LEGAL ACTION
-
కోర్టుకెళ్తా.. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పాత్రపై వస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సీరియస్‌గా స్పందించారు. ఆ ఆరోపణలకు ఖండించిన ఆయన.. లీగల్ యాక్షన్‌కు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ‘‘నాపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, ఓ మంత్రిపై కోర్టుకు వెళ్తా. న్యాయపరంగా నాపై చేస్తున్న అబద్ధపు ఆరోపణలు ఎదుర్కొంటా. సిగ్గులేకుండా ఇలాంటి అర్థరహిత, ఆధారాల్లేని ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు అయినా తెలియజేయాలి. లేదంటే.. లీగల్‌గా చర్యలకు ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. అలాగే.. వాస్తవాలు తెలుసుకోకుండా ఈ వార్తను ప్రచురించిన వార్త సంస్థలకు కూడా నోటీసులు ఇస్తాం’’ అని కేటీఆర్ తెలిపారు.Both these Congress fellows (including the minister) will be served legal notices for defamation & slanderEither Apologise for this shameful, baseless & nonsensical allegations or face legal consequences Also will be serving legal notices to news outlets who are dishing out… pic.twitter.com/IjHNQ7Yn2T— KTR (@KTRBRS) April 2, 2024 -
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పాత్రపై వస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సీరియస్‌గా స్పందించారు. ఆ ఆరోపణలకు ఖండించిన ఆయన.. లీగల్ యాక్షన్‌కు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ‘‘నాపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, ఓ మంత్రిపై కోర్టుకు వెళ్తా. న్యాయపరంగా నాపై చేస్తున్న అబద్ధపు ఆరోపణలు ఎదుర్కొంటా. సిగ్గులేకుండా ఇలాంటి అర్థరహిత, ఆధారాల్లేని ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు అయినా తెలియజేయాలి. లేదంటే.. లీగల్‌గా చర్యలకు ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. అలాగే.. వాస్తవాలు తెలుసుకోకుండా ఈ వార్తను ప్రచురించిన వార్త సంస్థలకు కూడా నోటీసులు ఇస్తాం’’ అని కేటీఆర్ తెలిపారు. Both these Congress fellows (including the minister) will be served legal notices for defamation & slander Either Apologise for this shameful, baseless & nonsensical allegations or face legal consequences Also will be serving legal notices to news outlets who are dishing out… pic.twitter.com/IjHNQ7Yn2T — KTR (@KTRBRS) April 2, 2024 -
Meloni: డీప్‌ఫేక్ వీడియోలపై దావా వేసిన ఇటలీ ప్రధాని
రోమ్: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని డీప్‌ఫేక్ కంటెంట్‌కు వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టారు. స్వయంగా తానే బాధితురాలినంటూ మీడియా ముందుకు వచ్చారామె. అంతేకాదు.. ఆ వీడియోలను అప్లోడ్ చేసిన వ్యక్తులపై లక్ష యూరోలకు పరువు నష్టం దావా వేశారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని పేరిట వీడియోలు అశ్లీల సైట్లలో అప్లోడ్ అయ్యాయి. ఓ పోర్న్‌స్టార్ ముఖానికి మెలోనీ ముఖాన్ని డీప్‌ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి ఆ వీడియోలను అప్లోడ్ చేశారు ఇద్దరు. ఆ వీడియోలను అమెరికాలో గత కొన్ని నెలలుగా కొన్ని లక్షల మంది వీక్షించారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో ఆమె సత్వరమే స్పందించారు. ఆ ఇద్దరిపై లక్ష యూరోల(మన కరెన్సీలో 90 లక్షల రూపాయల దాకా) పరువు నష్టం దావా వేశారామె. ఈ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం జులై 2వ తేదీన ఆమె కోర్టుకు హాజరు కానున్నారు. ఇక.. ప్రధాని లాంటి ఉన్నత పదవిలో ఉన్న తానే డీప్‌ఫేక్‌కు వ్యతిరేకంగా ముందుకు వచ్చానని, బాధితులు ముందుకు వచ్చి ధైర్యంగా పోరాడాలని ఆమె పిలుపు ఇచ్చారు. ఇక ఈ కేసులో నిందితుల నుంచి తీసుకునే పరిహారాన్ని హింసకు గురైన మహిళలకు విరాళంగా మెలోనీ ఇస్తారని ప్రధాని లీగల్ టీం ప్రకటించింది. నిందితులను తండ్రీ కొడుకులుగా(40, 72 ఏళ్లు) గుర్తించిన దర్యాప్తు అధికారులు.. స్మార్ట్ ఫోన్ ద్వారా ఆ వీడియోలను అప్లోడ్ చేసినట్లు నిర్ధారించారు. అయితే.. మెలోనీ ప్రధాని కాకముందే 2022లో ఆ వీడియోలు అప్లోడ్ కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఇటలీ చట్టాల ప్రకారం ఇలాంటి పరువు నష్టం దావాలు తీవ్రంగా నేరాలుగా పరిగణించబడ్తాయి. బాధితులకు పరిహారం ఇప్పించడంతో పాటు నిందితులకు జైలు శిక్ష విధిస్తారు కూడా. సంబంధిత వార్త: ఇంటర్నెట్ నిండా ఫేక్ ఫొటోలు, అశ్లీల వీడియోలు! -
ఏనాడూ అలాంటి పని చేయలేదు.. బాధగా ఉంది: సచిన్
సోషల్ మీడియాలో సెలబ్రిటీల మీద పుకార్లు వైరల్ కావడం సహజమే. చాలామంది వాటిని తేలికగా తీసుకుంటారు. కొందరు మాత్రం అసహనం వ్యక్తం చేస్తూ ఒక రేంజ్‌లోనే కౌంటర్లు ఇస్తుంటారు. ఈ క్రమంలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌కి మార్ఫింగ్ ఫొటోలతో తనను బద్నాం చేయడం ఇబ్బంది పెట్టిందట. అందుకే న్యాయపరమైన చర్యలకు సిద్ధమయ్యారు ఆయన. గోవాకు చెందిన ఓ కాసినోపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గరం అయ్యారు. అనుమతి లేకుండా తన ఫొటోలను వాడుకోవడంపై లీగల్ యాక్షన్‌కు సిద్ధమయ్యారు ఆయన. ఈ మేరకు మార్ఫింగ్ చేసిన తన ఫొటోలను ‘బిగ్ డాడీ’ క్యాసినో ప్రమోషన్ కోసం ఉపయోగించుకుంటోందని అసహనం వ్యక్తం చేశారాయన. Requesting everyone to remain vigilant about misleading images on social media. pic.twitter.com/VCJfdyJome — Sachin Tendulkar (@sachin_rt) February 24, 2022 ‘‘నా ఇన్నేళ్ల కెరీర్లో గ్యాంబ్లింగ్గానీ, టొబాకోగానీ, ఆల్కాహాల్ ఉత్పత్తులనుగానీ.. నేరుగా గానీ, పరోక్షంగా గానీ తాను ఏనాడూ ఎండోర్స్ చేయలేదని, అలాంటిది తన ఫొటోలు ప్రజల్ని తప్పుదోవ పట్టించేదిగా ఉండడం తనని బాధించిందని చెప్తున్నారు 48 ఏళ్ల టెండూల్కర్. ‘నా లీగల్ టీం అవసరమైన చర్యలు తీసుకుంటోంది. కానీ, ప్రతి ఒక్కరికి ఈ సమాచారం అందించాలనే ఉద్దేశంతో ఈ పోస్ట్ చేస్తున్నా. తప్పుదోవ పట్టించే ఆ ఫొటోలను నమ్మకండి’ అంటూ ట్విటర్లో సచిన్ ఇవాళ ఒక ట్వీట్ చేశారు. -
భారత్‌పే ఎండీకి ఉద్వాసన! అసలేం జరుగుతోందంటే..
ఫిన్‌టెక్ కంపెనీ భారత్‌పే ఎండీ, సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్‌కు ఉద్వాసన దిశగా కంపెనీ నిర్ణయం తీసుకోనుందా? తాజా పరిణామాలు అవుననే సంకేతాలు ఇస్తున్నప్పటికీ.. తెర వెనుక వ్యవహారం మరోలా ఉందని తెలుస్తోంది. కొటక్ మహీంద్రా బ్యాంక్ ఉద్యోగిని ఫోన్‌కాల్‌లో దుర్భాషలాడుతూ.. అష్నీర్ గ్రోవర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక క్లిప్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో న్యాయపరమైన చర్యలకు దిగిన కొటాక్ మహీంద్రా, భారత్‌పే ఎండీకి నోటీసులు సైతం పంపింది. దీంతో కంపెనీ అష్నీర్‌ను హడావిడిగా సెలవుల మీద బయటికి పంపింది. తాజాగా మార్చి చివరినాటి వరకు ఆయన సెలవుల్ని పొడిగిస్తున్నట్లు భారత్‌పే ఒక ప్రకటనలో పేర్కొంది. శాశ్వతంగా..? ‘ఇది పూర్తిగా అష్నీర్ తీసుకున్న నిర్ణయం.. కంపెనీ, ఉద్యోగులు, ఇన్వెస్టర్లు, కస్టమర్ల ప్రయోజనాల దృష్ట్యా అష్నీర్ నిర్ణయంతో మేం ఏకీభవిస్తున్నాం’ అని ప్రకటనలో పేర్కొంది కంపెనీ. అయితే అష్నీర్ లాంగ్ లీవ్ వెనుక బోర్డు ఒత్తిడి ఉన్నట్లు ఓ ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం అష్నీర్ స్థానంలో సీఈవో సుహాయిల్ సమీర్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శక్తివంతమైన మేనేజ్మెంట్ టీంతో ముందుకు వెళ్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటన విడుదల చేయడం ఆసక్తిని రేకెత్తించింది. మరోవైపు సెలవుల పరిణామంపై స్పందించేందుకు అష్నీర్ విముఖత వ్యక్తం చేయడంతో.. భారత్‌పే ఎండీ ఉద్వాసన దాదాపు ఖరారైనట్లేనని జోరుగా ప్రచారం సాగుతోంది. అలాంటిదేం లేదు! 3 బిలియన్ డాలర్ల విలువ ఉన్న భారత్‌పేలో ఇలాంటి విషపూరిత సంప్రదాయం మంచిది కాదనే ఉద్దేశానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చినట్లు సమాచారం. బోర్డు సభ్యులతో పాటు ఇన్వెస్టర్లుగా సెకోయియా ఇండియా, రిబ్బిట్ క్యాపిటల్, కోవాట్యు మేనేజ్మెంట్తో పాటు పలువురు బ్యాంకింగ్ దిగ్గజాలు ఉన్నారు. వీళ్లంతా ప్రతిపాదించినందునే.. అష్నీర్ లాంగ్ లీవ్ మీద వెళ్లాడే తప్ప.. ఉద్వాసన లాంటి పరిణామం ఏం లేదని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపినట్లు ఓ ప్రముఖ మీడియాహౌజ్ కథనం ప్రచురించింది. ‘బోర్డుకు ఆయన్ని తొలగించే ఉద్దేశం లేదు. కానీ, మీడియా ఊహాగానాల్ని దూరం చేయాలన్న ఉద్దేశంతో మాత్రం ఉంది. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత వ్యవహారం. ప్రొఫెషనల్‌కి సంబంధించింది కాదు’.. అంటూ బోర్డులోని ఓ కీలక సభ్యుడు వెల్లడించాడు. నైకా ఐపీవో సంబంధిత షేర్ల కేటాయింపులో కొటక్ మహీంద్రా బ్యాంక్ విఫలమైందని అష్నీర్ గ్రోవర్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆపై 500 కోట్ల రూపాయలకు కొటక్ మహీంద్రా మీద దావా వేశారు. అంతటితో ఆగకుండా అష్నీర్, ఆయన భార్య మాధురి.. కాల్లో బ్యాంక్ ప్రతినిధిని అసభ్యంగా దూషించడంతో.. కొటక్ మహీంద్రా బ్యాంక్ లీగల్ నోటీసులు పంపింది. సంబంధిత వార్త: 500 కోట్ల పరిహారం.. ఆపై భార్యతో ఫోన్లో బండబూతులు! -
500 కోట్లకు దావా.. అదనంగా ఫోన్‌కాల్‌లో అసభ్య పదజాలం!
కొటక్ మహీంద్రా బ్యాంక్, ఫిన్‌టెక్ కంపెనీ ‘భారత్‌పే’ ఎండీ అష్నీర్ గ్రోవర్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. నైకా ఐపీవో సంబంధిత షేర్ల కేటాయింపులో కొటక్ మహీంద్రా బ్యాంక్ విఫలమైందని అష్నీర్ గ్రోవర్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వివాదం మరో మలుపు తిరిగింది. కొటక్ బ్యాంక్ నుంచి నష్టపరిహారం కోరుతూ 500 కోట్ల రూపాయలకు దావా కూడా వేశాడు అష్నీర్ గ్రోవర్. అయితే తాజాగా ఈ పరిణామంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. అష్నీర్, ఆయన భార్య మాధురి ఫోన్‌కాల్‌లో తమ ప్రతినిధిని అసభ్యంగా దూషించారని ఆరోపిస్తూ న్యాయపరమైన చర్యలకు సిద్ధమైంది కొటక్ మహీంద్రా బ్యాంక్. ఈ మేరకు ఆదివారం ఆ జంటకు నోటీసులు సైతం పంపింది. అష్నీర్ గ్రోవర్-కొటక్ బ్యాంక్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. అష్నీర్ జంట నుంచి అక్టోబర్ 30న లీగల్ నోటీసులు అందుకున్నట్లు ఒప్పుకున్న కొటక్ మహీంద్రా బ్యాంక్.. అది ఎందుకనో స్పష్టత ఇవ్వలేదు. కాకపోతే టైంకి మాత్రం బదులు ఇచ్చినట్లు వెల్లడించింది. అయితే గ్రోవర్ ఆడియో కాల్లో తమ ప్రతినిధిని ఉద్దేశించి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై మాత్రం న్యాయపరమైన చర్యలకు వెళ్తున్నట్లు కొటక్ మహీంద్రా బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఒక మీడియా స్టేట్మెంట్లో వెల్లడించింది. నా గొంతు కాదు ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో గతవారం ఒక ఆడియో క్లిప్ విపరీతంగా వైరల్ అయ్యింది. ఒక బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్‌తో దురుసుగా ఒక జంట మాట్లాడిన క్లిప్ అది. ఆ కాల్లో ఒక వ్యక్తి అసభ్య పదజాలం ఉపయోగిస్తుండగా.. అవతలి వ్యక్తి అతన్ని శాంతింపజేసే ప్రయత్నం చేస్తుంటాడు. అయితే ఆ క్లిప్‌లో గొంతు భారత్‌పే ఎండీ అష్నీర్ గ్రోవర్దే అంటూ కథనాలు వెలువడ్డాయి. కానీ, అష్నీర్ అది తన గొంతు కాదని ఖండించాడు కూడా. మరోవైపు లీగల్ నోటీసులు స్పందించేందుకు భారత్‌పే నిరాకరించింది. -
రేయ్.. ఎవర్రా మీరు? ఎక్కడి నుంచి వచ్చార్రా?
Anand Mahindra Angry With Instagram Page Over Fake Quotation: మీడియా, సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలు, వ్యాపారదిగ్గజాలు, నేతలకు సంబంధించిన ప్రతీ అప్డేట్ ఈమధ్యకాలంలో జనాలకు చేరుతోంది. అయితే ఈ క్రమంలోనే అసత్య ప్రచారాలు, ఫేక్ పోస్టులు సైతం వైరల్ అవుతుండడం విశేషం. ఈ మధ్య వరుసగా ఇంటర్నెట్లో ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రకు సంబంధించిన ఫేక్ కథనాలు వరుసగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ తరుణంలో స్వయంగా ఆయనే రియాక్ట్ అవుతున్నారు. అయితే తాను అనని మాట అన్నట్లుగా ప్రచారం చేస్తున్న వాళ్లపై ‘ఎక్కడి నుంచి వచ్చారంటూ’ అగ్గిమీద గుగ్గిలం అయ్యారాయన. As a colleague told me: ‘It looks like it’s hunting season on you with miscreants on the internet.’ Another completely fabricated quote falsely attributed to me. I’ll be taking legal action. Meanwhile, I’m going to post the 2 memes to the right, below, whenever I spot more fakes! pic.twitter.com/9DPM5k0Kde — anand mahindra (@anandmahindra) November 21, 2021 గత కొన్నిరోజులుగా ‘‘సగటు భారతీయుడు జీవితం అతని చేతుల్లోనే లేదంటూ’’ మహీంద్ర పేరిట ఒక కొటేషన్ వైరల్ అయ్యింది. అయితే అది సగటు భారతీయుల్ని కించపరిచినట్లుగా ఉండడమే ప్రధాన అభ్యంతరం. ఈ ఫేక్ కోట్ తన కొలీగ్ ద్వారా విషయం తన దృష్టికి వచ్చిందంటూ పేర్కొన్న మహీంద్ర.. అందుకు సంబంధించిన ఫొటోల్ని ట్విటర్లో షేర్ చేశారు. అంతేకాదు తాను అనని మాటల్ని అన్నట్లుగా వైరల్ చేసిన ఇన్స్టాగ్రామ్ పేజీ మీద లీగల్ యాక్షన్ తీసుకోనున్నట్లు ప్రకటించారు. పనిలో పనిగా తన చాతుర్యం ప్రదర్శిస్తూ.. ‘జాలీ ఎల్ఎల్బీ’లోని నటుడు అర్షద్ వార్సీ ఫేమస్ డైలాగ్ మీమ్.. ‘కౌన్ యే లోగ్?.. కహా సే ఆతే హైన్?’ అంటూ ఫేక్ రాయుళ్లపై పంచ్ కూడా విసిరారు. ఇలాంటి ఫేక్ కొటేషన్లు తన పేరుతో చాలానే ప్రచారం అవుతున్నాయని చెప్తున్నారాయన. క్లిక్ చేయండి: అంతా అబద్ధం.. ఒక్క రూపాయి పెట్టలేదు!: ఆనంద్ మహీంద్రా -
ఇనోదయ ఆస్పత్రిపై జాయింట్ కలెక్టర్ చర్యలు
సాక్షి, తూర్పు గోదావరి: ప్రభుత్వ నిబంధనలను పాటించని ఇనోదయ ఆస్పత్రిపై జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి చర్యలు తీసుకున్నారు. ఇటీవల పెద్దాపురానికి చెందిన కరోనా రోగి నుంచి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం చేస్తూ రూ.4.50 లక్షలను ఆస్పత్రి సిబ్బంది వసూలు చేశారు. ఈ క్రమంలో ఆస్పత్రి యాజమాన్యంపై సర్పవరం పీఎస్‌లో క్రిమినల్ కేసులు నమోదయ్యింది. ఆస్పత్రిపై శుక్రవారం జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇనోదయ ఆస్పత్రిని డీ నోటిఫై చేశారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి ఆస్పత్రిలో కరోనా చికిత్సలు నిలిపివేయనున్నారు. దీంతో పాటు ఆస్పత్రికి రూ.15-20 లక్షల జరిమానా కూడా విధించారు. ఆస్పత్రి యాజమాన్యంకు సహకరించిన ఆరోపణలపై ఆరోగ్య మిత్ర నాగమణిని విధుల నుంచి తొలగించినట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. చదవండి: ఆరోగ్యశ్రీలో ఉచితం.. మిగిలిన వారికి ప్రభుత్వ ధరలే -
న్యాయపోరాటానికి దిగిన బెన్ స్టోక్స్
లండన్: తమ గోప్యతకు భంగం కలిగించే అత్యంత సున్నితమైన విషయాలను ప్రచురించిన ‘ది సన్’ పత్రికపై ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ న్యాయపోరాటానికి దిగాడు. ఈ విషయంపై స్టోక్స్ తన తల్లితో పాటు స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ ఆమోదం లేకుండా తమ కుటుంబానికి సంబంధించి అత్యంత బాధకరమైన, సున్నితమైన వ్యక్తిగత విషయాలను ప్రచురించినందుకు గాను చర్యలు తీసుకోవాలని వారు కోర్టుకు విన్నవించుకున్నారు. అసలేం జరిగిందంటే.. ‘స్టోక్స్ సీక్రెట్ ట్రాజెడీ’ అనే పేరుతో సన్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. స్టోక్స్ అక్క, అన్నను అతడి తల్లి మాజీ ప్రియుడు చంపేశాడు. స్టోక్స్ పుట్టడానికి మూడేళ్ల ముందు ఇది జరిగిందని సదరు పత్రిక కధనాన్ని ప్రచురించింది. దీనిపై స్టోక్స్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన వ్యక్తిగత విషయాలు అది కూడా తాను పుట్టాక మునుపు జరిగిన విషయాలను ఇప్పుడు ప్రచురించడం ఎంతవరకు సబబు అని ? జర్నలిజం పేరుతో దిగజారతారా? అని ఆయన ప్రశ్నించిన విషయం తెలిసిందే. భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని.. తాజాగా ప్రొఫెషనల్ క్రికెటర్స్ అసోసియేషన్ (పీసీఏ) అవార్డుల కార్యక్రమం ముగిశాక ఇంటికి వెళ్లే సమయంలో స్టోక్స్ తన భార్యతో గొడవపెట్టుకున్నాడని ఓ మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా స్టోక్స్ భార్య క్లారే అతడి చెంపపై కొట్టినట్టు ఓ ఫోటోను కూడా ప్రచురించింది. దీనిపై స్టోక్స్ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ ఫోటోలో క్లారే బెన్ స్టోక్స్‌ను కొట్టనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఆ సదరు మీడియా మాత్రం స్టోక్స్‌ను క్లారే కొట్టినట్లు ప్రచురించింది. ప్రపంచకప్‌కు ఇంగ్లండ్‌కు అందించి సంబరాలు చేసుకుంటున్న తరుణంలో మీడియాలో ఇలా తనకు వ్యతిరేకంగా వరుస కథనాలు రావడం పట్ల స్టోక్స్ అసహనం వ్యక్తం చేస్తున్నాడు. అయితే అతడికి ఇంగ్లండ్ క్రికెటర్లు మద్దతుగా నిలుస్తున్నారు. స్టోక్స్‌కు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న పత్రికలపై వారు కూడా విమర్శిస్తున్నారు. -
‘ఆంధ్రజ్యోతి’పై కచ్చితంగా చర్యలు తీసుకుంటా’
పిడుగురాళ్ల: తాను ప్రెస్‌మీట్, ఇంటర్వ్యూ ఇవ్వకుండానే ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో తన పేరుతో తప్పుడు కథనాలు రాయడంపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉగ్గు నాగేశ్వరరావు తెలిపారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తనను అడ్డుపెట్టుకుని ఆర్యవైశ్యుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా గురజాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్‌రెడ్డి వద్ద తనను అప్రదిష్ట పాలు చేసే విధంగా తప్పుడు కథనాలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసు కుటుంబం ఆర్యవైశ్యులకు ఎప్పుడూ దూరంగా ఉంటారని, ఆ సామాజికవర్గం వారి పట్ల శ్రద్ధ చూపరంటూ ‘ఆంధ్రజ్యోతి’లో ఈ నెల 11న తప్పుడు రాతలు ప్రచురించారన్నారు. గతంలో కూడా తనను అడ్డుపెట్టుకుని తప్పుడు రాతలు, కథనాలు రాశారని, అప్పుడు కూడా మందలించినట్లు గుర్తు చేశారు. అయినా వారి పంథా మార్చుకోకుండా, తన ప్రమేయం లేకుండా తాను కాసు కుటుంబంపై అసంతృప్తిగా ఉన్నట్లు తప్పుడు కథనాలు రాయడం సరికాదని మండిపడ్డారు. తమ లాంటి ఆర్యవైశ్యుల పరువును బజారున పెట్టడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. తప్పుడు రాతలు రాసే ఆంధ్రజ్యోతి పత్రికపై, సంబంధిత వ్యక్తిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని తాను ఎన్నో పూజలు చేసినట్లు గుర్తు చేసుకున్నారు -
‘ఆ’ పోస్ట్.. శేఖర్ కమ్ముల సీరియస్
టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల కోపం వచ్చింది. తనను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ పోస్ట్ గురించి తీవ్రంగా స్పందించారు. అందులో ఉన్నవి అవాస్తవాలని.. తక్షణమే అది పోస్ట్ చేసిన వారు క్షమాపణలు చెప్పకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఫేస్బుక్లో ఆయన చేసిన పోస్ట్... ‘నన్ను కించపరుస్తూ, సోషల్ మీడియాలో నిన్న వచ్చిన పోస్ట్, నా దృష్టికి వచ్చింది. ఆ పోస్ట్ లో ప్రతీ మాట అబద్ధం. అసభ్యం. అవమానకరం. ఆ పోస్ట్ నాకు, నా కుటుంబానికి, నన్ను గౌరవించేవారికి చాలా మనస్థాపం కలిగించింది. నేను ఎప్పుడూ కలవని, అసలు చూడనే చూడని, కనీసం ఫోన్లో కుడా మాట్లాడని అమ్మాయి , నా గురించి ఆధారం లేని ఆరోపణలు చేయటం షాకింగ్ గా ఉంది. ఈ దిగజారుడు చర్య వెనక ఎవరున్నా, వారి ఉద్దేశం ఏమైనా, నేను చెప్పదల్చుకున్నది ఒకటే. ఇది తప్పు, నేరం, అనైతికం. స్త్రీ ల సమానత్వం, సాధికారతలని నేను ఎంత నమ్ముతానో నా సినిమాలు, నా కార్యక్రమాలు చూస్తే అర్ధమౌతుంది. నా వ్యక్తిత్వం, నమ్మే విలువలు నా ప్రాణం కంటే ముఖ్యం. వాటి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే, వదిలి పెట్టే ప్రసక్తి లేదు. ఆ పోస్ట్ లోని ప్రతీ మాట తప్పు అని ఒప్పుకొని, క్షమాపణ చెప్పకపోతే, చట్టపరంగా చర్యలు తీసుకుంటాను’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఈ పోస్ట్‌పై జోరుగా చర్చసాగుతోంది. -
వివాదంలో హీరో ‘అనధికార’ బయోగ్రఫీ
ముంబై: బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జీవితం ఆధారంగా అనధికారికంగా విడుదలైన ‘ది క్రేజీ అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ బాలీవుడ్స్ బాడ్ బాయ్’ పుస్తక రచయిత, పబ్లిషర్స్‌పై సంజయ్ దత్ చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమతున్నారు. త్వరలోనే నిజమైన, అధికారిక బయోగ్రఫీ విడుదల అవుతుందని సంజయ్ దత్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. బాలీవుడ్స్ బాడ్ బాయ్స్ పుస్తక రచయిత యాస్సర్ ఉస్మాన్‌కు, పబ్లిషర్ జుగ్గర్నాట్కు నోటీసులు పంపారు. అలాగే వీరికి తాను తన బయోగ్రఫీ రాసేందుకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. పుస్తకంలో తాము ఎటువంటి సమాచారం జొప్పించలేదని, కేవలం పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారం మాత్రమే ప్రచురించడానికి ఉపయోగించామని పబ్లిషర్ జుగ్గర్‌నాట్ తెలిపింది. గతంలో పత్రికల్లో ప్రచురితమైన సమాచారం, తాను ఇచ్చిన ఇంటర్వ్యూలు, 1990 దశకంలో గాసిప్ మ్యాగజైన్లు రాసిన ఊహాజనితమైన సమాచారం ఆధారంగా చేసుకుని పుస్తకం రాశారని, అందులో తప్పుడు సమాచారం ఉందని సంజయ్ పేర్కొన్నారు. ఈ విషయం తనను, తన కుటుంబసభ్యులకు బాధ కలిగించిందని పేర్కొన్నారు. సునీల్ దత్, నర్గీస్ ఎలా, ఎప్పుడు కలిసి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, సంజయ్ దత్ జననం, బోర్డింగ్ స్కూల్లోసంజయ్ దత్ జీవనం, తల్లి నర్గీస్ మరణం, సోదరి,తండ్రితో సంజయ్ బంధం, మాదక ద్రవ్యాలకు బానిస కావడం, వాటి నుంచి బయటపడటం, సంజయ్ పెళ్లి, అండర్‌వరల్డ్‌తో సంబంధాలు, ముంబై బాంబు పేలుళ్ల కేసు, ప్రస్తుతం సంజయ్ దత్ పరిస్థితి తదీతర విషయాలు ‘ది క్రేజీ అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ బాలీవుడ్స్ బాడ్ బాయ్’లో చర్చకు వచ్చాయి. -
బీజేపీది నీచ రాజకీయం!?
సాక్షి, అహ్మదాబాద్: సెక్స్ సీడీలు బహిర్గతం కావడం వెనుక భారతీయ జనతా పార్టీ హస్తం ఉందని పటేదార్ అనామత్ ఆందోళన్ సమితి అధినేత హార్థిక్ పటేల్ ఆరోపించారు. తన వ్యక్తిగత జీవితాన్ని బీజేపీ పబ్లిక్ చేయడంపై ఆయన మండిపడ్డారు. వ్యక్తిగత గోప్యతా ఉల్లంఘన కింద ఆ పార్టీపై న్యాయ పోరాటాన్ని చేస్తున్నట్లు హార్ధిక్ బుధవారం ప్రకటించారు. గుజరాత్ రాజకీయాలు అత్యంత దారుణంగా ఉన్నాయని, ఇంకా చెప్పాలంటే నీచస్థాయికి దిగజారాయని హార్ధిక్ పటేల్ వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు అత్యంత అథమస్థాయిలో ఉన్నాయి. నన్ను ఎంత దిగజార్చాలని ప్రయత్నాలు చేసినా.. వాటిని ఎవరూ నమ్మొద్దు’ అని హార్ధిక్ ట్వీట్ చేశారు. భారతీయ జనతా పార్టీ నీచ రాజకీయాలకు పరాకాష్టగా మారిందని చెప్పిన హార్ధిక్.. ఆ పార్టీపై న్యాయపోరాటం చేస్తానని ట్విటర్లో పేర్కొన్నారు. ఇప్పటికే ప్రముఖ న్యాయవాదులను సంప్రదించానని.. కేసు నమోదు చేసే ప్రక్రియలో ఉన్నట్లు ఆయన తెలిపారు. పటేల్ రిజర్వేషన్ ఉద్యమంపై సెక్స్ సీడీల ప్రభావం ఏ మాత్రం ఉండదని ఆయన చెప్పారు. కాగా హార్ధిక్ పటేల్..రాసలీలల వీడియో టేప్ రెండు రోజలు నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. మొదటి సీడీలో హార్థిక్, ఒక మహిళ దగ్గరగా ఉండటం, ఆల్కహాల్ తీసుకోవడం వంటివి ఉండగా.. రెండో సీడీలో ఇద్దరు ముగ్గురు యువకులు, ఒక స్త్రీ సన్నిహితంగా ఉన్న వీడియో వెలుగులోకి వచ్చింది. -
ట్రంప్‌పై టెక్ లీగల్ వార్ షురూ!
శాన్ఫ్రాన్సిస్కో : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై టెక్ దిగ్గజాల లీగల్ వార్ షురూ అయింది. ట్రంప్ ట్రావెల్ బ్యాన్‌కు వ్యతిరేకంగా మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్ వంటి 97 టెక్నాలజీ దిగ్గజాలు అమెరికా కోర్టులో మోషన్ రూపంలో ఫిర్యాదు దాఖలు చేశాయి. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్ చట్టాలకు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని టెక్ దిగ్గజాలు ఈ ఫిర్యాదులో పేర్కొన్నాయి. అప్పీల్స్ కోర్టు తొమ్మిదవ సర్క్యూట్లో ఈ మోషన్‌ను టెక్ కంపెనీలు ఆదివారం దాఖలు చేశాయని సీఎన్ఎస్ మనీ రిపోర్టు చేసింది. ఇదే కోర్టులో ఆదివారం ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇమ్మిగ్రేషన్, ఆర్థిక వృద్ధి ఒకదానికొకటి ముడిపడి ఉంటాయని లీగల్ బ్రీఫింగ్లో పేర్కొన్నాయి.. ట్రంప్ ఆదేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభను ఆకట్టుకోవడాన్ని దెబ్బతీస్తుందని టెక్ కంపెనీలు చెప్పాయి. అయితే ట్రంప్ బ్యాన్పై టెక్ కంపెనీలు ఫైల్ చేసిన లీగల్ పిటిషన్ ఇదే మొదటిది కాదు. అంతకముందే అమెజాన్, ఎక్స్పీడియాలు వాషింగ్టన్ అటార్నీ జనరల్స్ దావాలో తమ మోషన్స్ పిటిషన్లను ఫైల్ చేశాయి. ఇమ్మిగ్రేషన్ ఆర్డర్లు తమ ఉద్యోగులు, బిజినెస్‌లపై ప్రభావం చూపుతాయని ఆ కంపెనీలు పేర్కొన్నాయి. ట్రంప్ జారీచేసిన వివాదాస్పదమైన ఈ ఆర్డర్‌పై టెక్ కంపెనీలు చాలా గుర్రుగా ఉన్నాయి. ట్రంప్‌ను న్యాయపరంగా విచారణకు ఎదుర్కోవాలని టెక్ దిగ్గజాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ట్రంప్ తాత్కాలిక ఈ ట్రావెల్ బ్యాన్ ఏడు ముస్లిం దేశాలపై ప్రభావం చూపనుంది. ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సుడాన్, సిరియా, యెమెన్ దేశాల పౌరులను తాత్కాలికంగా అమెరికాలోకి రాకుండా ఈ ట్రావెల్ బ్యాన్‌ను ట్రంప్ జారీచేశారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. ట్రంప్ ట్రావెల్ బ్యాన్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన టెక్ దిగ్గజాలు.. AdRoll Aeris Communications Airbnb AltSchool, PBC Ancestry.com Appboy Apple AppNexus Asana Atlassian Corp Autodesk Automattic Box Brightcove Brit + Co CareZone Castlight Health Checkr Chobani Citrix Systems Cloudera Cloudflare Copia Institute DocuSign DoorDash Dropbox Dynatrace eBay Engine Advocacy Etsy Facebook Fastly Flipboard Foursquare Labs Fuze General Assembly GitHub Glassdoor Google GoPro Harmonic Hipmunk Indiegogo Intel Jand, Inc. doing business as Warby Parker Kargo Global Kickstarter, PBC Kind Knotel Levi Strauss & Co. LinkedIn Lithium Technologies Lyft Mapbox Maplebear Inc. d/b/a Instacart Marin Software Medallia A Medium Corporation Meetup Microsoft Motivate International Mozilla Netflix Netgear NewsCred Patreon PayPal Holdings Pinterest Quora Reddit Rocket Fuel SaaStr Salesforce.com Scopely Shutterstock Snap Spokeo Spotify USA Square Squarespace Strava Stripe SurveyMonkey TaskRabbit Tech:NYC Thumbtack Turn Twilio Twitter Turn Uber Technologies Via Wikimedia Foundation Workday Y Combinator Management Yelp Zynga -
ప్రతిపక్షనేత క్షమాపణ చెప్పాలి: సీఎం
కొచ్చిన్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కేరళ రాజకీయాలు వేడెక్కాయి. కేరళ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ కి చెందిన సీనియర్ నాయకుడు ఉమెన్ చాందీ, ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తన పై ప్రతిపక్షనేత దుష్ప్రాచారం చేస్తున్నారని ఉమెన్ చాందీ మండిపడ్డారు. కోర్టులో ఉమెన్ చాందీపై 31 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అచ్యుతానందన్ ఆరోపించారు. అయితే దీని పై చాందీ స్పందిస్తూ..'కోర్టులో నాపై ఉన్న కేసుల వివరాలు బహిర్గతం చేయాలి. నాపై ఒక్క కేసు కూడా పెండింగ్‌లో లేదు. దీనిపై అచ్యుతానందన్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని బేషరతుగా క్షమాపణచేప్పాలి' అన్నారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎవరైనా కోర్టులో, పోలీసు స్టేషన్‌లోగానీ ఫిర్యాదు నమోదు చేసినంత మాత్రాన దాన్ని కేసుగా పరిగణించలేమన్నారు. కేసు ఎఫ్ఐఆర్ తో ప్రారంభమౌతుంది. తనపై నమోదైన ఏ కేసులోనైనా ఎఫ్ఐఆర్ కాపీని చూపించాలని అచ్యుతానందన్‌కు సవాలు విసిరారు. తన మంత్రివర్గసభ్యులపైన కూడా 131 కేసులు నమోదయ్యాయన్న వ్యాఖ్యల్లో వాస్తవంలేదన్నారు. కేవలం ఆర్థికమంత్రి కేఎం మణి పై ఒక్క కేసు మాత్రమే నమోదైందన్నారు. దీనిపై విజిలెన్స్ డిపార్ట్ మెంట్ దర్యాప్తు చేసి కేసుకు సంబందించి పూర్తి వివరాలను కోర్టు సమర్పించిందని తెలిపారు. -
బీబీసీకి కేంద్రం నోటీసులు
న్యూఢిల్లీ: నిర్భయ గ్యాంగ్ రేప్ కు సంబంధించి వివాదాస్పద డాక్యుమెంటరీ ‘ఇండియాస్ డాటర్’ను బీబీసీ ప్రసారం చేయడంతో ప్రభుత్వం ఆ సంస్థకు నోటీసులు అందజేసింది. ఆ సంస్థ ఎలాంటి బెరుకు లేకుండా లండన్‌లో డాక్యుమెంటరీని ప్రసారం చేసి భారత ప్రభుత్వ హెచ్చరికలను పక్కకు పెట్టింది. పైగా ఆ వీడియోను యూట్యూబ్‌లో కూడా అప్లోడ్ చేసింది. కాగా బీబీసీ భారత్‌లో మాత్రం ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేయబోమని వెల్లడించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది. బీబీసీకి లీగల్ నోటీసులు పంపింది. ఒప్పందానికి విరుద్ధంగా ఆ డాక్యుమెంటరీని వ్యాపార అవసరాలకు వాడుకున్నందున చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సిందిగా నోటీసులో స్పష్టంచేసింది. ‘‘డాక్యుమెంటరీని వ్యాపార అవసరాలకు వాడుకునేందుకు ముందు బీబీసీ ఎలాంటి అనుమతి తీసుకోలేదు. అందుకే నోటీసు ఇచ్చాం. స్పందన కోసం ఎదురుచూస్తున్నాం’’ అని హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మహిళ దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీన ఆ వీడియోను ప్రసారం చేయడానికి బీబీసీ ప్రణాళిక రచించింది. అయితే ముందుగానే మార్చి నాల్గో తేదీనే ఆ డాక్యుమెంటరీ ప్రసారం చేయడం ఆశ్చర్యాన్ని కల్గించిందని హోం శాఖ తెలిపింది. దీనిలో భాగంగానే ఆ సంస్థకు నోటీసులు పంపినట్లు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా యూ ట్యూబ్ లో పెట్టిన ఆ వివాదస్పద వీడియోను తొలగించారు. -
లీగల్ గా ప్రొసీడవుతాం ...
న్యూఢిల్లీ: ఢిల్లీ నిర్భయ గ్యాంగ్ రేప్ డాక్యుమెంటరీ వివాదంలో అనేక పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినం రోజు ప్రసారం చేయడానికి ఉద్దేశించిన బీబీసీ డాక్యుమెంటరీలో నిర్భయ కేసు దోషి ముఖేష్ సింగ్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా అలజడి సృష్టించాయి. పార్లమెంటు ఉభయ సభల్లోనూ ిది ప్రకంపనలకు కారణమైంది. దీనిపై హోంమంత్రి సీరియస్ గానే స్పందించి విచారణకు ఆదేశించారు. ఆ డాక్యుమెంటరీ ప్రసారాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రసార మంత్రిత్వశాఖ నోటీసులు జారీ చేసింది. ఆ డాక్యుమెంటరీ నిషేధాన్ని నిర్భయ తండ్రి తొలుత వ్యతిరేకించారు. మన సమాజ పరిస్థితికి ముఖేష్ మాటలు అద్దం పడతాయన్నారు. ఇది అందరూ చూడాల్సిన వీడియో అని కూడా వ్యాఖ్యానించారు. అయితే.. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ స్పందన చూశారో ఏమో గానీ ఈ డాక్యుమెంటరీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు. దోషి ముఖేష్ సింగ్ మాటలను తీవ్రంగా ఖండిస్తూనే.. లెస్లీ ఉద్విన్ తీసిన ఫిలింలో ఎక్కడా తమ పేర్లు వాడొద్దని, గోప్యంగా ఉంచాలని కోరామనీ.. కానీ దానికి విరుద్ధంగా వ్యవహరించారని, అందుకు వారికి లీగల్ నోటీసులు ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు, ప్రభుత్వం స్పందించిన తీరుపట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా కొద్ది సేపటిలోనే రెండు విభిన్న వైఖరులు ప్రదర్శించడం పలువురిని విస్మయానికి గురిచేసింది. ప్రముఖ రచయిత్రి, కాలమిస్ట్ శోభా డే కూడా ఈ డాక్యుమెంటరీ నిషేధాన్ని వ్యతిరేకించారు. మరోవైపు వివాదాస్పదమైన ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీని ప్రసారం చేయొద్దని కేంద్ర హోంమంత్రిత్వశాఖ బీబీసీని కోరింది. కానీ హోంశాఖ ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. ఒక వైపు ఇండియాలో దీనిపై వివాదం రగులుతూండగానే ..అనుకున్న దానికంటే ముందుగానే బుధవారం రాత్రి పదిగంటలకు బీబీసీ ఈ డాక్యుమెంటరీ ప్రసారం చేసేసింది. పైగా చాలా బాధ్యతాయుతంగానే తామీ డాక్యుమెంటరీ తీశామని సమర్ధించుకుంది. మరోవైపు ఈ వివాదాస్పద డాక్యుమెంటరీ దృశ్యాలను డిలిట్ చేయాల్సిందిగా వీడియో షేరింగ్ వెబ్ సైట్ యూట్యూబ్ ను కోరినట్టు తెలుస్తోంది. ఇది చాలా సున్నితమైన విషయం కనుక సంబంధిత చర్యలు తీసుకోవాల్సిందిగా యూ ట్యూబ్ ను కోరామని కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయాన్ని యూ ట్యూబ్ ధ్రువీకరించలేదు. -
యునైటెడ్ బ్యాంక్ పై కోర్టుకెళతా: మాల్యా
హైదరాబాద్: యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తనను ఎగవేతదారుడిగా ప్రకటించడంపై కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా అసంతృప్తి వ్యక్తం చేశారు. డిఫాల్టర్ ట్యాగ్ ను అంగీకరించబోనని, ఆ బ్యాంకుపై న్యాయపరమైన చర్య తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని పేర్కొన్నారు. విజయమాల్యాను యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం డిఫాల్టర్‌గా ప్రకటించింది. బ్యాంకుల నుంచి రుణాలు పొంది నిబంధనలకు విరుద్దంగా ఇతర అవసరాలకు కేటాయించడం, తిరిగి చెల్లించకపోవడం లాంటి చర్యలకు ఆయన పాల్పడ్డారని ఆరోపించింది. -
ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తా: కొత్తపల్లి గీత
విశాఖ: ప్రత్యర్థులు ఎవరైనా ఆరోపణలు చేస్తే వారిపై పరువునష్టం దావా వేస్తానని అరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థి కొత్తపల్లి గీత హెచ్చరించారు. నామినేషన్ స్క్రూటినీ సందర్భంగా అడ్డతీగల ఎమ్మార్వో ఎస్టీనని ధృవీకరించారని కొత్తపల్లి గీత తెలిపారు. ఎమ్మార్వో ధృవీకరించినా తనపై ఆరోపణలు చేస్తే తాను చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. నేను ఎస్టీ వాల్మీకి కులస్తురాలినని, 2002లోనే ఎస్టీనని హైకోర్టు తీర్పు ఇచ్చిందనే విషయాన్ని కొత్తపల్లి గీత స్పష్టం చేశారు. రాజకీయంగా లబ్ది పొందడానికి తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఆమె అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అరకు అభ్యర్థి కొత్తపల్లి గీత ఎస్టీ కాదని ప్రత్యర్ధులు తప్పుడు ఆరోపణలు చేయడంపై ధీటుగా స్పందించారు.