎమ్మెల్సీగా వాటి సాధన కోసం ఆమె ఏనాడూ పట్టుబట్టలేదు. టీడీపీ హయాంలో ఏజెన్సీలో గిరిజ నుల మరణాలు అధికంగా సంభవించాయి. ఒక్క కరాసవలసలోనే డెంగీ జ్వరాలతో 10 రోజుల వ్యవధిలో 11 మంది వరకు చనిపోయారు. కొదమ పంచాయతీ గిరిశిఖర సిరివర గ్రామం నుంచి డోలీలో గర్భిణిని తీసుకువస్తే..మార్గమధ్యంలోనే ఆమె ప్రసవించింది. దీంతో మానవహక్కుల సంఘం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.ఎన్నికల ముందు హడావుడిసాలూరులో వంద పడకల ఆస్పత్రికి 2019 ఎన్నికలకు ముందు అప్పటి మంత్రి సుజయ్ కృష్ణ రంగారావుతో కలిసి సంధ్యారాణి హడావుడిగా భూమి పూజ చేశారు. తర్వాత పట్టించుకోలేదు. కందులపథం బ్రిడ్జికి కూడా ఎన్నికలకు ముందు కొబ్బరికాయ కొట్టి పనులు చేయకుండా వదిలేశారు. సొంత మండలాన్నే ఆమె ఏనాడూ పట్టించుకున్న పా పాన పోలేదని..ఇంక నియోజకవర్గాన్ని ఏం పట్టించుకుంటారని ‘తెలుదేశం పార్టీలోని ఓ వర్గం ప్రశ్ని స్తోంది. తన పదవీ కాలంలో అంటీముట్టనట్లుగానే ఆమె కాలం గడిపేశారని గుర్తుచేస్తున్నారు. ఇప్పు డు తాము కూడా అలాగే ప్రవర్తిస్తామని ఆ పార్టీ నేతలు, క్యాడర్ చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. -
సంధ్యారాణి కుల నిరూపణకు హైకోర్టును ఆశ్రయిస్తాం
సాలూరు: టీడీపీ సాలూరు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన సంధ్యారాణి ఎస్టీ కాదని, ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయిస్తామని న్యాయవాది, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం న్యాయ సలహాదారు రేగు మహేశ్వరరావు స్పష్టం చేశారు. సాలూరు పట్టణంలో విలేకరులతో మంగళవారం మాట్లాడారు. సంధ్యారాణి కులవివాదంపై ఆదివాసీ వికాస పరిషత్ సంఘం నాయకులు కలెక్టర్ గ్రీవెన్స్‌లో సోమవారం ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. ఆమె కుల వివాదంపై ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. ఆమె రాజకీయనాయకురాలు కావడం, రాజకీయ ఒత్తిళ్లతో సరిగా దర్యాప్తు జరగలేదని ఆరోపించారు. ఈ క్రమంలో ఆమె కుల వివాదంపై దర్యాప్తు చేయాలని కోరుతూ తాము హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. మక్కువ మండలం మరిపివలస గ్రామం, కొప్పలవెలమ కులానికి చెందిన అమరాపు సిమిడినాయుడు, పార్వతమ్మల కుమార్తె సంధ్యారాణి అని పేర్కొన్నారు. తన తండ్రి మాజీ ఎమ్మెల్యే జన్ని ముత్యాలుగా పేర్కొంటూ ఎస్టీ కులధ్రువీకరణ పత్రం పొంది చలామణి అవుతున్నారని ఆరోపించారు. సంధ్యారాణి తల్లి పార్వతమ్మ, మాజీ ఎమ్మెల్యే జన్ని ముత్యాలును రెండో వివాహం చేసుకుందని ఆమె చెబుతున్న వాదన సరైనదే అయినా.. ఆమె ఎస్టీ కులధ్రువీకరణ పత్రం కేవలం విద్యకు మాత్రమే పరిమితమవుతుందన్నారు. మిగిలిన పదవులు, ఉద్యోగాలకు వర్తించదన్నారు. దీనిపై డీఎల్సీ కమిటీతో పూర్తిస్థాయి విచారణ జరిగేలా ఆదేశాలు జారీచేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. విజయనగరం కలెక్టర్ 2008లో ఓ కేసుకు సంబంధించి తండ్రి ఎస్టీ గదబ అయినప్పటికీ, తల్లి ఓసీ బ్రాహ్మణ అయినందున భార్య, ఆమె పిల్లలు ఎస్టీ గదబ ఆచార వ్యవహారాలు ఆచరించనందున, పిల్లలు ఎస్టీలుగా పరిగణించడానికి వీల్లేదని తీర్పునిచ్చారని గుర్తుచేశారు. -
బీఆర్ఎస్లో రసవత్తర రాజకీయం.. కందులకు కవిత అభయహస్తం!
స్వపక్షమా, ప్రతిపక్షమా అనవసరం. ఏ పార్టీ నుంచి గెలిచినా మనకు లాయల్‌గా ఉంటారా.. అవసరమైతే మనవైపు మొగ్గేవాళ్లేనా అనేదే కొత్త తరహా రాజకీయం. తెలంగాణాలో అలాంటి రాజకీయాలకు కేరాఫ్‌గా మారుతోంది రామగుండం. ఈ క్రమంలో గత ఎన్నికల తర్వాత జరిగిన సేమ్ సీనే మళ్లీ రిపీట్ అవుతుందా అన్నది రామగుండం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో రామగుండం రాజకీయాలు కొద్దిగా భిన్నంగా కనిపిస్తాయి. అందుకు గత ఎన్నికలే ఓ ఉదాహరణ అయితే.. ఈ ఎన్నికల్లో కూడా అదే సీన్ పునరావృతమయ్యే అవకాశాలు కనిపించడమే అందుకు కారణం. గత ఎన్నికల్లో రామగుండం అధికార బీఆర్ఎస్ అభ్యర్థిగా సోమారపు సత్యనారాయణ బరిలోకి దిగినా.. ఏఐఎఫ్బీ నుంచి సింహం గుర్తుపై ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పోటీలో ఉండి గెల్చారు. కానీ, ఆయన ఆ తర్వాత పూర్తిగా గులాబీ కండువా కప్పుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తరహాలో మారిపోయారు. అంతేకాదు, సోమారపుపై నాడున్న వ్యతిరేకత.. చందర్‌పై ఉన్న సానుభూతి పవనాల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పెద్దలు కూడా రాజకీయంలో భాగంగా చందర్‌ను ఒకింత ప్రోత్సహించినట్టుగా కూడా వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయంలో ఇప్పటికీ ప్రస్తుత బీజేపీ నేత సోమారపు సత్యనారాయణలో ఒకింత బాధ కనిపిస్తూనే ఉంటుంది. కేసీఆర్ లిస్ట్ ఫైనల్ కాదు.. గత ఎన్నికల్లో సిట్టింగ్ ఉండగా.. బూమ్‌లో ఉన్న మరో నేతను ప్రోత్సహించినట్టే ఈసారి కూడా జరుగబోతుందా అన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్న అంశం. చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలనే మళ్లీ కేసీఆర్ అభ్యర్థులుగా ప్రకటించినా.. బీఫామ్ ఇచ్చేనాటికి పరిస్థితుల్లో మార్పు ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అభ్యర్థులుగా ప్రకటించినవారు.. గులాబీబాస్ ప్రకటన తర్వాత నియోజకవర్గాల్లో ఎలా ఉంటున్నారు.. అందరినీ కలుపుకుపోతున్నారా అనేది అంతర్గత సర్వేలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌పై అసంతృప్త నేతలు పెద్దఎత్తున తిరుగుబావుటా ఎగురేయడం.. ఏకంగా రెండుసార్లు ఇద్దరు మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ చర్చలు జరిపితేనేగానీ.. ఓ కొలిక్కి రావడం జరిగింది. సింహం గుర్తు కలిసొచ్చేనా? అయితే, అదంతా తాత్కాలికమేనని.. ఇంకా నివురుగప్పిన నిప్పులాగా సిట్టింగ్ చందర్‌పై అసంతృప్తి అలాగే ఉందనే చర్చ ఉంది. అసంతృప్త నేతల వైఖరీ రామగుండంలో ఇంకా అలాగే కనిపిస్తోంది. ఈ క్రమంలో అసంతృప్త నేతల్లో కీలకంగా వ్యవహరిస్తున్న పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి ఈసారి చందర్‌కు సపోర్ట్ చేసే పరిస్థితే లేదని తేల్చేశారు. తాను ఇండిపెండెంట్‌గా లేకుంటే, అవకాశం దొరికితే గతంలో ప్రస్తుత సిట్టింగ్‌కు సెంటిమెంట్‌గా కలిసివచ్చిన సింహం గుర్తుపైనైనా పోటీ చేయాలని ఆమె ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో అకేషన్నూ తనకనుకూలంగా మార్చుకుంటూ ముందుకెళ్తున్న కందుల సంధ్యారాణి.. రాఖీ పండుగ నేపథ్యంలో కార్మికసంఘాల నాయకులు, కార్మికులకు పెద్దఎత్తున రాఖీలు కట్టి సోదర భావం సెంటిమెంట్‌నూ రగిల్చారు. ఈ నేపథ్యంలో.. కందులకు కవిత అండదండలు కూడా ఉన్నట్టుగా ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. కందులకు కవిత హామీ.. రామగుండం వంటి కార్మిక క్షేత్రంలో అధికారాన్ని అస్సలు విడిచిపెట్టుకోవడానికి అధికారపార్టీ సిద్ధంగా లేనట్టే కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌లో రామగుండం కీలక నాయకులుగా వ్యవహరిస్తున్న బాబర్ సలీమ్ పాషా, హెచ్ఎమ్ఎస్ కీలక నేతైన రియాజ్ అహ్మద్ వంటివాళ్లనూ తమవైపు లాక్కోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. మరోవైపు సిట్టింగ్ చందర్‌పై అసమ్మతి నేతలు వ్యక్తం చేసిన అసంతృప్తే ఇంకా కనిపిస్తే.. సమాంతరంగా అదే స్థాయిలో ప్రజామోదం ఉన్న నేతలను ప్రోత్సహించేందుకూ అధికార బీఆర్ఎస్ సిద్ధంగా ఉండి.. గత ఎన్నికల సీన్‌ను రిపీట్ చేసేందుకు యత్నిస్తోందనే టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎమ్మెల్యేతో పోటీ పడుతూ సై అంటే సై అంటున్న కందుల సంధ్యారాణికి కవిత అభయహస్తమిచ్చిందని.. ఎక్కడా ఎమ్మెల్యేపైగానీ, పార్టీపైగానీ అనుచిత వ్యాఖ్యలు చేయకుండా నీ ప్రచారం నువ్వు చేసుకుపో అని భరోసా ఇచ్చినట్టుగా ఒక ప్రచారమైతే జరుగుతోంది. దీంతో రామగుండం రాజకీయం మొత్తం రాష్ట్రంలోనే ఓ భిన్నమైన ఒరవడితో సాగుతుండటం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
Putta Madhu: అదే జరిగితే పెద్దపల్లి జెడ్పీ కుర్చీ ఎవరికో..?!
మంథని: న్యాయవాద దంపతుల హత్య నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధు పాత్రపై విచారణ జరుగుతున్న సమయంలో ఈ పీఠంపై పలువురు కన్ను పడింది. మొదటి జిల్లా పరిషత్ చైర్మన్‌గా తామంటే తాము అవుతామని ఊహల లోకంలో తేలినవారికి స్వయానా సీఎం కేసీఆర్ పుట్ట మధు పేరు ప్రస్తావించడంతో మిన్నకుండిపోయారు. తాజాగా మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మధు పోలీసుల అదుపులో ఉండడంతో ఆయన పదవికి గండం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసులో ప్రస్తుతం పుట్ట మధును పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను అరెస్టు చేస్తారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే జరిగితే మధు చైర్మన్ పదవి ఊడుతుందని, ఆ స్థానంలో తాము సిద్ధంగా ఉన్నామని పలువురు జెడ్పీటీసీలు అధిష్టానం ఎదుట బారులు తీరినట్లు సమాచారం. వీరిలో పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి మొదటి నుంచి పార్టీలో చురుకుగా పనిచేస్తున్నారు. అటు మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మద్దతుతో జెడ్పీ పీఠం దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈమెతోపాటు జిల్లాలోని మరో ముగ్గురు జెడ్పీటీసీలు సైతం చైర్మన్‌గిరి కోసం పోటీ పడుతున్నారు. పుట్ట మధును పోలీసులు విచారిస్తున్నా.. ఇప్పటివరకు ఆయనపై పార్టీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అయినా మధు పదవి ఎలాగైనా పోతుందనే ముందస్తు సమాచారంతో జెడ్పీటీసీలు చైర్మన్ గిరి కోసం పోటీ పడుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. చదవండి: Etela, Putta Madhu: వాళ్లందరికీ షాక్..! -
బూటుకాలితో తన్నిన కానిస్టేబుల్‌పై వేటు
సాక్షి, పటాన్చెరు: నారాయణ కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కన్నకూతురు చనిపోయిందని రోదిస్తున్న మృతురాలి తండ్రి చంద్రశేఖర్‌ను శ్రీధర్ అనే కానిస్టేబుల్ బూటుతో తన్నాడు. దీంతో విద్యార్థులు పోలీసులపై తిరగబడటంతో వారు లాఠీచార్జి చేయగా పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ఇక సదరు కానిస్టేబుల్ దురుసుతనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.(నారాయణ విద్యార్థిని ఆత్మహత్య: పరిస్థితి ఉద్రిక్తం) ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హోంమంత్రి మహమూద్ అలీ గురువారం సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేశారు. కాగా సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం వెలిమెల నారాయణ బాలికల కళాశాలలో విద్యార్థిని సంధ్యారాణి(16) మంగళవారం బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. (నారాయణ విద్యార్థిని ఆత్మహత్య: కేటీఆర్ స్పందన) -
నారాయణ విద్యార్థిని ఆత్మహత్య: కేటీఆర్ స్పందన
సాక్షి, హైదరాబాద్: నారాయణ కళాశాలలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సంధ్యారాణి అనే విద్యార్థిని బాత్రూమ్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సంధ్యారాణి తండ్రిని పోలీసు కానిస్టేబుల్ శ్రీధర్ బూటు కాలుతో తన్నిన విషయం తెలిసిందే. అయితే సంధ్యారాణి తండ్రిపై దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్ శ్రీధర్ తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీజీపీని కేటీఆర్ కోరారు. బాధితులు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వారికి అధికారులు అండగా నిలవాలని కేటీఆర్ తెలిపారు. చదవండి: నారాయణ విద్యార్థిని ఆత్మహత్య: పరిస్థితి ఉద్రిక్తం -
నారాయణ విద్యార్థిని ఆత్మహత్య: పరిస్థితి ఉద్రిక్తం
-
నారాయణ విద్యార్థిని ఆత్మహత్య; ఉద్రిక్తత
సాక్షి, సంగారెడ్డి: పటాన్చెరు ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నిన్న వెలిమల నారాయణ కళాశాలలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సంధ్యారాణి అనే విద్యార్థిని బాత్రూమ్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే కళాశాల యాజమాన్యం వేధింపుల వల్లే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందంటూ బుధవారం విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. మృతదేహాన్ని పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా అడ్డుకున్నారు. అంతేకాకుండా మార్చురీలో ఉన్న సంధ్యారాణి మృతదేహాన్ని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మృతదేహం తరలింపును పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మృతురాలి తండ్రిని ఓ పోలీస్ అధికారి బూట్ కాళ్లతో తన్నారు. ఈ సంఘటనతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమువుతున్నాయి. దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబీకులు కోరుతున్నారు. న్యాయం చేయమని అడిగితే దౌర్జన్యానికి దిగుతారా అని ప్రశ్నిస్తున్నారు. కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలి సంధ్యారాణి మృతిపై నిరసన వ్యక్తం చేసిన ఏబీవీపీ, తెలంగాణ జన సమితి విద్యార్థి నేతలు బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు పోలీసులు అదుపులోనే ఉన్నారు. అరెస్టు చేసిన విద్యార్థి నేతల్ని పోలీసులు బేషరతుగా విడుదల చేయాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు. సంధ్యారాణి తండ్రి చంద్రశేఖర్‌ను బూటుకాలితో తన్నిన కానిస్టేబుల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. నారాయణ విద్యా సంస్థ ల యాజమాన్యంపై క్రిమినల్ కేసు పెట్టాలని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయకపోతే విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఎస్పీ చందనా దీప్తి సీరియస్ పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రి వద్ద సంధ్యారాణి తండ్రి చంద్రశేఖర్‌ను బూటు కాలితో కానిస్టేబుల్ తన్నిన ఘటనపై సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ ఎస్పీ చందనా దీప్తి సీరియస్ అయ్యారు. కానిస్టేబుల్ శ్రీధర్‌ను హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఎస్పీ చందనా దీప్తి ఆదేశించారు. కాగా, వెలిమేల గ్రామంలోని నారాయణ రెసిడెన్షియల్ కాలేజ్ లో సంధ్యారాణి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. మధ్యాహ్నం భోజనం విరామ సమయంలో బాత్రూమ్లోకి వెళ్లిన సంధ్యారాణి అక్కడే ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న యాజమాన్యం నలగండ్లలోని సిటీజన్ ఆసుపత్రికి తరలించారు. -
టీచర్ పోస్టుల భర్తీ షురూ
సాక్షి, అమరావతి: టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ – 2018 నియామకాల ప్రక్రియ గురువారం రాత్రి నుంచి ప్రారంభమైంది. తొలుత మోడల్ స్కూళ్లు, ఏపీ బీసీ వెల్ఫేర్ స్కూళ్లలో ప్రిన్సిపాల్ పోస్టుల ప్రొవిజినల్ సెలెక్షన్ జాబితాను పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్లో విడుదల చేసింది. సెలెక్షన్ కమిటీ పరిశీలించి ఖరారు చేసిన అనంతరం జాబితాను శుక్రవారం ప్రకటించారు. అభ్యర్థులు దీన్ని అనుసరించి శని, ఆదివారాల్లో ధ్రువపత్రాలను నిర్దేశిత వెబ్సైట్ ద్వారా అప్లోడ్ చేయాలి. ఐదు కేటగిరీల పోస్టులకు పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రకటించింది. సెప్టెంబర్ 4తో ముగియనున్న షెడ్యూల్.. రాష్ట్రంలో 7,902 పోస్టుల భర్తీకి డీఎస్సీ – 2018 నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించిన మెరిట్ జాబితాలను ఇంతకు ముందే ఖరారుచేసినా ఎన్నికల కోడ్, కోర్టు కేసుల వల్ల జిల్లాలవారీగా సెలెక్షన్ జాబితాల విడుదలలో జాప్యం జరిగింది. ఎన్నికల కోడ్ ముగిసి కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఇటీవల పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేయడం తెలిసిందే. తొలిసారిగా పోస్టుల భర్తీ ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే నిర్వహించేలా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పోస్టులు మిగిలిపోకుండా ఉండేందుకు విభాగాల వారీగా వేర్వేరుగా షెడ్యూళ్లను ప్రకటించారు. అదే సమయంలో ఆయా విభాగాల్లో మూడు నాలుగుసార్లు ప్రొవిజనల్ సెలెక్షన్ జాబితా విడుదల చేసేలా చర్యలు చేపట్టారు. ఈనెల 20వ తేదీ రాత్రి నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ ఐదు కేటగిరీల పోస్టుల భర్తీకి వీలుగా ఐదు షెడ్యూళ్లలో కొనసాగుతుంది. సెప్టెంబర్ 4వ తేదీతో ముగిసేలా పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌ను ప్రకటించింది. పోస్టులు మిగలకుండా చర్యలు గతానికి భిన్నంగా పాఠశాల విద్యాశాఖ ఈసారి భర్తీ ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. ప్రొవిజనల్ సెలెక్షన్ జాబితాల విడుదల, కన్ఫర్మేషన్, సర్టిఫికెట్ల అప్లోడ్, పరిశీలన, అనంతరం ప్రొవిజనల్ సెలెక్షన్ జాబితాల విడుదల ఇలా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. చివరిగా తుది సెలెక్షన్ జాబితా ప్రకటించి అభ్యర్ధులకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. అనంతరం పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తారు. ప్రొవిజనల్ ఎంపిక జాబితాలను మూడు దఫాలుగా ఇవ్వడం వల్ల ఎవరైనా అనర్హతతో వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చినా ఆ పోస్టు మిగలకుండా తదుపరి మెరిట్ అభ్యర్థికి అవకాశమిచ్చేలా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అలాగే ఒకే అభ్యర్థి పలు కేటగిరీల్లోని పోస్టులకు ఎంపికైనా ఏ పోస్టులో చేరేందుకు ప్రాధాన్యమిస్తున్నారో ముందుగానే ఆప్షన్ ఇచ్చే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అన్ని ప్రొవిజనల్ జాబితాలు వెలువడిన అనంతరం వారికి ఆప్షన్‌కు అవకాశం కల్పిస్తామని అధికారులు పేర్కొన్నారు. దీనివల్ల అలాంటి అభ్యర్ధులు ఏదో ఒక పోస్టుకు ఆప్షన్ ఇస్తే మిగతా పోస్టులకు మెరిట్ జాబితాలోని తదుపరి అభ్యర్థిని ఎంపిక చేస్తామని వివరించారు. తద్వారా ఏ కేటగిరీలోనూ పోస్టులు మిగలకుండా అర్హులైన అభ్యర్ధుల ద్వారా అన్ని పోస్టులు భర్తీ చేస్తామని పాఠశాల విద్యాశాఖ అధికారి ఒకరు వివరించారు. ప్రిన్సిపాల్ పోస్టులకు ఈ ధ్రువపత్రాలు తెచ్చుకోవాలి... ప్రిన్సిపాల్ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్ధులు పరిశీలన కోసం వచ్చే సమయంలో నిర్ణీత సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటిమేషన్ లెటర్, అప్లికేషన్ ఫారం, హాల్‌టిక్కెట్, అర్హత ధ్రువపత్రాలు, ఎస్సెస్సీ సర్టిఫికెట్, ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ తత్సమాన ధ్రువపత్రాలు, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ పత్రాలు, బీఈడీ, ఎంఈడీ తత్సమాన సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రాలు (ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్ధులకు), మాజీ సైనికోద్యోగుల సర్టిఫికెట్లు, దివ్యాంగ అభ్యర్థులు సంబంధిత మెడికల్ బోర్డు ధ్రువీకరణ పత్రాలు వెంట తెచ్చుకోవాలి. ఒరిజినల్ పత్రాలతో పాటు మూడు సెట్ల నకలు ధ్రువపత్రాల కాపీలను కూడా తీసుకురావాలని పేర్కొన్నారు. ధ్రువపత్రాల పరిశీలన శని, ఆదివారాల్లో ఉంటుందన్నారు. ఈ రెండు రోజుల్లో అభ్యర్ధులు ‘సీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ వెబ్సైట్లో ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలని సూచించారు. అనంతరం అభ్యర్ధులు ఈనెల 24వ తేదీన 9 గంటల నుంచి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలోని మోడల్ స్కూల్ విభాగంంలో నిర్వహించే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలని సూచించారు. ప్రొవిజినల్ సెలెక్షన్ జాబితాలో ఉన్న అభ్యర్ధులంతా హాజరు కావాలన్నారు. మోడల్ స్కూళ్లు, బీసీ వెల్ఫేర్ స్కూళ్ల పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులు ఏదో ఒక మేనేజ్మెంట్ స్కూల్‌కు ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుందని కమిషనర్ వివరించారు. -
టెన్త్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో బాలికలు అగ్రస్థానంలో నిలిచారు. మొత్తం 94.88 శాతం మంది ఉత్తీర్ణులవ్వగా అందులో బాలికలు 95.09 శాతం మంది, బాలురు 94.68 శాతం మంది ఉన్నారు. గత ఏడాదికన్నా ఈసారి 0.40% ఉత్తీర్ణత పెరిగింది. మంగళవారం విజయవాడ ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో కమిషనర్ సంధ్యారాణి ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 6,30,082 మంది పరీక్ష రాశారు. 2,816 మంది పరీక్షకు హాజరుకాలేదు. పరీక్ష రాసిన వారిలో రెగ్యులర్ విద్యార్థులు 6,19,494 మంది, ప్రైవేటు విద్యార్థులు (ఒకసారి రాసి ఫెయిలై మళ్లీ పరీక్ష రాసిన వారు) 10,588 మంది ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 5,87,765 (94.88) మంది ఉత్తీర్ణులవ్వగా పరీక్ష రాసిన బాలురలో 94.68 శాతం (3,00,548) మంది, బాలికల్లో 95.09 శాతం (2,87,217) మంది పాస్ అయ్యారు. ప్రైవేటు విద్యార్థుల్లో 6,228 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది 11,690 పాఠశాలల నుంచి టెన్త్ పరీక్షలకు విద్యార్థులు హాజరుకాగా వీటిలో 5,464 (46.74 శాతం) స్కూళ్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. మూడు స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాసవ్వలేదు. వీటిలో రెండు ప్రైవేటు స్కూళ్లు, ఒకటి ఎయిడెడ్ స్కూల్ ఉంది. ఫలితాల్లో తెలుగు మాధ్యమ విద్యార్థుల కన్నా ఆంగ్ల మాధ్యమ విద్యార్థులు ముందంజలో ఉన్నారు. ఆంగ్ల మాధ్యమ విద్యార్థులు 97.54 శాతం మంది, తెలుగు మాధ్యమ విద్యార్థులు 90.46 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. తూర్పుగోదావరి ఫస్టు టెన్త్ ఫలితాల్లో ఈఏడాది 98.19 శాతంతో తూర్పుగోదావరి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. చివరి స్థానంలో 83.19 శాతంతో నెల్లూరు జిల్లా ఉంది. ఎయిడెడ్ స్కూళ్ల విద్యార్థులు 87.16 శాతంతో ఉత్తీర్ణతలో చివరి స్థానంలో నిలిచారు.10 జీపీఏలో కూడా తూర్పుగోదావరి జిల్లానే ముందువరసలో ఉంది. అత్యధికంగా తూర్పుగోదావరిలో 5,456 మందికి 10 జీపీఏరాగా నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 1,271 మందికి 10 జీపీఏ లభించింది. కాగా, ఫలితాల విడుదల కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ డైరెక్టర్ ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటుకే ఎక్కువగా 10 జీపీఏ పాయింట్లు అత్యధిక శాతం 10 జీపీఏ పాయింట్లను ప్రైవేటు పాఠశాలలే సాధించాయి. ఇంటర్నల్ మార్కులను ఇష్టానుసారం ప్రైవేటు పాఠశాలలు వేసుకుంటున్నాయని, అందుకే 10 జీపీఏ పాయింట్లు ఆ పాఠశాలలే సాధిస్తున్నాయని ఆరోపణలున్నాయి. ఈ ఏడాది ఫలితాల్లో అదే తీరు కనిపించింది. టెన్ జీపీఏ సాధించిన విద్యార్థులు 33,972 ఉంటే.. ఇందులో 29,016 మంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థులే కావడం గమనార్హం. 10 జీపీఏ సాధించిన యాజమాన్యాలు, విద్యార్థుల వివరాలు.. సబ్జెక్టుల వారీగా ఏ1 గ్రేడ్లు సాధించిన విద్యార్థులు.. ఇంగ్లీషు: 2,04,746 సోషల్ స్టడీస్: 1,70,587 ఫస్టు లాంగ్వేజ్: 1,68,193 మేథమెటిక్స్: 1,41,417 సెకండ్ లాంగ్వేజ్: 1,03,086 జనరల్ సైన్సు: 90,025 జూన్ 17 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫెయిలైన విద్యార్థుల కోసం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీని జూన్ 17 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు కమిషనర్ సంధ్యారాణి తెలిపారు. అభ్యర్థులు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫలితాల కోసం ఎదురు చూడకుండా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పరీక్షలకు జూన్ 6వ తేదీలోగా దరఖాస్తు చేయాలన్నారు. పరీక్ష ఫీజును ఆన్లైన్లో చెల్లించవచ్చని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థుల మార్కుల మెమోలను రెండు రోజుల్లో ఠీఠీఠీ. bట్ఛ్చp. ౌటజ వెబ్సైట్లో పొందుపర్చనున్నామని వివరించారు. వీటి ఆధారంగా ఇంటర్మీడియెట్ కాలేజీల్లో చేరవచ్చని చెప్పారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ గడువు మే 30 రీకౌంటింగ్ కోసం విద్యార్థులు సబ్జెక్టుకు రూ. 500 చొప్పున ఈనెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని సంధ్యారాణి తెలిపారు. ఫీజును సీఎఫ్ఎంఎస్ చలానా ద్వారా చెల్లించాలన్నారు. రీవెరిఫికేషన్ కోసం అభ్యర్థులు దరఖాస్తును సంబంధిత ప్రధానోపాధ్యాయుని ద్వారా ధ్రువీకరణ సంతకం చేయించి హాల్ టికెట్ జిరాక్సు కాపీతో పాటు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఈనెల 30 లోగా సమర్పించాలని పేర్కొన్నారు. దరఖాస్తు నమూనాను www. bseap. org వెబ్సైట్ నుంచి, లేదా డీఈవో కార్యాలయం నుంచి పొందవచ్చన్నారు. రీవెరిఫికేషన్ కోరే అభ్యర్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ. 1,000 చొప్పున చెల్లించాలన్నారు. రీవెరిఫికేషన్లో మార్కులను లెక్కించడం, అన్ని సమాధానాలకు మార్కులు ఇచ్చారా? లేదా? అన్న అంశాలను పరిశీలించడం, మూల్యాంకనం చేయని సమాధానాలను తిరిగి మూల్యాంకనం చేయించడం ఉంటుందన్నారు. ‘గురుకులాల్లో 95.40శాతం ఉత్తీర్ణత’ పదో తరగతి ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు 95.40శాతం ఉత్తీర్ణత సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పారని సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ కార్యదర్శి కల్నల్ వి.రాములు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 175 గురుకుల పాఠశాలల్లో 13,064 మంది పరీక్షలకు హాజరు కాగా, 12,463 మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. చిత్తూరు జిల్లా 99.05 శాతం ఉత్తీర్ణత సాధించి ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. మొత్తం 71 గురుకులాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషమని తెలిపారు. ఇక ఏపీటీవీఆర్ఐ సొసైటీకి చెందిన విద్యార్థులు 94.35 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 52 రెసిడెన్షియల్ స్కూళ్లలో 23 స్కూల్స్ నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. వచ్చే ఏడాది నుంచి టెన్త్ ఇంటర్నల్ మార్కులు రద్దు! రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఇంటర్నల్ మార్కుల కేటాయింపు రద్దు చేయనున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి మంగళవారం తెలిపారు. నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం యథాతథంగానే కొనసాగిస్తూనే పబ్లిక్ పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులు లేకుండా 100 మార్కులకే పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్నల్ మార్కులు కేటాయింపు విధానంలో లోపాలు ఉన్నాయి. పాఠశాలల్లో అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో వీటిని రద్దు చేయాలని పలువర్గాల నుంచి డిమాండ్లు వచ్చాయి. వీటిని పరిశీలించిన పాఠశాల విద్యాశాఖ ఈ ఇంటర్నల్ మార్కులను రద్దు చేసేందుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. వీటికి ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఇంటర్నల్ మార్కుల రద్దు అమల్లోకి వస్తుందని కమిషనర్ వివరించారు. మంగళవారం ఎస్సెస్సీ ఫలితాల విడుదల సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది నుంచి టెన్త్ ప్రశ్నపత్రం మోడల్లో కూడా మార్పులు ఉంటాయని, దీనిపై నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నామని తెలిపారు. టెన్త్ మార్కుల్లో స్పోర్ట్సు కోటాకు కూడా కొన్ని మార్కులు కేటాయించాలని భావిస్తున్నామన్నారు. టెన్త్ ఫలితాల విడుదలలో పలు జాగ్రత్తలు తీసుకోవడంతో ఎలాంటి లోపాలు లేకుండా ధ్రువపత్రాలు జారీ కానున్నాయని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి జూన్ నుంచే నామినల్ రోల్స్‌ను స్కూళ్ల నుంచి తీసుకుంటామని తెలిపారు. ముందుగానే తప్పులను సవరించి ధ్రువపత్రాలు ఇవ్వడానికి వీలవుతుందన్నారు. జూన్ ఆఖరుకు డీఎస్సీ నియామకాలు డీఎస్సీ నియామకాలను జూన్ ఆఖరుకు పూర్తిచేసే అవకాశాలున్నాయని కమిషనర్ పేర్కొన్నారు. డీఎస్సీ ఫలితాలు ఇంతకు ముందే ప్రకటించినా.. ఎన్నికల కోడ్ వల్ల జిల్లాల వారీగా ఎంపిక జాబితాల ప్రకటన చేయలేదన్నారు. కొత్త ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డీఎస్సీ నియామకాలపై చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త టీచర్ల నియామకానికి ముందే బదిలీల ప్రక్రియ ఉంటుందన్నారు. ఇదివరకటి దరఖాస్తులను అనుసరించి వీటిని చేస్తారన్నారు. సాధారణ బదిలీలు ఉండవని తెలిపారు. పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియ కూడా ఉంటుందని చెప్పారు. -
స్నేహితురాలివి మాత్రమే అంటే చెంప పగులగొట్టరా..
ఒంగోలు: నేను ఓ సాధారణ అడపిల్లను, అమ్మ, పెద్దమ్మ చనిపోవడంతో నాకు పెద్ద దిక్కు ఎవరూ లేరు. నేడు నేను ఒంటరిని. నాలుగేళ్లుగా నాతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండి నేడు నన్ను కాదు పొమ్మంటున్నాడు. ఇందుకు అతని తల్లితో పాటు బంధువులు, అండగా నిలుస్తున్నారు. రూ. 75 లక్షలకుపైగా నావద్ద డబ్బులు లాగేసుకున్నాడు. అంతే కాదు బంగారం కూడా స్వాహా చేశాడు. తీరా నేడు కేవలం స్నేహితురాలివి మాత్రమే అంటే చెంప పగులగొట్టరా.. అంటూ వాసిరెడ్డి సంధ్యారాణి అలియాస్ సహస్త్ర పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఒంగోలు ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం పెట్టి వివరాలు మీడియాకు వెల్లడించారు. అమ్మ, పెద్దమ్మ చనిపోయిన దుఃఖంలో ఉన్న తన మొబైల్ నెంబర్‌ను టంగుటూరుకు చెందిన పూనాటి అరవింద్ స్వరూప్ ఎలా సంపాదించాడో తెలియదన్నారు. తొలుత అతనితో మాట్లాడేందుకు తాను తిరస్కరించినా రోజు ఫోన్‌చేస్తూ నాకు ధైర్యం చెప్తుంటే అతని మాయలో పడిపోయానని తెలిపింది. తరువాత కొద్దికాలానికే హైదరాబాద్‌లోని మణికొండలోని తన నివాసానికి వచ్చి మంచి మాటలు చెప్తుండేవాడని, అనతికాలంలోనే ప్రపోజ్ చేశాడన్నారు. తాను అప్పటికే మానసికంగా ఎవరూలేరన్న భావనతో ఉన్నందువల్ల అతని మాయమాటలు గుర్తించక అంగీకరించానని వాపోయింది. తమ ప్రేమ వ్యవహారం అతని తండ్రికి కూడా తెలుసన్నారు. ఆయన మరణానంతరం అరవింద్ స్వరూప్ అసలు కుట్రకు తెరదీశాడంది. తన వద్ద అంచెలంచెలుగా రూ. 75 లక్షలు స్వాహా చేయడంతో పాటు తనకు తెలిసిన స్నేహితుల వద్ద మరో రూ. 7 లక్షల వరకు అప్పులు కూడా చేసి నేడు తనను తల ఎత్తుకోకుండా చేశాడని వాపోయింది. తనను పెళ్లిచేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు కాబట్టే ఆధారాలతో తాను టంగుటూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళితే పోలీసులు తీసుకోలేదన్నారు. 15వ తేదీ జిల్లా ఎస్పీని కలిసేందుకు వెళ్లగా అదనపు ఎస్పీతో మాట్లాడేందుకు అనుమతించారని, ఆయనకు తన ఫిర్యాదును కూడా అందజేశానన్నారు. 16వ తేదీ టంగుటూరు పోలీసుస్టేషన్ వద్ద ఉండగా తనను మాట్లాడుకుందాం రమ్మని పిలిచి అరవింద్ తల్లి కోటేశ్వరమ్మ, కొంతమంది కొట్టారని ఆరోపించారు. 19వ తేదీ చంద్రశేఖర్ అనే వ్యక్తి తాను అండగా ఉంటాను రమ్మని చెప్పి పిలిపించాడని, కేసు వాపసు తీసుకోకపోతే చంపేస్తామంటూ బెదిరించారని, తనపై కొడవలితో దాడిచేసి చంపేందుకు కూడా యత్నించారని, మీడియా స్పందించకపోయి ఉంటే తన ప్రాణాలు ఎప్పుడో గాలిలో కలిసిపోయి ఉండేవని కన్నీళ్ల పర్యంతం అయ్యారు. అయితే మీడియాలో కథనాలు రావడంతో అర్ధరాత్రి సమయంలో పోలీసుస్టేషన్‌కు రావాలని టంగుటూరు పోలీసులు ఒత్తిడిచేశారన్నారు. తీరా ఈనెల 25వ తేదీ హడావిడిగా తొలుత తాను ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదుచేశారని, కానీ దాని ఎఫ్ఐఆర్ కాపీ కూడా తనకు అందజేయలేదన్నారు. తాను తొలుత ఇచ్చిన ఫిర్యాదుల అనంతరం తనపై జరిగిన దాడులకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు వెళితే టంగుటూరు పోలీసులు ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించారని వాపోయింది. దీంతో తాను ఎట్టకేలకు ఎస్పీ మొబైల్ నెంబర్ తెలుసుకొని ఆదివారం ఫోన్‌చేశానని, ఆయన స్పందించి అసలు ఈ ఘటన గురించి తన దృష్టికి రాలేదంటూ తప్పక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆయన స్పందిచండంతో న్యాయం జరుగుతుందన్న నమ్మకం కుదిరిందని రెండు రోజుల్లో ఎస్పీని కలిసి మొత్తం వ్యవహారాన్ని తెలియజేయనున్నట్లు పేర్కొంది. కులం వ్యవహారంగా చిత్రీకరించడం సరికాదు అరవింద్ తప్పుచేశాడు కాబట్టే దాక్కుంటున్నాడని, తాను తప్పుచేయలేదు కాబట్టే తెలంగాణా నుంచి ధైర్యంగా వచ్చి వారి ఇంటివద్దకు వెళ్లగలుగుతున్నానని సహస్ర పేర్కొంది. తాము ఒకే సామాజిక వర్గం అయినంత మాత్రాన కులం వ్యవహారంగా చిత్రీకరించేందుకు జరుగుతున్న కుట్రను ప్రతి ఒక్కరూ ఖండించాలని, ఒక ఆడపిల్లకు జరుగుతున్న అన్యాయంగా గుర్తించాలని వేడుకుంటున్నానన్నారు. తనకు జరుగుతున్న అన్యాయంపై గ్రామంలో చాలామంది సానుభూతి వ్యక్తం చేస్తున్నా ఆ కుటుంబం అంటే భయం ఉండడం వల్లే ముందుకు రాలేకపోతున్నారన్నారు. ఇదే ఆ గ్రామానికి చెందిన ఆడపిల్లకు జరిగినా ఇదే విధంగా మౌనంగా ఉంటారా అంటూ భావోద్వేగానికి గురైంది. తన వద్ద డబ్బులకు సంబంధించి ఉన్న పలు పత్రాలను మీడియాకు చూపించారు. తనతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా ఆమె మీడియా ముందు చూపించి స్నేహితులు అయితే ఇలానే ఉంటారా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా రాద్దాంతాన్ని మానుకొని తనతో పెళ్లికి ముందుకు రావాలని, లేనిపక్షంలో అరవింద్‌కు కఠిన శిక్ష వేయడంతో పాటు తనపై దాడులకు దిగిన వారందరిపైన కేసులు నమోదుచేయాలని డిమాండ్ చేస్తున్నట్లు వాసిరెడ్డి సంధ్యారాణి అలియాస్ సహస్ర పేర్కొన్నారు. -
నన్ను అనుమానించావు.. ఇక సెలవు
శ్రీకాకుళం, పొందూరు: మండలంలోని తండ్యాం పంచాయతీ శ్రీరామ్‌నగర్ కాలనీలో వివాహిత మృతి కలకలం రేపింది. మేదరమెట్ల సంధ్య(28) మృతి ఎన్నో అనుమానాలను రేకెత్తించింది. ఆమె మరణించిన తీరు మండల ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. సంధ్యది ఆత్మహత్యేనని పోలీసులు అంటున్నారు. కాదు అది హత్యేనని మృతురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు. దీంతో ఇది హత్యా..? ఆత్మహత్య..? అనే అనుమానం ప్రతి ఒక్కరిలో నెలకొంది. వివరాల్లోకి వెలితే... తండ్యాం పంచాయతీలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో మేదరమెట్ల వెంకటరమణ, సంధ్య నివాసముంటున్నారు. మూడేళ్ల క్రితం వీరికి ప్రేమ వివాహమైంది. వీరికి పాప లహరి పుట్టి ఏడాది గడచింది. ఏం జరిగిందో ఏమో గాని ఆమె ఉన్నట్టుండి ఒక్కసారిగా మృతిచెందింది. గురువారం ఉదయమే సంధ్య మరణవార్త ఆమె సోదరుడు శ్రీనివాసరావుకు ఫోన్లో తెలిపారు. దీంతో అతడు సంధ్య ఇంటికి వెళ్లి చూసేసరికి మరణించి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హెడ్ కానిస్టేబుల్ భాదుషా వెళ్లి మృతురాలిని చూసి ఎస్ఐ బాలరాజుకు సమాచారం అందించారు. ఎస్ఐ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి సీఐ వై.రామకృష్ణ, డీఎస్పీ భీమారావుకు తెలియజేశారు. వారు కూడా సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. క్లూస్ టీం వచ్చి వివరాలను సేకరించింది. మృతురాలు సంధ్య ఉరి వేసుకొన్నట్టు ఉరికి ఉపయోగించిన వస్త్రాలను భర్త వెంకటరమణ డీఎస్పీ, సీఐలకు అందించారు. రాత్రి పడుకొనేటప్పుడు ఎటువంటి గొడవ జరగలేదని, తాను గురువారం ఉదయం నిద్రలేచేసరికి తన భార్య ఉరివేసుకొన్నట్టు గమనించి వస్త్రాన్ని కోసానని కింద పడిపోవటంతో అందరికి ఫోన్లు చేశానని వెంకటరమణ తెలిపాడు. పోలీసు అధికారులు ఇంటిని పరిశీలించగా మృతురాలు రాసిన లేఖ లభ్యమైందని చెప్పారు. ఈ లేఖలో తన భర్త ఇబ్బందులు పెడుతూ అనుమానిస్తుండటంతో ఆత్మహత్య చేసుకొంటున్నట్టు ఉందని తెలిపారు. దీంతో ఇది ఆత్మహత్యగా ధృవీకరించామని చెప్పారు. కాగా, తహసీల్దార్ దిలీప్ చక్రవర్తి, ఆర్ఐ ఈశ్వరరావు, వీఆర్ఓలు అంకమ్మ, అసిరయ్య, సీతయ్యల సమక్షంలో పోలీసులు శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టానికి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. సంఘటనా స్థలంలో వివరాలు సేకరిస్తున్న క్లూస్‌టీం అయ్యో పాపం చిన్నారి తల్లి మృతి చెందడంతో ఏడాది చిన్నారి లహరిని చూసి గ్రామస్తులు అయ్యో పాపం అని చలించిపోయారు. క్షణం కూడా తల్లిని విడిచి ఉండలేని పాప ఏడుస్తుంటే అందరూ చూసి కంటతడి పెట్టుకొన్నారు. పాప బంధువులతో పాటు గ్రామస్తులు విచారం వ్యక్తం చేయడమే తప్ప పాపను ఓదార్చడంలో విఫలమయ్యారు. ఇది హత్యే... తమ కుమార్తె సంధ్యది హత్యేనని ఆమె తల్లిదండ్రులు కాళ్ల వరలక్ష్మి, శంకరరావు తెలిపారు. నిత్యం తాగడం తన కుమార్తెను హింసించడం, కొట్టడం వంటివి అల్లుడు చేసేవాడని అంటున్నారు. తన కుమార్తె ఆత్మహత్య చేసుకొనేంత పిరికిది కాదని చెబుతున్నారు. కచ్చితంగా తమ కుమార్తెను అల్లుడు హత్య చేశాడని అంటున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండేదని, రెండు రోజుల క్రితమే ఇక్కడికి వచ్చిందని తల్లిదండ్రులు చెప్పారు. అల్లుడే హత్య చేశాడని చెబుతున్నారు. సంఘటనా స్థలంలో పరిశీలన బట్టి ఆత్మహత్యే... సంఘటనా స్థలాన్ని పరిశీలించిన మీదట ఇది ఆత్మహత్యగా నిర్ధారిస్తున్నాం. ఆమె రాసిన లేఖ ఆధారంగా ఆత్మహత్యగా అనుమానించి కేసును దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ భీమారావు తెలిపారు. -
సంధ్యపై అసత్య ప్రచారం
సాక్షి, హైదరాబాద్: తన కుమార్తెను దారుణంగా చంపిన కార్తీక్‌ను కఠినంగా శిక్షించాలని సంధ్యారాణి తల్లి సావిత్రమ్మ ప్రభుత్వాన్ని కోరారు. ‘నన్ను ఎలా కాల్చాడో అలానే అతన్ని కూడా కాల్చాలని’ ప్రాణంపోయే సమయంలో తన కూతురు కోరిందని ఆమె వెల్లడించారు. చనిపోయిన తర్వాత కూడా సామాజిక మాధ్యమాల్లో, కొన్ని చానల్స్‌లో సంధ్యపై అసత్య ప్రచారం చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంధ్యారాణి సోదరుడు సాయికుమార్‌తో కలిసి ఆమె మాట్లాడుతూ.. నిందితుడు తన కూతురును రోజూ ఆఫీసుకు తీసుకువెళ్లి, తీసుకొచ్చేవాడన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించాలని, బస్తీ వాసులను విచారిస్తే ఈ విషయం తెలుస్తుందన్నారు. కార్తీక్‌కు, తన కుమార్తెకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఘటనలో నిందితుడి తల్లి హస్తం కూడా ఉందన్న అనుమానం కలుగుతోందని, ఆమెను కూడా విచారించాలని కోరారు. నిందితుని ఇంటివద్దకు వెళ్లి వారి కుటుంబం గురించి విచారించగా వారు ఎంతో దుర్మార్గులని తేలిందన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సంధ్యారాణి తల్లి సావిత్రమ్మ మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు బత్తుల రాంప్రసాద్ మాట్లాడుతూ.. సంధ్యారాణి హత్య మరో ఢిల్లీ నిర్భయ ఘటన లాంటిదే అన్నారు. మరణించిన తర్వాత కూడా సంధ్యపై అసత్య ప్రచారాలు చేయడంతో ఆమె ఆత్మకూడా శాంతించదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఒక మహిళను పెట్రోల్‌పోసి తగలబెట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకరమన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సంధ్యారాణి కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, పక్కా ఇల్లు, సంధ్యారాణి తల్లి సావిత్రమ్మకు నెలకు రూ. 5 వేల ఫించన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పెండ్యాల భానుప్రసాద్, నిమ్మ బాబూరావు, ఉత్తమ్ శ్రీనివాస్, ప్రభాకర్ రావు తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. -
సంధ్య అంటే 'టామీ'కి ఎంత ప్రేమో!
-
కార్తీక్‌ను పెట్రోల్ పోసి తగలబెట్టాలి: బంధువులు
సాక్షి, హైదరాబాద్: ప్రేమించలేదని సంధ్యారాణిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన నిందితుడు కార్తీక్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సంధ్యారాణి ప్రాణాలను పొట్టనబెట్టుకున్న కిరాతకుడు కార్తీక్‌ను కఠినంగా శిక్షించాలని సంధ్యారాణి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అతన్ని కూడా పెట్రోల్ పోసి తగలబెట్టాలని గట్టిగా కోరుతున్నారు. సంధ్యారాణి సజీవ దహనం నేపథ్యంలో నగరంలో మహిళల భద్రతపైనా ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు మాత్రం దీనిని ప్రత్యేక ఘటనగా చూడాలని, నగరంలో మహిళల భద్రతకు ఇది ముడిపెట్టకూడదని అంటున్నారు. ప్రేమోన్మాది కార్తీక్ నిప్పంటించడంతో తీవ్రంగా గాయపడిన బాధితురాలు సంధ్యారాణి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన దాడి తర్వాత 80 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం 7.20 గంటల ప్రాంతంలో కన్నుమూసింది. దీంతో హత్యాయత్నం కేసును హత్య కేసుగా మార్చిన లాలాపేట్ పోలీసులు నిందితుడు కార్తీక్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలోని వాటితోపాటు మరికొన్ని సెక్షన్లు జోడించారు. -
కార్తీక్‌ను నేనే పోలీసులకు అప్పగించా
కనుమూసిన ప్రేమోన్మాది బాధితురాలు ప్రేమోన్మాది నిప్పంటించడంతో తీవ్రంగా గాయపడిన సంధ్యారాణి మృత్యువుతో పోరాడి శుక్రవారం ఉదయం గాంధీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. దీంతో లాలాపేట్ భజన సమాజం ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంధ్య మృతితో ఆమె కుటుంబం ఓ ఆధారాన్ని కోల్పోయింది. జరిగిన ఘటనపై మహిళా సంఘాలు తీవ్రస్థాయిలో స్పందించాయి. నిందితుని కఠినంగా శిక్షించాలని నినదించాయి. సాక్షి, సిటీబ్యూరో: ఆమె కుటుంబానికి సంధ్య సంపాదన సైతం ఓ ఆధారం. ఆమె మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. లాలాపేట ప్రాంతానికి చెందిన సావిత్రి భర్త దాసు కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. అనంతరం సావిత్రి తన సంతానంతో కలిసి వినోభానగర్‌లో కొంతకాలం నివసించారు. ఆపై కొన్నాళ్ల క్రితం అక్కడ నుంచి లాలాపేట్‌లోని భజన సమాజం ప్రాంతంలోని అద్దె ఇంట్లోకి మారారు. సావిత్రికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. కుమారులు సాయికుమార్, వినోద్, కిరణ్‌లలో అనారోగ్య కారణాల నేపథ్యంలో వినోద్ ఇంటికే పరిమితమయ్యాడు. కుమార్తెలు సరిత, సుజాత, సంధ్యారాణిలలో సరితకు వివాహం కాగా.. సుజాత, సంధ్యరాణి చిరుద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సంధ్య సోదరులైన సాయికుమార్, కిరణ్‌లు స్థానికంగా చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. వీరంతా కలిసే నివసిస్తున్నారు. సంధ్య మరణంతో ప్రస్తుతం ఆ కుటుంబం ఓ దిక్కును కోల్పోయినట్లయ్యింది. శుక్రవారం ఉదయం 7.30 గంటలకు సికింద్రా బాద్‌లో ఉన్న గాంధీ ఆస్పత్రి బరŠన్స్ వార్డులో మృతిచెందిన సంధ్య మృతదేహానికి అక్కడి మార్చురీలో పోస్టుమార్టం పరీక్షలు నిర్వహిం చారు. అక్కడకు ఆమె కుటుంబసభ్యులు, బంధువులు, బస్తీవాసులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. వారి రోదనలతో మార్చురీ ప్రాంతం శోకసంద్రంగా మారింది. విగతజీవిగా పడున్న కుమార్తెను చూసి సంధ్య తల్లి గుండెలవిసేలా విలపించారు. నిందితుడు కార్తీక్‌ను సజీవదహ నం చేయాలని అప్పుడే తన కుమార్తె ఆత్మ శాంతిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మాజీ మంత్రి, పార్లమెంట్ సభ్యుడు బండారు దత్తాత్రేయ, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి మార్చురీ వద్ద సంధ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంధ్యారాణి కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకునేందుకు కృషి చేస్తామన్నారు. హతురాలి తల్లి సావిత్రి ఎంపీ దత్తాత్రేయ కాళ్లు పట్టుకుని రోధిస్తూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, తనకు కలిగిన కడుపుకోత ఎవరికీ కలగకుండా చర్యలు చేపట్టాలని వేడుకోవడం అక్కడి వారి కళ్లు చెమర్చేలా చేసింది. సంధ్య కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని, కార్తీక్‌ను కఠినంగా శిక్షించాలని మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి డిమాండ్ చేశారు. పోస్టుమార్టం అనంతరం సంధ్యారాణి మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో శాంతినగర్‌లోని వారి ఇంటికి తరలించారు. స్థానిక కార్పొరేటర్ ఆలకుంట సరస్వతి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5 వేలు ఆర్థిక సహాయం అందించారు. మహిళా సంఘాల నేతలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు సంధ్య మృతదేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. సంధ్య మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లి సంధ్య కుటుంబ సభ్యులు, బంధువులు మాట్లాడుతూ గతంలో వరంగల్ జిల్లాలో యాసిడ్ దాడి జరిగినప్పుడు 24 గంటలు గడవక ముందే అక్కడి పోలీసులు నిందితుల్ని ఎన్కౌంటర్ చేశారు. ఇప్పుడు కార్తీక్‌ను అలాగే చేయాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులు, బంధువుల ఆశ్రునయనాల మధ్య సాయంత్రం 4 గంటలకు లాలాపేటలోని హిందూ శ్మశానవాటికలో సంధ్యారాణి అంత్యక్రియలు జరిగాయి. సంధ్య కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సంధ్య మృతదేహానికి ఆమె ఇంటి వద్ద నివాళులర్పించిన ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతక్రియల నిమిత్తం రూ.20 వేలు ఆర్థిక సాయం అందించారు. ఆయన మాట్లాడుతూ... సంధ్యారాణి ఘటన చాలా బాధాకరం అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గస్తీని పెంచుతామన్నారు. ప్రేమ పేరుతో వేధింపులకు గురవుతున్న యువతులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. స్థానిక శాసన సభ్యులు, మంత్రి పద్మారావు శబరిమల పర్యటనలో ఉన్నారని, వారు నగరానికి రాగానే మాట్లాడి సంధ్యారాణి కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇంటితో సహా ఇతర సహాయ సహకారాలు అందేలా కృషిచేస్తానని పేర్కొన్నారు. కార్తీక్‌ను నేనే పోలీసులకు అప్పగించా సంధ్యారాణి నిత్యం మా బస్తీ మీదుగా వెళ్తుండేది. ప్రతిరోజు తనను చూసి నవ్వేదని కార్తీక్ చెప్పేవాడు. ఆఫీసుకు వెళ్లడానికి ఇబ్బందిగా ఉందనడంతో అప్పు చేసి బైక్ కొనిచ్చా. అనేకసార్లు సంధ్యారాణిని బండిపై ఎక్కించుకొని లాలాపేట బస్టాండ్‌లో కనిపించాడు. అమ్మాయి ఎవరు అని అడిగితే, మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పాడు. ఆమె కోసమంటూ నాతో ఎన్నోసార్లు రకరకాల వంటకాలు వండించుకుని తీసుకువెళ్లాడు. గురువారం రాత్రి ఫోన్ చేసి ‘సంధ్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాను అమ్మా! బతికుందో లేదో తెలీదు, నేను కూడా చనిపోవడానికి మౌలాలి రైల్వేస్టేషన్‌కు వచ్చాను’ అని చెప్పాడు. నువ్వు చనిపోతే అమ్మాయి కుటుంబ సభ్యులు మన కుటుంబంపైకి వస్తారు. అక్కడే ఉండు అంటూ నేను వెళ్లాను. కార్తీక్‌ను స్వయంగా తీసుకువెళ్లి పోలీసులకు అప్పగించాను. – ఊర్మిల (కార్తీక్ తల్లి) -
‘మూర్ఖుడు.. ఏ శిక్ష వేసినా తప్పులేదు’
సాక్షి, హైదరాబాద్: తన కొడుకు మూర్ఖంగా ప్రవర్తించాడని, అతడికి ఎటువంటి శిక్ష వేసినా అభ్యంతరం లేదని కార్తీక్ తల్లి ఊర్మిళ అన్నారు. శుక్రవారం ఆమె ఓ వార్తా చానల్‌తో మాట్లాడుతూ... తన కొడుకు చేసిన తప్పు మరొకరు చేయొద్దని వేడుకున్నారు. సంధ్యతో కార్తీక్‌కు చాలా రోజులుగా పరిచయం ఉందని తెలిపారు. సంధ్య అప్పుడప్పుడు తమ ఇంటికి వచ్చేదని వెల్లడించారు. కార్తీక్ తన సంపాదన మొత్తం సంధ్యకే ఇచ్చేవాడని, కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య దూరంగా పెరిగిందన్నారు. వారం క్రితం ఆత్మహత్యాయత్నం చేశాడని వెల్లడించారు. సంధ్య వెంటపడొద్దని కొడుక్కి నచ్చజెప్పినట్టు తెలిపారు. సమస్యలుంటే పెద్దవారితో మాట్లాడుకుకోవాలని, ఇలాంటి దారుణాలకు దిగొద్దని కోరారు. ఓ అమ్మాయి ప్రాణం తీశాడు.. తల్లి బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునని చెప్పారు. కార్తీక్‌ను తానే తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్పానని తెలిపారు. గురువారం సాయంత్రం లాలాపేట్ విద్యామందిర్ సమీపంలో సంధ్యారాణిపై కార్తీక్ కిరోసిన్ పోసి నిప్పంటించాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం ప్రాణాలు విడిచింది. నిందితుడు కార్తీక్‌పై 307, 354డీ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. -
ప్లాన్ ప్రకారమే కార్తీక్ దాడి : డీసీపీ సుమతి
సాక్షి, హైదరాబాద్ : సంధ్యారాణి హత్యకేసులో నిందితుడు కార్తీక్‌ను పోలీసులు శుక్రవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. నార్త్ జోన్ డీసీపీ సుమతి కేసు వివరాలను మీడియా సమావేశంలో వివరించారు. ఈ ఘటన దురదృష్టకరమని ...పథకం ప్రకారమే కార్తీక్...సంధ్యారాణిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించినట్లు ఆమె తెలిపారు. ఈ కేసులో అన్ని వివరాలు సేకరించామని, కార్తీక్‌కు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ‘ఏడాది కాలంగా కార్తీక్...సంధ్యారాణిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. సంధ్యారాణి అందంగా ఉండటమే కాకుండా, చక్కగా చదువుకుంది. అయితే కార్తీక్ మాత్రం ఏడో తరగతి ఫెయిల్ కావడమే కాకుండా ఆవారాగా తిరుగుతున్నాడు. దీంతో ఆమె అతడిని కాదనుకుంది. అంతేకాకుండా కార్తీక్ వేధింపుల విషయాన్ని సంధ్యారాణి తాను పని చేస్తున్న లక్కీ ట్రేడర్స్ యజమాని దృష్టికి తీసుకు వెళ్లింది. యజమాని కూడా అతడిని మందలించాడు. కార్తీక్...సంధ్యకు ఉద్యోగం చూపించినా, ఆమె స్వశక్తితోనే అక్కడ రాణిస్తోంది. అయితే సంధ్యారాణి తనను దూరం పెట్టడాన్ని సహించలేని కార్తీక్ ఈ వికృత చర్యకు పాల్పడ్డాడు. 64 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సంధ్యారాణి ఈ రోజు ఉదయం మృతి చెందింది. నిందితుడు కార్తీక్‌పై 307, 354డీ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశాం.’ అని తెలిపారు. మరోవైపు సంధ్యారాణి మృతదేహానికి వైద్యులు పోస్ట్‌మార్టం పూర్తి చేసి కుటుంబసభ్యులకు అందచేశారు. ఆమె మృతదేహాన్ని లాలాపేటకు తరలించారు. -
పథకం ప్రకారమే కార్తీక్...సంధ్యారాణిపై దాడి
-
నా కూతురు చావుకు కారణమైన కార్తీక్‌ను శిక్షించాలి
-
కార్తీక్ గురించి ఎప్పుడూ చెప్పలేదు..
సాక్షి, హైదరాబాద్ : తన కుమార్తె చావుకు కారణం అయిన కార్తీక్‌ను చంపేయాలంటూ మృతురాలు సంధ్యారాణి తల్లి సావిత్రి అన్నారు. ప్రేమించలేదనే అక్కసుతో కార్తీక్ అనే యువకుడు సంధ్యపై కిరోసిన్ పోసి నిప్పు అంటించడంతో...తీవ్ర గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. సంధ్యారాణి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అందచేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి తల్లి మాట్లాడుతూ.. ‘నా కూతురు చావుకు కారణమైన కార్తీక్ ను కూడా చంపాలి. అప్పుడే నా కూతురుకు న్యాయం జరిగినట్టు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి వెంటనే కార్తీక్‌ను శిక్షించాలి. సంధ్య ఎప్పుడు కార్తీక్ గురించి నాకు చెప్పలేదు. కార్తీక్ ఎవరో మాకు తెలియదు.’ అని అన్నారు. సంధ్య కుటుంబాన్ని ఆదుకోవాలి మరోవైపు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ...ఈ రోజు ఉదయం మృతురాలు సంధ్యారాణి కుటుంబసభ్యులను పరామర్శించారు. నేరానికి పాల్పడ్డ కార్తీక్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి...సంధ్యారాణి కుటుంబాన్ని ఆదుకోవాలని బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఆమె కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలన్నారు. 24 గంటలు వైద్య సేవలు అందించాల్సిన వైద్యులు ఈ కేసులో నిర్లక్ష్యం వహించారన్నారు. ఇలాంటి ఘటనలు వారానికి ఆరు కేసులు గాంధీ ఆస్పత్రికి వస్తున్నాయన్నారు. నగరంలో రోజురోజుకు మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా సంధ్యారాణిని ప్రేమించా... సంధ్యారాణిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించిన కార్తీక్‌ను లాలాగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై హత్యకేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో సందర్భంగా కార్తీక్ పలు విషయాలు వెల్లడించాడు. ‘ అయిదేళ్లుగా సంధ్యారాణిని ప్రేమిస్తున్నా. ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కొద్దిరోజులుగా సంధ్యారాణి ప్రవర్తనలో మార్పు వచ్చింది. నిన్న కూడా ఆమెను బతిమిలాడాను. నన్ను ప్రేమించి, పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. నన్ను నిరాకరించడంతోనే కిరోసిన్ పోసి నిప్పు అంటించాను. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాను.’ అని తెలిపాడు. -
సంచలనం
► నాతవరం మండలంలో జంట హత్యలు ► సహచరిపై అనుమానంతో గునపంతో దాడి ► మహిళ, ఆమె ప్రియుడు హతం విశాఖపట్నం : తెలతెలవారుతుండగానే కలకలం రేగింది.. జంట హత్యలతో గ్రామమంతా విస్తుబోయింది.. ఆరేళ్ల నుంచి తనతో సహజీవనం చేస్తున్న మహిళ వేరొకరికి దగ్గర కావడం సహించలేకపోయాడు.. మద్యం మత్తులో ఉన్నట్టు నటించి సహచరి, ఆమె ప్రియుడు ఒక్కచోటకు చేరేక కిరాతకంగా హతమార్చాడు. నాతవరం మండలంలో శనివారం తెల్లవారుజామున జరిగిన జంట హత్యలు సంచలనం సృష్టించాయి. కె.వి.శరభవరం పంచాయతీ శివారు కృష్ణాపురం గ్రామానికి చెందిన వంజరి రాము అనుమానంతో తనతో సహజీవనం చేస్తున్న సంధ్యారాణి (26)ని, ఆమెతో సన్నిహితంగా మెలుగుతున్న కాళ్ల రాంబాబు (46)ను కిరాతకంగా గునపంతో కొట్టి చంపేశాడు. నిందితుడు, గ్రామస్తుల కథనం ప్రకారం.. రాముకు గతంలో వివాహం జరిగింది. మొదటి భార్యకు దూరంగా ఉంటూ ఆరేళ్ల నుంచి సంధ్యారాణితో కలిసి ఉంటున్నాడు. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా వెదురుపల్లి గ్రామానికి చెందిన కాళ్ల రాంబాబుకు సంధ్యారాణికి మధ్య వివాహేతర సంబంధం నడుస్తోంది. ఈ విషయం గమనించిన రాము.. పద్ధతి మార్చుకోమని పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ మార్పు రాకపోవడంతో కొన్నాళ్లుగా కోపంగా ఉన్నాడు. పథకం ప్రకారం.. శుక్రవారం రాత్రి కృష్ణాపురం గ్రామంలో జరిగిన వివాహ వేడుకలకు రాము, సంధ్యారాణి కలిసివెళ్లారు. ఆ పెళ్లికి రాంబాబుకు కూడా వచ్చాడు. దీంతో రాము అనుమానం మరింత బలపడింది. వీరి ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచాడు. పెళ్లి సమయంలో వారిద్దరి కనుసైగలను గమనించి మద్యం మత్తులో ఉన్నట్టు నటించాడు. అర్ధరాత్రి సమయంలో నిద్ర వస్తోందని సంధ్యారాణితో కలిసి ఇంటికి వెళ్లిపోయాడు. మత్తుగా పడుకున్నాడని భావించిన ఆమె పెరట్లో వేచివున్న రాంబాబు వద్దకు మెల్లగా జారుకుంది. రాము పథకం ప్రకారం గునపంతో ఇద్దరిపై దాడి చేశాడు. వారి కళ్లు, ముఖాలపై కసి తీరా కొట్టి ప్రాణాలు తీశాడు. కేకలు విని చుట్టుపక్కల వారు ఏం జరిగిందని వెళ్లి చూడగా రాంబాబు, సంధ్యారాణి రక్తం మడుగులో పడివున్నారు. రాము వెంటనే నాతవరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ సంఘటనపై వీఆర్వో సత్తిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు, ఎస్ఐ అశోక్‌కుమార్ సంఘటన స్థలంలో ఉన్న జంట మృతదేహాలను పరిశీలించారు. గ్రామస్తులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
వీడని విభేదాలు
► సాలూరు టీడీపీలో రాజుకుంటున్న వివాదం ► సంధ్యారాణి అనుచరులపై మొదలైన కక్ష సాధింపు ► సీఎం ఆదేశాలతో రెచ్చిపోతున్నారని భంజ్‌దేవ్‌పై మండిపాటు ► జిల్లా పార్టీ అధ్యక్షుడు జగదీష్‌కు ఫిర్యాదు చేసిన సంధ్యారాణి వర్గీయులు సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఊహించిందే జరిగింది. సాలూరు టీడీపీలో విభేదాలు మరింత ఎక్కువయ్యాయి. నియోజకవర్గ వ్యవహారాల్లో వేలు పెట్టొద్దని సీఎం ఆదేశించిన వారం వ్యవధిలోనే ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి అనుచరులపై కక్ష సాధింపు ప్రారంభమయ్యింది. నియోజకవర్గ ఇన్చార్జి భంజ్‌దేవ్ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, తమను అన్నింటా తొక్కి పెడుతున్నారని సంధ్యారాణి అనుచరులు జిల్లా పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌కు నేరుగా ఫిర్యాదు చేసి తమ ఆవేదన వెళ్ల గక్కారు. మొదటినుంచీ వివాదమే...: తొలి నుంచీ భంజ్‌దేవ్, సంధ్యారాణి వర్గీయుల మధ్య పొసగడం లేదు. రెండు గ్రూపులుగా విడిపోయారు. ఒకరినొకరు దెబ్బకొట్టుకునే ప్రయత్నం చేసుకుంటున్నారు. కొన్నాళ్లు పార్టీ ఇన్చార్జిగా సంధ్యారాణి చేయగా, ఆ తర్వాత ఇన్చార్జి బాధ్యతల్ని భంజ్‌దేవ్‌కు అప్పగించారు. ఎమ్మెల్సీ హోదాలో సంధ్యారాణి పనులు చేసుకుంటుండగా, నియోజకవర్గ ఇన్చార్జ్ హోదాలో భంజ్‌దేవ్ చక్రం తిప్పుతున్నారు. ఇటీవల రాజధానిలో జరిగిన సమీక్షలో సీఎం జోక్యం చేసుకుని నాలుగైదు నెలల వరకు నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్దని సంధ్యారాణిని ఆదేశించారు. ఇదే అదనుగా ఆ రోజు నుంచే సం«ధ్యారాణి వర్గీయులపై కక్ష సాధింపు కార్యక్రమాలు మొదలయ్యాయి. ఎవరైనా తనవద్దకే రావాలని, ఇప్పుడేం చేస్తారో చూస్తానంటూ భంజ్‌దేవ్ బెట్టు కాయడాన్ని ప్రత్యర్థి వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. కమిటీల నియామకంలో వివక్ష: పార్టీ కార్యక్రమాలకు భంజ్‌దేవ్ డుమ్మా కొడుతున్నారని, కమిటీలను ఇంట్లో కూర్చొని వేస్తున్నారని, తన ఇంట్లో పనిచేసే మనుషులకే కమిటీలో చోటు కల్పిస్తున్నారని, సాలూరు ఎంపీపీ జెంటిల్మెన్ ఒప్పందాన్ని అమలు చేయకుండా దాట వేస్తున్నారని, తమను రాజకీయంగా అణగదొక్కుతున్నారని సంధ్యారాణి వర్గీయులు జగదీష్‌కు ఫిర్యాదు చేశారు. ఎంపీపీ ఎన్నిక సమయంలో ప్రస్తుతం ఎంపీపీ బోని ఈశ్వరమ్మకు రెండున్నరేళ్లు, సారిక ఎంపీటీసీకి మిగతా రెండున్నరేళ్లు ఇచ్చేందుకు ఒప్పందం జరిగిందని, ఇప్పుడా ఒప్పందాన్ని అమలు చేయకుండా భంజ్‌దేవ్ అడ్డుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిసింది. పథకాల లబ్ధిదారుల ఎంపికలో వివక్ష చూపుతున్నారని ఆక్రోశం వెళ్లగక్కారు. దీనిపై జగదీష్ స్పందిస్తూ భంజ్‌దేవ్‌తో మాట్లాడుతానని, అప్పటికీ స్పందన లేకపోతే సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం. భంజ్‌దేవ్‌పై ఫిర్యాదు చేసిన వారిలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి అత్యాన తిరుపతిరావు, డొంకా అన్నపూర్ణమ్మ, సారిక మాజీ ఎంపీటీసీ రామన్నదొర, తుండ మాజీ సర్పంచ్ ధర్మరాజు, మరుపల్లి మాజీ సర్పంచ్ సత్యం తదితరులు ఉన్నారు. -
ప్రొఫెసర్ లక్ష్మీ అరెస్ట్ కాకుండా యత్నాలు
-
అసలేం జరిగిందంటే..!
సంధ్యారాణి ఆత్మహత్య డాక్టర్ సంధ్యారాణి సొంత ఊరు నల్గొండ జిల్లా, కట్టంగూర్ మండలం, ఐటి పాముల. ఆమె తండ్రి బాల సత్తయ్య వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇల్లందు బ్రాంచ్‌లో జూనియర్ ఆఫీసర్. 2013లో హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యారు. వారికి ఇద్దరబ్బాయిలు. సంధ్యారాణి ఒక్కతే కూతురు. సంధ్యారాణి చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్. టెన్త్‌లో స్కూల్ టాపర్. టెన్త్ వరకు ఖమ్మంలోనే చదివింది. ఇంటర్, ఎంబీబీఎస్ కోచింగ్ హైదరాబాద్‌లో తీసుకుంది. సంధ్య ఎంత సెన్సిటివో అంత డేరింగ్ కూడా. మ్యాథ్స్ అండ్ సైన్స్ రెండిట్లో ఫస్టే! టెన్త్‌లో రెండిట్లో హండ్రెడ్‌కి హండ్రెడ్ మార్క్స్ వచ్చాయ్. ఇంటర్లో 960. డాక్టర్ కావాలని ఆమె యాంబిషన్. ఆ ప్యాషన్‌తోనే ఎంబీబీఎస్ చేసింది. 75 పర్సెంటేజ్ తెచ్చుకుంది. తర్వాత గైనకాలజీ చేసి... విమెన్ హెల్త్ కోసం పనిచేయ్యాలని ఉండేదామెకు! అందుకే హైదరాబాద్‌లో ప్యాథాలజీలో సీట్ వచ్చినా వద్దనుకొని, గుంటూరు మెడికల్ కాలేజ్‌లో వచ్చిన గైనకాలజీలో చేరింది. మా బిడ్డ ఏం చేసినా... ఆమెకు తప్పే! ‘‘సంధ్య రోజుకు మూడుసార్లు ఫోన్ చేసేది. ‘ప్రొఫెసర్ బాగా సతాయిస్తోంది, టార్చర్ పెడ్తోందని ఏడ్చేది. ఇంకా నాలుగు నెలలైతే కోర్స్ అయిపోతుంద’ని నచ్చచెప్పేవాళ్లం’’ అన్నారామె తల్లితండ్రులు.‘‘సెలవులు అడిగితే ప్రొఫెసర్ ఇచ్చేది కాదు. దసరాకి కూడా ఇవ్వకుండా ఆ రోజు కావాలనే నైట్ డ్యూటీ వేసిందట. వినాయక చవితికీ లీవ్ ఇవ్వలేదు. అయితే అప్పుడు ప్రొఫెసర్ లక్ష్మి అయిదు రోజులు సెలవులో ఉంది. ఇంకో ప్రొఫెసర్... మా అమ్మాయితో ‘లీవ్ కావాలంటే తీసుకో సంధ్యా’ అని సెలవు ఇచ్చారు. ఆ విషయం ప్రొఫెసర్ లక్ష్మికి ఎవరు చెప్పారో ఏమో... మా అమ్మాయికి సెలవు ఇచ్చిన ప్రొఫెసర్‌కి ఫోన్ చేసి సంధ్య గురించి ఆరా తీసిందట. తిరిగి కాలేజ్‌కి వెళ్లగానే.. ‘నేను లేకపోతే వెళ్లిపోతావా’ అంటూ మళ్లీ టార్చర్ స్టార్ట్ చేసిందట లక్ష్మి. నవంబర్ ఫస్ట్ నుంచి రెండు నెలలు మా అమ్మాయికి లేబర్ వార్డ్‌లో పోస్టింగ్ ఉండింది. ఆ లేబర్ వార్డ్ హెడ్ కూడా ప్రొఫెసర్ లక్ష్మీయే. ‘ఫస్ట్ నుంచి నా దగ్గరికే కదా నువ్ రావాల్సింది! ఎలా పాసవుతావో చూస్తా. నీకు సర్టిఫికెట్ ఎలా వస్తుందో చూస్తా. నీ అంతు చూస్తా’ అంటూ బెదిరించేదట. మా అమ్మాయి చాలా భయపడింది. అందుకే చనిపోయే ముందు రోజు (అక్టోబర్ 22వ తారీఖు) పొద్దున ఆరు గంటలకే ఫోన్ చేసింది. ‘నేను వచ్చేస్తా. ఇక్కడ ఉండను. మానేస్తా’ అని ఏడ్చింది బిడ్డ. ‘ఇంకెంత నాలుగు నెలలే కదా’ అని నేను, వాళ్ల డాడీ సర్ది చెప్పడానికి ప్రయత్నించాం. అయినా సరే బిడ్డ సమాధానపడలేకపోయింది. ‘లేదు. నేనుండను. లక్ష్మీ మేడమ్ బాగా టార్చర్పెడుతోంది. నాకు ఉండబుద్ధి కావట్లేదు. నేను చదువు మానేసుకొని వచ్చేస్తా’ అని ఏడ్చింది. బిడ్డ కంటే ఎక్కువేం కాదు కదా అని ‘సరే వచ్చెయ్’ అని చెప్పాం. వెంటనే బయలుదేరతా అని కూడా అన్నది. ఆమెతో మాట్లాడిన వెంటనే మలేసియాలో ఉన్న పెద్దకొడుకుకి ఫోన్ చేసి, ‘చెల్లెలు ఏడుస్తోందిరా. ఒకసారి మాట్లాడు’ అని చెప్పాను. వాడు మాట్లాడితే కూడా ‘నాకు ఉండ బుద్ధి కావట్లేదు హైదరాబాద్ వెళ్లిపోతా’ననే ఏడ్చిందట. వాడు కూడా ‘సరే. ఇష్టం లేకపోతే ఉండకు. బయలుదేరిపో’ అనే ధైర్యం చెప్పాడు. ఇది జరిగిన కొంచెంసేపటికి బయలుదేరిందా లేదా తెలుసుకుందామని మా అమ్మాయికి ఫోన్ చేస్తే, ‘లేదు మమ్మీ... రావట్లేదు. హాస్పిటల్కెళ్తున్నా’ అంది. సరే మనసు మార్చుకుందేమో.. కుదుటపడిందేమో అనుకున్నాం. ఆ రోజు ఇక తాను ఫోన్ చేయలేదు. రాత్రి తొమ్మిదిన్నర టైమ్‌లో మేమే ఫోన్ చేశాం. మామూలుగానే మాట్లాడింది. అంతా బాగానే ఉందని స్థిమిత పడ్డాం. ఆదివారం తెల్లవారింది! మర్నాడు ఆదివారం. మామూలుగా ఆదివారం లేట్‌గా ఫోన్ చేస్తుంది. ఆ టైమ్ దాటినా ఫోన్ రాకపోయేసరికి మేమే ఫోన్ చేశాం. సంధ్య ఫోన్ తీయలేదు. రెండు మూడుసార్లు చేసినా సమాధానం లేదు. మా అమ్మాయి రూమ్ పక్కనే ఉన్న ఆమె ఫ్రెండ్‌కి ఫోన్ చేసి... - సంధ్య ఫోన్ ఎత్తట్లేదు ఒకసారి చూడమని అడిగాం. ఆమె వెళ్లి చూస్తే డోర్, కిటికీ అన్నీ వేసున్నాయ్. పిలిస్తే పలకలేదు. కిటికీ అద్దం పగలగొట్టి చూస్తే... బెడ్ మీద కాళ్లు, చేతులు కొట్టుకుంటూ కనిపించింది సంధ్య. వాళ్లు వెంటనే మాకు ఫోన్ చేసి సంధ్యను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. మేము ఉదయం తొమ్మిదరన్నరకు గుంటూరు బయలుదేరాం. మధ్యలో ఫోన్ చేస్తే మా ఫోన్ కట్ చేశారు. వెళ్లేసరికి సంధ్య ఐసీయూలో ఉంది. నేను పిలిస్తే ఉలిక్కిపడి లేచింది. మమ్మల్ని గుర్తు పట్టి ‘మమ్మీ’ అని పిలవబోయింది. కానీ, నోట్లో పైపులు ఉండేసరికి మాట్లాడలేకపోయింది. మంచమ్మీద నుంచి లేవపోయింది. అంతలోనే మత్తులోకి వెళ్లిపోయింది. గుండె ఫాస్ట్‌గా కొట్టుకుంటోందని గుండె డాక్టర్‌ను పిలిపించారు. బీపీ డౌన్ అవుతోందని మాట్లాడుకుంటుంటే విన్నాం. మేం బయటకు వచ్చాం. ఆ తర్వాత మూడు నిమిషాలకు ఆమె ఫ్రెండ్స్ ఏడుస్తూ బయటకు వచ్చారు. తర్వాత మమ్మల్ని పిలిచారు. ఏముంది! అప్పటికే అంతా అయిపోయింది. బిడ్డ చచ్చిపోయింది. గుండెకు సంబంధించిన ఏదో ఇంజక్షన్ తీసుకుని ప్రాణం తీసుకుంది’’ అంటూ చీర కొంగు నోట్లో పెట్టుకొని పెల్లుబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకొనే ప్రయత్నం చేసింది సంధ్య తల్లి ప్రమీల. తండ్రి సత్తయ్య పంటి బిగువున బాధను అదిమిపెట్టుకుని, చెంపల మీద కారుతున్న కన్నీళ్లను మౌనంగా తుడుచుకున్నారు. గర్భం పోయి ఉండవచ్చు! గర్భం ఒకటి - రెండు నెలల్లో అయితే మాత్రలతో టెర్మినేట్ అయిపోతుంది. బహుశా సంధ్యారాణి విషయంలో అదే జరిగి ఉండవచ్చు. గర్భం దాల్చినప్పటికీ, చనిపోయే నాటికే మందులతో పోగొట్టుకున్నట్లుంది. పోస్టుమార్టంలో ఆ విషయం తేలదు. - టిటికె రెడ్డి, ఫోరెన్సిక్ విభాగాధిపతి, గుంటూరు జనరల్ హాస్పిటల్ ఆ అమ్మ... ప్రాణం ఖరీదు ఈ ఏడాది మే నెలలో జరిగిన లావణ్య హత్య ఇంకా మరిచిపోలేదు ఎవ్వరు! మనం సంక్షేమరాజ్యంలో కాదు రౌడీ రాజ్యంలో ఉన్నామని వీపు చరిచి మరీ చెప్పిన ఘటన అది! లావణ్య, అప్పలరాజు.. చక్కటి జంట.రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు. చూడముచ్చటైన సంసారం. విశాఖపట్నం జిల్లా, గాజువాక మండలం, రాజీవ్‌నగర్ వాళ్ల నివాసం. మే 22న.. అందరూ కలిసి నూకాంబికా దేవాలయానికి వెళ్లారు లావణ్య కోరిక మేరకు. పిల్లలకు నిద్ర వస్తోందని బంధువుల భరోసాతో భార్యను దేవాలయంలోనే ఉంచేసి, తాను పిల్లల్ని తీసుకొని ఇంటికొచ్చేశాడు భర్త అప్పలరాజు. ఆ తర్వాత దర్శనం ముగించుకున్న లావణ్య తమ బంధువులైన మోహన్, దివ్యలతో కలిసి బైక్ మీద ఇంటికి వస్తోంది. తప్పతాగిన దాడి హేమకుమార్, అతని స్నేహితులు కారులో ఆ బైక్‌ను వెంబడించారు. హారన్ మోగిస్తూ వెకిలిగా నవ్వుతూ, మోటార్ బైక్ పైపైకి తీసుకెళ్లారు కారును. ఆ బృందం నుంచి తప్పించుకోవడానికి శతవిధాలా ప్రయత్నించాడు మోహన్. అయినా వదల్లేదు హేమకుమార్ బృందం. బైకుని కారుతో ఢీకొట్టారు. లావణ్య అక్కడిక్కడే మరణించింది. హేమకుమార్, లావణ్య కుటుంబానికి ఏ పరిచయమూ లేదు. పగ అంతకన్నా లేదు. అది కేవలం అధికార పార్టీ అండ, ఆర్థిక బలం, ఆ మదంతో దుండగులు పాల్పడ్డ దుశ్చర్య. సరదాగా సామాన్యుల ప్రాణాలతో ఆడిన చెలగాటం! జనం ఉద్యమించేసరికి, ప్రాణం ఖరీదు పది లక్షలని బేరం పెట్టారు! -
లెక్చరర్స్ కాలనీలో చైన్‌స్నాచింగ్
హైదరాబాద్‌సిటీ: హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లెక్చరర్స్ కాలనీలో చైన్‌స్నాచింగ్ జరిగింది. బోనాలపండగ సందర్భంగా బంధువుల ఇంటికి వచ్చిన సంధ్యా రాణి అనే మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా మెడలో ఉన్న 3 తులాల మంగళ సూత్రాన్ని, మరో తులం బంగారు గొలుసును ఇద్దరు దొంగలు లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముదిరిన వివాదం
* సంధ్యారాణి వర్సెస్ భంజ్‌దేవ్ * కేంద్రమంత్రి అశోక్ వద్దకు చేరిన పంచాయితీ సాక్షి ప్రతినిధి, విజయనగరం: నాయకుల మధ్య వైరం ముదిరిపోతుంటే వారిని అంటిపెట్టుకున్న కార్యకర్తలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. శాసన మండలి సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి, సాలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఆర్పి భంజ్‌దేవ్‌ల మధ్య ఆధిపత్య పోరు మరోమారు తెరపైకి వచ్చింది. ఇన్నాళ్లూ నాయకుల మధ్యే చాపకింద నీరులా ఉన్న వైరం ఈ సారి ఆయా వర్గాల వారీగా పోట్లాడుకు నేంతవరకు పాకింది. శాసన మండలి సభ్యురాలిగా పదవి ఉన్న తనను కాదని కొన్ని కార్యక్రమాలు, సభలకు భంజ్‌దేవ్ అన్నీతానై ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని, సంధ్యారాణి తీవ్రంగా మండిపడుతున్నారు. పోస్టులు, నియామకాలు పక్క మండలానికి పాచిపెంట మండలానికి చెందిన పలు పదవులు, పోస్టులను సాలూరు మండలానికి చెందిన వారికి కట్టబెడుతున్నారని సంధ్యారాణి వర్గం అరోపిస్తోంది. పాచిపెంట మండలానికి చెందిన పారమ్మకొండ ఆలయ కమిటీ నియామకంలో స్థానిక మండల నాయకులకు కాకుండా సాలూరు మండల నాయకులకు కట్టబెట్టారన్నది సంధ్యారాణి వాదన. అలాగే ఇక్కడి విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద ఉండే షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులను కూడా సాలూరు మండలానికే కట్టబెట్టారని ఆరోపిస్తున్నారు. మరో పక్క పాచిపెంట మండలంలోని పెద్ద గెడ్డ జలాశయం సాగునీటి సంఘం ఎన్నికలో కూడా సాలూరు ప్రాంత వాసులకే ప్రాధాన్యం ఇచ్చి ఏర్పాటు చేశారని సంధ్యారాణి వర్గం ఆరోపిస్తోంది. ఎమ్మెల్సీని కాదని భంజ్‌దేవ్ అన్నీ తానే అయి ప్రొటోకాల్‌ను కూడా విస్మరించి ప్రారంభోత్సవాలు, సభలకు హాజరవుతున్నారని సంధ్యారాణి వర్గం వాపోతోంది. కష్టానికి లేని గుర్తింపు జిల్లాలో పార్టీ ముఖ్యనాయకులు ఎవరు వచ్చినా సంధ్యారాణి సమాచారం ఇవ్వడం లేదని భంజ్‌దేవ్ వర్గంలోని పలువురు సాలూరు మండల నాయకులు చెబుతున్నారు. ఎంతో కష్టపడి మున్సిపాలిటీని సాధించుకుంటే ఏదైనా చిన్న కార్యక్రమం జరుగుతున్నా ఆమె వచ్చి హల్చల్ చేస్తుండడంతో తమ కష్టానికి తగిన గుర్తింపు ఉండడం లేదని మున్సిపల్ చైర్పర్సన్ భర్త గొర్లె మాధవ రావు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఇలా ప్రతి చిన్న విషయంలోనూ ఒకరి రూట్ మరొకరు తెలుసుకుంటూ ఆయా వర్గాల ద్వారా విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీని వీడిపోవాలా? సాలూరులో వర్గపోరు తీవ్రమవడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరుత్సాహం చెందుతున్నారు. నాయకుల మధ్య వైరం తమ పీకలమీదకి వచ్చిందనీ ఇలాగే కొనసాగితే పార్టీని వదిలి వెళ్లిపోవడం ఖాయమని కార్యకర్తలు, నాయకులు ఇద్దరినీ హెచ్చరించినట్టు తెలిసింది. అశోక్ బంగ్లాకు భంజ్‌దేవ్ వర్గం సాలూరు నియోజకవర్గానికి సంధ్యారాణి వర్గం వల్ల ఇబ్బందులు తప్పవని ఫిర్యాదు చేసేందుకు మాజీ ఎమ్మెల్యే భంజ్ దేవ్ వర్గంలోని నాయకులు సిద్ధమయ్యారు. ఈ మేరకు పాచిపెంట మండల పార్టీ అధ్యక్షుడు పిన్నింటి ప్రసాద్‌బాబు, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు గొర్లె మాధవరావు, మెంటాడ మండల పార్టీ ఉపాధ్యక్షుడు జలుమూరి వెంకట రమణ, సాలూరు పట్టణ పార్టీ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతి, మక్కువ మండలం జెడ్పీటీసీ భర్త తిరుపతి తదితరులు కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు బంగ్లాకు వెళ్లి శుక్రవారం సాయంత్రం వెళ్లారు. ఆయనను కలిసి సంధ్యారాణిపై ఫిర్యాదు చేశారు. ఇద్దర్నీ గట్టిగా నిలదీయండి పార్టీ పరిస్థితిపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలతో అశోక్ గజపతిరాజు ఘాటుగా స్పందించారని తెలిసింది. పార్టీ పరువు ఎక్కువగా తీస్తున్న వారిద్దరినీ గట్టిగా నిలదీయండని అన్నట్టుగా సమాచారం. ఇటువంటి వారి వల్ల పార్టీ పరువు పోతోందని, సద్దుమణిగిద్దామని సముదాయించినట్లు భోగట్టా! -
ఉరివేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
ఖమ్మం జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి జూనియర్ కళాశాల హాస్టల్లో ఉప్పల సంధ్యారాణి(16) అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సంధ్యారాణి స్వగ్రామం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం మిట్టపల్లి గ్రామం. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు ఖమ్మం బయలుదేరారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
కోర్టులో లొంగిపోయిన తహసిల్దార్
4 రోజుల అజ్ఞాతానికి తెర ఈ నెల 28 వరకు రిమాండ్ సాక్షి, హైదరాబాద్: నాలుగు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న హైదరాబాద్ జిల్లా అంబర్‌పేట తహసీల్దార్ సంధ్యారాణి సోమవారం ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. న్యాయస్థానం ఆమెకు ఈ నెల 28 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అధికారులు ఆమెను చంచల్‌గూడ మహిళాజైలుకు తరలించారు. ఆమెకు యూటీ(అండర్ ట్రయల్) నంబర్ 4686 కేటాయించినట్లు సమాచారం. కోర్టు ఉత్తర్వుల మేరకు సంధ్యారాణిని ప్రత్యేక ఖైదీగా పరిగణిస్తున్నట్లు జైలు సూపరింటెండెంట్ బషీరాబేగం తెలిపారు. అయితే తనను ఈ కేసులో ఏసీబీ అన్యాయంగా ఇరికిస్తోందని సంధ్యారాణి బెయిల్ కోసం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు ఏసీబీ అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించడానికి మంగళవారం కోర్టులో పిటిషన్ వేయాలని ఏసీబీ నిర్ణయించింది. మలక్‌పేటలోని ఒక స్థలానికి ఎన్ఓసీ జారీ చేసే నిమిత్తం ఈ నెల 10న తహసీల్దార్ సంధ్యారాణి సూచనల మేరకు ఆమె సోదరుడు రూ.4 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తహసీల్దార్ కోసం ఏసీబీ డీఎస్పీ రవికుమార్ నేతృత్వంలో అధికారులు మొదటి రోజు నుంచి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, కూకట్‌పల్లిలోని రెమిడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని రెండు రోజుల తర్వాత సంధ్యారాణి జిల్లా కలెక్టర్‌కు సమాచారం పంపించారు. దీంతో ఏసీబీ అధికారులు ఆమె చికిత్స పొందిన ఆస్పత్రికి వెళ్లారు. ఏసీబీ అధికారులు వెళ్లేలోపే ఆమె డిచ్చార్జి కావడంతో వెనుదిరిగారు. తాజాగా సోమవారం న్యాయవాదితో కలసి ఆమె ఏసీబీ కోర్టుకు హాజరు కావడంతో అధికారులు కంగుతున్నారు. -
కోర్టులో లొంగిపోయిన తహసిల్దార్
-
టీఢీపీ
►సంధ్యారాణి వర్సెస్ భంజ్‌దేవ్ ►సాలూరు తెలుగుదేశం పార్టీలో ముదిరిన అంతర్గత పోరు ►పరస్పరం దెబ్బతీసుకునే ప్రయత్నాలు ►విభేదాల నడుమ వాయిదా పడిన తహశీల్దార్ కార్యాలయం ప్రారంభం అనూహ్యంగా పార్టీలో ఎదిగిన వ్యక్తి హవా వల్ల తన ప్రాబల్యానికి ఎక్కడ గండిపడుతుందో అని ఒకరు. తనకు వచ్చిన అవకాశంతో ప్రాబల్యం పెంచుకోడానికి, భవిష్యత్‌లో ఎదురులేకుండా చేసుకోవడానికి మరొకరు. పరస్పరం చెక్ పెట్టుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో సాలూరు నియోజకవర్గ టీడీపీ నాయకుల్లో అంతర్గత పోరు నడుస్తోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: సాలూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్ మధ్య నువ్వానేనా అన్నట్టు అంతర్గత పోరు నడుస్తోంది. సాలూరు నియోజకవర్గ టీడీపీలో అంతర్గత పోరు ఈనాటిది కాదు. 2009ఎన్నికల సమయంలో గుమ్మడి సంధ్యారాణి పార్టీలో చేరిన దగ్గరి నుంచి ప్రారంభమయ్యింది. ఎస్టీ కుల వివాదం కారణంగా పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయిన దగ్గరి నుంచి భంజ్‌దేవ్ ప్రాబల్యం తగ్గిపోయింది.సంధ్యారాణి ఆ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పార్టీలో క్రీయాశీలకంగా పనిచేస్తూ వచ్చారు. భంజ్‌దేవ్ తన స్పీడ్‌ను తగ్గించారు. అయితే, మొన్నటి ఎన్నికల్లో అనూహ్యంగా ఎస్టీ సర్టిఫికెట్ చేతికి రావడంతో భంజ్‌దేవ్ మళ్లీ తెరపైకొచ్చారు. తనకున్న సీనియారిటీ, పార్టీలో ఉన్న పలుకుబడితో ఎమ్మెల్యే టిక్కెట్‌ను దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో సంధ్యారాణికి మొండి చేయి ఎదురైంది. తప్పనిపరిస్థితుల్లో ఆమెను బలవంతంగా అరకు ఎంపీగా అధిష్టానం పోటీ చేయింది. మొత్తానికి ఈ ఎన్నికల్లో ఇద్దరూ ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కారణంగా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి భంజ్‌దేవ్‌కు దక్కింది. అలాగే భంజ్‌దేవ్ తీరుకు అడ్డుకట్ట పడేలా ఎస్టీ కోటాలో, కీలక మంత్రి అండదండలతో సంధ్యారాణికి అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఇంకేముంది నియోజకవర్గంలో సంధ్యారాణి ప్రాబల్యం పెరిగినట్టు అయ్యింది. అంతటితో ఆగిపోకుండా ఎస్టీ కోటాలో మంత్రి పదవి కూడా దక్కుతుందనే ప్రచారం నడుస్తోంది. దీంతో భంజ్‌దేవ్ తట్టుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోయారు. ఇప్పుడే ఆమెను డ్యామేజ్ చేయకపోతే సంధ్యారాణికి హవాకు బ్రేక్ పడదనే అభిప్రాయానికొచ్చినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆమెపై ఉన్న ఆరోపణల్ని అస్త్రంగా చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. షిప్ట్ ఆపరేటర్ల పోస్టులను అమ్ముకున్నారని, మక్కువ మండలంలోని వెంగళరాయసాగర్ జలాశయం పనులలో పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారని భంజ్‌దేవ్ ఫిర్యాదు చేసినట్టు జోరు గా చర్చ సాగుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే సంధ్యారాణి చేతుల మీదుగా సోమవారం జరగనున్న తహశీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంపైనా భంజ్‌దేవ్ తన అక్కసు చూపించినట్టు తెలుస్తోంది. కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రి ఉంటుండగా సంధ్యారాణి ఎలా ప్రారంభిస్తారని ఏకంగా కేంద్రమంత్రి అశోక్, జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌లకు ఫిర్యాదు చేసినట్టు తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం జరగాల్సిన తహశీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. భంజ్‌దేవ్ ప్రయత్నాలు ఇలా ఉంటే గుమ్మడి సంధ్యారాణి కూడా తానేమీ తక్కువ కాదంటూ భంజ్‌దేవ్‌పై ఎస్టీ కుల వివాద ఉచ్చు బిగించేలా ఆయనపై పోరాడుతున్న గిరిజన సంఘాలకు లోపాయికారీగా సహకరిస్తున్నారని భంజ్‌దేవ్ వర్గం భావిస్తోంది. అదే విధంగా ఆయనవైపు తిరుగుతున్న నాయకుల్ని తనవైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారన్న వాదనలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ వీరిద్దరి మధ్య అంతర్గత పోరు తారస్థాయికి చేరింది. -
ఆమెను మంత్రి పదవినుంచి తప్పించాలని డిమాండ్
మృణాళికి ప్రతికూల అంశాలు జిల్లాలో వ్యతిరేక వర్గం అసెంబ్లీలో సమర్థంగా వ్యవహరించలేదనే వాదన ఆమెను మంత్రి పదవినుంచి తప్పించాలని ఎమ్మెల్యేల డిమాండ్ సంధ్యారాణికి అనుకూల అంశాలు రాష్ట్ర మంత్రి వర్గంలో ఎస్టీ సామాజిక వర్గానికి స్థానం లేకపోవడం ఇష్టం లేకపోయినా అరకు ఎంపీగా పోటీచేయించడం సాక్షి ప్రతినిధి, విజయనగరం :జిల్లాకు ఎమ్మెల్సీని కేటాయించిన తరువా త టీడీపీలో చర్చలు జోరందుకున్నాయి. మం త్రి మృణాళిని వ్యతిరేక వర్గం శిబిరంలో మరిం త జోరుగా సాగుతున్నాయి. టీడీపీలో రాజకీ య సమీకరణాలు మారబోతున్నాయా అంటే...చాలామంది అవుననే సమాధానాన్ని వ్యక్తీకరి స్తున్నారు. మంత్రి మృణాళిని పదవికి ఎసరొచ్చేలా ఉందని పార్టీ వర్గాల్లో విసృ్తత చర్చ నడుస్తోంది. గుమ్మడి సంధ్యారాణికి ఎమ్మెల్సీ ఖరారైన దగ్గరి నుంచి కొత్త వాదనలు ఊపందుకున్నాయి. ఎస్టీ కోటాలో సంధ్యారాణికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని, జిల్లాకు రెండు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం లేనందున మృణాళినిని తప్పించే అవకాశం ఉందని గుసగుసలు విన్పిస్తున్నాయి. పార్టీ వర్గాలకు కూడా సూచన ప్రాయ సంకేతాలొచ్చినట్టు చెవులు కొ రుక్కొంటున్నారు. అరుకు ఎంపీగా పోటీ చే యించి, సంధ్యారాణికి అన్యాయం చేశారనే వా దన ఎన్నికల దగ్గరి నుంచి ఉంది. అప్పటి నుం చి తనకు న్యాయం చేయాలని ఆమె అధిష్టానా న్ని కోరుతున్నారు. ఇంతలోనే అరకు ఎంపీగా గెలుపొందిన కొత్తపల్లి గీత ఎస్టీ కాదని పార్టీ అండదండతో న్యాయ పోరాటానికి దిగారు. కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఎస్టీ కాదని కోర్టు తీర్పుఇస్తే ఎన్నికల్లో తర్వాత స్థానంలో ఉన్న తనకి ఎంపీ పదవి వస్తుందని సంధ్యారా ణి ఆశించారు. కానీ, ఇంతలోనే ఎంపీ కొత్తపల్లి గీత టీడీపీకి దగ్గరయ్యారు. ఆ పార్టీ అధిష్టానం తో సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో ఎంపీ గీతపై టీడీపీ యూటర్న్ తీసుకుంది. న్యాయపోరాటం విషయంలో కాస్త వెనక్కి తగ్గింది. పో రాటం చేస్తున్న సంధ్యారాణి వెనక్కి తగ్గేలా ఒత్తి డి కూడా చేసింది. దీంతో అధిష్టానం వద్ద ఆమె ఆప్షన్ పెట్టినట్టు తెలిసింది. కనీసం ఎమ్మెల్సీ పదవైనాఇవ్వాలని పట్టుబట్టారు. పార్టీలో చక్రం తిప్పుతున్న కార్పొరేట్ నేతను ఆశ్రయించారు. ఆయనపైనే ఆమె ఆశలన్నీ పెట్టుకున్నారు. కారణాలేదైతేనేమి ఎమ్మెల్సీ టిక్కెట్ సంధ్యారాణికి ఖరారైంది. ఇదంతా మొన్నటి వరకు జరిగిన ప్రయత్నం. మంత్రి మృణాళిని అసెంబ్లీలో సమర్థంగా వ్యవహరించడం లేదనే విమర్శలతో పా టు జిల్లాలోని ఎమ్మెల్యేలతో సమన్వయంతో పని చేయలేకపోతున్నారని, ఒక వర్గం ఎమ్మెల్యేలు గ్రూపుగా మారడంతో పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతున్నాయన్న సమాచా రం అధినేత దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా సంధ్యారాణికి టిక్కెట్ ఖరారవ్వడంతో కొత్త వాదనకు తెరలేచింది. తాజా పరిణామంతో రాజకీయ సమీకరణాలే మారబోతున్నాయనే చర్చ ఊపందుకుంది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఎస్టీ సామాజిక వర్గం నుంచి ప్రాతినిథ్యం లేదని, అదే కోటాలో సంధ్యారాణి ని మంత్రి వర్గంలో తీసుకోవచ్చని, దీంతో మృ ణాళినిని తప్పించ వచ్చని పార్టీ వర్గాలు చర్చిం చుకుంటున్నాయి. అసమ్మతి ఎమ్మెల్యేలు కూడా ఆమెను తప్పించాలనే కోరుకుంటున్నారు. ఆమె మంత్రి పదవిలో ఉంటే తమ ఆటలు సాగవని భయంతో అవకాశం చిక్కినప్పుడుల్లా వ్యతిరేకంగా చెబుతూ వస్తున్నట్టు సమాచారం. అటు గ్రూపులు, ఇటు మంత్రివర్గ సామాజిక కూర్పు ను దృష్టిలో ఉంచుకుని లెక్క సరిచేసే ఆలోచన లో అధినేత ఉన్నట్టు ఇప్పటికే పార్టీలో ప్రచారం సాగుతోంది. మరి, పార్టీలో చర్చ జరుగుతున్నట్టు సంధ్యారాణికి మంత్రి పదవిచ్చి, మృణాళిని పక్కన పెడతారా? లేదా మృణాళిని కొనసాగిస్తూనే సంధ్యారాణిని తీసుకుని మరో నాయకత్వానికి తెరలేపుతారా? అన్నది వేచి చూడాలి. -
ఉన్నత చదువులకు వెళ్లి అనంతలోకాలకు...
ఎల్లారెడ్డిపేట, న్యూస్‌లైన్: మండలంలోని కోరుట్లపేటకు చెందిన తాడ సంధ్యారాణి (20) బుధవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న ఆమె ఉదయం కళాశాలకు వెళ్లింది. అనంతరం కళాశాల భవనం నాలుగో అంతస్తు ఎక్కి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సంధ్యారాణిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. సంధ్యారాణి తండ్రి మల్లారెడ్డి ఆమె చిన్నతనంలోనే మృతిచెందాడు. మృతురాలికి సోదరుడు మహేందర్ ఉండగా తల్లి శోభారాణి ఇద్దరు పిల్లలను కూలి పనులు చేస్తూ పోషించుకుంది. కొడుకును చదివించిన ఇంటర్ వరకు తల్లి కూతురును మాత్రం కష్టపడుతూ ఉన్నత చదువులు చదివిస్తోంది. పదో తరగతి బొప్పాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన సంధ్యారాణి అత్యధిక మార్కులు సాధించి పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచింది. కూతురు చదువును మధ్యలో ఆపకుండా అప్పులు చేస్తూ ఉన్నత చదువులకోసం సంధ్యారాణిని ఆమె తల్లి హైదరాబాద్‌కు పంపించింది. ఇంటర్ పూర్తయిన తరువాత ఆమె జనరల్ కౌన్సిలింగ్లో ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ఫీజురియింబర్స్‌మెంట్ కింద సీటు సంపాదించింది. ఇంకో రెండేళ్లలో ఉన్నత చదువు పూర్తయి కూతురు మంచి ఉద్యోగం సంపాదిస్తుందని ఆశించిన ఆ తల్లికి దుఃఖమే మిగిలింది. అయితే సంధ్యారాణి కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగానే ఆత్మహత్య చేసుకుందని హైదరాబాద్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఫీజురియింబర్స్‌మెంట్ విషయంలో కళాశాల యాజమాన్యం సంధ్యారాణిని ఫీజుకోసం వేధించడంతోనే ఈ అఘాహిత్యానికి పాల్పడిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఉజ్వల భవిష్యత్తు ఉన్న సంధ్యారాణి మృతి వారి కుటుంబానికి తీరని లోటును మిగిల్చింది. సంధ్యారాణి మృతివార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులతో పాటు సర్పంచ్ మౌలోజి సింహాద్రి, మాజీ సర్పంచ్ సుధాకర్‌రావు హైదరాబాద్‌కు వెళ్లారు. -
వారిది చానళ్ల ఆరాటం : సంధ్య
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రజలది చాన్నాళ్ల పోరాటం, సీమాంధ్రులది చానళ్ల ఆరాటమని టీ-జేఏసీ కోకన్వీనర్, పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య వ్యాఖ్యానించారు. సీమాంధ్రుల కుట్రలను తిప్పికొడుతూ సాధించుకున్న తెలంగాణను కాపాడుకుందామని కోరారు. దోమలగూడలోని సిరిరాజ్ మీడియా సెంటర్లో (ఎస్ఎంఎస్) సోమవారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో డాక్టర్ల జేఏసీ నాయకురాలు అనితారెడ్డితో కలసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యమం స్పాన్సర్డా, కృత్రిమమా తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజల మధ్య వైషమ్యాలు లేవని, ప్రాంతాలు, సంస్కృతుల మధ్యే వైరుధ్యం ఉందని, తెలుగు వారి ఆత్మ గౌరవానికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం జరగలేదని తెలిపారు. విడిపోవడానికి తెలంగాణ ప్రజలు అనేక కారణాలు చూపుతున్నా.. ఎందుకు కలిసి ఉండాలో అనడానికి సీమాంధ్రులు ఒక్క కారణం కూడా చూప డం లేదన్నారు. ఎంపీ లగడపాటి, కేంద్రమంత్రి కావూరి సాంబశివరావులాంటి సీమాంధ్ర పెట్టుబడిదారులు హైదరాబాద్ చుట్టుపక్కల కోట్లాది రూపాయల భూములను కొల్లగొట్టారని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధి తమ వల్లనే అని సీమాంధ్రులు చెపుతున్నారని, ప్రతిష్ఠాత్మకమైన ప్రాగాటూల్స్, హెచ్ఎంటీ, ఆల్విన్ వంటి కంపెనీలను మూసివేయడమే అభివృద్ధా? ఆ భూములన్ని సీమాంధ్రుల చేతుల్లోనే ఉన్నాయని ఆరోపించారు. ఏకాభిప్రాయం పేరిట మహిళా బిల్లుకు మోసం చేశారని, పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టకుండా అడ్డుకునే ప్రమాదం ఉందని, ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సీఎం సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం దుర్మార్గమన్నారు. ముఖ్యమంత్రి, డీజీపీ సీమాంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సంధ్య ఆరోపించారు. తెలంగాణలోని సీమాంధ్ర ఉద్యోగులకు అభద్రతాభావం లేదని, ఏవైనా అపోహలుంటే తొలగించుకోవాలని ఆమె కోరారు.