ఫోన్ ట్యాపింగ్‌ ఆరోపణలపై కేటీఆర్ సీరియస్‌ | KTR Reacts Phone Tapping Involvement Ready To Take Legal Action | Sakshi
Sakshi News home page

కోర్టుకెళ్తా.. ఫోన్ ట్యాపింగ్‌ ఆరోపణలపై కేటీఆర్ సీరియస్‌

Published Tue, Apr 2 2024 10:54 AM | Last Updated on Tue, Apr 2 2024 4:47 PM

KTR Reacts Phone Tapping Involvement Ready To Take Legal Action - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తన పాత్రపై వస్తున్న ఆరోపణలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు సీరియస్‌గా స్పందించారు. ఆ ఆరోపణలకు ఖండించిన ఆయన.. లీగల్‌ యాక్షన్‌కు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. 

‘‘నాపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, ఓ మంత్రిపై కోర్టుకు వెళ్తా. న్యాయపరంగా నాపై చేస్తున్న అబద్ధపు ఆరోపణలు ఎదుర్కొంటా. సిగ్గులేకుండా ఇలాంటి అర్థరహిత, ఆధారాల్లేని ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు అయినా తెలియజేయాలి. లేదంటే.. లీగల్‌గా చర్యలకు ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. అలాగే..   వాస్తవాలు తెలుసుకోకుండా ఈ వార్తను ప్రచురించిన వార్త సంస్థలకు కూడా నోటీసులు ఇస్తాం’’ అని కేటీఆర్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement