
సాక్షి, హైదరాబాద్: నారాయణ కళాశాలలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సంధ్యారాణి అనే విద్యార్థిని బాత్‌రూమ్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సంధ్యారాణి తండ్రిని పోలీసు కానిస్టేబుల్ శ్రీధర్ బూటు కాలుతో తన్నిన విషయం తెలిసిందే. అయితే సంధ్యారాణి తండ్రిపై దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్ శ్రీధర్ తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీజీపీని కేటీఆర్ కోరారు. బాధితులు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వారికి అధికారులు అండగా నిలవాలని కేటీఆర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment